న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.
కైలాష్ ఆ పకటనలో పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.
కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.
Delhi Minister and AAP leader Kailash Gahlot resigned from primary membership of Aam Aadmi Party; writes to party national convenor Arvind Kejriwal.
The letter reads, "There are many embarrassing and awkward controversies like the 'Sheeshmahal', which are now making everyone… https://t.co/NVhTjXl1c2 pic.twitter.com/wVU7dSesBa— ANI (@ANI) November 17, 2024
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు. కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్ మిశ్రా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment