E Kyc Pm Kisan Samman Nidhi Yojana, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!

Published Sun, Dec 19 2021 2:37 PM | Last Updated on Mon, Dec 20 2021 7:33 AM

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana e KYC Online Process - Sakshi

PM KISAN e-KYC: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది 3 విడతలలో రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద 10వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుంది.

అయితే, ఈ సారి రైతుల ఖాతాలో 10వ విడత డబ్బులు జమ చేయడానికి ముందు సరికొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ 10వ విడత రూ.2000 వేలను రైతుల ఖాతాలో జమ చేయాలంటే కచ్చితంగా ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ-కేవైసి ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ నెంబర్‌ను ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాలి, లేకపోతే ఈ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కావు అని తెలిపింది. ఈ-కేవైసి అనేది రెండూ రకాలుగా చేయవచ్చు. 

ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసి ప్రక్రియ విధానం

  • మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈ-కేవైసి అనేది చేయవచ్చు.
  • మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 
  • ఇప్పుడు పీఎం కిసాన్ హోమ్ పేజీలో కనిపించే "ఈ-కేవైసి" ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేసి "Get OTP" క్లిక్ చేయండి. 
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ నమోదు చేసి "Submit For Auth" మీద నొక్కండి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌ ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది.

మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు కానీ వారు, ఈ-కేవైసి పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని CSC కేంద్రాన్ని సందర్శించండి. ఆ తర్వాత వారితో పీఎం కిసాన్ ఈ-కేవైసి కోసం వచ్చినట్లు చెప్పండి. మీ బయోమెట్రిక్ తీసుకొని పీఎం కిసాన్ ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేస్తారు.

(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement