Statement Record
-
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్‌ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది -
‘కవిత వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరాలంటూ తనను ఆఫర్ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ బృందం కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆమె చెప్పిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ శుక్ర వారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్యనేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఎంఆర్ జీ వినోద్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ఆ నలుగురి వరకే పరిమితం చేయొద్దని, కవితను కలిసి గానీ, సిట్ కార్యాలయానికి పిలిపించి గానీ వాంగ్మూలం రికార్డు చేయాలని కోరారు. లేదంటే సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కోర్టు ముందు దోషిగా నిలబ డాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో నలుగురు ఎమ్మెల్యేలను బందెల దొడ్డిలో బంధించినట్టు ప్రగతిభవన్‌లో ఉంచా రని, అమ్ముడుపోయిన వారే మళ్లీ అమ్ముడు పోతుంటే వారితో కేసీఆర్ రాజకీయం చేయా లనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసహ్య పదజాలంతో చిల్లర పంచాయతీలు పెట్టుకుం టున్న టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల ఆలోచన లను కలుషితం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం కాంగ్రెస్‌లో చేరతానంటూ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసినట్టు ఎంపీ అర్వింద్ చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా తమకు అలాంటి సమాచారం లేదని రేవంత్ బదులిచ్చారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరే అంశం గురించి తమకు తెలు సని, ఆయన్ను చేర్చుకునేందుకు తమకు అభ్యంతరం లేదని ఖర్గేకు చెప్పామన్నారు. తన పాదయాత్రపై ఏఐసీసీ నిర్ణయం తీసు కుంటుందని రేవంత్ చెప్పారు. ప్రజా సమ స్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే టీఆర్ ఎస్, బీజేపీలు వివాదాస్పద అంశాలపైనే చర్చను పక్కదారి పట్టిస్తున్నారని మండిప డ్డారు. రైతుల సమస్యలపై తాము ప్రజాక్షే త్రంలోకి వెళ్తామని, నేటి ముఖ్యనేతల సమా వేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఓబీసీల జనగణ నపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై పోరాడతామని వెల్లడించారు. ఇదీ చదవండి: దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్ -
'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
Shilpa Shetty Says I don't know Raj Kundra Work: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్షీట్లో చేర్చారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్లో పేర్కొంది. 'నేను షూటింగ్స్‌లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. హాట్‌షాట్స్, బాలీఫేమ్ యాప్స్‌ల గురించి కూడా నాకు తెలియదు' అంటూ శిల్పా చెప్పిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 1400పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు ఫైల్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్‌షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది. అంతేకాకుండా పోర్న్రాకెట్ను గట్టుచప్పుడు కాకుండా నడిపించిన రాజ్‌కుంద్రా ఇందుకు గాను వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్‌షీట్‌లో నమోదు చేవారు. మరోవైపు గత జులై19నుంచి రాజ్‌కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. చదవండి : బిగ్‌బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్?! -
రోడ్డు ప్రమాదం.. వాంగ్మూలం ఇచ్చిన బిగ్‌బాస్ నటి
చెన్నై: నటి యాషిక ఆనంద్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా తీవ్ర గాయాలపాలైన నటి యాషిక ఆనంద్ స్థానిక అడయార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె నడుము, కుడికాలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు సోమవారం కారు ప్రమాదం గురించి యాషికను కలిసి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె స్నేహితురాలు భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదంలో కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాంగ్మూలంలో యాషిక తెలిపారు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. కారు నడుపుతున్న సమయంలో యాషిక మద్యం సేవించలేదని విచారణలో తేలింది. -
వైఎస్ వివేకా హత్య కేసులో వాచ్మెన్ వాంగ్మూలం
