పీఎం కిసాన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం కేంద్రం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం తమ పేరును ఇంకా నమోదు చేసుకోని రైతులు, ఈ పథకం నుంచి రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ను ఈ నెల జూన్ 30 లోపు అధికారులు ఆమోదిస్తే, లబ్ది దారుల జాబితాలో మీ పేరు ఉంటే గత నెల, ఈ నెల రెండు విడతలు ఒకేసారి పొందవచ్చు అని జీ న్యూస్ నివేదించింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను రైతుల ఖాతాలో ప్రతి ఏడాది ఆరు వేల రూయపాయాలను జమ చేస్తుంది. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతు కుటుంబాలకు ఏడాదికి మూడు సార్లు రైతుల ఖాతాలో నగదు జమచేస్తుంది. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం.. అర్హత గల రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రభుత్వాల సహాయంతో గుర్తించి నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. పీఎం కిసాన్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, ల్యాండ్‌హోల్డింగ్ పేపర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం. మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment