దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి పెట్టుబడి సహాయం కింద చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతలలో రూ.2వేల చొప్పున అందజేస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమ కాలేదు.
కేంద్ర ప్రభుత్వం గత కొద్దీ రోజుల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉంది. దీంతో పీఎం కిసాన్ ఎనిమిదవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించింది. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు, డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమచేయలేదు.. అంటూ పేర్కొన్నారు కైలాష్ చౌదరి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment