తీపి వార్త: తిరుమలలో అందరికీ ఉచిత లడ్డు | Free Laddu At Tirumala From New Year Onwards | Sakshi
Sakshi News home page

దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచిత లడ్డు

Published Tue, Dec 31 2019 2:53 PM | Last Updated on Tue, Dec 31 2019 3:28 PM

Free Laddu At Tirumala From New Year Onwards - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సరానికిగానూ తీపి కానుక అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది. అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇంతకుముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా ఇక నుంచి అందరికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఉచిత లడ్డుతో కలిపి రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని టీటీడీ వెల్లడించింది.

చదవండి: తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement