PMKSY
-
ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు
అనంతపురం అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి ఈ–కేవైసీ, కేవైసీ రెండూ వేర్వేరు.. ఈ–కేవైసీ, కేవైసీ (నో యువర్ కస్టమర్) రెండు విధానాలు వేర్వేరు. ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ–కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ–కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ–కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. దీంతో ప్రజాధనం ఆదా అవుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే ఇలా... స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇంట్లోనే ఈ–కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో... జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) రైతుల సౌకర్యార్థం ఈ–కేవైసీ చేస్తున్నారు. ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 31 లోపు రైతులు ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఈ పథకం వర్తించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఈ–కేవైసీ నమోదుకు గడువు పొడగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. అవకాశం జారవిడుచుకోవద్దు.. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2 వేలు చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నెంబరు, అలాగే ఓటీపీ నెంబరు ఆధారంగా అథెంటిఫికేషన్ చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదే చివరి అవకాశం.. జారవిడుచుకోవద్దు. – బి.చంద్రానాయక్, డీఏఓ -
అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. అందుకే ఇందులో లబ్ధిదారుడిగా ఉన్న రైతులు కేవైసీ చేసుకున్నప్పటికీ మళ్లీ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలా చేసిన ప్రతి లబ్ధిదారునికి రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు అనగా సంవత్సర కాలానికి రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు అధికారులు.ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు. అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ( e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది. e-KYC నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి: African Parrot: మా రుస్తుమా ఎటో వెళ్లిపోయింది.. మీకు కనిపిస్తే చెప్పండి.. రూ.50వేలు ఇస్తాం.. -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్‌కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్‌పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్‌లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
PM Kisan: గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి
దేవరకొండ (నల్గొండ): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పది విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యసాయ అధికారులు రైతులకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి👉🏼 ‘పరువుహత్య’ విచారణపై ఒవైసీకి అభ్యంతరం ఎందుకు? నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి👉🏾 India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు -
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడగింపు!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం-కిసాన్) రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువును 2022 మే 22 వరకు పొడిగించినట్లు అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు కచ్చితంగా ఆధార్ ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ చేసుకోలేకపోయినట్లయితే పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమ కాదు. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిందని వేచి చూడకుండా.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి రైతులు ఇకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు. ఈ పథకం కింద, సంవత్సరానికి ₹6,000 మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులను వచ్చే నెలలో రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి? పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్లో ఈ-కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ నమోదు చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. 'సబ్మిట్' పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం వెబ్సైట్ డౌన్లో ఉంది. పనిచేయడం లేదు. (చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!) -
న్యూయర్ గిఫ్ట్..బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000; మీకు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఇలా..!
ప్రధాన మంతి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు నూతన సంవత్సర కానుకను అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత నగదును రైతుల ఖాతాల్లోకి జమచేసింది. సుమారు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అట్టడుగు రైతులకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ నిబద్ధత, సంకల్పానికి అనుగుణంగా నగదు బదిలీ జరిగిందని ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఇవ్వనుంది. నాలుగు-నెలల వాయిదాలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. అయితే పదో విడత నగదు ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విధంగా చెక్ చేస్తే సరిపోతుంది. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..! పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎఫ్టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. చదవండి: గుడ్‌న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు -
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూయర్ గిఫ్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) యోజన పథకం కింద 10వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఏడాది జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నట్లు పీఎంఓ తెలిపింది. ఈ పథకం కింద 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.20 వేల కోట్లకు పైగా నిదులను బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రైతు లబ్దిదారులతో సంభాషించనున్నారు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఏడాదికి రూ.6 వేల మేర ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది. (చదవండి: ఆన్లైన్లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!) -
పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!
PM KISAN e-KYC: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది 3 విడతలలో రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద 10వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుంది. అయితే, ఈ సారి రైతుల ఖాతాలో 10వ విడత డబ్బులు జమ చేయడానికి ముందు సరికొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ 10వ విడత రూ.2000 వేలను రైతుల ఖాతాలో జమ చేయాలంటే కచ్చితంగా ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ-కేవైసి ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ నెంబర్‌ను ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాలి, లేకపోతే ఈ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కావు అని తెలిపింది. ఈ-కేవైసి అనేది రెండూ రకాలుగా చేయవచ్చు. ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసి ప్రక్రియ విధానం మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈ-కేవైసి అనేది చేయవచ్చు. మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పీఎం కిసాన్ హోమ్ పేజీలో కనిపించే "ఈ-కేవైసి" ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేసి "Get OTP" క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చే ఓటీపీ నమోదు చేసి "Submit For Auth" మీద నొక్కండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది. మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు కానీ వారు, ఈ-కేవైసి పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని CSC కేంద్రాన్ని సందర్శించండి. ఆ తర్వాత వారితో పీఎం కిసాన్ ఈ-కేవైసి కోసం వచ్చినట్లు చెప్పండి. మీ బయోమెట్రిక్ తీసుకొని పీఎం కిసాన్ ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేస్తారు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!) -
వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ 10వ విడత రూ.2 వేలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని2018 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 రైతు ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తేలిసిందే. ఇప్పటి వరకు 9 సార్లు రూ.2000లను రైతు ఖాతాలలో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 10వ విడత నగదును వచ్చే నెలలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది. అయితే, ఈ పథకానికి సంస్థాగత భూస్వాములు, ఆదాయ పన్నులు చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు తమ ప్రధాని కిసాన్ ఖాతాను తమ ఆధార్ కార్డులకు లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ 10వ విడత నగదు జమ చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఒకవేళ తప్పుడు ఆధార్ వివరాలు అందించినట్లయితే, ఆ రైతుకు రూ.2000 లభించవు. మీ ఆధార్ ను ప్రధాని కిసాన్ ఖాతాతో ఎలా లింక్ చేయాలి? మీ ఆధార్ కార్డుతో పీఎం కిసాన్ ఖాతాను లింక్ చేసిన బ్యాంకు బ్రాంచీకి వెళ్లండి. బ్యాంకు అధికారి సమక్షంలో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై మీ సంతకం చేయండి. మీ ఆధార్ వెరిఫై చేసిన తర్వాత ఆధార్- ప్రధాని కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది. లింకు అయిన అనంతరం, మీకు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. (చదవండి: దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న రాష్ట్రాలు ఇవే : నీతి ఆయోగ్) -
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కొత్త రూల్స్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ పథకానికి నమోదు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అవసరమైన పత్రాలలో మార్పులు చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు రిజిస్టర్ చేసే లబ్ధిదారుని రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, లబ్ధిదారులు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీని కూడా పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు తప్పనిసరి ఇక నుంచి రేషన్ కార్డు లేకుండా పీఎం కిసాన్ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం లబ్ధిదారునికి లేదు. పీఎం కిసాన్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారుడు వారి రేషన్ కార్డు నంబర్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారంతో సహా ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టవచ్చు అని కేంద్రం భావిస్తుంది. (చదవండి: బ్లాక్‌చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా!) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందించే 10వ వాయిదా తేదీని కూడా కేంద్రం నిర్ణయించింది. డిసెంబర్ 15, 2021 నాటికి లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కేంద్రం చేస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలనుకునే కొత్త రైతులు ఆ తేదీలోపు ముందస్తుగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా రూ.6,000 లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుని ఖాతాకు బదిలీ చేస్తుంది. (చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!) -
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. "9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాలో రేపు ₹19,500 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు'' అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000లను కేంద్రం ప్రతి ఏడాది మూడు విడుతలలో విడుదల చేస్తుంది. ఒక్కొక్క విడుతలలో భాగంగా ₹2,000లను ప్రతి నెలలకు ఒకసారి జమచేస్తుంది. ఈ నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో బదిలీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ₹1.38 లక్షల కోట్లకు పైగా సమ్మాన్ రాశిని రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు. అంతకు ముందు మే 14న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 8వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు. To further strengthen the social security of farmers, PM Shri @narendramodi will release the next instalment of PM-KISAN on 9th August 2021 at 12:30 PM. Register for the event at: https://t.co/NNPhWg5KT1 #TransformingIndia pic.twitter.com/VjYHLEMA2D — MyGovIndia (@mygovindia) August 8, 2021 -
42 లక్షల పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పీఎం-కిసాన్ పథకం కింద 42 లక్షల మందికి పైగా అనర్హులైన రైతులకు బదిలీ చేసిన సుమారు రూ.3,000 కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎం కిసాన్ పథకం కింద, కేంద్రం ప్రతి ఏడాది రూ.6,000ను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తుంది. అయితే ఈ పథకానికి రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందిన 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల గరిష్ట సంఖ్య అస్సాంలో 8.35 లక్షలుగా ఉంది, తమిళనాడులో - 7.22 లక్షలు, పంజాబ్ - 5.62 లక్షలు, మహారాష్ట్రలో - 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో - 2.65 లక్షలు, గుజరాత్ లో - 2.36 లక్షలు. స్వాధీనం చేసుకోవలసిన డబ్బు అస్సాంలో రూ.554 కోట్లు, పంజాబ్ లో రూ.437 కోట్లు, మహారాష్ట్రలో రూ.358 కోట్లు, తమిళనాడులో రూ.340 కోట్లు, యుపీలో రూ.258 కోట్లు, గుజరాత్ లో రూ.220 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. "ఆధార్, పీఎఫ్ఎంఎస్ లేదా ఆదాయపు పన్ను డేటాబేస్ ఆధారంగా అధికారులు లబ్ధిదారుల డేటాను నిరంతరం చెక్ చేస్తారు. అయితే, వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో ఈ పథకం ప్రయోజనం కొంతమంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులతో సహా కొంతమంది అనర్హులైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసినట్లు కనుగొన్నట్లు" తోమర్ పార్లమెంటుకు తెలిపారు. పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని "నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి" ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి డబ్బులను రికవరీ చేయడానికి నోటీసులు పంపాయి. పీఎం-కిసాన్ లబ్ధిదారుల భౌతిక ధృవీకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినట్లు తోమర్ పేర్కొన్నారు. -
పీఎం కిసాన్ కొత్త దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్!
పీఎం కిసాన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం కేంద్రం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం తమ పేరును ఇంకా నమోదు చేసుకోని రైతులు, ఈ పథకం నుంచి రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ను ఈ నెల జూన్ 30 లోపు అధికారులు ఆమోదిస్తే, లబ్ది దారుల జాబితాలో మీ పేరు ఉంటే గత నెల, ఈ నెల రెండు విడతలు ఒకేసారి పొందవచ్చు అని జీ న్యూస్ నివేదించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను రైతుల ఖాతాలో ప్రతి ఏడాది ఆరు వేల రూయపాయాలను జమ చేస్తుంది. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతు కుటుంబాలకు ఏడాదికి మూడు సార్లు రైతుల ఖాతాలో నగదు జమచేస్తుంది. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం.. అర్హత గల రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రభుత్వాల సహాయంతో గుర్తించి నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. పీఎం కిసాన్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, ల్యాండ్‌హోల్డింగ్ పేపర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం. మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేయవచ్చు. చదవండి: మే 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబందు -
అనంతపురానికి చెందిన మహిళా రైతు మనోరమతో ముచ్చటించిన మోదీ
-
రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ నగదు.. చెక్ చేసుకోండి ఇలా?
కేంద్ర ప్రభుత్వం నేడు రైతుల ఖాతాల్లోకి పీఏం కిసాన్ 8వ విడత నగదును జమ చేసింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది. ఏప్రిల్-జూలై మధ్య, మొదటి విడత, ఆగస్టు-నవంబర్ మధ్య రెండవ విడత, డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడత నగదును జమ చేస్తుంది. ఈ సారి అర్హత గల 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి 8వ విడత కింద రూ.19000 కోట్లకు పైగా నేడు నరేంద్ర మోడి బటన్ నొక్కి జమ చేశారు. మొత్తం 2 హెక్టార్ల కంటే భూమి తక్కువ రైతులు ఈ వార్షిక సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పథకాన్ని 2018 డిసెంబర్లో ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రైతులకు ఏడు విడతలుగా చెల్లించింది. అయితే, నగదు మన ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విదంగా చేయండి. Prime Minister @narendramodi releases 8th instalment of financial benefit under PM-KISAN PM digitally transfers the benefit of more than ₹19,000 crore directly to the bank accounts of more than 9.5 crore farmers #PMKisan pic.twitter.com/QQlNDZG9LK — PIB India (@PIB_India) May 14, 2021 స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా: పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎఫ్టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. -
అన్నదాతలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీ.ఎం-కిసాన్) పథకం కింద 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మే నెల 14వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 9.5 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.19 వేల కోట్లకు పైగా నిదులను బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి రైతు లబ్దిదారులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఏడాదికి రూ.6 వేల మేర ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.15 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది. చదవండి: పీఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? -
అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
అమరావతి: ఈ కరోనా కష్టకాలంలో అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీప్ పంటకాలానికి చెందిన వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ ఈ ఆర్దిక సంవత్సరానికి చెందిన తొలి విడత సాయాన్ని రేపు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ‘వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం’ కింద అందించే ఈ ఏడాది మొదటి విడత సొమ్ము రూ.7,500లను రైతుల ఖాతాల్లో సీఎం జగన్ లాంఛనంగా విడుదల చేయనున్నారు. తొలి విడతగా రూ.3,882.23 కోట్లను 52.38 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ కష్టకాలంలోనూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండాలని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు. 2019-20 సంవత్సరం నుంచి సీఎం జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. తొలి విడత మేలో రూ.7,500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా మరికొంతమంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.13,101 కోట్ల సీఎం జగన్ ప్రభుత్వం అందించింది. రేపు విడుదల చేసే నిధులతో కలిపి ఈ మొత్తం రూ.16,983.23 కోట్లు కానుంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.67,953.76 కోట్ల సాయం అందించారు. అలాగే, ఈ నెలలోనే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించనుంది. చదవండి: కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
పీఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా?
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఆరు వేల రూపాయలను జమ చేస్తుంది. ఈ పథకం కింద మొదటి విడత నగదును ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులను జమ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. అతి త్వరలో 8వ విడత నగదు రైతుల ఖాతాలో పడనున్నాయి. అయితే, ఈ నగదు మీ ఖాతాలో జమ కావాలంటే కచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేరు ఉండాలి. అయితే పీఎం కిసాన్ వెబ్సైట్(pmkisan.gov.in)లోని అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టు(అర్హుల జాబితా)లో పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. ఇందులో పేరు ఉంటేనే ఏపీ ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కూడా వస్తుంది. అర్హు జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా: మొదట మీరు పీఎం కిసాన్(pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి. ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్టుపై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
పీఎం కిసాన్ ఎనిమిదో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి పెట్టుబడి సహాయం కింద చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతలలో రూ.2వేల చొప్పున అందజేస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. కేంద్ర ప్రభుత్వం గత కొద్దీ రోజుల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉంది. దీంతో పీఎం కిసాన్ ఎనిమిదవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించింది. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు, డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమచేయలేదు.. అంటూ పేర్కొన్నారు కైలాష్ చౌదరి. చదవండి: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్ -
ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాలో రూ.2,000
రైతుల ఆర్థిక చేయూత కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకోని వచ్చింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి విడతలో వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 7 విడతల నగదును జమ చేసింది. ఇప్పుడు 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది. ఇక నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో దశల వారీగా రైతుల ఖాతాలో వేయనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎనిమిదవ విడత నగదు మీ ఖాతాలో పడతాయి. అయితే, ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలంటే మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తుంది. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా?
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 7వ విడత రూ.2000 కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. పీఎం నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా డిసెంబర్ 25న 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18000 కోట్లు జమ చేశారు. ఈ సమయంలో 6 రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను వస్తున్నాయని, వీటి గురుంచి మిగతా రైతులకు కూడా తెలియజేయాలని పేర్కొన్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఇప్పటివరకు మీ ఖాతాలోకి రాకపోతే మీరు వెంటనే ఫిర్యాదును దాఖలు చేయాలి. దీని కోసం ముందు మీ ఖాతా యొక్క స్టేట్మెంట్ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బును పొందడానికి తప్పని సరిగా మీ పేరు 7వ విడత జాబితాలో ఉందొ లేదో ముందుగా తెలుసుకోవాలి. ఒకవేల కనుక జాబితాలో మీ పేరు లేకపోతె పీఎం కిసాన్ సమ్మన్ యొక్క హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 1. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేయండి. 2. మీకు అక్కడ హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 3. మీకు అక్కడ కనిపించే బెనెఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. 4. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ పేరును ఎంటర్ చేయండి. 5. ఈ వివరాలను పూర్తీ చేసిన తరువాత 'గెట్ రిపోర్ట్' పై క్లిక్ చేసి మీ పేరు జాబితాలో ఉందొ లేదో తెలుసుకోండి. మీ పేరు కనుక 7వ విడుత జాబితాలో ఉంటే మీ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు కొద్దీ రోజుల్లో వచ్చి చేరుతాయి. ఒకవేల కనుక 7వ విడత జాబితాలో పేరు లేకపోతే క్రింద చెప్పిన హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లు: పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266 పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011—23381092, 23382401 పీఎం కిసాన్ యొక్క కొత్త హెల్ప్‌లైన్: 011-24300606PM కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ ఉంది: 0120-6025109 ఇమెయిల్ ఐడీ: pm kisan-ict@gov.in -
ప్రధాని మోదీకి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ నిధి రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి మరియు స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందటానికి వీలు కల్పిస్తుందని అన్నారు. తద్వారా మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడేందుకు తోడ్పడుతుందని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్) కాగా, వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కేంద్రం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. (లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని) -
లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని
-
లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
రూ. లక్ష కోట్లతో వ్యవసాయ నిధి!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కిసాన్ నిధులతోపాటు రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించనున్నట్లు శనివారం ఓ అధికారిక ప్రకటన తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర తోమర్‌తోపాటు లక్షలాది మంది రైతుల ఆన్లైన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సామాజిక స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని ఆ ప్రకటనలో వివరించారు. ఈ సదుపాయాల ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు మెరుగైన విలువ లభిస్తుందని, వృథా తగ్గుతుందని అంచనా. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
కాళేశ్వరానికి సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచైనా సాయం తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బృహత్తర లక్ష్యా లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మున్ముందు ఖర్చు చేయాల్సిన నిధుల్లో కొంతైనా కేంద్రం నుంచి రాబట్టుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకే ఎస్‌వై)లో భాగంగా ఉన్న సత్వర సాగునీటి ప్రాయోజిత కార్య క్రమం (ఏఐబీపీ)లో అయినా ఈ పథకాన్ని చేర్పించే దిశగా ప్రణాళి కలు రచిస్తోంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 28 వేల కోట్ల మేర నిధుల అవసరాలను లెక్కగడుతున్న ప్రభుత్వం... వాటికి ఏమాత్రం కేంద్ర సాయమందించినా రాష్ట్రానికి పెద్ద ఊరటే అంటోంది. జాతీయ హోదా కాకున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ లోని ఏదైనా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశం స్పష్టంగా ఉందని, దానికి అనుగుణంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్, ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంటు లోపలా, వెలుపల డిమాండ్ చేస్తున్నారు. జాతీయ హోదా విషయమై పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రదానికి విన్నవించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సైతం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా అంశాన్ని గుర్తుచేసింది. అనంతరం కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై వినతులు వెళ్లాయి. అయినా దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఏఐబీపీ కింద ద్వారా అయినా నిధులు రాబట్టుకోవాలని ఆలోచిస్తోంది. నిజానికి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 80,190 కోట్లుగా ఉండగా అందులో ఇప్పటికే తెలంగాణ రూ. 51,666 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ. 28 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకు ఏఐబీపీ కింద సాయం కోరే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ఎలాంటి భారీ ప్రాజెక్టు పరిధిలో అయినా ప్రధాన పనుల్లో 50 శాతం పూర్తయితే ఏఐబీపీ కింద సాయం కోరవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 65 శాతం పనులు పూర్తవగా రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 9 రకాల అనుమతులు రాగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఏఐబీపీ కింద నిధులు అందే అవకాశం ఉంటుంది. -
ఒక్క క్లిక్‌తో కిసాన్ సమ్మాన్, రైతుబంధు స్టేటస్
నాగారం (తుంగతుర్తి): రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం కిసాన్ సమ్మాన్, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏడాదికి 2విడతల్లో ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. పీఎం కిసాన్‌సమ్మాన్ సమాచారం తెలుసుకునేందుకుప్రభుత్వం www.pmkisan.gov.in లోకి వెళ్లి బెన్‌ఫిషియర్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్‌నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్నంబర్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంకులో డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుంది. అలాగే రైతుబంధు సమాచారాన్ని కూడా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.https://ifmis.telangana.gov.in లోకి వెళ్లి స్కీంవైజ్ రిపోర్టుపై క్లిక్ చేయాలి. అప్పుడు సంవత్సరం వద్ద 2019–2020 అని, పథకం వద్ద రైతుబంధు అని, కొత్తపట్టాదారుపాస్ బుక్‌నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే సమాచారం తెలుస్తుంది. ఇలా ఇంటర్నెట్ ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. -
ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు
-
‘14.6 కోట్ల మంది రైతులకు లబ్ది’
సాక్షి, గుంటూరు : దేశాభివృద్ధికై గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం ద్వారా రూ. 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాడర్‌ను బలోపేతం చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి జడ్పీటీసీల వరకు కొత్త వారిని చేర్చుకుని..ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అయితే కోర్ కమిటీతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదని విమర్శించారు. ఇతరులతో గొడవలు పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు -
జై జవాన్.. జై కిసాన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు, సాయుధ, పారామిలటరీ బలగాలకు పెద్ద పీట వేసింది. రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్లో కేంద్రం పీఎంకేఎస్ఎస్ పథకాన్ని ప్రకటించింది. తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది. ఈ విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ..‘పీఎంకేఎస్ఎస్ పథకంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 14.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.12 కోట్ల మంది రైతులకు తొలివిడత నగదును, 2.66 కోట్ల మంది రైతన్నలకు రెండో విడత నగదును అందజేశాం’ అని తెలిపారు. చిరువ్యాపారులకు సంబంధించిన పెన్షన్ పథకానికీ కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీనివల్ల దాదాపు 3 కోట్ల మంది చిల్లర వర్తకులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ‘కిసాన్ పెన్షన్’కు ఆమోదం అలాగే రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తోమర్ చెప్పారు. ‘తొలుత 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను కేంద్రం ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. 18–40 ఏళ్ల మధ్య వయసుండే రైతులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతన్నలు పీఎంకేపీ పథకం కింద ఎంత జమచేస్తారో, కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. వీరి వయసు 60 సంవత్సరాలు దాటాక ప్రతినెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.10,774.5 కోట్ల భారం పడనుంది’ అని తోమర్ తెలిపారు. ఒకవేళ పెన్షన్‌దారుడు చనిపోతే, అతని జీవితభాగస్వామికి మొత్తం పెన్షన్‌లో 50 శాతం అందుతుందని వెల్లడించారు. అయితే సంబంధిత జీవితభాగస్వామి పీఎంకేపీవై పథకంలో సభ్యుడిగా/సభ్యురాలిగా ఉండరాదని పేర్కొన్నారు. ‘సాయుధ’ స్కాలర్షిప్ పెంపు.. శత్రుమూకలతో పోరాడుతూ అమరులైన, పదవీవిరమణ చేసిన సాయుధ, పారామిలటరీ బలగాలు, రైల్వే పోలీసుల కుటుంబసభ్యులకు లబ్ధిచేకూర్చేలా కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరుల భార్యలు, పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం(పీఎంఎస్ఎస్) కింద ప్రస్తుతం అమర జవాన్ల కుమారులకు నెలకు రూ.2,000 కుమార్తెలకు రూ.2,250 అందజేస్తున్నారు. తాజాగా కుమారులకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.2,500కు, అమ్మాయిలకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన దాదాపు 500 మందికి లబ్ధిచేకూరనుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ, మెడికల్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదివే అమరుల కుటుంబసభ్యులకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. పీఎంఎస్ఎస్ కింద ఇప్పటివరకూ అ మరులైన సాయుధబలగాల పిల్లలకు 5,500, పారామిలటరీ బలగాల పిల్లలకు 2,000, రైల్వేపోలీసుల పిల్లలకు 150 స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు. బిమ్స్టెక్ అధినేతలతో భేటీ.. తన ప్రమాణస్వీకారానికి హాజరైన బిమ్స్టెక్(బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) దేశాల అధినేతలతో ప్రధాని మోదీ శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమైన మోదీ, ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచదేశాలకు పెనుసవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా భద్రత, శాంతి, సుస్థిరతల కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతెయ్ శెరింగ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్‌లతో వేర్వేరుగా సమావేశమైన మోదీ, అన్నిరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్ సహా ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ జూన్ 9న కొలంబోను సందర్శించే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక జూన్ 7–8 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించాలని మోదీ నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళతారని దౌత్యవర్గాలు తెలిపాయి. చాలా సంతోషంగా ఉంది: మోదీ నూతన కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘కేబినెట్ భేటీలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు చాలా లాభపడతారు. కార్మికుల ఆత్మగౌరవం పెరుగుతుంది. వారంతా సాధికారతతో జీవించడం వీలవుతుంది. ఇప్పుడు కాదు.. ఎప్పుడైనా సరే ప్రజలే మాకు తొలి ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో మహాత్మాగాంధీ, పటేల్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ బాధ్యతలు చేపట్టారు. జూలై 5న బడ్జెట్.. 17వ లోక్‌సభ తొలివిడత సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రెండ్రోజులు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి జూన్ 20న ప్రసంగిస్తారని జవదేకర్ చెప్పారు. బడ్జెట్ సమర్పణకు ఒక్కరోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. మొత్తం 30 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై 5న ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
పేద రైతుకే ‘పెట్టుబడి’
సాక్షి, మెదక్: చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేద కర్షకులకు వరంలా మారింది. నిరుపేద రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ పథకంతో గుంటభూమి ఉన్నా రైతుకు రూ. 6 వేలు వస్తుండటంతో వారు సంతోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో గుంట, రెండు గుంటల భూమి ఉన్న వేలాదిమంది పేద రైతులు ఆ పథకాన్ని వదిలేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 2.20 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 1.95 వేల మంది రైతులకు రూ.148 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించింది. ఇందులో 25 వేల మంది రైతులకు సంబంధించిన భూములు వివిధ సమస్యలు ఉండటంతో పార్ట్(బీ)లో పెట్టినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రబీ సీజన్లో 1.73 వేల మంది మాత్రమే రైతుబంధును తీసుకోగా ఇందుకోసం రూ. 136 కోట్లను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్ నుండి రబీ సీజన్‌తో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా 5 వేల మంది రైతులు రైతుబంధు పథకాన్ని తీసుకోకుండా తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడమే ఈ లెక్కన గుంటభూమి ఉన్న రైతుకు కేవలం రూ. 100 మాత్రమే వచ్చింది. ఇలా ఐదారు గుంటల భూములున్న రైతులు దాదాపు 5వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. జిల్లాలో తక్కువ భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. దీంతో నిరుపేద రైతులకు రైతుబంధు పథకం ఉపయోగ పడడం లేదు. «ఎకరం నుంచి ఆపైన ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగ పడుతోంది. ఈ లెక్కన వంద ఎకరాలు గల భూస్వామికి రూ. 4 లక్షలు రాగా ఎకరం భూమి ఉన్న రైతుకు కేవలం రూ. 4 వేలు మాత్రమే వచ్చింది. అదే గుంట భూమి ఉన్న రైతుకు రూ. 100 మాత్రమే చెక్కు రూపంలో వచ్చింది. దీంతో ఐదారు గుంటల భూములున్న రైతులకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది జిల్లాలో లక్షా 7 వేల మందికి లబ్ధి.. జిల్లాలో 1.07 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులుగా తేల్చారు. జిల్లాలో 3.20 లక్షల ఎకరాల భూములు ఉండగా అందులో 1.7లక్షల మంది రైతులు మాత్రమే ఐదెకరాలలోపు భూములు కలిగి ఉన్నారు. ఒక్కో రైతుకు రూ. 6 వేలను మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేల చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విడతకు జిల్లావ్యాప్తంగా రూ. 21.40 కోట్ల చొప్పున మూడు విడతల్లో రూ. 64.20 కోట్లను ఇవ్వనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతుల అకౌంట్లలో రూ. 2 వేల చొప్పున వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గుంట భూమి ఉన్నా కేంద్ర సాయం గుంట భూమి ఉన్న రైతులు సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులే. జిల్లాలోని 5 వేల మంది రైతులకు ఎకరం కన్నా తక్కువ భూమి ఉంది. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులను తీసుకోలేదు. గుంట భూమి ఉన్న రైతుకు రైతుబంధు కింద రూ. 100 మాత్రమే వస్తుందనే ఉద్దేశంతో తీసుకోలేదు. ఇలాంటి రైతులందరూ వారి పట్టాపాస్‌పుస్తకాలు, బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు తెచ్చి ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారందరికీ ఏడాదికి రూ. 6వేల చొప్పున మూడు విడతల్లో డబ్బులు వస్తాయి. చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులకు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇస్తే ఐదు సంవత్సరాల పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతు అకౌంట్లకే వస్తాయి. – పరశురాం, జిల్లావ్యవసాయశాఖ అధికారి -
93 ప్రాజెక్టులకు 65 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు 65,634.93 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు చైర్మన్ హర్షకుమార్ భన్వాలా వెల్లడించారు. పీఎంకేఎస్‌వై కింద మొత్తం 99 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నాబార్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున నిధులు సమకూరుస్తోంది. ఈ 99 ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 70 వేల కోట్ల రూపాయలను నాబార్డు అందించాల్సి ఉంది. భన్వాలా మాట్లాడుతూ 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 23,402.72 కోట్లను ఇప్పటికే ఇచ్చేశామనీ, 18 ప్రాజెక్టులు పూర్తవ్వగా మరో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం తుదిదశలో ఉందని చెప్పారు. పీఎంకేఎస్‌వై కింద చేపడుతున్న ఈ 99 ప్రాజెక్టుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణల్లోనూ పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. -
రూ.659 కోట్ల నిధులకు దక్కని మోక్షం!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం దక్కడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టులకు మరో రూ.659 కోట్లు అందాల్సి ఉన్నా ఇంతవరకు విడుదల చేయలేదు. మెజారిటీ ప్రాజెక్టులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా నేపథ్యంలో కేంద్ర సాయం అందకపోవడం.. ప్రాజెక్టుల పనులకు ప్రతిబంధకంగా మారుతోంది. పీఎంకేఎస్‌వై కింద కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటి నిర్మాణానికి రూ.24,827 కోట్లు అవసరం కాగా ఇందులో రూ.17,387 కోట్లను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసింది. మరో రూ.7,440 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం తన వాటా కింద రూ.659.56 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులకు రూ.496 కోట్లు.. కేంద్ర నిధుల్లో అత్యధికంగా దేవాదులకు రూ.496 కోట్లు, భీమాకు రూ.107 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ.37 కోట్లు, గొల్లవాగుకు రూ.10కోట్ల మేర సాయం అందాల్సి ఉంది. వరద కాల్వ మినహా మిగతా ప్రాజెక్టులన్నింటినీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నిధుల కోసం రాష్ట్రంతో పాటు పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టులకు చెందిన రాష్ట్రాలు కేంద్ర జలవనరుల శాఖపై ఒత్తిడి పెంచాయి. ఈ ఒత్తిళ్లతో ఈ నెల 6న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలపై రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రం నుంచి కమిషనర్ మల్సూర్ హాజరు కానున్నారు. ఈ భేటీలో పెండింగ్ నిధులపై స్పష్టత రానుంది. -
మాటలు సరే.. మూటలేవీ?
‘ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) పథకం పరిధిలోకి తెచ్చిన వివిధ రాష్ట్రాల్లోని 99 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని నిర్ణీత సమయానికి అందజేస్తాం. నాబార్డ్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించిన రుణాలను ప్రణాళికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందిస్తాం. ఆ మేరకు ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసే చర్యలకు రాష్ట్రాలు పూనుకోవాలి’.. మార్చి 30న ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా కేంద్రం చేసిన ప్రకటన ఇది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సాయంపై అనేక మాటలు చెప్పిన కేంద్రం.. ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులపై మాత్రం తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలోని 11 ప్రాజెక్టులకు ఏకంగా రూ.9 వేల కోట్ల మేర సాయం అందిస్తామని చెప్పి.. ఇప్పటివరకు కేవలం రూ.547 కోట్లకే పరిమితం కావడం సాగు నీటి లక్ష్యాలను నీరు గారుస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తున్నా, అప్పుడు.. ఇప్పుడు అనే సమాధానమే తప్ప నిధులు మాత్రం విదల్చడం లేదు. – సాక్షి, హైదరాబాద్ ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు..? నిజానికి పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమరంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.25,027 కోట్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 15,720.42 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.9,306.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిధులు సమకూర్చి ఆదుకోవాలని కోరింది. సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ కేంద్ర సాయం కింద రూ.1,108 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016–17, 2017–18లో కలిపి మొత్తంగా కేంద్ర సాయం కింద రూ.1,194.63 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా, గతేడాది రూ.547.63 కోట్ల సాయం అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.647 కోట్ల మేర నిధులు ఇంకా అందాల్సి ఉంది. ఇందులో ఒక్క దేవాదుల ప్రాజెక్టుకే రూ.496 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు 11 ప్రాజెక్టులకు నాబార్డ్ కింద రూ.7,955 కోట్లు రుణం ఇచ్చేందుకు కేంద్ర అంగీకరించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5,810 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు దీనిపైనా స్పష్టత లేదు. కేంద్రం చేయూతనివ్వదే! కేంద్ర సాయం చేసే భారీ ప్రాజెక్టులను నాలుగేళ్లలో, మధ్య తరహా ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయని పక్షంలో గడువును రెండుసార్లు మాత్రమే పొడిగిస్తుంది. తర్వాత కూడా జాప్యం చేస్తే మాత్రం నిధుల విడుదలను నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, భూసేకరణ సమస్యలు, పునరావాసం కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై ఇటీవల నీటి పారుదల శాఖ అధికారులు.. సీడబ్ల్యూసీ పెద్దలను కలసి తమ ప్రాజెక్టులకు నిధుల అవసరాన్ని విన్నవించారు. అయితే నిధులు మాత్రం రాలటం లేదు. 11 ప్రాజెక్టుల్లో ఇప్పటికే మత్తడివాగు, ర్యాలివాగు పూర్తవగా, ఈ ఏడాది డిసెంబర్ కల్లా భీమా, ఎస్సారెస్పీ స్టేజ్–2, కొమరంభీం, గొల్లవాగు, పాలెంవాగులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధులు సకాలంలో అందితేనే వాటిని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులను సంప్రదించగా.. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్‌వై పరిధిలోని 99 ప్రాజెక్టులకు రూ.9,020 కోట్ల నిధులను నాబార్డ్ ద్వారా 6 శాతం వడ్డీతో ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని, ఆ రుణాలపైనే ఆశలు పెట్టుకున్నామని వివరించడం గమనార్హం. -
ఇంకా అందని కేంద్ర సాయం
► 11 సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 647 కోట్ల నిధుల కోసం నిరీక్షణ ► నిధుల అంశంపై త్వరలో కేంద్రంతో రాష్ట్ర అధికారుల చర్చలు సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుత ఏడాదిలో ఈ ప్రాజెక్టులకు మరో రూ. 647 కోట్లు అందాల్సి ఉన్నా అతీగతీ లేదు. మెజారిటీ ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాల్సి ఉన్నా కేంద్ర సాయం అందకపోవడం, నాబార్డు ద్వారా అందాల్సిన రూ.5,810 కోట్ల రుణంపై స్పష్టత లేకపోవడం ప్రాజెక్టుల పనులకు ప్రతిబంధకంగా మారుతోంది. సాయంపై ఎదురుచూపులే.. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమరం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటి నిర్మాణానికి రూ. 25,027 కోట్లు అవసరంకాగా ఇందులో రూ. 15,720.42 కోట్లను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసింది. మరో రూ. 9,306.75 కోట్ల నిధులను ఏఐబీపీ కింద సమకూర్చి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ... కేంద్ర సాయం కింద రూ. 1108 కోట్లు, నాబార్డు రుణం ద్వారా రూ. 7,955 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016–17, 17–18లో కలిపి మొత్తంగా కేంద్ర సాయం కింద రూ. 1194.63 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా గతేడాది రూ. 547.63 కోట్ల సాయం అందించింది. ఇందులో అత్యధికంగా దేవాదులకు రూ. 470 కోట్లు, భీమాకు రూ. 54 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ. 17 కోట్ల మేర సాయం అందించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ దేవాదులకు రూ. 496 కోట్లు, భీమాకు రూ. 107.49 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ.31.34 కోట్లు, పెద్దవాగుకు రూ. 3.89 కోట్లు, గొల్లవాగుకు రూ. 8.23 కోట్లు కలిపి మొత్తంగా రూ. 647 కోట్ల మేర నిధులు ఇవ్వాల్సి ఉన్నా స్పందించడంలేదు. దీంతోపాటు నాబార్డు కింద రూ. 7,955 కోట్లను రుణంగా ఇచ్చేందుకు గతంలోనే ఆమోదం తెలిపిన కేంద్రం...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,810 కోట్లు, తర్వాతి ఏడాది రూ. 1,463 కోట్లు, మరుసటి ఏడాది రూ. 681 కోట్ల మేర రుణం అందించేందుకు ఓకే చేసింది. అయితే ఇప్పటివరకు ఎంత రుణం ఇస్తుందనే అంశంపై స్పష్టత లేదు. నాలుగు రోజుల కిందట జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎంకేఎస్‌వై పరిధిలో దేశవ్యాప్తంగా గుర్తించిన 99 ప్రాజెక్టులకు రూ. 9,020 కోట్ల నిధులను నాబార్డు ద్వారా 6 శాతం వడ్డీతో ఇవ్వడానికి మోదీ సర్కారు ఆమోదం తెలిపినా ఇందులో రాష్ట్ర ప్రాజెక్టులకు ఎంత మేర నిధులు అందుతాయనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే రాష్ట్ర అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరుపనున్నారు. -
పీఎంకేఎస్‌వై కింద జిల్లాకు రూ.10.14 కోట్లు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యెజన(పీఎంకేఎస్‌వై) పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నారు. వివిధ యూనిట్ల గ్రౌండింగ్‌కు రూ.10.14 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తోంది. ఈ నిధులతో 4,414 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికార వర్గాలు తెలిపాయి. పథకం కింద 2,061 ఫాంపాండ్స్ తవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో పాటు నీళ్లు ఇంకిపోకుండా పాలిథిన్ షీట్ కూడా పరుస్తారు. ఫాంపాండ్‌కు సబ్సిడీ రూ.25 వేలు.. బోర్ వెల్ వద్ద వాటర్ రీచార్జి స్ట్రక్చర్(సోక్‌పిట్) నిర్మాణానికి రూ.37,500 సబ్సిడీ ఇస్తారు. మూడు గోదాములు(స్టోరేజి స్ట్రక్చర్లు) నిర్మించ తలపెట్టారు. గోదాముల నిర్మాణంతో పాటు రహదారి సదుపాయం కల్పిస్తారు. ఒక్కో దానికి రూ.10 లక్షలు సబ్సిడీ ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పర్యావరణ అనుమతులు సడలించండి
• పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులకు రూ.7,900 కోట్ల రుణం ఇప్పించండి • నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి కోరనున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతుల నిబంధనలను సడలించడంతోపాటు ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద 11 పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 7,900 కోట్ల రుణం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరనున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అనీల్ మాధవ్ దవే, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీలో ఏళ్ల తరబడి జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయ అంచనాలు భారీగా పెరిగి ఖజానాపై భారం పడుతోందన్న అంశాన్ని దవే దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ దృష్ట్యా పర్యావరణ అనుమతుల నిబంధనలను సరళతరం చేయాలని కోరను న్నారు. దీంతోపాటే ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య వంటి అంశాలపై ఉమాభారతి అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థారుు సమావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం మరోసారి ఒత్తిడి తేనున్నారు. పీఎంకేఎస్‌వై కింద గుర్తించిన 11 ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకోవాలన్న నిర్ణయం గురించి ఉమాభారతికి వివరించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులకు ఎఫ్ఆర్బీఎంతో నిమిత్తం లేకుండా రూ.7,900 కోట్ల రుణాలు ఇప్పించాలని విన్నవించనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసేందుకు దీర్ఘకాలిక సాగునీటి నిధి కింద నిధుల విడుదలకు విన్నవించే అవకాశం ఉంది. -
అపెక్స్ భేటీపై స్పష్టత కోసం ఢిల్లీకి జోషి
నేడు కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 21న నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ భేటీపై స్పష్టత కోసం రాష్ర్ట నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల సంఘం, జల వనరుల శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశం కానున్నారు. 21నే అపెక్స్ భేటీ నిర్వహించిన పక్షంలో ఏయే అంశాలను ఎజెండాలో చేర్చాలి, వాటిపై ఎలాంటి నివేదికలు సమర్పించాలన్న అంశాలపై ఆయన కేంద్ర అధికారుల నుంచి స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) పరిధిలో చేర్చిన 11 సాగునీటి పథకాలకు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాధ్‌పూర్ , భీమా, వరద కాల్వ ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.7వేల కోట మేర్ల కేంద్ర సాయం అందించేందుకు ఇటీవలే నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పీఎంకేఎస్‌వై కింద రూ.2,500 కోట్లు, నాబార్డ్ రుణం కింద రూ.4,500 కోట్లు ఇప్పించేలా ఒప్పందం జరిగింది. -
రేపు ఢిల్లీకి హరీశ్ రావు
హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి మంత్రి హరీశ్ రావు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. ఈ కార్యక్రమానకి తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీశ్ రావు హాజరుకానున్నారు. -
6న ఢిల్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో ఈ నెల 6న ఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యు డు, రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావును కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆహ్వానిం చారు. ఈ మేరకు గురువారం హరీశ్‌రావుకు లేఖ పంపారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. భూసేకరణను వేగవంతం చేయండి... పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై సాగునీటిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీతో కలసి హరీశ్‌రావు సమీక్షించా రు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు కోసం 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇంతవర కు 10,428 హెక్టార్లు సేకరించారని, మిగతా భూమిని త్వరితగతిన సేకరించాలని సూచించారు. దీంతోపాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీం ప్రాజెక్టు పరిధిలో మిగిలిన భూసేకరణను వేగిరం చేయాలని ఆదేశించారు. -
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు!
* 1.20 కోట్ల ఎకరాలకు ఐదేళ్లలో నీరిచ్చేలా రాష్ట్ర సాగునీటి శాఖ ప్రణాళిక * ఏఐబీపీ కింద రూ.7,099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ కింద రూ.8వేల కోట్లు * కేంద్రం నుంచి కోరాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరా భూమికి నీటిని అందించేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక సిద్ధమైంది. మొత్తంగా 1.20 కోట్ల ఎకరాల భూమికి వివిధ పద్ధతుల్లో పూర్తి స్థాయిలో సాగునీరందించేలా కార్యాచరణను తయారు చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ‘హర్ ఖేత్ కో పానీ’, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’, వాటర్‌షెడ్ డెవలప్మెంట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకాలను ఉపయోగించుకొని, వాటికింద ఇచ్చే నిధులను రాబట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివధ్ధి శాఖలు కలిసి సంయుక్తంగా జిల్లాల వారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి. వీటికి రాష్ట్ర స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేయగా, ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను కేంద్రానికి పంపనున్నారు. కొత్తగా చేపట్టిన పీఎంకేఎస్‌వై కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఎక్కువగా బోర్లు, బావుల కిందే వ్యవసాయ భూమి సాగులో ఉండగా, భూగర్భ జలాలు తగ్గడంతో పంటల విస్తీర్ణం తగ్గి ఉత్పాదకత పడిపోతోంది. ఈ దృష్ట్యా పీఎంకేఎస్‌వై పథకాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం.. సాగు భూమి విస్తీ ర్ణం పెంచాలని నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో దీనికోసం రూ.50 వేల కోట్ల మేర నిధులు కేటాయించేందుకు సిద్ధమని ప్రకటిం చింది. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల కు అనుగుణంగా జిల్లాల్లో సాగు యోగ్యమైన భూ విస్తీర్ణం ఎంత, ఇప్పటికే జరుగుతున్న సాగు విస్తీర్ణం ఎంత, ఇందులో బోర్లు, బావు లు, భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద సాగు జరుగుతున్న ఆయకట్టు ఎంత, మిగతా ప్రాంతాన్ని సాగులోకి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర నీటి పారుదల శాఖ కసరత్తు పూర్తి చేసి నివేదిక తయారు చేసింది. 1.20 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించేలా కార్యాచరణ పూర్తి చేసింది. దీనికోసం ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి రూ.7.099 కోట్లు, హర్ ఖేత్ కో పానీ పథకం కింద రూ.8 వేల కోట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరేందుకు నిర్ణయించింది. ఇందు లో రూ.5వేల కోట్లను మిషన్ కాకతీయ పనులకు ఖర్చు చేయనున్నారని తెలిసింది. -
పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు
సమన్వయ కమిటీ ప్రతిపాదనల్లో చేర్చాం: హరీశ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పలు ప్రతిపాదనలను రూపొందించిందని.. త్వరలోనే వాటిని కేంద్ర మంత్రి మండలికి అందజేయనుందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో పీఎంకేఎస్‌వై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీఎంకేఎస్వైలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు చేర్చాలని సిఫారసుల్లో చేర్చాం. మొత్తంగా ప్రాజెక్టులపై రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఎంవోయూ జరిగిన వారంలోనే నిధులు విడుదల చేయాలి, ప్రాజెక్టు వ్యయంలో 60% గ్రాంటుగా ఇవ్వాలి, ఆపైన నాబార్డు నుంచి కేంద్రం హామీదారుగా ఉంటూ రుణం ఇప్పించాలి, ఆ రుణంపై వడ్డీని 4.5 శాతానికి తగ్గించాలి, సకాలంలో పూర్తయిన ప్రాజెక్టుల రుణంపై వడ్డీని కేంద్రమే భరించాలి, అంచనా వ్యయం 200% పెరిగిన ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పునఃపరిశీలించాలని ప్రతిపాదించాం. వాటి ని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించి నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం..’’ అని హరీశ్ తెలిపారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో భేటీ తమ్మిడిహట్టి, మేడిగడ్డతోపాటు పలు ఇతర ప్రాజెక్టులకు సహకరించాలని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీలతో కలసి హన్స్‌రాజ్ అహిర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిర్మించే నీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చించాం. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. -
పీఎంకేఎస్‌వై ప్రతిపాదనలు సిద్ధం చేయండి
♦ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ♦ వాటిని నెలాఖరుకు కేంద్రానికి పంపాలని సూచన ♦ 11 ప్రాజెక్టులపై 4 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనున్న రాష్ట్రంలోని 11 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను ఈ నెలాఖరుకు కేంద్రానికి పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర జల సంఘం ప్రాంతీయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం ఆయన పీఎంకేఎస్‌వై పథకం పనులపై జలసౌధ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కేంద్ర జల సంఘం సీఈ గుప్తా, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, సాగునీటి శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, వివిధ జిల్లాల సీఈలు పాల్గొన్నారు. గతంలో దేవాదుల ప్రాజెక్టు మాత్రమే పీఎంకేఎస్‌వై పరిధిలో ఉండగా, తాను కేంద్ర జల సమన్వయ కమిటీ సభ్యుడిగా కొమురంభీం, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు, పాలెంవాగు, ఎస్సారెస్పీ రెండో దశ, భీమా, వరద కాల్వలను సైతం ఈ పథకంలో చేర్పించానని మంత్రి గుర్తు చేశారు. ఇందులో ముందుగా వరదకాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ రెండో దశ, భీమా, పాలెంవాగు ప్రాజెక్టులకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు మూడు రోజుల్లో కేంద్ర జల సంఘానికి నివేదికలు సమర్పించాలని కోరారు. ఈ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులను 2017 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మధ్యతరహా ప్రాజెక్టులను కేంద్ర జల సంఘం ఇంజనీర్లు, ఆయా ప్రాజెక్టుల సీఈలు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నాలుగు రోజుల్లో కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి మరో వెయ్యి ఎకరాల భూసేకరణ చేయాల్సిన అంశంపై సమీక్ష సమావేశం నుంచే మంత్రి హరీశ్‌రావు వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. సత్వరం భూసేకరణ జరపాలని కలెక్టర్‌కు సూచించారు. -
సత్వర అనుమతులపై సమగ్ర చర్చ
* ప్రాజెక్టులపై నేడు ఢిల్లీలో జలవనరుల సమన్వయ కమిటీ భేటీ * సభ్యుని హోదాలో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సత్వర అనుమతులు, నిధుల విడుదల వంటి అంశాల్లో తీసుకురావాల్సిన మార్పులపై శనివారం కేంద్ర జలవ నరుల సమన్వయ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చే సిన 46 ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఈ కమిటీ చర్చిస్తుంది. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, సత్వర అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం, సీడ బ్ల్యూసీ పనితీరు మెరుగుపర్చడం, ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించడం, కేంద్ర జలవనరుల శాఖ సామర్థ్యం పెంపొందించడం సహా పలు అంశాలైపై ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేయడం సమన్వయ కమిటీ లక్ష్యం. ప్రాజెక్టుల పనులు వేగంగా చేపట్టడంతోపాటు, నాణ్యతను నిత్యం పర్యవేక్షించడం వంటి అంశాల్లో ఈ కమిటీ కేంద్రానికి పలు సూచనలు చేయబోతుంది. నెల రోజుల్లో నివేదిక సిద్ధం చేయనుంది. ఈ సమావేశానికి సమన్వయ కమిటీ సభ్యుని హోదాలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ప్రాజెక్టుల అనుమతులకు ప్రస్తుతం ఉన్న విధానాలను మార్చాలని గత జలమంథన్ సమావేశంలో హరీశ్‌రావు చేసిన ప్రతిపాదన పట్ల కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి వెంటనే స్పందించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి నివేదిక పంపితే రెండేళ్ల కాలం పడుతోందని, దీంతో అవి సకాలంలో పూర్తి కావడంలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి, విలువైన ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. హరీశ్ సూచనలతో ఏకీభవించిన కేంద్ర మంత్రి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. హరీశ్ రావు, మహారాష్ట్ర మంత్రి గిరిష్ దత్తాత్రేయ మహాజన్ సభ్యులుగా ఉన్నారు. రాజస్తాన్, జమ్ము కశ్మీర్, అస్సాం, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు.