sai baba temple
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు (ఫోటోలు)
-
దేశవ్యాప్తంగా వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
-
బాబా మందిరానికి యాచకుడి విరాళం.. రూ. 9.54 లక్షలు అందజేత
సాక్షి, విజయవాడ: సాయిబాబా మందిర అభివృద్ధికి ఓ యాచకుడు శుక్రవారం లక్షరూపాయల విరాళం అందజేశారు. దీంతో ఇప్పటివరకూ ఆయన అందజేసిన విరాళం రూ.9.54 లక్షలకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్షరూపాయలు పోగుచేసి బాబా మందిర అభివృద్ధికి ఇచ్చేలా నిర్ణయించుకుని, ఆ డబ్బును మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... బాబామందిరానికి యాదిరెడ్డి విరాళం ఇవ్వడం ఇది మొదటిసారికాదని, ఇప్పటివరకూ పలు దఫాలుగా రూ.8,54,691 అందజేశారని తెలిపారు. తాజాగా శుక్రవారం అందజేసిన రూ.లక్షతో కలిపి రూ.9,54,691 ఇచ్చినట్లయిందని చెప్పారు. ఈ రకంగా విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దాత యాదిరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన డబ్బు బాబాకే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపై తాను సేకరించే ప్రతి పైసా దైవకార్యాలకే వినియోగిస్తానని తెలిపారు. మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం యాదిరెడ్డిని బాబావారి శేషవస్త్రంతో గౌతంరెడ్డి సత్కరించారు. చదవండి: బనియన్ల నిండా బంగారం, నగదు -
వరంగల్ లో భక్తి దొంగ మొక్కి హుండీ ఎత్తుకపోయిండు ఏకంగ
-
దిల్ సుఖ్ నగర్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
హైదరాబాద్: పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
-
గురు పూర్ణిమ సందర్బంగా సాయిబాబా ఆలయాలో భక్తుల సందడి
-
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్‌కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్‌బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
న్యూజెర్సీలో సాయిబాబా ఆలయానికి భూమి పూజ
న్యూ జెర్సీ : సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో అమెరికాలో షిరిడీ తరహాలో సాయి బాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో సాయి భక్తుల కోసం న్యూజెర్సీలో నిర్మిస్తున్న సాయిబాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి, బాబా వారి 100 సంవత్సరాల పుణ్య తిధి సందర్భంగా సాయిదత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితులు బైరవ మూర్తిల ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. వేద మంత్రాల మధ్య భూమి పూజను వేదపండితులు పూర్తి చేశారు. అమెరికాలో షిర్డీ దేవాలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా జరగనుందని సాయిదత్తపీఠం నిర్వాహకులు తెలిపారు. హిందు సాంప్రదాయక జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా అమెరికాలో షిరిడీ నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఈ ఆలయం అచ్చం షిరిడీని పోలి ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారు. స్థల దాతలు, నిర్మాణ దాతల వివరాలను ఆలయ గోడల మీద లిఖించనున్నట్టు సాయిదత్తపీఠం తెలిపింది. దాతలతో పాటు ప్రత్యేక విరాళాలిచ్చే దాతల కుటుంబసభ్యుల పేర్లను ఈ గోడలపై చెక్కిస్తారు. గురుస్థానం, లెండివనము, ద్వారకామాయి, నిత్య ధుని, చావడి సదుపాయాన్ని ఈ ఆలయంలో కూడా నిర్మించనున్నారు. బాబా వారి శతసంవత్సర సమాధి సమయ సందర్భంగా, ఫ్రాంక్లిన్ టౌన్ షిప్ వారి పర్మిషన్స్ నడుమ, విజయదశమి నాడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ హాజరయ్యారు. -
అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్‌లో జలాభిషేకం
సాక్షి, విజయవాడ : గురుపౌర్ణమి పండుగ రోజు ముత్యాలం పాడు సాయిబాబా ఆలయం ఓ రికార్డుని నెలకొల్పింది. శుక్రవారం సాయిబాబా ఆలయంలో నిర్వహించిన లక్ష నారికేళ జలాభిషేకం ‘‘ అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్’’లో చోటుసంపాదించుకుంది. ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమానకి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు సైతం ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుపౌర్ణమి పండుగ రోజు బాబాను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులతో కిటకిటలాడుతున్న సాయిబాబా ఆలయాలు హైదరాబాద్ : గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నగరంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాయిబాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నా గుడి నీకు.. నీ గుడి నాకు!
సాక్షి, హైదరాబాద్: ఆయన దేవాదాయ శాఖలో గ్రేడ్–1 కార్యనిర్వహణాధికారి.. 6 సీ కేడర్‌లోని ఓ సాయిబాబా దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి గ్రేడ్–1 స్థాయికి ఎదిగాడు.. విధుల్లో చేరిన దేవాలయంలో ఖాళీల ప్రకారమే పదోన్నతులు పొందాల్సి ఉన్నా పైరవీలతో పెద్ద దేవాలయాలకు బదిలీ అయ్యాడు.. 25 ఏళ్లుగా హైదరాబాద్‌లో పాతుకుపోయి ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల్లో తిష్టవేస్తున్నాడు.. తాజా బదిలీల్లో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన వారు మరో ప్రాంతానికి బదిలీ కావాలన్న నిబంధనను పాతరేసి ఏడాదికి రూ.7 కోట్లకు పైగా ఆదాయం ఉన్న దేవాలయానికి బదిలీ అయ్యాడు. ఇది ఒక్కరికే పరిమితం కాలేదు. 20 ఏళ్లకు పైబడి నగరంలో పాతుకుపోయిన పలువురు ఈవోలకు కూడా తిరిగి ఇక్కడే పోస్టింగు ఇచ్చారు. వీరు.. ఒకరి స్థానంలోకి మరొకరు వచ్చేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తతంగాన్నంతా ఓ ఉన్నతాధికారి ముందుండి నడిపించాడని.. తాజా బదిలీల్లోనూ ఈయనదే ప్రధాన హస్తమని, బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బదిలీలున్నా నిబంధనలు సున్నా! దేవాదాయ శాఖ పరిధిలో ఆరేళ్లుగా కార్యనిర్వహణ అధికారుల బదిలీలు.. పన్నెండేళ్లుగా సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీలు జరగలేదు. దీంతో ఒకేచోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది స్థానిక రాజకీయ నేతలతో మిలాఖత్ అయి దేవుడి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెంటనే బదిలీలు చేపట్టాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జాబితాలు సిద్ధమై రెండు రోజుల క్రితం బదిలీ ఆదేశాలు వెల్లడయ్యాయి. నిబంధనల ప్రకారం ఒకేచోట ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని మరో చోటకు బదిలీ చేయాలి. కానీ.. హైదరాబాద్‌లోని పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల పైరవీతో ఈ నిబంధన మాయమైంది. పరస్పరం కుమ్మక్కయిన కొందరు కార్యనిర్వహణాధికారులు ఒకరి కుర్చీని మరొకరికి ఇచ్చుకునేలా పావులు కదిపారు. దీంతో ఈ అధికారులందరికీ నగరంలోనే పోస్టింగులు వచ్చాయి రూ.8 కోట్ల వార్షికాదాయం ఉన్న దేవాలయానికి డిప్యూటీ కమిషనర్ ఈవోగా ఉండాల్సి ఉన్నా తాజా బదిలీల్లో గ్రేడ్–1 అధికారిని ఈవోగా నియమించారు. ఐదేళ్ల నిబంధనే ఆయుధంగా.. తమకు కావాల్సిన వారి విషయంలో ఐదేళ్ల నిబంధనను అమలు చేయని అధికారులు.. ఇతరుల విషయంలో దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ అధికారి నల్లగొండకు బదిలీ అవడం.. ఆయన స్థానంలో రావాల్సిన అధికారి 6 నెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో ఇద్దరూ అవగాహనకు వచ్చి ఎక్కడి వారక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ నగరంలో అందరికన్నా ఎక్కువ సర్వీసు ఉన్న మరో అధికారి బదిలీ ఆపేందుకు పరస్పర అవగాహనకు వచ్చిన అధికారుల్లో నగరంలోని వ్యక్తిని మరో జిల్లాకు బదిలీ చేశారు. ఆ ఎక్కువ సర్వీసు ఉన్న అధికారి ఓ అధికారికి ‘కావాల్సినవాడు’ కావటంతో మరో అధికారిని సాగనంపారు. -
దేవుడికే శఠగోపం పెట్టాడు
-
దేవుడికే శఠగోపం పెట్టాడు
ఢిల్లీ: గుడిలో ఉన్న దేవుడికే రక్షణ లేకుండా పోయింది. మరీ సామాన్య మానవుడి పరిస్థితి తలచుకుంటే భయమేస్తోంది. ఓ వ్యక్తి మాస్క్ ధరించి ఇటీవల సాయి బాబా గుడిలో దేవుడి వస్తువులను దొంగతనం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకంది. మాస్క్ ధరించిన వ్యక్తి గుడిలో దర్జాగా తిరుగుతూ విలువైన వస్తువలను ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో అతనిలో ఎలాంటి భయమూ, బెణుకు కనిపించలేదు. ఆ దృశ్యాలన్ని ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
పోలీస్ కస్టడీ నుంచి నిందితుడి పరార్?
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట పోలీసుల కస్టడీ నుంచి నిందితుడు 1వ వార్డు కౌన్సిలర్ అరుణ్‌కుమార్ గురువారం పోలీసుల కళ్లుగప్పి ఛాకచక్యంగా తప్పించుకుపారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు అరుణ్‌కుమార్‌పై వివిధ వివాదాలకు సంబంధించి ఇదివరకే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా సాయిబాబా మందిరం కాలనీలో నిర్మిస్తున్న ఓ చర్చి విషయంలో తలదూర్చి పాదర్ డేవిడ్‌ను బేదిరించి భయబ్రాంతులకు గురి చేసిన విషయంలో ఈ నెలలో అతనిపై మరో కేసు నమోదైంది. నాలుగు కేసులకు సంబంధించి కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌ను పోలీసులు గురువారం సాయంత్రం 4 గంటలకు అదుపులోకి తీసుకుని విచారించారు. రిమాండ్ రిపోర్టు రాసిన తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుపారిపోయినట్లు సమాచారం. కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌పై 2016లో 384, 379 సెక్షన్ల కింద వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2017లో 448, 447 సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. 2018 జనవరిలో 447, 506 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డిను వివరణ కోరగా కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌పై నమోదైన కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. పోలీస్టేషన్లో ఉన్న నిందితుడు అరుణ్‌కుమార్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకి వేళ్లిపోయాడని సమాధానమిచ్చారు. -
మహిళపైకి దూసుకుపోయిన ట్యాంకర్
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ సమీపాన శ్రీ సాయిబాబ దేవాలయం వద్ద ఫ్లైయాష్ ట్యాంకర్ మహిళపై దూసుకుపోయింది. ప్రమాదంలో ట్యాంకర్ కింద పడి ప్రభావతమ్మ అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాలిలా.. కమలాపురం మండలం పందిర్లపల్లె గ్రామానికి చెందిన ప్రభావతమ్మ(55 తిప్పలూరు గ్రామ సమీపంలో ఉండే సాయిబాబా దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం రోడ్డు దాడుతుండగా ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో ప్రభావతమ్మ టైర్లకింద పడి నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ పరారు పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. మృతురాలు బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భీమనేని, బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం ప్రారంభం
-
ఆ దొంగెవరో తెలిసింది
విజయవాడ: నగరంలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడెవరన్నది పోలీసులు గుర్తించారు. చిక్కడు దొరకడు అన్నట్టుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఘరానా దొంగ ఆనవాళ్లను పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. 1998లో దుర్గగుడిలో చోరీకి పాల్పడిన ప్రకాశ్ కుమార్ సాహునే నిందితుడిగా పోలీసులు నిర్థారించారు. అయితే నిందితుడు సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
నేటి నుంచి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు
ఆలయ ట్రస్టు చైర్మన్ కుమారస్వామి సాక్షి, బళ్లారి/ అర్బన్ : బళ్లారిలోని షిర్డి సాయిబాబా ఆలయంలో శుక్రవారం నుంచి గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. ఆయన గురువారం నగరంలోని విశాల్‌నగర్ నెలకొన్న షిర్డి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల వివరాలను విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాబా ఆలయంలో ప్రతి గురువారం 10 వేల మంది భక్తులు సందర్శిస్తుంటారని, భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులందరి కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 500 మందితో రక్తదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదానానికి చెన్నైకు చెందిన రమణ అనే భక్తుడు నెలకు రూ.30 వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి సాయిబాబా ట్రస్టు నుంచి మెరిట్, పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. పూజా వివరాలు 1న తెల్లవారు జామున కాగడ హారతి, మంగళ స్నానం, గణపతి పూజ, అభిషేకం, సాయి అష్టోత్తర నామ పూజ, సాయి సంచరిత పారాయణం, ధూప హరతి, కేశవ గాయన సమాజ బృందంతో సంగీత కార్యక్రమం, రాత్రి 7 గంటలకు పల్లకీ మహోత్సవం, ఉయ్యాల సేవ తదితర పూజలు నిర్వహించారు. శనివారం గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కాగడ హారతి, గణపతి పూజ, సాయి చరిత్ర పారాయణం, సాయిబాబా నగర సంకీర్తన, గంధాభిషేకం, దత్తాత్రేయ సహస్రనామ అర్చన పూజలు, సాయి సత్యవ్రతం, హారతి, అన్నదానం, సాయంత్రం 3-12 సంవత్సరాల చిన్నారులతో సాయిబాబా వేషాలు, ధూప హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లకి మహోత్సవం, ఉయ్యాల సేవ, సజారతి, ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న ఆదివారం కూడా వివిధ ధార్మిక పూజలు నిర్వహిస్తారు. -
షిరిడీలో అజిత్
షిరిడీలోని సాయిబాబా ఆలయంలో నటుడు అజిత్ పూజలు నిర్వహించారు. వీరం చిత్రం తర్వాత గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు సూచించలేదు. ‘ఆయిరం తోట్టాక్కళ్’, ‘తుడిక్కుదు భుజం’ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా అనుష్క నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ‘నాలు నాళ్ల ఊరే క్రిస్తుమస్ కొండాడుం, యణక్కు మట్టుం అన్నైక్కు దీపావళిడా’ అంటూ అజిత్ మాట్లాడే పంచ్ డైలాగ్ చిత్రంలో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం పూణె వెళ్లిన సమయంలో అజిత్ షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. తన పుట్టిన రోజు సందర్భంగా బాబా దర్శనం చేసుకున్న అజిత్ ఆలయంలో చాలా సేపు గడిపారు. తర్వా త అక్కడి నుంచి వెళ్లారు. నిర్మాత ఏఎం రత్నం చెన్నై సాలిగ్రామంలో సాయిబాబా ఆలయం నిర్మించారు. అక్కడికి అజిత్ తరచుగా వెళ్లి వస్తుంటారు. దీని ద్వారా సాయిబాబా భక్తునిగా మారారు. దీని తర్వాత ప్రస్తుతం షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళుతున్నారు. -
షిర్డీలో గదుల అద్దె తగ్గింపు
జనవరి ఒకటినుంచి అమలులోకి సాక్షి, ముంబై: సాయిబాబా భక్తులకు శుభవార్త. భక్తి నివాస్ ప్రాంగణంలోని గదుల అద్దెను సగానికి తగ్గించాలని షిర్డీ సాయిబాబా సంస్థాన్ యాజమాన్యం నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దీనిని అమలు చేస్తామని సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే చెప్పారు. ప్రస్తుతం భక్తి నివాస్ భవనంలో సాధారణ గదికి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం జనవరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేస్తారు. అదేవిధంగా ఏసీ గదులకు రోజుకు రూ.900 వసూలు చేస్తుండగా, జనవరి నుంచి రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఓ సాయి భక్తుడు అందజేసిన విరాళాలతో నిర్మించిన సాయిఆశ్రం ప్రాజెక్టులో ఒక్కొక్క గదిలో మూడు పడకలు ఉన్నాయి. ఇటువంటి వి మొత్తం 1,536 గదులు ఉన్నాయి. హారతి కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్న రుసుమును సంస్థాన్ ఇటీవల రద్దు చేసిన సంగతి విదితమే. దీంతో హారతి సమయంలో సాధారణ భక్తుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సంస్థాన్ బాబా దర్శనంకోసం వచ్చే భక్తులతో వ్యాపారం చేస్త్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గదుల అద్దె తగ్గించాలని సంస్థాన్ నిర్ణయించింది. ఇదిలాఉంచితే బాబా సమాధి చుట్టూ అద్దాలను ఏర్పాటు చేయాలని సంస్థాన్ యోచిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశ నలుమూలలనుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు షిర్డీకి వెళతారు. -
అడుగడుగునా పోలీసుల పహారా
-
షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ
సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించాలని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భక్తులకు రూ.10కి మూడు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రెండు లడ్డూలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టీ యశ్వంత్ మానె తెలిపారు. అదనపు లడ్డూలు కావాలనుకునే భక్తులు ఒక్కో ప్యాకెట్‌కు రూ. 20 చెల్లించి పొందవచ్చని చెప్పారు. తాజా నిర్ణయం వల్ల ఆలయ ట్రస్టుపై ఏటా సుమారు రూ. 13 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.గత ఏడాది భక్తుల కానుకల రూపంలో ట్రస్ట్ రూ.450 కోట్లు ఆర్జించింది. అలాగే 300 కేజీల బంగారం, 3,500 కేజీల వెండిని భక్తులు సాయికి సమర్పించుకున్నారు.