kailash
-
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్.. నేడు (సోమవారం) బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, దుష్యంత్ గౌతమ్, హర్ష్ మల్హోత్రా, పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.ఆప్ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పదవికి కూడా గహ్లోత్ ఆదివారం రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే ఇది జరిగిన మరుసటి రోజే సోమవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కైలాష్ మాట్లాడుతూ.. ఆప్‌కు రాజీనామా, బీజేపీలో చేరిక నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒత్తిడితోనే తాను వైదొలిగినట్లు ఆప్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతలకు దూరమైందని ఆరోపించారు..‘నేను ఎలాంటి ఒత్తిళ్ల వల్ల బీజేపీలో చేరలేదు. ఆప్ దాని సిద్ధాంతాలపై రాజీ పడింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఆప్‌లో చేరాను, కానీ ఇప్పుడు పార్టీ దాని అసలు లక్ష్యం డిస్కనెక్ట్ అయ్యింది, ఆప్ నాయకులు 'ఆమ్' (కామన్) నుంిచి 'ఖాస్' (ఎలైట్) గా మారుతున్నారు.కేంద్రంతో పోరాడటంపైనే ఆప్ ప్రభుత్వం దృష్టి సారించింది., అలాంటి వైఖరి ఢిల్లీలో నిజమైన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కేంద్రంలో కలిసి పని చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ రోజు బీజేపీలో చేరాను. ’ అని ఢిల్లీ మాజీ మంత్రి తెలిపారు.కాగా నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యే అయిన గహ్లోత్ ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని.. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు.ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు , యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా 'శీష్ మహల్' చుట్టూ వివాదం ముసురుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
-
ఆప్ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.కైలాష్ ఆ పకటనలో పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. Delhi Minister and AAP leader Kailash Gahlot resigned from primary membership of Aam Aadmi Party; writes to party national convenor Arvind Kejriwal.The letter reads, "There are many embarrassing and awkward controversies like the 'Sheeshmahal', which are now making everyone… https://t.co/NVhTjXl1c2 pic.twitter.com/wVU7dSesBa— ANI (@ANI) November 17, 2024ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు. కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్ మిశ్రా అన్నారు. -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్‌ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది -
తిరుమల పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి
-
కొడుకును సీఎం చేయడంపైనే ధ్యాస
సాక్షి, హైదరాబాద్: తన కొడుకును సీఎం చేయడం తప్ప తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా సీఎం కేసీఆర్ తీరుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన రైతుసదస్సులో కిషన్‌రెడ్డి మాట్లా డారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్ పేరుతో రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డా రు. అయినా ఆ ప్రాజెక్టుకు ఫీజబిలిటి లేదని, కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.57 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారు: బండి నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో సీఎంవో రూ. 500 కోట్లు దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేసీఆర్ నిర్వాకంవల్ల రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల సంస్థను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. థ్యాంక్స్ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలతాయా?’అని అన్నారు. వారికి స్థానం లేదు: కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి ‘భారత్ మాతా కీ జై.. వందే మాతరం అనని వారికి ఈ దేశంలో స్థానం లేదు. పాకిస్తాన్ జిందాబాద్ అనే వారు అక్కడికి వెళ్లొచ్చు’అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వచ్చే కొద్దిపాటి కరెంటు కూడా ట్రిప్ అయి వస్తోందని చెప్పారు. ‘గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో దోచుకోవాలని చూస్తోంది. ఇది ఘమండి, ఘట్ బంధన్ కూటమి’అని మండిపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
నేటి నుంచి జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ) మినిస్టీరియల్ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధం అయ్యింది. గురువారం నుంచి ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీ య సంస్థల డైరెక్టర్ జనరల్స్ పాల్గొంటారు. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మొదటిరోజు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శిస్తారు. అనంతరం వ్యవసాయ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) జరుగనుంది. ద్వితీయార్ధంలో అగ్రిబిజినెస్ ఫర్ ప్రాఫిట్, పీపుల్ అండ్ ప్లానెట్ నిర్వహణ, ‘డిజిటల్లీ డిస్కనెక్ట్: వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవడం’ కార్యక్రమాలు జరుగుతాయి. జీ–20 సమావేశంలో పాల్గొనే మంత్రులు, ఇతర ప్రతినిధి బృందాల నాయకులకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వాగతం పలకడంతో రెండవరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, సుస్థిర జీవవైవిధ్యం, వాతావరణ సమస్యల పరిష్కారాలపై మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల చర్చలు మూడు సమాంతర సెషన్లలో జరుగుతా యి. మూడవ రోజు భారత్ అధ్యక్షతన అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, జీ–20 ఫలితాలను ఆమోదించడంతో మంత్రుల సమావేశం ముగుస్తుంది. అనంతరం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ –ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)కు సాంకేతిక విజ్ఞాన యాత్రకు ప్రతినిధి బృందం వెళ్తుంది. -
‘నిత్యానంద కైలాస’ను పరిగణించం: ఐరాస
జెనీవా: భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన నిత్యానంద స్వామి నెలకొల్పినట్లు చెబుతున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు జెనీవాలో గత నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక చర్చాగోష్టిలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐరాస స్పష్టతనిచ్చింది. ‘యూఎస్‌కే ప్రతినిధులు వాస్తవానికి ఒక దేశం తరఫున ఆ చర్చలో పాల్గొనలేదు. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా వాళ్లు వచ్చి మాట్లాడారు. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు’ అని ఐరాస బుధవారం స్పష్టంచేసింది. ‘ జెనీవా చర్చాగోష్ఠిలో ముందస్తు అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. పలు సమస్యలు, ఇతివృత్తాలపై వెలువడే భిన్నాభిప్రాయాలతో కూడిన ముసాయిదా అది. ఐరాసలో కైలాస దేశ శాశ్వత మహిళా రాయబారిగా చెప్పుకున్న విజయప్రియ నిత్యానంద అభిప్రాయాలను పట్టించుకోబోం’ అని జెనీవాలోని ఐరాస మానవహక్కుల హై కమిషనర్ చెప్పారు. -
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
పీఎం కిసాన్ ఎనిమిదో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి పెట్టుబడి సహాయం కింద చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతలలో రూ.2వేల చొప్పున అందజేస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. కేంద్ర ప్రభుత్వం గత కొద్దీ రోజుల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉంది. దీంతో పీఎం కిసాన్ ఎనిమిదవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించింది. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు, డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమచేయలేదు.. అంటూ పేర్కొన్నారు కైలాష్ చౌదరి. చదవండి: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్ -
వేగంగా ఎదుగుతున్న విత్తన పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే భారతదేశంలో విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి అన్నారు. దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే, అందులో తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయన్నారు. తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధికి బాటలు వేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నోవాటెల్‌లో బుధవారం అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రైతాంగ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమన్నారు. ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారత్‌లో జరగడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే పత్తి విత్తనోత్పత్తిలో భారత్‌ది అగ్రస్థానం కాగా... వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, కూరగాయల్లో మేలైన విత్తనాల ఉత్పత్తి జరుగుతుందన్నారు. పర్యావరణ మార్పులు, తరుగుతున్న సహజ వనరుల నేపథ్యం లో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కైలాష్ చౌదరి అభిప్రాయపడ్డారు. తెలంగాణది పెద్దన్న పాత్ర: నిరంజన్‌రెడ్డి భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, సీఎం కేసీఆర్ కృషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇస్టా సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహదపడుతుందన్నారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తనరంగ సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. నాణ్యమైన విత్తనమే వ్యవసాయాభివృద్ధికి మూలమన్నారు. విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. రైతులకు విత్తనోత్పత్తిలో సాయంగా ఉండే పాలసీలను తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యతకు ఆదరణ: మహమూద్ అలీ నాణ్యమైన ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అదే కారణమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సుకు గౌరవ అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇస్టా సదస్సు మూలంగా విత్తన పరీక్షా ప్రమాణాలు మన రైతులకు, నిపుణులకు తెలుస్తాయన్నారు. దానికి అనుగుణంగా పంటలు పండించి విత్తనాలను రూపొందించడం మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రమాణాల పెరుగుదలకు దోహదం.. వివిధ దేశాల విత్తన అవసరాలు, ప్రమాణాలు పరస్పరం తెలుసుకునేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన మొలక శాతం, నాణ్యత పరీక్షలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై జరిగిన పరిశోధనా ఫలితాలు అందరూ తెలుసుకునేందుకు ఇది అవకాశం అని, తెలంగాణ విత్తన బ్రాండ్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయడానికి దీంతో అవకాశాలు మెరుగవుతాయన్నారు. ‘ఇస్టా’సదస్సుకు 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారతీయ, తెలంగాణ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎగ్జిబిషన్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. సదస్సుకు ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ మెక్‌గ్రిల్, జాతీయ విత్తన సంయుక్త కార్యదర్శి అశ్వనీకుమార్, జాతీయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు వందన సమర్పణతో తొలిరోజు సదస్సు ముగిసింది. గురువారం సదస్సులో కీలకమైన విత్తనోత్పత్తి రైతుల సమావేశం జరగనుంది. నేడు విత్తన రైతుల సదస్సు అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండోరోజు గురువారం విత్తన రైతు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 1,500 మంది విత్తనోత్పత్తి రైతులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి శివశంకర్‌రెడ్డిలు హాజరుకానున్నట్లు తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్, ఇస్టా సదస్సు కో–ఆర్డినేటర్ డాక్టర్ కేశవులు తెలిపారు. విత్తన సదస్సు సందర్భంగా విత్తన సాగు చేపడుతున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, వివిధ దేశాలలో విత్తన అవసరాల గుర్తింపు, ఏయే దేశాలకు ఏ విత్తనాలు ఎగుమతి చేయగలమనే అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. -
వంద మలుపులు!
కైలాష్, అభిషేక్, ప్రియా, మధు ముఖ్యతారలుగా వెంకట్ నారాయణ దర్శకత్వంలో ‘మూడు వందల ముప్పై నాలుగో కథ’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్స్, శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్ బ్యానర్స్‌పై సి. చంద్రనాథ్ నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మొబైల్ ఫోన్లో వినోదాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను స్టార్స్ లేని ఈ చిత్రానికి రప్పించాలన్నది మా ఆశయం. అందుకే కొత్త కథ, కథనంతో సినిమాను డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. సినిమాలో ఉన్న ఆరు కథలకు సింగిల్ క్లైమాక్స్ ఉంటుంది. 333 కథలు ఉన్న ఓ పాత పుస్తకం చుట్టూ సినిమా తిరుగుతుంది. 334వ కథ ఏంటి? ఏం జరిగింది? అనేదే కథ. ఈ సినిమాలో వందకు పైగా ట్విస్ట్‌లు ఉంటాయి. హారర్, సస్పెన్స్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉన్న కథ. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
సిమ్ కోట్ లో చిక్కుకున్నభారతీయులు!
న్యూఢిల్లీః కైలాశ్ మానస సరోవరం యాత్రకు వెళ్ళిన 500 మంది భారతీయ యాత్రికులు వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్ లో చిక్కుకుపోయారు. నేపాల్ పర్వత ప్రాంతంలోని హిల్సా, సిమికోట్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారని, వారికి సహాయక చర్యలు అందించేందుకు సైతం అనేక ఇబ్బందులు ఎదురౌతున్నట్లు అధికారులు వెల్లడించారు. మానస సరోవర్ యాత్రికులకు సహాయక చర్యలను అందించేందుకు నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శితో కాట్మాండులోని భారత దౌత్య కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయ యాత్రికులందరినీ కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నేపాల్ లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు హోం శాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర పోలీసు బలగాలు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్ళిన దాదాపు 50 మందిని ఇప్పటి దాకా హిల్సానుంచి సిమ్ కోట్ కు తరలించినట్లు, దాదాపు వంద మందిని సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. హెలికాప్లర్ల ద్వారా వారిని తరలిస్తున్నామని, ఇంకా సిమికోట్ లో 250 మంది వరకూ యాత్రికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నేపాలీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు స్వరూప్ వెల్లడించారు. -
వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొంగుప్పల్ గ్రామంలో వడదెబ్బకు ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం గ్రామంలోనే వ్యవసాయ క్షేత్రాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీ పనులకు మొండి కైలాస్ (44) వెళ్లాడు. ఎండ ప్రభావానికి మధ్యాహ్న సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. తోటి కూలీలు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. -
సైనేడ్ కిల్లర్
కర్ణాటక, 2009... ఆటో దిగి ఎదురుగా ఉన్న కళ్యాణ మంటపం వైపు చూసింది సవిత. ఆమె మనసంతా వింత అనుభూతికి లోన య్యింది. కాసేపట్లో తను ఒక వ్యక్తికి భార్య కాబోతోంది. అది కూడా తన మనసుకు నచ్చిన వ్యక్తికి. అది తలచుకుంటుంటే ఆమె అణువణువూ పులకరిస్తోంది. ‘‘ఏంటలా నిలబడిపోయావ్. పద’’ అన్నాడు కైలాష్ ఆమె చేయి పట్టుకుంటూ. అతని ముఖంలోకి చూసింది సవిత. మరు క్షణం ఆమె కనురెప్పలు సిగ్గుతో వాలాయి. ‘‘అబ్బో... సిగ్గే? కాసేపట్లో నువ్వు నా భార్యవయిపోతున్నావు. ఇంకా ఎందుకట అంత సిగ్గు’’ అన్నాడు కైలాష్.‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను కైలాష్. నీ భార్యను కావాలన్న ఆశ ఇంత త్వరగా తీరుతుందనుకోలేదు. థాంక్యూ’’ అంటుంటే సవిత కన్నుల్లోకి ఆనంద బాష్పాలు వచ్చి చేరాయి. ‘‘ఇదిగో... సంతోషంతో అయినా సరే, నీ కళ్లు తడిస్తే నేను తట్టుకోలేనని చెప్పానా? అయినా నేనే నీకు థాంక్స్ చెప్పాలి, నీ భర్తనయ్యే చాన్స్ నాకిచ్చినందుకు.’’మురిసిపోయింది సవిత. కైలాష్ చేయి పట్టుకుని మంటపం వైపు కదిలింది. నాలుగడుగులు వేయగానే ఠక్కున ఆగిపో యాడు కైలాష్. ఏమైందన్నట్టు చూసింది.‘‘అవునూ... ట్యాబ్లెట్ వేసు కున్నావా?’’ అన్నాడు చెవిలో గుసగుసగా. నాలిక్కరుచుకుందామె. ‘‘సారీ కైలాష్... మర్చిపోయాను’’ అంది గోముగా. ‘‘భలేదానివే. ఇవాళ పెళ్లి కదా అని రాత్రి తొందరపడ్డాం. కానీ అప్పుడే పిల్లలూ గట్రా అంటే మన సంతోషానికి బ్రేక్ పడినట్టే. ముందు వెళ్లి ట్యాబ్లెట్ వేసుకుని రా. అందరి ముందూ వేసుకోకు. పెళ్లికూతురి ముస్తాబులో ఉండి కాంట్రా సెప్టివ్ పిల్ వేసుకోవడం ఎవరైనా చూస్తే బాగోదు’’ అన్నాడు కైలాష్. సరేనని తలూపి టాయిలెట్ వైపు నడిచింది సవిత. కైలాష్ మంటపం వైపు నడిచాడు. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’ టాయిలెట్ ముందు గుమిగూడి ఉన్న జనాన్ని చూసి అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవ్వరూ మాట్లాడలేదు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చి అన్నాడు... ‘‘ఎవరో అమ్మాయి సర్. టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్నట్టుంది’’.అందరినీ దాటుకుని ముందుకు వెళ్లాడు ఇన్స్పెక్టర్. టాయిలెట్లో నేలమీద పడి ఉంది సవిత. నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. దగ్గరకు వెళ్లి నాడి పట్టుకుని చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘చనిపోయింది’’ అన్నాడు చేయి వదిలేస్తూ. ‘‘పెళ్లి చేసుకోవడానికి వచ్చిందని తన మేకప్‌ని బట్టి తెలుస్తోంది. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుని ఉంటుంది సర్’’... సందేహాన్ని వెలిబుచ్చాడు వెనుకే ఉన్న కానిస్టేబుల్.‘‘ఏముంది? ఎవరినో నమ్మి వచ్చి ఉంటుంది. వాడు తాళి కట్టే సమయానికి పరారైపోయి ఉంటాడు. తట్టుకోలేక ప్రాణాలు తీసుకుని ఉంటుంది. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువైపోయాయిగా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అక్కడ ఉన్నవాళ్లందరినీ అడిగాడు. అందరూ తలలు అడ్డంగా ఊపడంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘వ్వా...ట్! అదెలా సాధ్యం?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ.‘‘ఏమో సర్. తను సైనేడ్ మింగే ఆత్మ హత్య చేసుకుంది’’.. నొక్కి వక్కాణించాడు పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్. ‘‘ఒకవేళ ఆ అమ్మాయి మోసపోయి ఉంటే, చనిపోవాలని అప్పటికప్పుడు అను కుని ఉంటుంది. అలాంటప్పుడు వెళ్లి ఉరి వేసుకునేది. లేదంటే ఆ ఆవేశంలో ఏ బిల్డింగో ఎక్కి దూకేది. కానీ తనకి సైనేడ్ ఎక్కడి నుంచి వస్తుంది?’’ఆ అనాలసిస్ చూసి తన బాస్ గ్రేట్ అనిపించింది కానిస్టేబుల్‌కి. ‘‘నిజం సర్. మీరన్నది ముమ్మాటికీ నిజం. ఒకవేళ వెళ్లి కొనుక్కున్నా ఇంకెక్కడైనా మింగాలి కానీ, మళ్లీ మంటపం దగ్గరకొచ్చి, టాయిలెట్లోకి వెళ్లి ఎందుకు మింగుతుంది?’’... తన ఆలోచనలను కూడా జోడించాడు.‘‘యు ఆర్ రైట్. అంటే ఆమె ముందే చనిపోవడానికి ప్రిపేరయ్యి అయినా వచ్చి ఉంటాలి. లేదంటే ఆమెతో సైనేడ్ మరెవరైనా మింగించైనా ఉండాలి.’’ ఇన్స్పెక్టర్ అలా అనగానే చురుక్కున చూశాడు డాక్టర్. ‘‘నాకో విషయం గుర్తొచ్చింది సర్. కొల్లూరులో నాకో ఫ్రెండ్ ఉన్నాడు. తనూ డాక్టరే. కొద్ది రోజుల క్రితం తను నాతో ఓ కేసు వివరాలు షేర్ చేసుకున్నాడు. అది కూడా ఇలాంటిదే. ఓ హోటల్ టాయిలెట్లో ఒకమ్మాయి శవం దొరికింది. నా ఫ్రెండే పోస్ట్‌మార్టమ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా పెళ్లికూతురి ముస్తాబులోనే ఉందని, సైనేడ్ మింగి చనిపోయిందని నా ఫ్రెండ్ చెప్పాడు.’’ వెతకబోయిన తీగ ఏదో కాలికి తగిలినట్లయ్యింది ఇన్స్పెక్టర్కి. మరుక్షణం కొల్లూరు పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాడు. కేసు వివరాలడిగి తెలుసుకున్నాడు. డాక్టర్ చెప్పింది నిజమే. వెంటనే కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్లకీ ఫోన్ చేశాడు. ఇంకెక్కడైనా సైనేడ్ మరణాలు సంభవిం చాయా అంటూ ఆరా తీస్తే బుర్ర తిరిగి పోయే విషయాలు తెలిశాయతనికి. అప్పటివరకూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఇరవై మంది అమ్మాయిలు సైనేడ్ వల్ల మరణించారు. అందరూ పెళ్లికూతుళ్లే. అందరూ టాయిలెట్లలోనే చనిపోయారు. అయితే ఆత్మహత్య చేసు కున్నారా, హత్యకి గురయ్యారా అన్నది తేలకపోవడంతో అన్ని కేసుల ఫైళ్లూ అల్మరాల్లో చేరి మూలుగుతున్నాయి. విస్తుపోయాడు ఇన్స్పెక్టర్. ఒకటి కాదు, రెండు కాదు... ఇరవై మరణాలు. ఒక్క క్లూ కూడా దొరకలేదా? అదెలా? అతడీ విషయాన్ని తేలికగా తీసుకో దలచుకోలేదు. ఇంకే ఆడపిల్లా అలా మరణించడానికి వీల్లేదు అనుకున్నాడు బలంగా. అందుకేం చేయాలో వ్యూహాన్ని రచించడం మొదలుపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత... మంగుళూరులోని ఓ హోటల్ ముందు ఆగింది పోలీస్ జీపు. ‘‘సర్... వాడే’’... ఇన్స్పెక్టర్ చెవిలో చెప్పాడు కానిస్టేబుల్. హోటల్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్. మెయిడ్ డోర్ పక్కన నిలబడి ఉన్నాడో వ్యక్తి. సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు.అందరూ జీపు దిగారు. ఒక్క అంగలో వెళ్లి ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. సివిల్ డ్రెస్సుల్లో ఉన్నా, పోలీసులని అర్థమైపో యిందతనికి. మౌనంగా లొంగిపోయాడు. లేడీ కానిస్టేబుల్ని తీసుకుని టాయి లెట్ వైపు పరుగు తీశాడు ఇన్స్పెక్టర్. తలుపులు తోసుకుని లోపలికెళ్లేసరికి ఓ అమ్మాయి ఏదో ట్యాబ్లెట్ వేసుకోవడానికి సిద్ధపడుతోంది. ‘‘ఏంటిది... ఏం చేస్తున్నావ్’’... అంటూ చప్పున ఆపాడు.‘‘ఇది... ఇది... కాంట్రాసెప్టివ్ పిల్ సర్’’... అందా అమ్మాయి సిగ్గుతో తల దించుకుంటూ. ‘‘కాదు... అది కాంట్రాసెప్టివ్ కాదు. సైనేడ్’’ అంటూ ఆమె చేతిలోని ట్యాబ్లెట్ లాక్కున్నాడు. ఆమె అవాక్కయి చూస్తూండిపోయింది. ఆమె మాత్రమే కాదు... ఇరవై మంది అమ్మాయిల మరణాల వెనుక ఉన్న అసలు కథ తెలిసి యావత్ దేశమే అవాక్కయి పోయింది. మరణాలు సంభవించిన ప్రాంతాల్లోని మందుల షాపులపై నిఘా పెట్టారు పోలీసులు. ఎవరైనా సైనేడ్ అమ్ముతున్నారేమోనని పరిశీలించారు. చివరికి ఓ షాపువాడే ఆ పని చేస్తున్నాడని అర్థమైంది. అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజం బయటపడింది. ఆ ఆడపిల్లలెవరూ ఆత్మహత్య చేసుకో లేదు. హత్యకు గురయ్యారు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసానికి గురై ప్రాణాలు విడిచారు. దురదృష్టం ఏమిటంటే... అందరూ ప్రేమించింది ఒకే వ్యక్తిని. అతడే మోహన్ కుమార్. మోహన్ ఓ సాధారణ స్కూల్ మాస్టర్. కానీ అతడి ఆలోచనలు మాత్రం సామాన్యమైనవి కావు. డబ్బులో మునిగి తేలాలని విపరీతమైన ఆశ. సుఖాల్లో తేలియాడాలని వెర్రి తలలు వేసిన కాంక్ష. అ రెండూ అతణ్ని క్రూరమృగంగా మార్చేశాయి. మ్యాట్రిమోనియల్ సైట్లు, పేపర్లో పెళ్లి ప్రకటనల ద్వారా అమ్మాయిల వివరాలు సేకరించేవాడు. వారితో ఫోన్ ద్వారా మెల్లగా మాట కలిపేవాడు. అందంగా మాట్లాడి వాళ్లను ప్రేమ మత్తులో ముంచేసేవాడు. చివరికి డబ్బు, నగలు తీసుకుని ఇంటి నుంచి పారిపోయి రమ్మంటూ వాళ్లను ప్రోత్సహించేవాడు. వచ్చిన తర్వాత హోటల్‌కి తీసుకెళ్లేవాడు. రేపు పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మబలికి ఆ రాత్రి వారితో తన కోరికలు తీర్చుకునేవాడు. మర్నాడు వాళ్లను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసేవాడు. కానీ నగలు పెట్టుకోనిచ్చేవాడు కాదు. అందరి కళ్లూ పడతాయనో, అన్ని నగలు పెట్టుకో వడం రిస్క్ అనో చెప్పి, వాటిని బ్యాగులో సర్దేసేవాడు. ఆ తర్వాత టాయిలెట్లోకి వెళ్లి, గర్భం రాకుండా కాంట్రాసెప్టివ్ మాత్ర వేసుకొమ్మని ఇచ్చేవాడు. వాళ్లు వెళ్లి వేసు కుని మరణించేవారు. ఇతడు ఏమీ ఎరగ నట్టు డబ్బు, నగలు తీసుకుని ఉడాయించే వాడు. ఇలా ఇరవై హత్యలు చేశాడు. దొరక్కుండా ఉండేందుకు రకరకాల ప్రదేశాల్లో హత్యలు ప్లాన్ చేశాడు. కానీ చివరికి పాపం పండి పట్టుబడ్డాడు. మోహన్ కుమార్ చేసిన ఘాతుకాలు విని అందరూ షాకైపోయారు. అమాయక మైన ఆడపిల్లల్ని నమ్మించి, ఉసురు తీసిన ఆ దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు అన్నారు. న్యాయస్థానం కూడా అలాగే ఆలోచించింది. 2013లో మోహన్‌కి ఉరిశిక్ష విధించింది. అయితే అది ఇంకా అమలు కాలేదు. ప్రస్తుతం ఆ యాభై రెండేళ్ల మృగం... కర్ణాటకలోని ఓ జైలులో మగ్గుతోంది. ఎందరో ప్రాణాలు తీసిన తనను మృత్యువు కబళిస్తుందా లేక ఎన్నో కేసుల్లోలాగే తన మరణశిక్ష జైలుశిక్షగా మారుతుందా అని ఎదురు చూస్తోంది. మొదటిదే జరగాలని మరణించిన అమ్మాయిల కుటుంబాలతో పాటు దేశ ప్రజానీకం మొత్తం కోరుకుంటోంది. రెండోది కనుక జరిగితే న్యాయానికి ఉరి వేసినట్టవుతుందని అంటోంది. మరి సైనేడ్ కిల్లర్ మోహన్ కథ చివరికి ఎలా అంతమవుతుందో... వేచి చూడాలి! కర్ణాటకలోని బంట్వాల్ జిల్లాలో ఉన్న ఓ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేవాడు మోహన్. అక్కడ అతనికి ఎంత మంచి పేరు ఉందంటే... అతడన్ని హత్యలు చేశాడంటే వాళ్లెవరూ నమ్మలేక పోయారు. అతను ఎంతో నెమ్మదస్తుడని ఇరుగు పొరుగువాళ్లు, బంధువులు, స్నేహితులు సైతం సర్టిఫికెట్ ఇచ్చారు. విచిత్రమేమిటంటే... అంతమంది ఆడపిల్లల్ని నిర్దాక్షి ణ్యంగా చంపేసిన మోహన్‌కి ముగ్గురు భార్యలు, పిల్లలు ఉన్నారు. వాళ్లని అతడు ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, ఏ లోటూ రానిచ్చేవాడు కాదనీ వాళ్ల మాటల ద్వారా తెలిసింది. అయితే మాత్రం... తన ఇంట్లో సంతోషాన్ని వెదజల్లి, ఎందరో ఇళ్లలో చీకటిని నింపేసిన మోహన్ని క్షమించగలమా?! -
బాలికపై రేప్.. నిందితుడి కొడుకుతో పెళ్లి!
జైపూర్: ఓ నలభై ఏళ్ల దుర్మార్గుడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కుల పంచాయతీకి వచ్చింది. అన్నీ పరిశీలించిన మీదట.. ఆ బాలికను నిందితుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పంచాయతీ తీర్పు చెప్పింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ్‌పుర గ్రామం ఈ దారుణానికి వేదికైంది. పక్షం రోజుల కిందట కైలాశ్(40) అనే వ్యక్తి.. తమ సమీపంలో నివసించే బాలికను ఓ గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడని, బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి బదులు ఇలా కుల పంచాయతీని ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. దీంతో బాధిత బాలికను కైలాశ్ చిన్న కుమారుడు(8) పెళ్లి చేసుకోవాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దీనికి రెండు వర్గాల వారూ అంగీకరించలేదు. దీనిపై నిందితుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు బుధవారంనాడు ఆ బాలికపై కైలాశ్ మరోసారి అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయం కొందరు సామాజిక కార్యకర్తలకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కైలాశ్‌ను అరెస్టు చేశారు. -
బాలికపై రేప్.. నిందితుడి కొడుకుతో పెళ్లి!
జైపూర్: ఓ నలభై ఏళ్ల దుర్మార్గుడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కుల పంచాయతీకి వచ్చింది. అన్నీ పరిశీలించిన మీదట.. ఆ బాలికను నిందితుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పంచాయతీ తీర్పు చెప్పింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ్‌పుర గ్రామం ఈ దారుణానికి వేదికైంది. పక్షం రోజుల కిందట కైలాశ్(40) అనే వ్యక్తి.. తమ సమీపంలో నివసించే బాలికను ఓ గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడని, బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి బదులు ఇలా కుల పంచాయతీని ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. దీంతో బాధిత బాలికను కైలాశ్ చిన్న కుమారుడు(8) పెళ్లి చేసుకోవాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దీనికి రెండు వర్గాల వారూ అంగీకరించలేదు. దీనిపై నిందితుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు బుధవారంనాడు ఆ బాలికపై కైలాశ్ మరోసారి అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయం కొందరు సామాజిక కార్యకర్తలకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కైలాశ్‌ను అరెస్టు చేశారు.