Tirumala Srivari Temple
-
తిరుమల శ్రీవారి సేవలో హీరో వరుణ్ తేజ్-లావణ్య (ఫోటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
Neha Shetty: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ నేహా శెట్టి (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేరుగు నాగార్జున
-
శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి జాహ్నవీ కపూర్
-
భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
-
PM Modi In Tirumala Photos: తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోదీ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా నడక మార్గంలో చిరుత కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత పెంచారు. గుంపులుగా వెళ్లాలని, చిన్న పిల్లలను దగ్గరే ఉంచుకోవాలని భక్తులకు అటవీ శాఖాధికారులు సూచించారు. ఇటీవల కాలంలో చిరుతల సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి కర్రను కూడా అందిస్తోన్న టీటీడీ.. మరిన్ని భద్రతా చర్యలు చేపట్టే అంశంపై కసరత్తు చేస్తోంది. -
తిరుమలలో శ్రీవారి లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 8 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా.. 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! -
పుష్పక విమానంలో విహరించిన శ్రీమలయప్పస్వామి (ఫోటోలు)
-
గరుడ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామి వారు (ఫొటోలు)
-
సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్షం అలంకరణలో శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై శ్రీహరి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు అనీల్ కపూర్
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
సీఎం జగన్‌కు తిరుమల వేద పండితుల ఆశీర్వచనం
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపై విమాన రాకపోకలు
-
తిరుమల శ్రీవారికి కోటి 50 లక్షల విలువ చేసే బంగారం
-
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార
-
శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. వైభవంగా అమావాస్య ఉత్సవం శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లను భక్తులు దర్శించి పరవశించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. (చదవండి: అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’) అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..త్వరలో మా ఇద్దరు అబ్బాయిల సినిమా విడుదల అవుతున్నాయని, ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారని, కేవలం కష్టం ఒకటే కాదని, శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామి వారి దర్శనార్థం వచ్చాంమని అక్కినేని నాగార్జున అన్నారు. అనంతరం అమల మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు అమల తెలిపారు.. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లను ఎగురవేశారు. దీంతో, వీటిని ఎవరు ఎగురవేశారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, డ్రోన్లను ఎగురవేస్తున్న సమయంలో స్థానికులు డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించారు. డ్రోన్లతోనే శ్రీవారి ఆలయ దృశ్యాల చిత్రీకరణ జరిగింది. కాగా, కాకులకోన వద్ద సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలు తీసేందుకే డ్రోన్ ఆపరేటర్ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల ముందు సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ చిత్రీకరించారు. దీంతో, డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయం బయటకు వచ్చింది. -
తిరుమల: ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. గురువారం నుంచి యథావిధిగా శ్రీవారి కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టైమ్ స్లాట్ టికెట్లు పొందిన వారికి కేటాయించిన నిర్ణీత సమయంలో త్వరితగతిన దర్శనం లభిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 58,184 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 16,122 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.20 కోట్లు వేశారు. శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకున్నారు. కాగా, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం తిరుమల నడక మార్గంలో శాశ్వతంగా షెడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈవో ఏవీ ధర్మారెడ్డితో మాట్లాడదలచుకున్న భక్తులు 0877–2263261 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
శ్రీవారి దర్శనానికి 40 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఎస్ఎంసీ సర్కిల్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా, 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.4.66 కోట్లు భక్తులు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. -
తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం
తిరుపతి అలిపిరి: తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో నిరీక్షించే పరిస్థితి లేకుండా సర్వదర్శనానికి టైం స్లాట్ పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో నిలిపివేసిన సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. దర్శనానికి వెళ్లేవారికి తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. కోవిడ్ కారణంగా 2020లో శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శనాలను ప్రారంభించినా పరిస్థితులకు అనుగుణంగా కేవలం 40,000 మందికి మాత్రమే దర్శనాలు కల్పిస్తూ వచ్చిన టీటీడీ ఈ ఏడాది మార్చి నుంచి సడలింపులనిస్తూ సర్వదర్శనానికి అనుమతించింది. దీంతో వేలాదిగా ప్రతి రోజూ తిరుమలకు భక్తులు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అతికష్టం మీద రోజుకు 85,000 మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు టైంస్లాట్ టోకెన్లు తీసుకురావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభమైంది. తొలిరోజున 13,000 మందికి టోకెన్లను జారీ చేశారు. 3 కేంద్రాలు..30 కౌంటర్లు శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను అందించేందుకు తిరుపతిలో మూడు చోట్ల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతి అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో 30 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తుల మధ్య తోపులాట లేకుండా ప్రత్యేక క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డుతో సంప్రదించిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ జిరాక్స్ కాపీలను భక్తులు తమవెంట తీసుకురావాలి. టోకెన్ల జారీ ఇలా.. శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు అధిక రద్దీ, ముఖ్య రోజుల్లో జారీ చేసిన టోకెన్ల వివరాలను టీటీడీ ప్రకటించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25,000 టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15,000 మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఏ రోజు టోకెన్ తీసుకున్న భక్తులకు అదే రోజున దర్శనం కల్పిస్తారు. ఇప్పటి దాకా సర్వదర్శనం 40 గంటల వరకు సమయం పట్టేది. ఈ పద్ధతితో అత్యంత తక్కువ సమయంలోనే దర్శనం చేసుకొంటున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లడానికి టీటీడీ అనుమతిస్తోంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు
-
ఆనంద నిలయం అంటే...ఆ దేవదేవుడి నిలయం
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీరికి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్ల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 92,328 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,969 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.36 కోట్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి క్యూలైన్ ఆస్థాన మండపం వద్దకు చేరుకుంది. అద్దె గదులు దొరకకపోవడంతో భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. -
జులైలో తిరుమల శ్రీవారికి అత్యధిక హుండీ ఆదాయం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సిదిరి అప్పలరాజు
-
సిరికాంతుల శ్రీవారు.. దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు.. స్పెషల్ స్టోరీ
తిరుమల: కలియుగంలో అత్యంత సంపన్నుడెవరంటే అందరూ తిరుమల శ్రీవారు అని వెంటనే చెప్పేస్తారు. వడ్డికాసులవాడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామికి ఉన్న ఆస్తులు.. ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి.. భక్తులు సమర్పించిన ఆస్తుల విలువ.. ఆ ఆస్తుల సంరక్షణ వ్యవస్థ.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పదిటన్నుల బంగారం, రూ.8,500 కోట్ల నగదు బ్యాంకుల్లో.. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారికి భక్తులు తీర్చుకునే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి. హుండీలో నగదు సమర్పించేవారు కొందరైతే, బంగారం చెల్లించేవారు మరికొందరు. తమ బరువుకు సమానమైన పదార్థాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. స్వామి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించేవారు కొందరైతే.. ఇంకొందరు విలువైన భూములను శ్రీవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక టీటీడీ నిర్వహించే ట్రస్ట్‌లకు ఏటా రూ.300 కోట్లకు పైగానే విరాళాలుగా అందిస్తున్నారు. ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం 10 టన్నులకు పైగా టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ.8,500 కోట్ల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. స్వామి హుండీ ఆదాయం తరువాత టీటీడీకి ప్రధానమైన ఆదాయం బంగారం, నగదు డిపాజిట్ల మీద వచ్చేదే. మరోవైపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో శ్రీవారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు. నేపాల్లోనూ భక్తులు సమర్పించిన ఆస్తులున్నాయి. 7,636 ఎకరాల్లో ఆస్తులు టీటీడీ నిరర్ధక ఆస్తులు విక్రయించే అంశం గత ఏడాది వివాదాస్పదం కావడంతో.. ఇకపై టీటీడీ ఆస్తులు విక్రయించకూడదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాలకమండలిలో పెట్టి తీర్మానం చేశారు. అప్పటినుంచి టీటీడీ ఆస్తులు ఎక్కడున్నాయి, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, వాటిద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం ఎంత, అన్యాక్రాంతమైన భూములు, వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా, వాటిని టీటీడీ ఆదాయ వనరులుగా ఎలా ఉపయోగించుకోవాలి.. తదితర అంశాలను పరిశీలించడానికి టీటీడీ పాలకమండలి 4 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు టీటీడీకి దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు ఉన్నట్లు గుర్తించాయి. వీటిలో 2014కు పూర్వమే 173 ఆస్తులను రూ.114 కోట్ల రూపాయలకు టీటీడీ విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 75 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు 7,636 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు 1,226 ఎకరాలు. వ్యవసాయేతర భూములు 6,410 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. 535 ఆస్తులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో ఉన్నాయి. 159 ఆస్తులను టీటీడీ ఇతరులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.4.15 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇక టీటీడీ వినియోగంలోలేని 169 ఆస్తులను ఇతరులకు లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. అన్యాక్రాంతమైన 29 ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల విలువ రూ.23 కోట్లుగా టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. ఒక్క తిరుపతిలోనే ఐదు ప్రాంతాల్లో ఉన్న విలువైన టీటీడీ ఆస్తులను గుర్తించి వాటి అభివృద్ధిపై దృష్టి సారించారు. 12 ఆస్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు, ఆధారాలు లేవు. ఇటీవల తమిళనాడులోని తంజావురు జిల్లా కబిస్థలం అనే ప్రాంతంలో ఆరెకరాల టీటీడీ స్థలాన్ని కమిటీ గుర్తించింది. గతంలో వంద సంవత్సరాలకు ఈ స్థలాలను లీజుకు ఇవ్వడం, అప్పటికి టీటీడీ ఏర్పాటు కాకపోవడంతో వాటికి సంబంధించిన రికార్డులు లేవు. దీంతో వాటి గుర్తింపు టీటీడీకి ఇబ్బందికరంగా మారింది. మిగిలిన ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. కల్యాణ మండపాల ద్వారా ఆదాయం దేశవ్యాప్తంగా 307 ప్రాంతాల్లో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించింది. ఇందులో 166 కల్యాణ మండపాల నిర్వహణ బాధ్యతను ఇతరులకు అప్పగించింది. 29 కల్యాణ మండపాలను దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది. వీటిద్వారా టీటీడీకి ఏటా రూ.4.28 కోట్ల ఆదాయం లభిస్తోంది. స్వామి ఆస్తులకు ఆధునిక భద్రత ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల గుర్తింపును సులభతరం చేయడానికి జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్‌ను టీటీడీ ప్రారంభించింది. తద్వారా ఆస్తులను సులభతంగా గుర్తించవచ్చని, అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చునని టీటీడీ భావిస్తోంది. సంపూర్ణమైన భద్రత స్వామివారి ఆస్తులను సులభంగా గుర్తించడానికి జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేశాం. జియో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం. స్వామి పట్ల భక్తితో భక్తులు సమర్పించిన ఈ ఆస్తులను ఎప్పటికీ విక్రయించకూడదని పాలకమండలి కూడా తీర్మానించింది. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి స్వామి ఆస్తులను నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా గుర్తించి భద్రత కల్పించాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో -
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు శివరాంరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్
-
టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే.. పూర్తి వివరాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార వైభోగం చెప్పనలవి కాదు. స్వామి వారి అలంకారంలో పుష్పాలదే అగ్రస్థానం. తిరుమలేశుని మూల మూర్తికి ఉదయం లేచింది మొదలు రాత్రి పవళింపు సేవ వరకు నిత్యం సాగే పూజాదికాల్లో అనేక రకాల పుష్పాలు వాడతారు. స్వామి సేవకు ఉపయోగించిన పవిత్రమైన పుష్పాలను పూజారుల చేతుల నుంచి అందుకోవడమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది పూజకు ఉపయోగించిన పుష్పాలు స్వామి వారి రూపంలో ఉంటే భక్తుల తన్మయత్వం అంతా ఇంతా కాదు. ఇదే తలంపుతో టీటీడీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తలపెట్టాయి. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? గతేడాది జనవరిలో ‘ఎండు పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వామి వారి పుష్పాలతో దేవతా మూర్తులు, పలు రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధన ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లో 350 మందికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చారు. ఎండబెట్టిన పూలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో కూడిన చిత్రపటాలు, వివిధ రకాల వస్తువుల తయారీతో జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు. కోవిడ్ కారణంగా భర్త చనిపోయిన వారు, ఉపాధి కోల్పోయిన వారు, టీ బంకుల్లో, ఇళ్లల్లో పనులు చేసుకునే వారు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. దైవత్వం ఉట్టిపడేలా కళారూపాలు ఉద్యాన వర్సిటీతో చేసుకున్న ఒప్పందం మేరకు స్వామివారి సేవలో ఉపయోగించే పూలను టీటీడీ సరఫరా చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వాటిని ఎండబెట్టి, ఫొటో పేపర్, కాన్వాస్‌లపై దైవత్వం ఉట్టిపడేలా వివిధ రూపాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, పద్మావతి, ఒంటిమెట్టలోని సీతారాములు, శ్రీకృష్ణుడు, వకుళామాత వంటి దేవతామూర్తుల చిత్రపటాలను తీర్చిదిద్దుతున్నారు. డాలర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, లాకెట్లు, పెన్స్టాండ్లు వంటి వాటిని తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నారు. కొందరు రూ.30 వేల వరకు కూడా సంపాదిస్తున్నారు. నెలకు రూ.40 లక్షల ఉత్పత్తుల తయారీ ఇక్కడ తయారైన వస్తువులను తిరుమలతో పాటు టీటీడీకీ అనుబంధంగా ఉన్న స్వామి వారి ఆలయాల వద్ద విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల విలువైన ఉత్పత్తులు తయారవుతుండగా, రూ.60 లక్షల స్థాయికి పెంచుతున్నారు. ఆన్లైన్లో కూడా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారికి అలంకరించే 3 నుంచి 5 అడుగుల నిలువెత్తు పూలదండలను ఎండబెట్టి ఫ్రేమ్ కట్టి భక్తులకు అందించే ఆలోచన చేస్తున్నారు. దీనిని పూర్తిస్థాయి పరిశ్రమగా నిలబెట్టేందుకు ప్రత్యేక భవనం నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలంటూ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి యూనివర్సిటీకి వినతులు వస్తున్నాయి. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ప్రవాసాంధ్రులు కూడా ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మరో వైపు ఎండుపూలతో తయారు చేసే వస్తువుల జీవిత కాలం పెంచేందుకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రొ.రాచకుంట నాగరాజు పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. ఎండబెట్టిన పూలను వాటి సహజసిద్ధమైన రంగు కోల్పోకుండా పౌడర్ రూపంలో మార్చడం పైనా అధ్యయనం చేస్తున్నారు. కుటుంబానికి లోటులేకుండా ఉంది నా భర్త ఏడాది క్రితం కోవిడ్‌తో చనిపోయారు. ఇద్దరు పిల్లలు, అత్త పోషణ నాపై పడింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇక్కడ శిక్షణ పొంది నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. కుటుంబానికి లోటు లేకుండా ఉంది. –ఎం.శివకుమారి, హరిపురం కాలనీ, తిరుపతి అప్పులన్నీ తీర్చేశా నా భర్త సిమెంట్ పనికి వెళ్తారు. నెలలో 15–20 రోజులే పని. రోజుకు 450 సంపాదించే వారు. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. స్వామి వారి ఫొటో ఫ్రేమ్స్ తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత నెలకు రూ.10–12వేలు సంపాదిస్తున్నా. అప్పులన్నీ తీర్చేశా. –కడపల దివ్యలత, అన్నమయ్య నగర్, తిరుపతి మంచి స్పందన లభిస్తోంది టీటీడీతో కలిసి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎండుపూల ఉత్పత్తుల ప్రాజెక్టుకు మంచి స్పందన లభిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ పొందిన మహిళల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. –డాక్టర్. టి.జానకిరామ్, వైస్‌చాన్సలర్, ఉద్యాన వర్సిటీ -
తిరుమల: భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. -
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
శ్రీవారి ఆర్జిత సేవల పునఃప్రారంభంపై టీటీడీ కీలక నిర్ణయం
-
శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
ఏప్రిల్ 1 నుండి శ్రీవారి సేవలకు భక్తులకు అనుమతి
-
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
-
తిరుమల క్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధం
-
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు
టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన.. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నాని అన్నారు. ఈ ఏడాది కరోనా అంతమై ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను నటించిన బంగార్రాజు చిత్రాన్ని కరోనా సమయంలోనూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆదివారం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ నాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మలయప్పస్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు 3 సార్లు స్వామి వారి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఘనంగా ‘కాకబలి’ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. వరాహస్వామివారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరాహస్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసి సంప్రోక్షణ చేసిన విషయం విదితమే. సంప్రోక్షణ చేసి మండలం (48 రోజులు) పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరిగింది. కాగా, తిరుమలలో సోమవారం నిర్వహించే రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి
తిరుమల/చంద్రగిరి: ఇల వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూవైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన స్వామి దర్శనానికి ఉత్తరద్వారం స్వాగతం పలికింది. సుప్రీంకోర్టు సీజే దంపతులు, వివిధ రాష్ట్రాల హైకోర్టు సీజేలు, సుమారు 40 మంది జడ్జీలు, వీఐపీలు వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. తిరుమలేశుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరవడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండోసారి కూడా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే 7.35 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. సామాన్యులు సైతం దేవదేవుడిని కనులారా వీక్షించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దేవదేవుడు స్వర్ణరథాన్ని అధిరోహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతున్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథం లాగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్ రమణ దంపతులు వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారి మూల మూర్తిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం టీటీడీ చైర్మన్ తీర్థప్రసాదాలను అందించారు. సీజేతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికి వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవారి స్వర్ణరథ సేవలో పాల్గొని కొంతసేపు రథాన్ని లాగారు. ఆ తర్వాత వారు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. తిరుమలకు తరలివచ్చిన వీఐపీలు తిరుమల శ్రీవారిని ఆలయ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరి జయరామ్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, ఆదిమూలపు సురేష్, బాలినేని, రంగనాథరాజు, ఎంపీలు భరత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, వేమిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ చెన్నై, న్యూఢిల్లీ స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దర్శించుకున్నారు. నేడు చక్రస్నానం వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక హైకోర్టు సీజేలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ రమేష్, జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోవిందరాజన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ గురువారం ఉదయం వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హైకోర్టు సీజే, మంత్రి తలసాని కుటుంబ సభ్యులు వేర్వేరుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భాజపా నాయకురాలు డీకే అరుణలు శ్రీవారిని దర్శించుకున్నారు. -
వైకుంఠ ఏకాదశినాడు తిరువీధిలో ఉత్సవం
-
శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో మోసాలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లంటూ నకిలీ టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఒక కేసులో వైకుంఠం–1లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న అరుణ్‌రాజు, తిరుపతిలో ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, తిరుమల ప్రత్యేక ప్రవేశదర్శనం కౌంటర్లో పనిచేస్తున్న ఆపరేటర్ నరేంద్రలను, మరో కేసులో తిరుపతికి చెందిన దళారి చెంగారెడ్డి, గతంలో త్రిలోక్ ఏజెన్సీ కౌంటర్ బాయ్‌గా పనిచేసిన దేవేంద్రప్రసాద్, వెంకట్‌లను అరెస్టు చేసినట్లు తిరుమల వన్ టౌన్, టూటౌన్ సీఐలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్ చెప్పారు. వారు తెలిపిన మేరకు.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ముఠా సభ్యులు ఆదివారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జితేంద్రకుమార్ సోనీ, అతడి స్నేహితులకు రూ.300 టికెట్లు నకిలీవి మూడింటిని రూ.21 వేలకు అమ్మి దర్శనానికి పంపించారు. కౌంటర్లో ఆపరేటర్ నరేంద్ర టికెట్లను స్కాన్ చేయకుండా పంపడాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ ఉద్యోగులు అతడిని పట్టుకుని విచారించి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దాపురానికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబంతో సహా శ్రీవారి దర్శనానికి వచ్చాడు. దళారి చెంగారెడ్డి ముఠా సభ్యులు రూ.300 టికెట్లు నకిలీవి ఒక్కొక్కటి రూ.3,300కు వారికి అమ్మి శ్రీవారి దర్శనానికి పంపారు. దర్శనం కౌంటర్ వద్ద నకిలీ టికెట్లను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుల నుంచి సమాచారం సేకరించి తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి.. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. నకిలీ టికెట్లు విక్రయించే దళారుల గురించి తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్‌లు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసిందని అన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణతో సినిమా: దర్శకుడు గోపిచంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణ తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో ఆమెను సత్కరించారు. అదేవిధంగా.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా న్యాయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు. కాగా, అంతకు ముందు రోజు గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని జస్టిస్ బీవీ నాగరత్న కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ శ్రీసుధా తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలి: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు రావాలని కోరుకుంటున్నన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ -
అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశ్వ వాహనంపై శ్రీవారు దర్శనమిస్తున్నారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. (చదవండి: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్) జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రేపు(శుక్రవారం) ఉదయం చక్రస్నాన మహోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు. చదవండి: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్ నిర్ణయం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్, డైరీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీవారికి శుభలేఖ పంపండి.. పెళ్లి కానుక అందుకోండి
తిరుమల: తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకోండి.. మొదటి శుభలేఖ పంపవచ్చు.. ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయవచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. -
వెంకన్న సన్నిధిలో విజయసాయిరెడ్డి
-
వెంకన్న సన్నిధిలో శాసనసభ స్పీకర్
సాక్షి, తిరుపతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనాతో మానవాళి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.. త్వరగా మెడిసిన్, వ్యాక్సిన్ వచ్చేలా ఆశీర్వదించాలని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. శ్రీవారి దర్శన అనుమతికి ఇబ్బందులు ఎదురవుతున్నా, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. 24 గంటలూ పూర్తిస్థాయి సిబ్బందితో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్పత్రులకు అదనపు బలాన్ని చేకూరుస్తోందని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 వేల వైద్య పోస్టుల భర్తీకి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఇకపై 24 గంటలూ పూర్తిస్థాయిలో సిబ్బందితో ప్రభుత్వాస్పత్రులు పనిచేస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: కొండలకు కోట్లిచ్చిన ఘనులు!) (బినామీ ‘బాబు’కు చెక్) -
నిబంధనల ప్రకారమే దర్శనాలు
-
దర్శనానికి వేళాయె
-
తీపి వార్త: తిరుమలలో అందరికీ ఉచిత లడ్డు
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సరానికిగానూ తీపి కానుక అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది. అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇంతకుముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా ఇక నుంచి అందరికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఉచిత లడ్డుతో కలిపి రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని టీటీడీ వెల్లడించింది. చదవండి: తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు -
తిరుమలలో ‘వైకుంఠ’ ఏర్పాట్లు
తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరాది,జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ లోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 31, జనవరి 1వ తేదీల్లో అన్ని ఆర్జిత సేవలతో పాటు దాతలు, వృద్ధులు, దివ్యాం గులు, చంటిపిల్లల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేసినట్టు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుంచి 7 వరకు ఆర్జిత సేవలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు, రూ. 300 దర్శన టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశామని వివరించారు. జనవరి 7న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 5 వేల మంది భక్తులకు గతంలోనే ఆన్లైన్లో కేటాయించామన్నారు. జనవరి 6న తెల్లవారుజామున 2 నుంచి వైకుంఠ ద్వార దర్శ నం ప్రారంభమవుతుందని తెలిపారు. నారాయణ గిరి ఉద్యానవనాల్లోని షెడ్లలో జనవరి 5న ఉదయం 11 నుంచి రాత్రి 12 వరకు నామసంకీర్తన యజ్ఞం నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ సమీక్షలో టీటీటీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఈ–2 నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, హెచ్డీపీపీ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో విశేష ఉత్సవాలు జనవరి నెలలో తిరుమల ఆలయంలో పలు విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 6న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, 7న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, అలాగే 7 నుంచి 13 వరకు ఆండాళ్ నీరాటోత్సవం, 11న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 14న భోగి, 15న మకర సంక్రాంతి. 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 30న వసంతపంచమి తదితర విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. జస్టిస్ జేకే మహేశ్వరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను(వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్) హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ చదివి వినిపించారు. తరువాత సీజేగా జస్టిస్ మహేశ్వరి ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా జస్టిస్ మహేశ్వరిని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిన్నటి వరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (ఏసీజే) వ్యవహరించిన జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, పలువురు న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులు, మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ వారంలోనే హైకోర్టు సందర్శన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్నప్పుడు జస్టిస్ జేకే మహేశ్వరి పొరపాటున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదులు మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అని పలికారు. గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అని చదవగా, జస్టిస్ జేకే మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ బదులు మధ్యప్రదేశ్ అని పొరపాటున చదివి ప్రమాణం పూర్తి చేశారు. సీజేతో సహా వేదికపై ఉన్న ప్రముఖులు దీనిని గుర్తించలేదు. సంప్రదాయం ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి జస్టిస్ జేకే మహేశ్వరిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఆ వెంటనే జాతీయ గీతాలాపన పూర్తి కావడం, తేనీటి విందుకు హాజరుకావాలన్న ప్రకటన వెలువడడం జరిగిపోయాయి. ఆ వెంటనే జరిగిన పొరపాటును గవర్నర్ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా గుర్తించి, స్వయంగా జస్టిస్ జేకే మహేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన గవర్నర్ హరిచందన్‌తో మాట్లాడారు. అప్పటికే అందరూ తేనీటి విందు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మరోసారి ప్రమాణం చేయించేందుకు గవర్నర్ సిద్ధమయ్యారు. తేనీటి విందు ప్రారంభానికి ముందే గవర్నర్ మరోసారి జస్టిస్ జేకే మహేశ్వరితో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. అనంతరం ఏజీ శ్రీరామ్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులను(జీపీ) ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు. ఈ వారంలో ఆయన హైకోర్టును సందర్శించే అవకాశాలున్నాయని హైకోర్టు వర్గాలు తెలిపాయి. కాగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వదించారు. నేడు శ్రీవారి సేవలో హైకోర్టు సీజే తిరుమల : ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో పద్మావతి అతిథిగృహం వద్ద ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి దర్శన ఏర్పాట్లుచేశారు. అలాగే, మంగళవారం జరగనున్న శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. -
‘హోదా ఇచ్చేవరకు పోరాటం సాగిస్తాం ’
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. హోదా ఇచ్చేవరకు కేంద్రంపై తమ పోరాటం కనసాగుతుందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో రెండు రాష్ట్రలకు మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రెండు రాష్ట్రాలలో ఎలా అధికారంలోకి రావాలో అన్న ఆలోచనను పక్కకు పెట్టి ప్రజలకు ఎలా మంచి చేయాలో ఆలోచించాలని సూచించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు ముఖ్యమంత్రులు చూపిస్తున్న చొరవ దేశంలోనే ఆదర్శవంతం అని ప్రశంసించారు. -
శ్రీవారిని దర్శించుకున్న పీఎం మోదీ, సీఎం జగన్
సాక్షి, తిరుమల : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకున్న మోదీ..అక్కడ ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో మోదీ మూడో సారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతకు ముందు 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. -
నేడు తిరుమలకు ప్రధాని మోదీ
తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలుకుతారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్ స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా వుంటే ప్రధానమంత్రిగా మోదీ 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3వతేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోది తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించి అణువణువునా తనిఖీలు చేస్తూ భద్రత పటిష్ట పరిచారు. మూడు వేల మందితో భద్రత పీఎం, గవర్నర్, సీఎం రానుండడంతో తిరుమల, తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్ర««ధాన మంత్రి సెక్యూరిటీ ఎన్ఎస్జి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి పబ్లిక్ మీటింగ్ ప్రాంతం వరకు అక్కడ నుంచి తిరుమల వరకు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు ఎస్పీలు, ఏడుగురు అడిషనల్ ఎస్పీలు, 33 మంది డీఎస్పీలు, 77 మంది సీఐలు, 146 మంది ఎస్ఐలు, 1899 మంది సిబ్బందితో పాటు ఏపీఎస్పీ ఆర్మ్డ్Š ఫోర్స్ 200, స్పెషల్ పోలీసులు 300, గ్రేహౌండ్స్ 50 మందితో పాటు కూంబింగ్, బాంబ్ డిస్పోజల్ పార్టీలు తిరుమల ఘాట్‌లో, రేణిగుంట మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన వివరాలు: ►ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. ►4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►4.40 గంటలకు విమానాశ్రయం దగ్గరగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకుంటారు. ►5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తిరుమల చేరుకుని దర్శనానికి వెళతారు. ►శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 7.20 గంటలకు రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి 8.10 గంటలకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా: ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.30 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు. ►దర్శనం అనంతరం తిరుమల నుంచి బయలుదేరి 8గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. ►8.15 గంటలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన తర్వాత 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు. -
రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక
సాక్షి, అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని గురువాయూర్ ఆలయ దర్శనానికి బయలుదేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. ఈ మధ్యలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. -
వజ్రాలకూ రెక్కలొచ్చాయా?
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే విలువైన వజ్రాలు, రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాల (స్టోన్‌గోల్డ్)కు సంబంధించిన లెక్కలు, వాటి వివరాలు టీటీడీ వద్దలేవు. వేల కోట్ల ఆభరణాల వివరాలు, లెక్కలు లేవంటే టీటీడీ పనితీరును అనుమానించాల్సి వస్తోంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియడంలేదు. దీని వెనుక మతలబు ఏమిటనే దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీవారికి వచ్చే బంగారంతో పాటు వజ్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ఎన్ని, ఎక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఉంటే ఎందుకు బహిర్గతం చెయ్యటం లేదు? అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో కొలువైన కలియుగ వైకుంఠనాధుడికి భక్తులు బంగారు, వెండి ఆభరణాలనూ హుండీలో కానుకలుగా సమర్పిస్తుంటారు. కొందరు భక్తులైతే నిలువు దోపిడీ పేరుతో ఒంటిపైన ఉన్న నగలు, ఆభరణాలను ఉన్నవి ఉన్నట్లుగా తీసి హుండీలోవేసి మొక్కులు తీర్చుకుంటారు. అందులో వజ్రాలు, రత్నాలు, అవి పొదిగిన ఆభరణాలు, కెంపు, ముత్యాలు, మరకత, మాణిక్యాలు ఉంటాయి. తమిళనాడులో పట్టుబడ్డ కోట్ల రూపాయలు విలువచేసే బంగారంపై వచ్చిన అనుమానాలకు టీటీడీ నుంచిగాని, ఇటు ప్రభుత్వం నుంచిగాని స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో శ్రీవారికి కానుకగా లభించే ఆభరణాల్లోని ఈ విలువైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు ఏమవుతున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వాటికి లెక్కలు లేవంటే చేతులు మారాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బంగారానికి ఉన్న లెక్కలు స్టోన్గోల్డ్కు ఎందుకు లేవు... శ్రీవారికి హుండీలో భక్తులు సమర్పించే నగదును ప్రతి రోజూ లెక్కిస్తున్నారు. ఆ వివరాలను టీటీడీ ఏరోజుకారోజు అధికారికంగా వెల్లడిస్తోంది. నిల్వ బంగారం విషయానికి వస్తే వివిధ బ్యాంకుల్లో 9,259 కిలోలను డిపాజిట్ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అయితే బంగారంతో పాటు వచ్చే స్టోన్‌గోల్డ్ వివరాలను మాత్రం వెల్లడించడంలేదు. ఆభరణాల్లోని విలువైన రాళ్లను టీటీడీ ఏం చేస్తోందన్న వివరాలు మాత్రం ఇప్పటిదాకా ప్రకటించకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆభరణాలను తిరుమల పరకామణిలోనే చిన్నచిన్న మూటలుగా కట్టి, అక్కడే వాటి బరువును లెక్కిస్తారు. ఆపై తిరుపతిలోని ట్రెజరీకి పంపుతారు. వాటిని తిరుపతిలో ఉన్న టీటీడీ అప్రైజర్లు తనిఖీ చేసి బంగారానికి విలువకట్టి ఖజానాలో జమ చేస్తారు. అదే విధంగా ఆభరణాల్లోని రాళ్ల వివరాలనూ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అయితే వివరాలు మాత్రం లేవట. జమాలజిస్టే లేడు – విలువ కట్టేదెలా? శ్రీవారికి ప్రతిరోజూ వచ్చే ఆభరణాల్లోని విలువైన రాళ్లను గుర్తించి విలువ కట్టాలి. అందుకు ప్రత్యేకంగా జమాలజిస్ట్ ఉండాలి. అయితే టీటీడీలో ఇప్పటి వరకు జుమాలజిస్ట్ లేడని అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం మాత్రం చెప్పడంలేదు. ఆభరణాల్లో ఉన్న రాళ్లు విలువ ఏమిటో లెక్కించే నిపుణులను ఎందుకు నియమించలేదు? దీనికి కారణంన ఎవరు వంటి ప్రశ్నలను భక్తులు లేవనెత్తుతున్నారు. జమాలజిస్ట్ లేకపోవటంతో తిరుపతిలో ఉన్న అప్రైజర్ అతనికి తోచిన విధంగా కొంత స్టోన్‌గోల్డ్‌ను విలువకట్టి ముంబైలోని మింట్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. అక్కడ కరిగించి, బంగారాన్ని విడదీసి శుద్ధిచేసి, కడ్డీలుగా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో వజ్రాలు, రత్నాలు వంటి వాటిని ఏం చేస్తున్నారన్నది తెలియడంలేదు. వాటి వివరాలు తెలియడంలేదు. బంగారం కన్నా విలువైన వజ్రాలు, రత్నాలకు లెక్కాజమాలేక పోవడంపై భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో బంగారం నుంచి వేరుచేసిన వజ్రాలు, రత్నాలు ఎన్ని, అవి ఎక్కడకు వెళుతున్నాయో తెలియడంలేదు. లెక్కపెట్టే అలవాటే లేదట! శ్రీవారికి హుండీలో భక్తులు సమర్పించే స్టోన్‌గోల్డ్‌ను లెక్కపెట్టటం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇంత నిర్లక్ష్యం వెనుక కారణాలు ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడంలేదు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు సమర్పించిన స్టోన్‌గోల్డ్‌ను మూటలు కట్టి భద్రపరచారా? ఎక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి? అనే భక్తుల ప్రశ్నలకు టీటీడీ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే...హుండీ ఆదాయాన్ని ట్రెజరీలో వేరుచేసిన సమయంలో లభించిన విడి రాళ్లను మాత్రం లూజ్ స్టోన్ పేరుతో మూటలుగా కట్టి నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం. శ్రీవారి ఆభరణాలకు సంబంధించి ఏవైనా మరమ్మతులు వచ్చినపుడు ట్రెజరీలో నిల్వచేసిన ఈ రాళ్లను వాడుతున్నట్లు తెలిసింది. అయితే ఇలా ఎన్నిరాళ్లను వినియోగిస్తారు అనేదానికి కూడా టీటీడీ వద్ద వివరాలు లేవు. ఎన్ని లడ్డూలు అమ్మాం, ఎంత మంది భక్తులు వచ్చారు అన్నదానికి ఉన్న పక్కా లెక్కలు వేల కోట్ల రూపాయల విలువచేసే స్టోన్‌గోల్డ్ విషయంలో ఎందుకు లేవన్న దానికి టీటీడీ వద్ద సమాధానం లేదు. -
28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 29న ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. 28న ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆరోజు నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. -
తిరుమలలో పీఎస్ఎల్వీ సీ– 35 నమూనా రాకెట్‌కు పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పీఎస్ఎల్వీ–సీ35 నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 9.12గంటలకు పీఎస్ఎల్వీ–సీ35 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇస్రో నిర్వహించే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలేశుని ఆలయంలో నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్‌వెహికల్ ప్రోగ్రాం (ఎల్‌వీపీవీ) డైరెక్టర్ ఎస్కే కనుంగో, శాటిలైట్ కమ్యునికేషన్ ప్రోగ్రాం (ఎస్ఈపీ) డైరెక్టర్ సేతురామన్, సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్ తదితరులు ఆదివారం తిరుమల ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని, నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు.