
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా నడక మార్గంలో చిరుత కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత పెంచారు. గుంపులుగా వెళ్లాలని, చిన్న పిల్లలను దగ్గరే ఉంచుకోవాలని భక్తులకు అటవీ శాఖాధికారులు సూచించారు.
ఇటీవల కాలంలో చిరుతల సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి కర్రను కూడా అందిస్తోన్న టీటీడీ.. మరిన్ని భద్రతా చర్యలు చేపట్టే అంశంపై కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment