న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్‌ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్‌లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది
Comments
Please login to add a commentAdd a comment