సాక్షి ప్రతినిధి, కడప/అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్మెన్ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానికి చెందిన ఇతను చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. విచారణలో భాగంగా ఇదివరకు ఇతనికి సిట్ బృందం నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేయించింది. తాజా విచారణలో భాగంగా ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు విచారించిన సీబీఐ.. ఇదే నెలలో 21, 22, 23 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు విచారించింది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించారు. నెగెటివ్ రిపోర్టు రావడంతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మధ్యాహ్నం 2.55 గంటల వరకు ఇతను మేజిస్ట్రేట్ సమక్షంలోనే ఉన్నాడు. ఈ సమయంలో మేజిస్ట్రేట్ ఇతని వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. 3 గంటలకు సీబీఐ బృందం తిరిగి రంగన్నను అదుపులోకి తీసుకొని రాత్రి 8.40 గంటలకు పులివెందుల బస్టాండులో వదిలిపెట్టింది. కోర్టులో ఇతని వాంగ్మూలం రికార్డు చేసే సమయంలో సీబీఐ అధికారులు బయటే ఉన్నారు. -
‘అన్నయ్యను అన్యాయంగా చంపేశారు’
సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి సోదరులు ఆదివారం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..’పోలీసులు పిలిస్తే డీఎస్పీ కార్యాలయానికి వచ్చాం. పోలీసులకు అన్నివిధాల సహకరిస్తాం. హత్య జరిగిన వెంటనే మేమంతా అక్కడికి వెళ్లాం. అక్కడ ఏమి జరిగిందనే అంశంపై ఆరా తీశారు. కేసులో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అన్యాయంగా వివేకాను చంపేశారు. ఆయన చాలా మంచివ్యక్తి’ అని అన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్ రెడ్డి కూడా డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాగా ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు, రక్తాన్ని తుడిచి వేయడం, మృతదేహాన్ని బాత్రూం నుంచి బెడ్రూంకి ఎందుకు తెచ్చారు అనే కోణంలో ప్రశ్నించిన పోలీసులు...వీరందరి స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
‘ముజే యాద్ నహీ... మాలూమ్ నహీ’
రాజేంద్రనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫాపై కాల్పుల కేసు ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాఫా స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు వెళ్లిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అతను సహకరించకపోవడంతో వెనుతిరిగారు. పోలీసులు సంఘటన విషయమై ఎన్ని ప్రశ్నలు వేసిన ‘జే యాద్ నహీ. ముజే మాలూమ్ నహీ’ సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు వెనుతిరిగారు. ముస్తాఫాతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు విషయమై ఆసుపత్రి వద్ద ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించినా వారి సమాధానం రాకపోవడంతో సుమోటోగా కేసును నమోదు చేశారు. ఎన్నో కీలక కేసులను గంటల వ్యవధిలో పరిష్కరించిన పోలీసులు ఈ కాల్పుల కేసులో మూడు రోజులు గడచినా ఎలాంటి పురోగతి సాధించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ పార్టీ ప్రధాన అనుచరుడు కావడంతో కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిడి రావడంతో పోలీసులు మెతక వైఖరి వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
శ్వేతాబసు వాంగ్మూలాన్ని సేకరించిన మేజిస్ట్రేట్
హైదరాబాద్: ఓ కేసులో ఇరుక్కుని రెస్కూ హోమ్ లో ఉంటున్న తన కూతురిని అప్పగించాలని శ్వేతాబసు తల్లి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపర్చారు. గత వారం వ్యభిచారం కేసులో పట్టుబడి రెస్కూ హోమ్ లో ఉంటున్న ఆమె వద్ద మెజిస్ట్రేట్ వాంగ్మూలం స్వీకరించారు. తన కూతుర్ని అప్పగించాలని ఆమె తల్లి ఇటీవల వేసిన పిటిషన్ మేరకు సినీనటిని కోర్టులో హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ ఆదేశించిన విషయం తెలిసిందే. తల్లి వేసిన పిటిషన్ మరియు వాంగ్మూలం వివరాలను కోర్టుకు హాజరైన సినీనటికి కోర్టు సిబ్బంది వివరించారు. తల్లి వద్దకు వెళ్లాలా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఆమె అభిప్రాయాన్ని మెజిస్ట్రేట్ కోరడంతో ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఇటు తల్లి వాంగ్మూలం, అటు ఆమె కూతురు వాంగ్మూలం సేకరించిన మెజిస్ట్రేట్ ప్రస్తుతం తీర్పును రిజర్వులో పెట్టారు. సినీనటిని తిరిగి రెస్కూ హోమ్‌కు తరలించారు. అందిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం సినీనటిని ఆమె తల్లికి అప్పగించాలా లేదా అనేది మెజిస్ట్రేట్ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి.