షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ | Free laddu to be given from today in Shirdi | Sakshi
Sakshi News home page

షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ

Published Thu, Aug 15 2013 5:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ

షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ

సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించాలని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భక్తులకు రూ.10కి మూడు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రెండు లడ్డూలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టీ యశ్వంత్ మానె తెలిపారు. అదనపు లడ్డూలు కావాలనుకునే భక్తులు ఒక్కో ప్యాకెట్‌కు రూ. 20 చెల్లించి పొందవచ్చని చెప్పారు. తాజా నిర్ణయం వల్ల ఆలయ ట్రస్టుపై ఏటా సుమారు రూ. 13 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.గత ఏడాది భక్తుల కానుకల రూపంలో ట్రస్ట్ రూ.450 కోట్లు ఆర్జించింది. అలాగే 300 కేజీల బంగారం, 3,500 కేజీల వెండిని భక్తులు సాయికి సమర్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement