తిరుమల: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్‌ | Twist In Tirumala Love Couple Suicide Attempt Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమల: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్‌

Published Fri, Aug 23 2024 3:40 PM | Last Updated on Fri, Aug 23 2024 3:56 PM

Twist In Tirumala Love Couple Suicide Attempt Incident

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక యువకుడితో ప్రేమలో పడిన వివాహిత మహిళ.. ముగ్గురు పిల్లలు, భర్తను వదిలి ప్రియుడు సతీష్‌తో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది.

తిరుమలకు వెళ్ళే  శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గర వారు  పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. చివరి నిమిషంలో రాధిక.. భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్త శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి పురుగుల మందు తాగిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు సతీష్‌ కోలుకుంటున్నాడు వీరిది చిత్తూరులోని బంగారురెడ్డిపల్లెకు చెందిన సతీష్‌, రాధికగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement