సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా ప్రార్థనలు | Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers | Sakshi
Sakshi News home page

Shilpa Shetty Raj Kundra: సాయిబాబా సన్నిధిలో శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా

Published Wed, Jan 5 2022 8:52 PM | Last Updated on Wed, Jan 5 2022 8:52 PM

Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers - Sakshi

Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్‌లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్‌ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్‌స్టా గ్రామ్‌ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది శిల్పా. 

ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్‌ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి

ఈ వీడియో క్లిప్‌కు 'సబ్‌ కా మాలిక్‌  ఏక్‌ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్‌' అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్‌ కుంద్రా తన సోషల్‌ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్‌ టాలెంట్‌ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. 
 

ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్‌ కుంద్రా.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement