Raj Kundra
-
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
అశ్లీల చిత్రాల కేసు.. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్ కుంద్రా అనుచరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇకపోతే.. అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని ప్రసారం చేశారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను 2021 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2021 సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక, ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అంటూ ముంబై పోలీసు అధికారులు ఆరోపించారు.మరోవైపు.. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం.. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతలతో కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారుల.. ముంబై సహా యూపీలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.2014లో సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్‌లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది. -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
దుస్తులిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు: శిల్పాశెట్టి భర్త
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా జీవితంలో నీలి చిత్రాల కేసు చెరగని మచ్చగా నిలిచిపోయింది. వ్యాపారవేత్తగా ఎంతో పేరు సంపాదించినా.. 2021లో నమోదైన నీలిచిత్రాల కేసుతో అతని జీవితం వివాదాల్లో కూరుకుపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉన్నాడు. బిజినెస్ వ్యవహారాల్లోనూ అంతగా జోక్యం చేసుకోలేదట. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మళ్లీ బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న యూటీ 69 అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రాజ్‌కుంద్రా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి, అక్కడ పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘జైలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి రోజే నా దుస్తులన్ని విడిపించి..అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకోచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం వైపు చెక్ చేశారు. అలాంటి ట్రీట్మెంట్ చూసిన తర్వాత బతికున్న చచ్చినట్టే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని బాధపడ్డాను. జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా గురించి ఏవోవో తప్పుడు కథనాలు రాసి..దుస్తులు విడిపించినంత పని చేసింది. అవమాన భారంతో కుంగిపోయాను. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’ అని రాజ్‌కుంద్రా చెప్పుకొచ్చారు. -
నీలిచిత్రాల కేసు.. దేశం వదిలి వెళ్లిపోదామనుకున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీడియాకు తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇటీవలే తన జీవిత కథ ఆధారంగా యూటీ 69 అనే బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో రాజ్ కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్పుకొచ్చాడు. వారానికి ఒకసారి ఫోన్ కాల్.. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారే ఫోన్ మాట్లాడనిచ్చేవాళ్లు. అది కూడా కొద్ది నిమిషాలే! అందుకే శిల్పా, నేను ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆమె రాసే ఉత్తరాలు చదువుకుని బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని. శిల్పాకు నా గురించి బాగా తెలుసు. నేను నా బిజినెస్‌లో, నా జీవితంలో ఎంత నిజాయితీగా ఉండేవాడిని, ఎలాంటి విధివిధానాలు పాటిస్తానో అన్నీ తెలుసు. అందుకే, నాకెంతో సపోర్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో తను మొదటి సారి ఫోన్ చేసి ఏమందంటే.. రాజ్.. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నా మీద నమ్మకముంచు అని చెప్పింది. ఆమె మాటలు విన్నాకే జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. అవమానభారంతో కుంగిపోయా.. నిజానికి నేను కుంగిపోయి ఉన్నాను. జైలు లోపలే నా జీవితం ముగించేయాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా పేరుప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఎంతో అవమానంగా ఉంది. నా వల్ల మీడియా నా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల వెంటపడుతూనే ఉంటుంది. అదంతా ఆలోచిస్తేనే చాలా భయమేసింది, బాధేసింది. బయట ఏం జరుగుతుందనేది నేను అంచనా వేయగలను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను. జీవితంలో ఇది నాకు సంక్లిష్ట సమయం. నిజమేంటనేది నాకు తెలుసు, అది ఏదో ఒక రోజు బయటకు రాక తప్పదు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. దేశం వదిలేసి వెళ్లిపోదామంది నా భార్య అయితే దేశం వదిలేసి వెళ్లిపోదామంది. నువ్వు లండన్‌లో పుట్టి పెరిగావు. అక్కడంతా వదిలేసి నాకోసం ఇండియా వచ్చావు, ఇక్కడే సెటిలయ్యావు. విదేశాల్లో ఉండాలనుందంటే చెప్పు.. అక్కడికే వెళ్లిపోదాం అని అడిగింది. కానీ నాకు భారత్ అంటే ఇష్టమని, ఈ దేశాన్ని వదిలేయలేనని చెప్పాను. వేలకోట్ల స్కామ్‌లు చేసి తప్పు చేసిన వారు దేశం విడిచి వెళ్తారు. నేనే తప్పూ చేయలేదు, నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను' అని తెలిపాడు రాజ్ కుంద్రా. చదవండి: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. తర్వాత భిక్షగత్తెగా మారి.. -
విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. భార్యతో విడాకులు?
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు. సడన్‌గా ఏమైంది? ఇది చూసిన జనాలు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటివరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు. ప్రమోషన్ స్టంట్? ఇటీవలే అతడు తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. కాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం. We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔 — Raj Kundra (@onlyrajkundra) October 19, 2023 చదవండి: అజిత్‌తో షూటింగ్ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్ -
అలా చెప్పగానే నా భార్య నాపైకి చెప్పు విసిరింది: శిల్పా శెట్టి భర్త
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలాకాలంగా తన ముఖాన్ని జనాలకు చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపిస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన ఓ వేడుకలో తన మాస్క్ తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుక ఏంటనుకుంటున్నారా? తనకు సంబంధించినదే! రాజ్ కుంద్రా.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీసుకువస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. దీనికి యూటీ 69 అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే తన ముఖాన్ని చూపించాడు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నా జీవితకథను బయోపిక్‌గా తీయాలనుకున్నాను. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పినప్పుడు తను నాకు కొంత దూరంలో నిలబడి ఉంది. సినిమా చేస్తానని చెప్పానో లేదో.. తను నా మీదకు చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. మొదట్లో ఇష్టపడలేదు కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నీలిచిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు 2021లో అరెస్ట్ చేశారు. కొంతకాలంపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తన సినిమాలో జైలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా చూపించనున్నాడు రాజ్ కుంద్రా. షహ్నావజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. చదవండి: నామినేషన్స్.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్ -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన రాజ్‌కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. -
నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్!
తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ సెన్స్‌పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్‌పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొంది. రాజ్‌కుంద్రాపై కేసు శిల్పాశెట్టి భర్త, రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. View this post on Instagram A post shared by Raj Kundra (@onlyrajkundra) -
'భార్య నిద్రపోగానే ఆమె చెల్లితో పార్టీకి వెళ్తా, తనకు పెళ్లి కాకూడదు'
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్‌కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు. భార్య పడుకోగానే మరదలితో పార్టీ తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం బాజీఘర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Laughter Club 💠 (@laughterclubdelhi) చదవండి: పాలబుగ్గల పసివాడిని గుర్తుపట్టారా? మెగాస్టార్ వారసుడు.. దుబాయ్‌లో ఉద్యోగం వదిలి హీరోగా.. తెలుగులో సూపర్ క్రేజ్! -
ఆ కేసులో రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్.. వారిద్దరికీ కూడా..!
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రా, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలతో వీరిపై కేసు నమోదైంది. దీంతో వారికి ఊరట లభించింది. గతంలోనూ రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ( ఇది చదవండి: Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్‌కుంద్రా వాదన) ఈ కేసులో రాజ్ కుంద్రా జూలై 2021లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. ఎఫ్ఐఆర్లో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను సహ నిందితులుగా పేర్కొన్నారు. -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్‌పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్‌పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
పోర్నోగ్రఫీ కేసులో నన్ను బలి పశువుని చేశారు: రాజ్‌కుంద్రా వాదన
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువునయ్యానని రాజ్ కుంద్రా వాపోయాడు. ఈ కేసులో ఏ ఒక్క మహిళా తనకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని చెప్పాడు. తనపై మోపిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్‌కుంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ అభియోగపత్రంలో కానీ, సప్లిమెంటరీ చార్జీషీట్లో ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించాడని, బలవంతం పెట్టడాని కానీ, వీడియో తీసినట్టు చెప్పలేదని పటిషన్లో పేర్కొన్నాడు. ఇక తాను రాహస్యంగా ఎటువంటి కంటెంట్‌ను సృష్టించలేదని, తాను అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం కానీ చేయలేదన్నాడు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ చార్జీషీట్లో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని రాజ్‌కుంద్రా కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే. చదవండి: అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ -
విడాకుల దిశగా శిల్పా శెట్టి-రాజ్‌కుంద్రా!, అందుకేనా ఆస్తుల పంపకాలు?
Shilpa Shetty And Raj Kundra: గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భర్తపై కోపంతో ఉన్న శిల్పా అతడితో విడాకులు తీసుకోనుందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే గతంలో విడాకుల రూమర్లను శిల్పా కొట్టిపారేయడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా వీరి విడాకుల వ్యవహరం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: Mahesh Babu: డైరెక్టర్ శంకర్‌కు మహేశ్ క్షమాపణలు, కారణమేంటో తెలుసా? రాజ్‌కుంద్రా తన పేరుపై ఉన్న ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు వార్తల్లో నిలిచింది. కాగా రీసెంట్గా తన పేరుపై ఉన్న విలువైన ఆస్తులను రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి పేరు మీదకు మార్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సడెన్‌గా ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చడం వెనుక అంతర్యం ఏముందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఈ జంట విడాకులకు సిద్ధమైందని, త్వరలోనే వారి వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్‌కుంద్రా! పోర్నోగ్రఫి కేసు తర్వాత రాజ్‌కుంద్రా, శిల్పాల మధ్య తరచూ విభేదాలు వస్తుండటంతో విరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట మధ్య ఆస్తుల పంపకం జరుగుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై శిల్పాశెట్టి దంపతులు స్పందించే వరకు వేచి చూడాలి. కాగా రాజ్‌కుంద్రా.. ముంబైలో జుహులోని ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడట. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లను కూడా శిల్పా పేరు మీదకు బదలాయించినట్లు తెలుస్తోంది. -
శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్‌కుంద్రా!
గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న శిల్పాశెట్టి స్టాంప్ డ్యూటీ కింద రూ.1.9 కోట్లు చెల్లించగా ఈ లావాదేవీల వివరాలను జప్కే డాట్ కామ్ వెల్లడించింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి పేరిట ఎందుకు మార్చారనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్‌స్టాలోకి రాజ్ కుంద్రా రీఎంట్రీ.. ఒక్కరిని మాత్రమే ఫాలో
Raj Kundra Reentry To Instagram Fallows Only One Account: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూలై 19, 2021న అరెస్టయిన రాజ్ కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదల అయ్యాడు. పోర్నో గ్రఫీ కేసులో ఇరుక్కోవడంతో తన ఇన్‌స్టాలోని పోస్టులను తొలగించడమే కాకుండా పూర్తిగా డిలీట్ కూడా చేశాడు. తాజాగా మళ్లీ తిరిగి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుంద్రా. ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ను తిరిగి ఓపెన్ చేసి ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు ఈ వ్యాపార వేత్త. ప్రస్తుతం రాజ్ కుంద్రా ఫాలో అయ్యే అకౌంట్ ఎవరిదా అనే ఆలోచనలో పడ్డారు నెటిజన్స్. రాజ్ కుంద్రా కొత్త అకౌంట్‌కు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఆ అకౌంట్‌కు వెరిఫైడ్ మార్క్ కూడా ఉంది. రాజ్ కుంద్రాను 10 లక్షల మంది ఫాలో అయితే అతను మాత్రం ఒకే ఒక అకౌంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఆ అకౌంట్ అతని భార్య శిల్పా శెట్టిదో లేదా అతని కుమారుడు వియాన్‌ది అని అనుకుంటే పొరపడినట్లే. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా బాంద్రాలోని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఆ రెస్టారెంట్లో అతడికి భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్లో తాను ఫోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించలేదని, డిస్ట్రిబ్యూట్ చేయలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదీ చదవండి: సాయిబాబా సన్నిధిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా -
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్‌కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్‌బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్‌కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్‌లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్‌కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్‌ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్‌కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాకు ఊరట!!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో సుప్రీంకోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. అంతేకాదు సుప్రీంకోర్టు రాజ్‌కుంద్రాకు అరెస్టు కాకుండా నాలుగు వారాల బెయిల్‌ని మంజూరు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) ఈ క్రమంలో కుంద్రా వీడియోలు శృంగారభరితమైనవే అయినప్పటికీ, వాస్తవానికి ఎటువంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదని హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో లేదా ప్రసారంలో పాల్గొనలేదని చెప్పడమే కాక తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని అన్నారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు'.. రాజ్ కుంద్రాపై ట్రోలింగ్
Netizens Trolls Raj Kundra For Hiding His Face: ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా రాజ్ కుంద్రాను ట్రోలింగ్ రూపంలో దురదృష్టం వెంటాడింది. గురువారం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ముంబై విమానాశ్రయం నుంచి ఏదో ప్రదేశానికి బయలుదేరారు. ఆ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. కారు నుంచి దిగిన వెంటనే రాజ్ కుంద్రా కెమెరాలకు చిక్కకుండా హడావుడిగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లాడు. ఎయిర్‌పోర్ట్‌లో పాప్ స్టేషన్ వద్ద ఆగకుండా ఫోన్ చూస్తూ వెళ్లిపోయాడు. అలాగే తన ముఖం పూర్తిగా కనపడకుండా ఉండేలా బ్లాక్ హుడీ ధరించాడు రాజ్ కుంద్రా. ఆ వీడియోలో శిల్పా శెట్టి ప్రశాంతంగా కారు దిగి ఎయిర్పోర్ట్ గేట్ల వద్దకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నీలం డెనిమ్, వైట్ స్నీకర్‌తో తెల్లటి చారల బ్లేజర్‌ను ధరించారు శిల్పా. ఇది గమనించిన నెటిజన్లు ఆ పోస్ట్‌పై అనేక రకాలుగా కామెంట్స్ పెట్టారు. రాజ్ కుంద్రా తన ముఖం కవర్ చేసుకున్నందుకు తెగ ట్రోల్ చేశారు. 'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు' అని ఒక యూజర్ కామెంట్ పెడితే, 'మీరు కూడా చూడకూడని పనులు చేయకండి' అని రాసుకొచ్చాడు. 'అప్పుడే సిగ్గులేని వాళ్లు మొహం దాచుకోవడం చూసి నవ్వుతారు' అని ఒకరన్నారు. 'అతను కెమెరా చూసి ఎందుకు మొహం దాచుకుంటున్నాడు. కెమెరా వెనుక ఉండి డైరెక్ట్ చేసినప్పుడు రాని సిగ్గు ఇప్పుడెందుకు' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇది చదవండి: వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్ -
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాల వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్
Shilpa Shetty And Raj Kundra Marriage Anniversary: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఆరోపణలు, వివాదాల నడుమ వారికి నేడు సంతోషకరమైన రోజు కానుంది. నవంబర్ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్‌ను పోస్ట్ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ అందమైన ఫొటోలతో పాటు '12 ఏళ్ల క్రితం ఈ క్షణం, ఈ రోజు మేము ఒక వాగ్దానం చేశాం. దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాం. కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రేమను విశ్వసిస్తూ, దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడని భావిస్తూ, ఒకరికొకరం ప్రతిరోజు నిలబడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేశాం. అసలు సమయం తెలియనేలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కుకీ' అని శిల్పా శెట్టి పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇంకా 'ఇక్కడ మరెన్నో అనుభూతులు, నవ్వులు, మైలురాళ్లు, విలువైన ఆస్తులు మా పిల్లలు ఉన్నారు. అన్ని విధాల మాకు సహకరించిన మా శ్రేయోభిలాషుందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఈ పోస్ట్‌కు అభిమానులు, స్నేహితులు, సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు లైక్‌లు, కామెంట్లతో ముంచెత్తారు. ' వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు' అని నటి బిపాసా బసు కామెంట్ చేశారు. అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసుకు సంబంధించిన ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందితోపాటు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై రాజ్‌కు సెప్టెంబర్ 20న బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు -
నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి
రాజ్ కుంద్రా దంపతులపై ఒక వ్యాపారవేత్త చేసిన చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై నటి శిల్పా శెట్టి నోరు విప్పారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 'రాజ్, నా పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త నుంచి ఇప్పుడే తేరుకున్నాను. షాకింగ్‌గా ఉంది. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ వెంచర్ నిర్వహిస్తుంది కాషిఫ్ ఖాన్. అతను దేశవ్యాప్తంగా ఎఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ జిమ్‌లను తెరవడానికి బ్రాండ్ ఎస్ఎఫ్ఎల్ పేరుతో హక్కులు తీసుకున్నాడు. అతను అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని, బ్యాంకింగ్, రోజువారీ వ్యవహారాలలో సంతకం చేశాడు. అతని లావాదేవీల గురించి మాకు తెలియదు. అతని నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అన్ని ఫ్రాంఛైజీలన్నీ నేరుగా కాషిఫ్‌తోనే నిర్వహిస్తారు. పూర్తిగా కాషిఫ్ ఖాన్ ద్వారా నిర్వహించబడే కంపెనీని 2014లో మూసివేశారు.' అని శిల్పా శెట్టి ట్వీట్ చేశారు. pic.twitter.com/lu5rToq0Sg — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) November 14, 2021 'గత 28 ఏళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. నా పేరు, ప్రతిష్ట దెబ్బతినడం, నన్ను ఇబ్బందుల్లోకి లాగడం చూసి నాకు చాల బాధ పడ్డాను. భారతదేశ చట్టాలను గౌరవించే పౌరురాలిగా నా హక్కులు రక్షించబడాలి. కృతజ్ఞతలతో శిల్పా శెట్టి కుంద్రా.' అని కూడా ట్విటర్లో రాసుకొచ్చారు శిల్పా శెట్టి. -
మరో వివాదంలో చిక్కుకున్న రాజ్‌కుంద్రా దంపతులు
FIR Registered Against Shilpa Shetty And Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరో కేసులో చిక్కుకున్నారు.అడల్ట్ వీడియోల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రాకు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా అతనిపై రూ. 1.51 కోట్లు మోసం చేశాడని మరో కేసు నమోదైంది. కుంద్రాతో పాటు శిల్పా శెట్టి, మరికొంత మందిపై ఓ వ్యాపార వేత్త చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు సమాచారం. వ్యాపార వేత్త నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు వారిపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, జులై 2014లో ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతరులతో కలిసి లాభం పొందడానికి ఈ ఎంటర్ప్రైజ్లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీ ఇస్తుందని, పూణెలోని హడప్సర్, కోరేగావ్లలో జిమ్, స్పాను తెరుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని నితిన్ బరాయి పేర్కొన్నారు. తర్వాత నితిన్ బరాయి తిరిగి తన డబ్బు అడిగితే బెదిరించినట్లు ఫిర్యాదులో ఉన్నట్లు ఓ పోలీసు అధికారి ఉటంకించారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో రాజ్ కుంద్రా దంపతులపై సెక్షన్లు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం)తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైందని సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారి తెలిపారు.