
Shilpa Shetty Says I don't know Raj Kundra Work: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్‌షీట్‌లో చేర్చారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్‌లో పేర్కొంది. 'నేను షూటింగ్స్‌లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు.
హాట్‌షాట్స్, బాలీఫేమ్ యాప్స్‌ల గురించి కూడా నాకు తెలియదు' అంటూ శిల్పా చెప్పిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 1400పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు ఫైల్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్‌షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది.
అంతేకాకుండా పోర్న్‌రాకెట్‌ను గట్టుచప్పుడు కాకుండా నడిపించిన రాజ్‌కుంద్రా ఇందుకు గాను వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్‌షీట్‌లో నమోదు చేవారు. మరోవైపు గత జులై19నుంచి రాజ్‌కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది.
చదవండి : బిగ్‌బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్?!
Comments
Please login to add a commentAdd a comment