వంద మలుపులు! | More than one hundred twists in the story of three hundred thirty-fourth | Sakshi
Sakshi News home page

వంద మలుపులు!

Published Mon, Jul 10 2017 12:36 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

వంద మలుపులు! - Sakshi

వంద మలుపులు!

కైలాష్, అభిషేక్, ప్రియా, మధు ముఖ్యతారలుగా వెంకట్‌ నారాయణ దర్శకత్వంలో ‘మూడు వందల ముప్పై నాలుగో కథ’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్‌ మైండ్‌ ప్రొడక్షన్స్, శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్‌ బ్యానర్స్‌పై సి. చంద్రనాథ్‌ నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మొబైల్‌ ఫోన్‌లో వినోదాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ప్రేక్షకులను స్టార్స్‌ లేని ఈ చిత్రానికి రప్పించాలన్నది మా ఆశయం.

అందుకే కొత్త కథ, కథనంతో సినిమాను డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. సినిమాలో ఉన్న ఆరు కథలకు సింగిల్‌ క్లైమాక్స్‌ ఉంటుంది. 333 కథలు ఉన్న ఓ పాత పుస్తకం చుట్టూ సినిమా తిరుగుతుంది. 334వ కథ ఏంటి? ఏం జరిగింది? అనేదే కథ. ఈ సినిమాలో వందకు పైగా ట్విస్ట్‌లు ఉంటాయి. హారర్, సస్పెన్స్, రొమాన్స్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న కథ. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement