Free laddu
-
శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డు
-
తీపి వార్త: తిరుమలలో అందరికీ ఉచిత లడ్డు
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సరానికిగానూ తీపి కానుక అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది. అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇంతకుముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా ఇక నుంచి అందరికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఉచిత లడ్డుతో కలిపి రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. చదవండి: తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు -
ఇక పై కాలినడకన వచ్చే వారికి ఉచిత లడ్డూ
-
షిర్డీలో నేటి నుంచి ఉచిత లడ్డూ
సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించాలని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భక్తులకు రూ.10కి మూడు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రెండు లడ్డూలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టీ యశ్వంత్ మానె తెలిపారు. అదనపు లడ్డూలు కావాలనుకునే భక్తులు ఒక్కో ప్యాకెట్‌కు రూ. 20 చెల్లించి పొందవచ్చని చెప్పారు. తాజా నిర్ణయం వల్ల ఆలయ ట్రస్టుపై ఏటా సుమారు రూ. 13 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.గత ఏడాది భక్తుల కానుకల రూపంలో ట్రస్ట్ రూ.450 కోట్లు ఆర్జించింది. అలాగే 300 కేజీల బంగారం, 3,500 కేజీల వెండిని భక్తులు సాయికి సమర్పించుకున్నారు.