srivari mettu
-
శ్రీవారి మెట్లమార్గం మూసివేత
-
రేపు శ్రీవారి నడక మార్గం మూసివేత
సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. రేపు(గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని టీటీడీ అధికారులు రద్దు చేశారు.కాగా, అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కాలువు ఉప్పొంగుతున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని, రోడ్లు మునిగిపోయాయని పెద్దసంఖ్యలో కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా కొరమేనుగుంట, గొల్లవానికుంట, జీవకోన, కొత్తపల్లె, కట్టకిందూరు. లక్ష్మీపురంతో పాటు కపిలతీర్థం, మాల్వాడీగుండం, పేరూరు నుంచి నగరంలోకి ప్రవేశించి నీటి పోటు అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే లీలా మహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.ఇదీ చదవండి: నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారిమెట్టు వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు దీపక్ అప్రమత్తమయ్యాడు. కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు.శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం 5 గంటలకు భక్తులను శ్రీవారిమెట్టుకు వదిలారు. అదే సమయంలో గార్డు దీపక్ గది నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీ శాఖ అధికారులకు చిరుత గురించి సమాచారమిచ్చాడు. తర్వాత కాలి నడక భక్తులను గుంపులు, గుంపులుగా వదులుతున్నారు.మరోవైపు, చిరుత సంచారంతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు కొన్నిరోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నారు. బుర్రిలంకలోని నర్సరీ, పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు నమోదు కాలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు.శనివారం రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తెలిపిన అనుమానాస్పద ప్రదేశాల్లో సిబ్బంది వెళ్లి గమనించగా, అవి కుక్కల పాదముద్రలుగా గుర్తించామన్నారు. దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు గుర్తించలేదన్నారు.బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉంటాయి కాబట్టి అటువైపు చిరుతపులి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆదివారం నుంచి గోదావరి లంకల్లో సిబ్బంది బృందాలుగా ఏర్పడి గమనిస్తారన్నారు. కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.ఇదీ చదవండి: బ్రహ్మూత్సవాలకు వెళాయే -
తిరుమల: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక యువకుడితో ప్రేమలో పడిన వివాహిత మహిళ.. ముగ్గురు పిల్లలు, భర్తను వదిలి ప్రియుడు సతీష్‌తో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది.తిరుమలకు వెళ్ళే శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గర వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. చివరి నిమిషంలో రాధిక.. భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్త శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి పురుగుల మందు తాగిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు సతీష్ కోలుకుంటున్నాడు వీరిది చిత్తూరులోని బంగారురెడ్డిపల్లెకు చెందిన సతీష్, రాధికగా గుర్తించారు. -
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత కలకలం
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా నడక మార్గంలో చిరుత కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత పెంచారు. గుంపులుగా వెళ్లాలని, చిన్న పిల్లలను దగ్గరే ఉంచుకోవాలని భక్తులకు అటవీ శాఖాధికారులు సూచించారు. ఇటీవల కాలంలో చిరుతల సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తోంది. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి కర్రను కూడా అందిస్తోన్న టీటీడీ.. మరిన్ని భద్రతా చర్యలు చేపట్టే అంశంపై కసరత్తు చేస్తోంది. -
350 సార్లు తిరుమల మెట్లు ఎక్కిన శ్రీవారి భక్తుడు
శ్రీకాకుళం కల్చరల్: ఏడుకొండల వారిని ఒక్క క్షణం కళ్లారా చూడాలని కోట్లాది మంది మొక్కుతుంటారు. రెండు ఘడియల పాటు స్వామిని చూసే అవకాశం వస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటిది ఆయన 350 సార్లు తిరుమల మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రతి మెట్టు పరిచయమే అన్నట్లు ప్రతినెల కాలినడకన తిరుపతి కొండ ఎక్కడం అలవాటుగా మార్చుకున్నారు. తాను వెళ్లడమే కాదు 780 మందితో తిరుమలకు పాదయాత్ర కూడా చేసి గోవిందుడి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలకు గాను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పేరు మహంతి శ్రీనివాస్. ఊరు శ్రీకాకుళం. గోవింద వరల్డ్‌వైడ్ వాట్సాప్ గ్రూపు.. శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాస్‌కు తిరుమలేశుడంటే ఎనలేని భక్తి. ఇప్పటివరకు 350 సార్లు తిరుపతి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబరు 6వ తేదీ ఏకాదశి పర్వదినాన 780 మందితో గ్రూపుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ‘గోవింద వరల్డ్‌వైడ్’ వా ట్సాప్ గ్రూపును రూపొందించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా చేరారు. ఈ గ్రూపులో జూన్ 25లోగా సెప్టెంబరు 6న మెట్ల మార్గం ద్వారా పాదయాత్రకు ఆసక్తి ఉన్న వారు తమ సమ్మతిని తెలపాలని కోరారు. సమ్మతి తెలిపిన వారు తిరుమలకు 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని సూచించారు. దీంతో కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ, ఒడి శా రాష్ట్రాల నుంచి 780 మందితో పాదయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆ రోజు సాయంత్రం గోవిందరాజస్వామి దర్శనాలు, శ్రీపద్మావతి అమ్మ వారి దర్శనాలు చేసుకున్నాక, రాత్రి తిరుపతిలో బస చేసి, 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర ప్రారంభించారు. 2388 మెట్లను 150 నిమిషాలు నడచి తిరుమల చేరుకున్నారు. ఇది ఆయన 350వ పాదయాత్ర. ఆ దారిలోనే.. తిరుమల వెళ్లే భక్తులు సాధారణంగా ముందుగా తిరుమల వరకు నేరుగా వెళతారు. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని శ్రీనివాస్ అంటారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక.. కొండపైకి చేరుకొని తలనీలాలు సమర్పించి, పుష్కర స్నానం చేసి ఆ తర్వాత వరాహ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలాగే కొండపై ఉన్న 6 ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత యాత్ర పూర్తి అవుతుందని ఆయన చెబుతుంటారు. 350 సార్లు ఇలా.. 1996లో మొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించారు. 1996 నుంచి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన వయసు 50 ఏళ్లు ఆ ఏడాదే 50 సార్లు పాదయాత్ర చేశారు. 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో రెండు సార్లు(ఆ సమయంలో కరోనాతో గుడి మూసివేశారు). 2021లో 52 సార్లు, 2022లో 8 సెప్టెంబరుæ వరకు 40 సార్లు పాదయాత్ర నిర్వహించారు. మొత్తంగా 350 దఫాలు మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకరోజులో ఒకసారిగా వెళ్లింది 193 సార్లు, ఒకరోజులో 2 సార్లు నడచింది 142సార్లు, ఒక రోజులో మూడుసార్లు నడిచింది 15 సార్లు కావడం విశేషం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా 59 సార్లు, కుమారుడు కూడా 30 సార్లు పాదయాత్ర చేశారు. ఇప్పటికి 2వేల మంది భక్తులను తనతో పాటుగా తీసుకువెళ్లారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తిరుమలలో పనిచేసిన జిల్లాకు చెందిన ఉన్నతాధికారి రుంకు అప్పారావు స్ఫూర్తితో శ్రీనివాస్ ఈ పాదయాత్రలు చేశారు. రుంకు అప్పారావు 108 సార్లు మెట్ల ద్వారా పాదయాత్ర చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పొందారు. అయితే శ్రీనివాస్ 2019 జనవరి 27 వరకు 205 పర్యాయాలు మెట్ల యాత్ర చేశాక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి యోగ్యతాపత్రాన్ని, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సర్టిఫికేటును అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి తన యాత్రను కొనసాగిస్తూ 258 పర్యాయాలు పూర్తి చేసినందుకు గాను 2020 మే8న ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు. ప్రతి నెలా వెళ్తా.. నేను ప్రతి నెల తిరుమల వెళ్లి మెట్ల దారి నుంచి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇప్పటి వరకు 350సార్లు పాదయాత్ర చేశాను. తిరుమల అంటే సాక్షాత్తు వైకుంఠధామమే. తిరుమల యాత్ర ఏవిధంగా చేయాలో అందరికీ చెబుతాను. ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే తాజా మార్పులను వాట్సాప్ గ్రూపు ద్వారా అందరికీ చేరవేస్తుంటాను. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. – మహంతి శ్రీనివాస్, శ్రీకాకుళం -
శ్రీవారి మెట్టు మార్గం పునఃప్రారంభం
తిరుమల/చంద్రగిరి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీవారి మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతిందని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు రూ.3.60 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారని తెలిపారు. ఈ మార్గం ద్వారా రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డి, ఆర్ఆర్ బిల్డర్స్ డీజీఎం ఆర్ముగాన్ని వైవీ సుబ్బారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని బుధవారం అర్ధరాత్రి వరకు 69,603 మంది దర్శించుకోగా.. 30,434 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. ఎలాంటి టోకెన్ లేకపోయినా దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అన్నప్రసాద సేవలు ప్రారంభం కోవిడ్ వల్ల 2020 మార్చిలో పీఏసీ–2 వద్ద నిలిపివేసిన అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. డిప్యూటీ ఈవోలు పద్మావతి, హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఇదిలాఉండగా, కోల్‌కతాకు చెందిన సుమిత్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రకాష్ చౌదరి తిరుమలలో టీటీడీకి రూ.50 లక్షల విలువైన 10 బ్యాటరీ వాహనాలను విరాళంగా ఇచ్చారు. అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు -
శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతివ్వనున్నారు. గత నవంబర్‌లో కురిసిన వర్షానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ ధ్వంసమవగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. చదవండి: (పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్) -
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారి పునఃప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ మార్గం గుండా ప్రతి రోజు ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్ర చెబుతుందని వివరించారు. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో బండరాళ్ళు పడి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నడక మార్గాన్ని రూ.3.60 కోట్లతో మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు. -
వారం రోజులు శ్రీవారి దర్శనాలు రద్దు
-
వారం రోజులు శ్రీవారి దర్శనాలు రద్దు : ఈవో
సాక్షి, తిరుపతి : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని తెలిపారు. భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలివేస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ భక్తుల ప్రవేశం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వారం రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని వివరించారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు రాత్రి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి పంపుతామన్నారు. వారం తర్వాత సమీక్ష నిర్వహించి నిర్ణయాలు ప్రకటిస్తామని అన్నారు. టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని కోరారు. టీటీడీ ప్రతిరోజు కరోనా పరిస్థితిపై సమీక్ష చేస్తుందని గుర్తుచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారని గుర్తుచేశారు. తిరుమలకు గురువారం ఒక కరోనా అనుమానితుడు వచ్చాడని తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన బృందంలో మొత్తం 110 మంది ఉన్నారని.. వారు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగి తిరుమలకు వచ్చారన్నారు. ఆ బృందంలో కొందరికి గుర్తింపు కార్డులు లేవని.. అందుకే వారికి దర్శనం టోకెన్ ఇవ్వలేదని వెల్లడించారు. అస్వస్థతకు గురికాగానే అతని ప్రాథమిక చికిత్స చేయించామని.. అనంతరం రుయా ఆస్పత్రికి పంపిచామని తెలిపారు. కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే అలిపిరి టోల్ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు ఇప్పటికే తిరుమలలో ఉన్నవారికి శ్రీవారి దర్శనం చేసి పంపించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. దేశవ్యాప్తంగా 169 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్నవరంలో సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతి సాక్షి, తూర్పుగోదావరి : అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి భక్తుల సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ఈవో త్రినాధరావు మాట్లాడుతూ.. భక్తులకు అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు యథావిథంగా జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు వీటిలో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. పదేళ్లలోపు చిన్నారులను, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులను ఆలయానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో అన్నదానంకు బదులు పులిహోరా, దద్దోజనం, సాంబారు అన్నం ప్యాకింగ్‌చేసి భక్తులకు అందజేస్తామన్నారు. చదవండి : ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్ -
తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం
-
ప్రమాదకరంగా మారిన శ్రీవారి మెట్టు మార్గం
-
శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
-
శ్రీవారి మెట్టు వద్ద భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : తిరుపతి నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి మెట్టు వద్ద బుధవారం అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న రెండు మినీ లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాల నుంచి భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీలను సీజ్ చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారందరిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.