Love couple
-
ప్రేమజంట ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో దారితప్పిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. జాన్సన్ అలియాస్ నాగరాజ్ (23), దిల్దాద్ (25) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్కు ఇప్పటికే పెళ్లి కాగా నాగరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయమై ప్రేమగా మారింది. తరచూ షికార్లకు వెళ్తూ ఉండేవారు. తమ ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్ శుక్రవారం రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్ మనసులోనే కుమిలిపోయింది. ప్రియుడు లేని లోకం వద్దంటూ శనివారం అమృతహళ్లిలోని తమ ఇంటిలో దిల్దాద్ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ జంట రేపిన చిచ్చు
-
ప్రియురాలు పిలిచింది.. మొత్తం దోచేసింది
బనశంకరి: ప్రేమ అనే పదానికి మచ్చ తెచ్చేలా ఆ ప్రియురాలు వ్యవహరించింది. ప్రియున్ని అపహరించి దోపిడీకి పాల్పడి చివరకు కటకటాల పాలైంది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చయింది. పెనుకొండకు పిలిపించి.. కోరమంగళ పోలీసులు తెలిపిన ప్రకారం... నెల్లూరుకు చెందిన శివ, మోనిక అనే యువతీ యువకులు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు నెల్లూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. శివతో బాగా డబ్బు, బంగారం ఉన్నట్లు భావించిన మోనికలో దుర్బుద్ధి పుట్టింది. అతనిని కిడ్నాప్ చేసి బాగా వసూలు చేయాలని తనకు తెలిసినవారితో కుట్ర పన్నింది. ఆ ప్రకారం 4 రోజుల కిందట శివకు ఫోన్ చేసింది, నిన్ను నా స్నేహితులు చూడాలని, బంగారు నగలు ధరించి ఇన్నోవా కారులో రావాలని ఫోన్లో తెలిపింది. మోనిక మాటలను నమ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇన్నోవా కారులో పుట్టపర్తి జిల్లా హిందూపురం వద్ద పెనుకొండకు వచ్చాడు. అక్కడ మోనిక అనుచరులు శివను కారులోనే అపహరించి బంగారు ఆభరణాలు దోచుకుని పావగడకు తీసుకెళ్లి ఓ హోటల్లో బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివ తన స్నేహితులతో మాట్లాడి తన బ్యాంక్ ఖాతాలోకి రూ.5 లక్షలు జమ చేయించాడు. ఏటీఎం కార్డు తెప్పించి.. డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు లేదు, దీంతో నెల్లూరులో ఇంటి నుంచి బెంగళూరు మెజిస్టిక్ అడ్రస్‌కు కొరియర్ చేయించుకుని శనివారం రాత్రి బెంగళూరులోని కోరమంగలలో నగదు డ్రా చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కిడ్నాపర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. గస్తీలో ఉన్న ఎస్ఐ మాదేశ్ అనుమానంతో వారిని విచారించగా కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు మోనిక, హరీశ్, హరికృష్ణ, నరేశ్, రాజ్‌కుమార్, నరసింహ, అంజనీల్ అనే ఏడుమందిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు కూడా నెల్లూరుకు చెందినవారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. నిందితుల్లో ఇద్దరిపై 5 కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రియురాలే దోపిడీకి సూత్రదారి అని తెలుసుకుని ప్రియుడు షాక్‌కు గురయ్యాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్‌కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుమల: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక యువకుడితో ప్రేమలో పడిన వివాహిత మహిళ.. ముగ్గురు పిల్లలు, భర్తను వదిలి ప్రియుడు సతీష్‌తో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది.తిరుమలకు వెళ్ళే శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గర వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. చివరి నిమిషంలో రాధిక.. భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్త శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి పురుగుల మందు తాగిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు సతీష్ కోలుకుంటున్నాడు వీరిది చిత్తూరులోని బంగారురెడ్డిపల్లెకు చెందిన సతీష్, రాధికగా గుర్తించారు. -
పారిపోయి ప్రేమ పెళ్లి.. యువతి పేరెంట్స్ ఇంటికి పిలిచి..
సాక్షి, హైదరాబాద్: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడలో జరిగింది. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ప్రేమజంట పెళ్లి చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడు.. యువతి కి దూరంగా ఉంటున్నాడు.‘‘మనకు కొడుకు పుట్టాడు.. చూడటానికి అయినా రమ్మని యువతితో ఆమె పేరెంట్స్ బలవంతంగా ఫోన్ చేయించారు. యువతి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన అబ్దుల్ సాహెల్‌ను యువతి కుటుంబ సభ్యులు బంధించి దాడి చేశారు. దీంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్న యువకుడు.. తనపై దాడి చేస్తున్నారని.. కాపాడమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడిని కాపాడిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెద్దలు అడ్డుకుంటారని.. ప్రేమజంట ఆత్మహత్య
కొందుర్గు: వారిద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు అడ్డు చెబుతారని భావించిన ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శ్రీకాంత్(24) షాద్‌నగర్‌లో ఓ కిరాణ షాపులో పని చేస్తున్నాడు. కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మాధవి(16)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అమ్మాయి మైనర్ కావడంతో పాటు ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవచ్చని ఇద్దరూ గత నెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ జంటగా స్వగ్రామానికి గత నెల 30న వచ్చారు. కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తారన్న భయంతో శ్రీకాంత్, మాధవి గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనమేరకు మార్చి 31 హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మాధ«వి మృతి చెందింది. ఈ క్రమంలో మంగళవారం శ్రీకాంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై శ్రీకాంత్ తల్లి లక్ష్మమ్మ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనయ్య తెలిపారు. -
ప్రేమిస్తే.. అంతే! ప్రేయసి పనికి అందరూ అవాక్కు! వైరల్ వీడియో
పిల్లలు ప్రేమించుకుంటారు. అదేదో సినిమాలో అన్నట్టు ‘‘ఈ పెద్దవాళ్లు ఉన్నారే...’’ కారణాలు ఏవైనా పెళ్లికి వ్యతిరేకిస్తారు.. దాదాపు ప్రతీ ప్రేమ కథలోనూ ఈ ట్విస్ట్ ఉంటుంది. కానీ చావనైనా చస్తాను గానీ.. ప్రియుడిని వదిలేది అంటూ పట్టుబట్టిన ఒక ప్రేయసి కథ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్, జముయ్ జిల్లా టెటారియా గ్రామానికి చెందినవర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించు కున్నారు. ఇది తెలిపిన అమ్మాయి తరపు కుటుంబం వీరి ప్రేమను నిరాకరించింది. హడావిడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని చూసి మార్చి 11న పెళ్లి ముహూర్తం నిశ్చయించేశారు. పెళ్లి సన్నాహాలు ఊపందుకున్నాయి. అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో, తెలిసిన వారికి పెళ్లి కార్డులు పంపిణీ చేశారు. ఇక సమయం లేదు మిత్రమా అనుకుందేమో..సరిగ్గా పెళ్లికి ఎనిమిది రోజులు ఉండగా శనివారం రాత్రి వర్ష ఇంట్లోనుంచి పారిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా గుడిలో ప్రియుడు ఉమేష్‌ను పెళ్లాడింది. ఇంతలో కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.వీరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. జముయి జిల్లాలోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధునియామారన్ గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ గ్రామానికి చేరుకుని అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఇక్కడే హై డ్రామా నెలకొంది. #जमुई में तिलक और हल्दी की रस्म के बाद लड़की ने भागकर प्रेमी से शादी रचा ली। शिकायत पर पुलिस ने जब पकड़ा तो दोनों एक दूसरे से लिपट गए। #viralvideo @NavbharatTimes pic.twitter.com/ByfC46eZxp — NBT Bihar (@NBTBihar) March 4, 2024 అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. పెద్ద తోపులాట జరిగింది. అయితే చావనైనా చస్తాను గానీ భర్తను వీడేది లేదంటూ అతడిని గట్టిగా వాటేసుకుంది. ఇద్దరినీ విడదీసేందుకు పోలీసులుఎంత యత్నించినా పట్టువీడలేదు. చివరికి పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ ఆ తరువాత మేజర్లు కావడంతో పోలీసులు కొత్త జంటను ఇంటికి పంపించారు. ఈ సంఘటన బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
రైలే కళ్యాణ వేదిక!
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్–జార్ఖండ్ మూవింగ్ ట్రైన్లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్ ఇండియన్ రైల్వేస్’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్ కుమార్ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్య
బోనకల్/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఐశ్వర్య హైదరాబాద్‌లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే
ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రేమికులు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తూ సరిహద్దులు దాటి మరీ ఏకమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు దేశాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రియురాలు సీమా హైదర్ 'భారత్ జిందాబాద్' అంటూ ఇక్కడ జెండా ఎగురవేస్తే భారత ప్రియురాలు అంజు మాత్రం 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదిస్తూ అక్కడ జెండా ఎగురవేసింది. పంద్రాగస్టు వచ్చిందంటే భారత దేశమంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. 77 ఏళ్ల క్రితం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగానికి దక్కిన ప్రతిఫలం స్వాతంత్య్రం. భారత దేశం తోపాటు పాకిస్తాన్ కూడా ఇదేరోజున స్వాతంత్య్రం జరుపుకుంటోంది. ఇక్కడలాగే అక్కడ కూడా వారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చినా కూడా ఎవరికి వారు విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు. ఆక్కడి వారు ఇక్కడి పతాకాన్ని ఎగరవేయడం కానీ ఇక్కడి వారు అక్కడి పతాకాన్ని కానీ ఎగరెయ్యడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. सीमा हैदर ने सचिन के साथ 15 अगस्त का झंडा लहराया अपने भारत में Visit- https://t.co/EY7ZMmpcrW#SeemaHaider #SachinSeema #IndependenceDay #indep #Newsclick pic.twitter.com/1cD3y0Uf5O — Newsfordays (@Newsforday65988) August 14, 2023 కానీ అలాంటి అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు దేశాంతర ప్రేమికులు సీమా హైదర్, అంజు. నేపాల్ మీదుగా భారత్‌లో అడుగుపెట్టిన సీమా హైదర్ భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేయగా వాఘా బోర్డర్ మీదుగా దాయాది దేశం చేరుకున్న అంజు మాత్రం పాకిస్తాన్లో వారి జాతీయ జెండాను ఆవిష్కరించి కేకును కూడా కట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. अंजू ने मनाया पाकिस्तान की आजादी का जश्न, नसरुल्लाह के साथ काटा केक#anjunasrullah #AnjuNasrullahLoveStory pic.twitter.com/M7of9FScJN — India TV (@indiatvnews) August 14, 2023 ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు..
ఇస్లామాబాద్: ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు నస్రుల్లాను కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్ళిపోయినా భారత మహిళా అంజు అక్కడి సంప్రదాయాలను అలవాటు హెసుకునే క్రమంలో ఫాతిమాగా మారింది. దీంతో అక్కడి వ్యాపారవేత్త మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెపై కానుకల వర్షాన్ని కురిపించారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలంతోపాటు నగదును కూడా కానుకగా ఇచ్చారు. రాజస్థాన్ కు చెందిన అంజు(34) పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా(29) ఒకరినొకరు సోషల్ మీడియాలో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ప్రేమికుడిని కలుసుకునేందుకు అంజు సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ వెళ్లి కథను సుఖాంతం చేసుకుంది. ఒకపక్క ఆమె భర్త ఆమె వివాహం చెల్లదని చెబుతున్నా కూడా ఆమె మాత్రం తన సంప్రదాయాలను మార్చుకుని అక్కడ ఒదిగిపోయే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె అంజు నుండి ఫాతిమాగా మారింది. ఇదిలా ఉండగా ఆమె తెగువకు ఫిదా అయిపోయిన అక్కడి వ్యాపారవేత్త పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి 272 చదరపు గజాల స్థలాన్ని, రూ.50000 నగదును కూడా కానుకగా ఇచ్చారు. ఈ సందర్బంగా అబ్బాసీ మాట్లాడుతూ.. కొత్త ప్రదేశానికి వచ్చినవారికి ఆశ్రయం ఏర్పరచుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే నేను మా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించి ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, నగదును ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అబ్బాసీ అదేవిధంగా సహచర వ్యాపారవేత్తలు, ప్రభుత్వం కూడా వారికి చేయూతనివ్వాలని కోరారు. తమ దేశానికి కొత్తగా వచ్చిన ఫాతిమాకు పాకిస్తాన్ తన సొంత ఇల్లేనన్న భావన కల్పించాలని కోరారు. Anju received 10 Marla housing land,cheque of 50K, & other Gifts, given by Islamabad Based businessman & CEO of Pak Star Group of Companies Mohsin Khan Abbasi. CEO PSG said that, #Anju has converted to Islam and married Nasrullah,so we are welcoming her. #AnjuNasrullahLoveStory pic.twitter.com/22j5CWM9LC — Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 29, 2023 ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత -
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై హగ్‌లతో రెచ్చిపోయిన జంట
ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో వైరల్‌గా మారి పోలీసులకు దొరికినా కొంతమందిలో మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘాజియాబాదద్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. ఇందిరాపురం సమీపంలోని రద్దీగా ఉండే ఎన్‌హెచ్9 రహదారిపై ప్రమాకరంగా లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. చదవండి: బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ ఈ ఘటన జూన్ 20 మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా.. దీనిని అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని, బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు. #गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है । वो कहते है ना - "हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे " पर नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO — Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023 ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF — Gzb Traffic police (@Gzbtrafficpol) June 21, 2023 -
ప్రేమజంట హడావుడి.. గుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆమె సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్. అతను అదే సచివాలయ పరిధిలో వలంటీర్. ఉద్యోగరీత్యా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే భయంతో గ్రామంలోని గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం గుడి తలుపులు మూసేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హడావుడి సృష్టించారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుద్దాలపాలెంకు చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి రెండేళ్ల కిందట సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెకు బుద్దాలపాలెం సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా నాగరాజు గాయత్రిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇరువురికీ వేర్వేరు కులాలు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట హత్య
-
వివాహేతర సంబంధం.. ప్రేమ జంట దారుణ హత్య
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ యువకుడు, వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. అదిలాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుడిహత్నూర్ మండలం సీతగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ప్రేమ జంట విగతజీవులుగా కనిపించారు. మృతులను ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహ్మద్ రఫిక్, అశ్వినిగా గుర్తించారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరీ దారుణానికి పాల్పడింది, హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యం ప్రేమ జంట హత్యలో కీలకమైన ఆదారాలు లభ్యమయ్యాయి. హత్యకు గురైన జంట అంతకుముందు స్కూటీపై బయటకు వెళుతున్న దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. మహ్మమద్ రఫిక్ బైక్ నడుపుతుండగా వివాహిత వెనక కూర్చొని ఉంది. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇద్దరు హత్యకు గురయ్యారు. అదేవిధంగా హత్య చేసిన వాళ్లకు సంబంధించిన అదారాలు కూడా లభ్యమయ్యాయి. కారులో వచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కారు విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. లొంగిపోయిన భర్త! ఇదిలా ఉండగా ప్రేమ జంట హత్య కేసులో అశ్విని భర్త రమేష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. భార్య వివాహేతర సంబంధం నచ్చని కారణంతో ఆమెను, తన ప్రియున్ని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన రఫిక్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు -
బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన తమన్నా..!, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట మాత్రం తమ రిలేషన్‌షిప్‌ని బయటపెట్టడం లేదు. అలా అని దూరంగానూ ఉండటం లేదు. కలిసి తిరుగుతున్నారు. లాంగ్‌డ్రైవ్, డిన్నర్ పార్టీలంటూ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహమేనా లేదా ఇంకేమైనా ఉందా అనే అనుమానం అభిమానులకు కలుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ పార్టీకి వెళ్తూ కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. బయటకు వెళ్లేందుకు కారు దగ్గరకు రాగా.. మీడియా కెమెరాలతో రెడీగా ఉంది. అయినా కూడా ఈ జంట గతంలో మాదిరి ముఖం చాటేయలేదు. హాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. (చదవండి: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్.. ‘మంగళవారం’ ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్) ఈ ఏడాది జరిగిన న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తమన్నా, విజయ్‌ల రిలేషన్షిప్ బయటపడింది. ఈ వేడుకల్లో తమన్నా .. విజయ్‌కి లిప్‌లాక్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తమన్నా మాత్రం అదేం లేదని కొట్టిపారేసింది. కానీ వీరిద్దరి వాలకం చూస్తుంటే రేపో మాపే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్‌తో పాటు రజనీకాంత్ జైలర్ చిత్రంలోనూ నటిస్తోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
నల్గొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
-
ఫేస్బుక్ లవ్‌స్టోరీ.. అన్నవరంలో పెళ్లి చేసుకుని..
నల్లజర్ల(తూర్పుగోదావరి): తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమజంట శనివారం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరుకు చెందిన సంకుల గాయత్రి బీఎస్సీ పూర్తిచేసి మంగళగిరిలోని ఓ కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి నల్లజర్ల మండలం అనంతపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వారిద్దరూ ఫేస్బుక్లో స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గాయత్రికి బయట సంబంధాలు చూస్తున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరేమోనని భావించి వారిద్దరూ శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన గాయత్రి తరఫు పెద్దలు మండిపడి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ గాయత్రి నల్లజర్ల ఎస్ఐ నరసింహమూర్తికి శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇరువురి పెద్దలను పిలచి మాట్లాడతామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో ఇష్టం లేక.. ప్రియుడిని మర్చిపోలేక..
యశవంతపుర(కర్ణాటక): యాదగిరి జిల్లా శహపుర తాలూకాలో ఘోరం జరిగింది. శివరాత్రి పండుగ రోజున ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శహపుర తాలూకా హురసగుండగి గ్రామానికి చెందిన సువర్ణ (20), ఈశప్ప (22)లు ఐదేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. తల్లిదండ్రులు సువర్ణకు రెండేళ్ల క్రితం మరో యువకునికిచ్చి పెళ్లి చేశారు. భర్తతో కలిసి బెంగళూరులో ఉన్న సువర్ణ.. ప్రియున్ని మరువలేకపోయింది. ఇద్దరూ టచ్‌లోనే ఉండేవారు. శివరాత్రి పండుగకు శుక్రవారం హురసగుండిగి వెళ్లింది. శనివారం ఉదయం సువర్ణ, ఈశప్పలు కలిసి జీవితంలో కలిసి జీవించడం సాధ్యం కాదని, కలిసి చనిపోవడమే శరణ్యమని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్ఐ భార్య, కూతురు మృతి -
సినిమాను మించిన లవ్‌స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి..
బంజారాహిల్స్(హైదరాబాద్): విజయవాడ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమజంటను యువతి తల్లిదండ్రులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విజయవాడ సమీపంలోని సూరంపల్లి మాదలవాడీ గూడెంలో నివసించే గంగుల నవీన్ కుమార్ (23), అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని (21) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి పారిపోయి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నవీన్ బంధువు ఇంటికి వచ్చారు. యువతి తల్లిదండ్రులు నవీన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు యూసఫ్‌గూడ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న నవీన్ తన ప్రియురాలిని తీసుకుని మరో చోటకు పారిపోయేందుకు బయటకు రాగా అప్పటికే అక్కడ వేచివున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. నవీన్ అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా అక్కడ గుమిగూడిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమజంటను, తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సోమవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామని ఇక్కడకు వచ్చినట్లు నవీన్ తెలిపారు. తన ప్రియురాలిని బలవంతంగా ఆమె తల్లిదండ్రులు కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది అన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే.. -
Valentine's Day: తీరం చేరిన ప్రేమకథలు.. లవ్, లైఫ్‌లో గెలిచిన జంటలు
సాక్షి , కరీంనగర్: ప్రేమ.. కులమతాలకు అతీతమైన భావన. టీనేజీ వయసులో మొదలయ్యే ప్రేమకథలు ఆకర్షణతో మొదలై.. అక్కడితో ముగుస్తాయి. కానీ, పరిణితితో కూడిన ప్రేమకథలు కచ్చితంగా విజయతీరాలు చేరతాయి. ఒక చేత్తో కెరీర్, మరో చేత్తో ప్రేమను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఖండాలు దాటినా, ఏళ్లకు ఏళ్లు గడిచినా ఎదురుచూపుల్లోనే బతికేస్తారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆ తరువాత పెద్దల్ని ఒప్పిస్తారు. కొందరికి ఈ అవకాశం లేకపోవచ్చు. అయినా వీరు చేరుకున్న విజయతీరాలు, సమాజంలో వీరికి దొరికే స్థానం వీరిపై ఉన్న వ్యతిరేక భావనను క్రమంగా దూరం చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై కథనం. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక మా స్నేహితులతో మా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి్సన అవసరం రాలేదు. అందరినీ ఒప్పించి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య దివ్యాన్షీ కంటి డాక్టర్. ఈ తరం యువతకు నేను చెప్పేది ఒక్కటే.. కెరీర్‌పై దృష్టి పెట్టి లక్ష్యం సాధిస్తే అన్ని మనవద్దకు వచ్చి చేరుతాయి. ఆకర్షణకు గురైతే లైఫ్ ఆగమవుతుంది. – సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్– డాక్టర్ దివ్యాన్షీ దంపతులు ఖండాలు దాటిన ప్రేమ నేను ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నక్రమంలో నాకు రమేశ్ పరిచమయ్యాడు. రోజూ మా కాలేజీకి వచ్చేవాడు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయితే, జీవితంలో పైకి రావాలన్న నా కలను వివరించాను. అయినా తను వెనకడుగు వేయలేదు. నాకు పూర్తిగా సహకరించాడు. ఉన్నత విద్య కోసం నేను బ్రిటన్ వెళ్లాను. పీజీ పూర్తయి ఉద్యోగంలో చేరాక ఇండియా వచ్చాను. నా కోసం ఎదురుచూస్తున్న రమేశ్‌తో వివాహం జరిగింది. కులాలు వేరుకావడంతో మొదట్లో మా పెద్దలు వ్యతిరేకించినా.. కెరీర్లో నిలదొక్కుకున్న తీరుకు మా ప్రేమను అంగీకరించారు. ఇపుడు లండన్‌లో రెండు రెస్టారెంట్లు, ఒక కేక్షాప్ నడుపుతున్నాం. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నం. ఏటా మా ఇద్దరి పిల్లలతో ఇండియాకు వస్తాం. – సుష్మ– రమేశ్ నేనే ప్రపోజ్ చేశా.. ఏదో సందర్భంలో తన ఫ్రెండ్ ప్రశాంత్‌ను పరిచయం చేశారు. ఆ పరిచయమే కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. ధైర్యం చేసి నేనే పెళ్లి ప్రేమను ప్రతిపాదించా. అమ్మానాన్న అంగీకరించలేదు. గొడవలు కూడా అయ్యాయి. సొంతంగా నిర్ణయం తీసుకుని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించి కలిసిపోయారు. ప్రస్తుతం అంతా సంతోషంగానే ఉంది. – లహరి, ప్రశాంత్ అనాథ యువతికి అన్నీ తానై.. కథలాపూర్(వేములవాడ): అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు ఓ సామాజిక సేవకుడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు శేఖర్ షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని అదే గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించాడు. 2013లో శేఖర్, రమ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని ఆమెకు అన్నీ తానయ్యాడు. వీరికి శ్రీహర్ష, రిషికేశ్ ఇద్దరు కుమారులు. శేఖర్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో 2018లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. కులాంతరమే కాదు.. అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్‌ను పలువురు అభినందించారు. ప్రేమ కోసం దేశంలోనే.. మాది మంథని, మా వారిది కరీంనగర్. నేను అపుడు పీజీ చదువుతున్నా. మా ఆయన ప్రభాకర్ అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలిశాం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాం. మాకు ఇపుడు ఒక పాప. మా ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు చివరికి మమ్మల్ని క్షమించేశారు. హైదరాబాద్‌లో ఓ ఇంటి వారిమయ్యాం. విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా మా పేరెంట్స్‌ను చూసుకునేందుకు మా ప్రభాకర్ వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. ఏమాత్రం సెలవు దొరికినా మా పేరెంట్స్‌కే టైం కేటాయిస్తాం. – స్వప్న– ప్రభాకర్ అప్పట్లో చాలా కష్టపడ్డాం నాది జగిత్యాల, ఆమెది కరీంనగర్. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాకు ఎన్సీసీలో పరిచయం. పీజీకి వెళ్లాక కూడా కొనసాగింది. అపుడే ఎస్సై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తనకు దాదాపుగా ఏడాది దూరంగా ఉండి ప్రిపేరయ్యా. ఈ లోపు విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారు. నేను ఎస్సైగా సెలెక్ట్ అయ్యాక మరో ఏడాది దూరంగా ఉన్నాం. పోస్టింగ్ తీసుకున్నాక వెళ్లి వారిని ఒప్పించా. తొలుత వ్యతిరేకించినా... కొన్నిరోజులకు కలిసిపోయాం. ఇపుడు నేను సీఐగా మానుకోటలో విధులు నిర్వహిస్తున్నా. మాకిద్దరు పాపలు. కులాలు వేరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటే అంతా ఆమోదిస్తారు. – సుష్మ– రవిరాజ్ ప్రేమ ముందు ఓడిన వైకల్యం పెద్దపల్లిరూరల్: ‘నా స్వాతి బంగారం.. నేను మరుగుజ్జుగా పుట్టినా నాకు ఆ భగవంతుడు స్వాతి రూపంలో మంచి జీవితాన్నే ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు రవికిరణ్. స్వాతి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి పెద్దపల్లికి వలస వచ్చింది. వారు రవికిరణ్ ఇంటి సమీపంలో అద్దెకు రావడంతో స్వాతితో ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది. స్వాతి కుటుంబీకులు వ్యతిరేకించడంతో అప్పటి సీఐ హబీబ్ఖాన్ను ఆశ్రయించగా ఠాణాలోనే పెళ్లి జరిపించారని రవికిరణ్, స్వాతి పేర్కొన్నారు. వారికి ఓ బాబు, ఇద్దరు కూతుళ్లు జన్మించినా అనారోగ్య కారణాలతో బాబు, ఓ కూతురు చనిపోయారని బాధపడ్డారు. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశాజ్యోతిని తమకున్నంతలో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరుగుజ్జునైన తనకు ప్రభుత్వం నుంచి దివ్యాంగ పింఛన్ అందుతోందని, మెప్మాలో పనిచేసినందుకు మరో నాలుగు వేలతోనే నెట్టుకొస్తునన్నాడు. టీనేజ్ ప్రేమతో సమస్యలు చదువు పూర్తికాకుండానే టీనేజ్‌లో ప్రేమలో పడుతున్న వారు చాలా మంది ఆ తరువాత కాలంలో ప్రేమ, ఆకర్షణ తేడాలు తెలుసుకుని తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా ఇంకొకరు గౌరవించే రీతిలో ప్రేమ ఉండాలి. అంతే కాని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌ల్లో పెడతానని బ్లాక్‌మెయిలింగ్ దిగడం సరికాదు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. – రాజశేఖర్‌రాజు, సీఐ, కోరుట్ల -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్‌లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్‌ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్‌లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్‌కి ట్వింకిల్‌పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్‌లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్‌లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్‌ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్‌లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా తెలియజేసింది. -
Video: రోడ్డుమీద రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్..
ఈ మధ్య కొంతమంది ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కాలంలోఇలాంటి ఘటనలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి చోట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. అజ్మీర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ – నౌసర్ వ్యాలీ రహదారిపై స్పీడ్‌గా వెళ్తున్న బైక్ మీద ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. ఇందులో ఓ యువకుడు ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అంతా చూస్తుండగానే యువతి యువకుడిని కౌగిలించుకుకోవడం, ముద్దు పెట్టడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన అజ్మీర్ పోలీసులు.. వీడియో ఆధారంగా బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైడర్ ఫై సాగర్ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్.. -
బెంగళూరులో మిస్సింగ్, తిరుపతిలో ప్రత్యక్షం
సాక్షి, తిరుపతి: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో పెళ్లిచేసుకుని.. తిరుగు ప్రయాణంలో తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో బుధవారం అనంతపురం వెళ్లేందుకు ప్లాట్‌ఫాం వద్ద ఉండగా ఆర్టీసీ సెక్యూరిటీకి అనుమానంగా కనిపించింది. దీంతో వారు ఆ జంటను విచారించారు. తాము వివాహం చేసుకున్నట్లు చెప్పడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులు బెంగళూరు సిటీలోని కోణనకుంటె పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టినట్లు తెలుసుకున్నారు. బాలిక వయస్సు 15, యువకుని వయస్సు 21గా వెల్లడించారు. ఈస్ట్ పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (వ్యభిచారగృహం నిర్వహిస్తున్న సినీ నటుడి అరెస్ట్) -
ఇంటి నుంచి పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని.. రైలుపట్టాలపై..
సాక్షి, యశవంతపుర: బెంగళూరు చిక్కబాణవార సమీపంలోని హుస్కూరు గ్రామం వద్ద ప్రేమ జంట రైలు కింద పడి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతుడు నాగేంద్ర (21) కాగా, యువతి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఇద్దరూ ఇళ్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకొన్నారు. చిక్కబాణవార–గొల్లహళ్లి రైల్వేస్టేషన్ల మధ్య హుస్కూరు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై ఇద్దరి శవాలను రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యశవంతపుర పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం
మైసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... మైసూరు తాలూకా శాదనహళ్లి గ్రామానికి చెందిన శివకుమార్ (29), కవిత (25) ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీరంగ పట్టణంలోని మేగరళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం కేఆర్ఎస్ సమీపంలో ఉన్న వరుణ కాలువ కట్ట వద్ద కూర్చొని కవిత బట్టలు ఉతుకుతుండగా కాలువలోకి జారి పడింది. అక్కడే ఉన్న శివకుమార్ కాలువలో దూకి ఆమెను కాపాడే యత్నంలో అతను కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మూడు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి.. ఎలుకలమందు తీసుకున్న ప్రేమజంట
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తల్లిదండ్రులు విడదీస్తారేమోనన్న భయంతో ప్రేమజంట విషం తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సూలగిరి సమీపంలో చోటు చేసుకుంది. వీరిలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం పోలార్ జిల్లా వేమక్కల్ ప్రాంతానికి చెందిన ఆనందన్ కుమార్తె అనుశ్రీ (14) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఉన్న ఏరాండాపల్లి గ్రామానికి చెందిన సౌందరరాజ్ (22)కు బంధువు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకం తెలిపారు. ఈ క్రమంలో మూడుసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రేమజంటను తల్లి దండ్రులు, బంధువులు తిరిగి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నాలుగోసారి సౌందరరాజ్, అనుశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయమై ఆనందన్ వేమక్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను సౌందరరాజ్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమో దు చేసి, ప్రేమ జంట కోసం గాలించారు. ఈ సంగతి తెలుసుకున్న సౌందరరాజు, అనుశ్రీ తమను తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించి, ఎలుకల మందు పేస్టు తీసుకుని తిని, సూలగిరి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు గుర్తించి, వారిని కృష్ణగిరి ప్రభుత్పాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుశ్రీ బుధవారం మృతి చెందింది. సౌందరరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సూలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ శవ రాజకీయం.. తాము బతికే ఉన్నామంటూ ప్రేమజంట వీడియో.. చివరికి అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారలేమి.. ప్రజల మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎలాగైనా అధికారపార్టీ వైఎస్సార్సీపీపై నిందలుమోపి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని నానాయాగీ చేస్తున్నారు. ఇలాంటిదే శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఆరు రోజుల క్రితం కేవీబీపురం మండలంలో దొరికిన ఓ మహిళ మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని శవరాజకీయాలకు తెరలేపారు. చదవండి: వామ్మో చినబాబు.. ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది..! ఎప్పుడో జనవరిలో ఊరు విడిచివెళ్లిన ఓ ప్రేమికురాలిదే ఆ శవమంటూ రాద్ధాంతం సృష్టించారు. ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తిట్ల దండకం అందుకున్నారు. వరుసగా ఆందోళనలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో ఆదివారం తాము బతికే ఉన్నామంటూ సదరు ప్రేమజంట వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది. కావాలనే పనిగట్టుకుని రాద్ధాంతం చేసినట్టు తేటతెల్లమైంది. టీడీపీ మరింత అభాసుపాలైంది. బతికి ఉన్న వాళ్లను కూడా చంపేశారంటూ ఒక శవాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి టీడీపీ, జనసేన నాయకులు ఆందోళనకు దిగి, ఘోరమైన రీతిలో అభాసుపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాళహస్తిలో కలకలంరేపుతోంది. అసలేం జరిగిందంటే స్థానికుల కథనం మేరకు, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలంలోని రామాపురానికి చెందిన బత్తెమ్మ అలియాస్ లలితను తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె చంద్రిత అమ్మమ్మ గ్రామమైన రామాపురానికి అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేది. రామాపురం అరుంధతివాడకు చెందిన చంద్రశేఖర్ (గ్రామ వలంటీర్)తో పరిచయమేర్పడింది. ఇతనికి ఇదివరకే పెళ్లై ఒక బిడ్డకూడా ఉన్నాడు. 2021లో చంద్రశేఖర్, చంద్రిత గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు రోజుల్లోనే ఆ జంటను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించిన రోజునే చంద్రశేఖర్‌ను వలంటీర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చంద్రితను వారి బంధువుల గ్రామమైన దొరవారి సత్రంలో ఉంచారు. అక్కడే మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకు ఆ యువకుడు చంద్రితకు సెల్‌ఫోన్ తీసి ఇచ్చాడు. దీంతో ఆ సెల్‌ఫోన్ ద్వారా ప్రియుడు చంద్రశేఖర్‌కు అప్పుడప్పుడూ ఫోన్ చేసేది. 2022 జనవరి 11న మళ్లీ ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన రోజు మళ్లీ పోలీసులకు ఇరువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ నెల 20న కేవీబీపురం మండల పరిధిలోని తెలుగుగంగకాలువలో ఓ యువతి మృతదేహం లభించింది. ఆ మృతదేహం చంద్రితదే అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఆ యువతిని వైఎస్సార్సీపీ వారే హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని ప్రచారం చేశారు. అందులో భాగంగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి అండ్‌కో చంద్రిత తల్లిదండ్రులను ప్రలోభపెట్టి రాజకీయాలకు వాడుకున్నారు. దీంతో టీడీపీ ప్రలోభాలకు లొంగిన చంద్రిత తల్లిదండ్రులు వైఎస్సార్సీపీపై నిందలు వేశారు. వారం రోజులుగా ఈ శవరాజకీయాలతో ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు. ఇదే అదనుగా ఎల్లో మీడియా కూడా రెచ్చిపోయింది. అయితే పోలీసులు పుట్టుమచ్చలు చెప్పమని కోరగా, వారు చెప్పిన పుట్టుమచ్చలకు మృతదేహానికి ఉండే పుట్టుమచ్చలకు పొంతన లేకపోవడంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. నేను బతికే ఉన్నా ఈ తంతు ఇలా సాగుతుండగా, వెళ్లిపోయిన ప్రేమ జంట తమను ఎవరూ చంపలేదని, తాము బతికే ఉన్నామంటూ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. తొందరలోనే గ్రామానికి చేరుకుంటామని వారు వీడియో ద్వారా తెలిపారు. దీంతో వాస్తవాలు తెలుసుకోకుండా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. టీడీపీ నాటకానికి తెరపడింది గత వారం రోజులుగా టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకానికి తెరపడిందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నియోజకవర్గ ఇన్చార్జి గాదిపాకుల కిరణ్ అన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ప్రజాదరణ మెండుగా ఉండడంతో, బొజ్జల సు«దీర్‌రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. అయితే కాలువలో దొరికిన యువతి శవం ఎవరిదో, అందులో టీడీపీ పాత్ర ఏమిటో పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని తేల్చాలని అన్నారు. వారం రోజులుగా వైఎస్సార్ సీపీపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ధర్మం గెలిచింది చంద్రిత తల్లిదండ్రులకు రూ.5లక్షలు ఇచ్చి ప్రలోభపెట్టానని బొజ్జల సుదీర్‌రెడ్డి ఆరోపించారు. అయితే చంద్రిత బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు తల్లిదండ్రుల చేత చెప్పించడం అత్యంత దుర్మార్గం. రెండు రోజులు ముందు టీడీపీ నేత సంపత్ ఆత్మహత్య చేసుకుంటే, వైఎస్సార్సీపీ నాయకులే చంపేశారంటూ ప్రచారం చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి అతని చావుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. అయినా ఆగకుండా యాదవ సంఘంతో సంప్రదించి ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్కిట్ కళాశాల పతనానికి టీడీపీ కారణమైతే మూసేశారంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరికి ధర్మం గెలిచింది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రజల సమస్యలపై పోరాడాలి. – అంజూరు తారక శ్రీనివాసులు, చైర్మన్, శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి -
పెళ్లి వరకు వెళ్లని ప్రేమ..కారణాలు ఎన్నో!
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమ నేటి యువతకు పరిచయం అక్కర్లేని పదం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక ఆలోచించే పరపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేక , ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం లేక ప్రియుడు లేదా ప్రియురాలు నిరాకరించడంతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించి వారిలో స్నేహభావం పెంపొందిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల ప్రభావంతో.. సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్ కాల్, వీడియో కాల్‌తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం యువతపై పడుతుంది. తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగితే...: ప్రతి మనిషికి స్నేహితుడి తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. అమ్మా, నాన్నలు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. వారికి కలిగే చిన్నచిన్న సమస్యలను మొదలుకుని ప్రేమ వ్యవహారాల్లో సైతం స్నేహితుడి పాత్ర పోషించాలి. పెద్దలకు తెలియకుండానే ఏమనుకుంటారనో, ఏమైన చేస్తారనేమో భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ఘటనలు: ► బెల్లంపల్లి పట్టణం షంషీర్‌నగర్‌కు చెందిన సోయం తేజశ్రీ నెన్నెల లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్‌కుమార్ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఏం చేయాలో తోచక తేజశ్రీ దసరా పండుగ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ►కుశ్నపల్లికి చెందిన జాడి రవి అనే యువకుడు వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన సత్యశ్రీ అనే ప్రియురాలి మరణవార్త విని నీవు లేనిదే జీవితం వ్యర్థమని భావించి మనస్థాపం చెంది ఈ ఏడాది ఫిబ్రవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఈగం మౌనిక ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్థాపం చెంది 2021, అక్టోబర్ 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ►బెల్లంపల్లి పట్టణానికి చెందిన సాజీద్ యశ్వంతిక ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో 2021 అక్టోబర్ 23న జైపూర్ శివారు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ►భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన దొబ్బల కల్పన అనే డిగ్రీ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన కోట మల్లేశ్ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రియుడు నిరాకరించడంతో మనస్తాపం చెంది 2021 డిసెంబర్ 26న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్, టీచర్లు గమనిస్తూ ఉండాలి పిల్లల ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులు, బ డిలో టీచర్లు గమనిస్తూ ఉండాలి. పిల్ల లు తప్పు చేస్తే కొట్ట డం, తిట్టడం చేయకుండా ఓపికతో మాట్లాడి నచ్చజెప్పాలి. యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ చెడు చేస్తే సా మరస్యంగా సమస్యను పరిష్కరించాలి. ప్రే మించుకున్న యువత మొదట తల్లిదండ్రుల మనస్సు గెలుచుకోవాలి. ప్రేమించడంతోపా టు యోగ్యతను సంపాదించాలి. కులం కన్నా ఆర్థిక స్థిరత్వం ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వీలు ఉంటుంది. అనుకున్నది జరగకపోతే తట్టుకునే శక్తి యువతకు ఉండకపోవడంతోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. – డాక్టర్ సునిల్‌కుమార్, మానసిక వైద్య నిపుణులు, మంచిర్యాల చట్టాలను ఉపయోగించుకోవాలి చట్టాన్ని ఉపయోగించుకొని హక్కులను సాధించుకోవాలి. పిరి కితనంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఆటలకు దూరం కావడం కూడా ఒక కారణం. ఆటలు ఆడటం ద్వారా గెలుపు, ఓటములను తట్టుకునే శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచడం ద్వారా ఏది అడిగిన ఇస్తారులే అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. బతకడానికి ఎన్నో మార్గాలు, చావడానికి ఒకటే మార్గం. ధైర్యంగా ఉండి ముందుకు నడవాలి. – రాజశేఖర్, ఎస్సై(నెన్నెల) -
పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి..
సాక్షి, మంత్రాలయం రూరల్: మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. నిద్రమాత్రల పొడి తాగి ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించగా వ్యక్తి మృతి చెందాడు. మహిళ చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏరేడు మండలం ఉల్వలపాడు గ్రామానికి చెందిన వేణు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విష్ణుప్రియ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. బుధవారం రాత్రి కారులో మంత్రాలయం చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వెంట తెచ్చుకున్న నిద్రమాత్రల పొడిని నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గురువారం ఉదయం విష్ణుప్రియ అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. అక్కడ పడిఉన్న వేణు (32)ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుప్రియను 108 ద్వారా ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. వేణు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య సాయిప్రతిష, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విష్ణుప్రియ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని దర్శి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై విచారణలో ఉంది. ఈ మేరకు దర్శి పోలీసుల సమక్షంలో విష్ణుప్రియను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: (డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు) -
ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు మృతి
సాక్షి, చెన్నై: ప్రియురాలితో కలిసి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు ప్రాంతానికి చెందిన కుప్పన్ కుమారుడు శాంతకుమార్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమ వ్యవహరం తెలిసి ఇరు కుటుంబీకులు ఇటీవల నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి శాంతకుమార్ శనివారం రాత్రి ఈకాడులోని బంధువుల ఇంటికి బైక్‌లో బయలుదేరాడు. తిరువళ్లూరు సమీపంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తిరువళ్లూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుప్పన్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!) -
సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్‌కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది. ‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్లో రాసి సూసైడ్ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్‌తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య) మిస్సింగ్ కేసుతో వెలుగులోకి.. దివ్య రాసిన సూసైడ్ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
మైలార్‌దేవ్‌పల్లి: తమ ప్రేమకు అడ్డు చెప్పారని భావించిన ఓ ప్రేమ జంట అర్థాంతరంగా తనువు చాలించారు. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురై గురువారం ఒకే తాడుకు ఉరి వేసుకొని తనువులను చాలించారు. అమ్మాయి 17 ఏళ్ల మైనర్ బాలిక. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ్మ, ఎస్సై రోహిత్ తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇరు కుటుంబాలు మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్ కర్నూల్ రోడ్డు సమీపంలో ఉన్న నేతాజీనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిటికెల నారాయణ స్థానికంగా నివాసం ఏర్పర్చుకోని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. నారాయణ కుమార్తె అనూషా ఇటీవలనే ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసింది. వెయ్యి మార్కులకు గాను 990 మార్కులతో రాష్ట్రస్థాయిలో నిలిచింది. వీరి ఇంటి సమీపంలోనే ఆటో డ్రైవర్ రవి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అనూషా, రవికుమార్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్దలు మందలించారు. దీంతో రవి కుటుంబసభ్యులు ఇతర ప్రాంతానికి మకాం మార్చారు. శంషాబాద్‌లో తల్లితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైన రవి నేతాజీనగర్‌లో ఉన్న పాత ఇంటికి వచ్చాడు. అనూషాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి గురువారం తెల్లవారుజామున ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇద్దరిని బలితీసుకున్న ప్రేమ వ్యవహారం
సాక్షి, నారాయణపేట: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. భయంతో యువకుడు సైతం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో నివాసం ఉండే పోతిరెడ్డిపల్లికి చెందిన పావని(18) హైదరాబాద్‌లో చదువుతుండగా.. కోస్గికి చెందిన నరేందర్ (19) స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఈ మధ్యనే తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఈ నెల 7న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కాగా, నరేందర్ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన పావని అదేరోజు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను పాలమూరు జనరల్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అప్పటికే భయంతో ఉన్న నరేందర్ సైతం శనివారం ఉదయమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మహబూబ్‌నగర్‌కు వెళ్లి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. చదవండి: (ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..) -
తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..
సాక్షి, చిత్తూరు(పిచ్చాటూరు): ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అడవికొడియంబేడు సమీపంలో అరుణానది ఒడ్డున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, ఏఏడబ్ల్యూకు చెందిన మార్కండేయ, గోవిందమ్మ దంపతుల కుమారుడు గుర్రప్ప(22), పక్క గ్రామమైన అడవిశంకరపురం దళితవాడకు చెందిన నాదముని, అంకమ్మ దంపతుల కుమార్తె పల్లవి (18) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెలిసి, పెళ్లికి నిరాకరించారు. దీంతోపాటు గత ఏడాది పల్లవికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. అయితే బాల్య వివాహం చేస్తున్నారంటూ గుర్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది ఆగిపోయింది. ఈ క్రమంలో పల్లవి మేజర్ కావడంతో సోమవారం సాయంత్రం గుర్రప్ప, పల్లవి ఇంటి నుంచి వెళ్లిపోయారు. బుధవారం సాయంత్రం అడవికొడియంబేడు నుంచి అరుణానది ఇసుక రీచ్‌కు వెళ్లే దారిలో శ్మశానం వద్ద ఇరువురూ ఉరేసుకొని మృతి చెందారు. దీన్ని పశువుల కాపరులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పుత్తూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: ప్రియుడితో కలిసి భార్యే హతమార్చింది) రెండు కుటుంబాలు కూలితోనే జీవనం: ఆత్మహత్యకు పాల్పడ్డ గుర్రప్ప, పల్లవి కుటుంబాలకు కూలి పనులే ఆధారం. పల్లవి పులికుండ్రంలో పదవ తరగతి.. ఆ తర్వాత నాగలాపురంలో గత ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పదో తరగతి చదువుకోవడానికి పులికుండ్రం జెడ్పీ హైస్కూల్‌కు వచ్చే సమయంలో మార్గమధ్యంలో ఉన్న అడవికొడియంబేడు ఏఏడబ్ల్యూకు చెందిన గుర్రప్పతో పరిచయం, ప్రేమగా మారింది. గుర్రప్ప 10వ తరగతి పూర్తి చేసి డప్పులు వాయించడంతో పాటు కూలి పని చేస్తున్నాడు. రెండు కుటుంబాలకు తీరని శోకం: మార్కండేయ, గోవిందమ్మ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు సంతానం. కూతురు గతంలోనే మరణించగా, కుమారుడు ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా నాదముని, అంకమ్మ దంపతులకు ఒక కూతురు, కొడుకు సంతానం. కొడుకు గత నెలలో మరణించగా, కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇలా రెండు కుటుంబాల్లోని తల్లిదండ్రులు కన్న బిడ్డలను పోగొట్టుకుని తీరని శోకంలో మునిగిపోయారు. -
Dhone: ఆలంకొండలో విషాదం
డోన్ (నంద్యాల): ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయస్సు వారిది. సినిమాల ప్రభావంతోనో, సామాజిక మాధ్యమాల్లో అతి స్పందనలతోనో.. మరే కారణంతోనో ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అడ్డుచెప్పారు. అబ్బాయికి బలవంతంగా అక్కకూతురుతో పెళ్లి చేశారు. తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు తెలియక మనస్తాపం చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ మాదులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బోయ ప్రసాద్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లింగమ్మ దంపతుల కుమార్తె అనిత (16) పదో తరగతి పూర్తి చేసింది. వీరిరువురూ రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. బోయ ప్రసాద్‌కు రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు మంగళవారం రాత్రి వారివారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి డోన్ మండల పరిధిలోని మల్యాల గ్రామం సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌మెన్ సుధాకర్ మృతదేహాలను చూసి మల్యాల స్టేషన్ మేనేజర్ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి వెల్దుర్తి సీఐ యుగంధర్, సీఆర్పీఎఫ్ పోలీస్ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆలంకొండలో విషాద ఛాయలు కృష్ణగిరి: ప్రేమజంట గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆలంకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలభై రోజుల క్రితం ఈతకెళ్లి నలుగురు చిన్నారులు కరెంట్‌షాక్‌తో మృతి చెందారు. అదే రోజు బోయ ప్రసాద్ తన అక్క కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మరో అమ్మాయితో కలిసి ప్రసాద్ రైలు కిందపడి మృతి చెందడం అందరినీ కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా బందోబస్తు మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
రాజాం అబ్బాయి.. అమెరికా అమ్మాయి
రాజాం సిటీ: వారి ప్రేమకు హద్దుల్లేవు. ఎల్లలు దాటిన వారి ప్రేమను ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో పండించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజాంలోని ఓ ప్రైవేట్ కల్యాణమంటపంలో ఆ ప్రేమ జంటకు వివాహం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని కూరాకులవీధికి చెందిన కందుల కిరణ్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడే బీబీఏ చదువుతున్న మోర్గాన్ బ్రింక్ (మహిగా ఇక్కడ మార్చిన పేరు)తో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. ఇద్దరూ చదువుల అనంతరం మిచిగాన్ రాష్ట్రంలో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారి ప్రేమగా విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలియజేశారు. తొలుత అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ కొన్నాళ్ల తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ముందుగా అమెరికాలో వారి సంప్రదాయం ప్రకారం ఆ ప్రేమ జంట వివాహం జరిగింది. భారతీయ సంప్రదాయం ప్రాకారం వివాహం చేసుకోవాలనే అమ్మాయి కోరిక మేరకు రాజాం పట్టణంలో వివాహం చేసుకోవాలని నిశ్చయించినప్పటికీ కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇన్నాళ్లకు ముహూర్తం ఖరారు చేసుకుని రాజాంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అమ్మాయిఒ తల్లిదండ్రులు టీనా బ్రింక్, ఎరిక్ బ్రింక్, అబ్బాయి తండ్రి కందుల కామరాజు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. చదవండి: (Visakhapatnam: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
బాపట్లలో ప్రేమ జంట ఆత్మహత్య!.. రాత్రికిరాత్రే
బాపట్ల: పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలకలం రేపుతోంది. బలవన్మరణానికి కారణాలు తెలియరావడం లేదు. ఘటనను పోలీసులూ నిర్ధారించడం లేదు. దీనిపై సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు హల్చల్ చేస్తున్నాయి. సేకరించిన సమాచారం మేరకు కర్లపాలెం మండలం చింతాయలపాలెంకు చెందిన యువకుడు, బాపట్లకు చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సోమవారం అర్ధరాత్రి దాటాక మూర్తిరక్షణ నగర్ రైల్వేగేట్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాలను బంధువులు వెంటనే తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని రాత్రికిరాత్రే ఖననం చేసేసినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున విషయం సోషల్ మీడియాలో రావడంతో కర్లపాలెం పోలీసులు చింతాయపాలెంలోని యువకుడి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదు చేసేందుకు అతడి తల్లిదండ్రులు ముందుకు రాలేదు. మంగళవారం మధ్యా హ్నం అతడి మృతదేహాన్నీ ఖననం చేసినట్టు సమాచారం. దీనిపై బాపట్ల రైల్వే పోలీసులను వివరణ కోరగా ఏమీ తెలియదని చెప్పారు. వాస్తవానికి రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య జరిగితే వారే కేసు విచారణ చేయాలి. చదవండి: (పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం) -
డ్యాన్స్ ఈవెంట్లు చేస్తూ జీవనం.. స్పందనతో పరిచయమై..
చిల్లకూరు (చిత్తూరు): సార్ మీరే మాకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట గురువారం చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు..మండలంలోని తీర ప్రాంత గ్రామామైన తమ్మినపట్నం గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు డ్యాన్స్ ఈవెంట్లు చేస్తూ జీవనం చేస్తున్నాడు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందన అనే యువతి పరిచయమైంది. ఇరువురు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో తమ ప్రేమ విషయం తెలియజేశారు. అయితే యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక, పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో యువతి ఇంటి నుంచి నేరుగా ప్రశాంత్ ఉండే ప్రాంతానికి వచ్చి విషయం తెలియజేసింది. ఇరువురు గ్రామ సమీపంలోని ఆలయంలో వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్ఐ సుధాకర్‌రెడ్డి యువకుని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఇద్దరు మేజర్లు అని వారిని ఇబ్బంది పెట్టొద్దని సర్దిచెప్పి పంపారు. యువతి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: (Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి) -
ఏలూరు జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి
-
ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగింది. యువతి తండ్రి, తమ్ముడు దాడికి పాల్పడ్డారు. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రాత్రి యువతి తండ్రి, తమ్ముడు సాంబశివరావు చెవి కొరికి, కర్రలతో దాడి చేశారు. దీంతో సాంబశివరావు, పావని ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (చంద్రబాబును, ఆయన కొడుకుని ప్రజలు బాదేశారు: మంత్రి అంబటి) -
మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. ప్రేమజంట..
కలువాయి (నెల్లూరు జిల్లా): ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. మండలంలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం మేరకు.. స్థానిక గిరిజన కాలనీకి చెందిన మానికల వెంకటయ్య (19) తల్లిదండ్రులు చనిపోవడంతో తన అన్న చంద్రయ్య, వదిన ముత్యాలమ్మ సంరక్షణలో ఉండేవాడు. అదే కాలనీకి చెందిన నాగముంతల తులసయ్య, పోలమ్మల కుమార్తె నాగముంతల తులసీ (16) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తాము పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించరని వారు భావించారు. మూడురోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటినుంచి రెండు కుటుంబాలు వారి కోసం గాలిస్తున్నాయి. శుక్రవారం కలువాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గొర్రెలకాపరులు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో గుళికల మందు లభించింది. దీంతో వారు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో కలువాయి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, కలువాయి ఎస్సై ప్రభాకర్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..) -
పాపం ఆ ప్రేమజంట.. ఆనందంగా గడిపి.. అంతలోనే..
తాడిమర్రి(అనంతపురం జిల్లా): దాడితోట గ్రామ సమీపాన చిత్రావతి నదిలో శుక్రవారం సాయంత్రం ప్రేమజంట గల్లంతయ్యింది. ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామానికి చెందిన ఎర్రి నాగప్ప, నాగేశమ్మ దంపతుల మూడో కుమారుడు అమర్నాథ్ (22) అనంతపురం, తాడిపత్రిలో సెంట్రింగ్ పనులు చేస్తుండేవాడు. అతనితో పాటు సెంట్రింగ్ పనులు చేస్తున్న దాడితోటకు చెందిన పశురాంతో పరిచయమైంది. ఈ క్రమంలో అనంతపురం నగరంలోని ప్రకాష్ రోడ్డుకు చెందిన ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రామాంజినమ్మ (20)తో అమర్నాథ్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. చదవండి: కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని.. వేటకొడవలితో ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం ఉదయం దాడితోటలోని పరుశురామ్ ఇంటికి వెళ్లారు. నాలుగు రోజులుగా సీబీఆర్‌లో ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నదిలో నీటిని చూడటానికి ముగ్గురూ కలసి చిత్రావతిలోకి వెళ్లారు. అక్కడ నీటిని చూస్తూ సెల్ఫీలు.. తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో నీరు తాగడానికని రామాంజినమ్మ నదిలోకి వెళ్లింది. నీరు తాగుతున్నపుడు కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అమర్నాథ్ రక్షించేందుకు దూకాడు. ఇద్దరు భయాందోళనకు గురై ఒకరిని ఒకరు పట్టుకుని నీటి ఉధృతిలో కనిపించకుండాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లారు. ముందుగా సీబీఆర్ నుంచి వస్తున్న నీటిని బంద్ చేయించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
విడదీయాలని చూస్తున్న జ్యోతుల నెహ్రు: ప్రేమజంట
-
'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు. చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?) తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్ కత్తి పద్మ అన్నారు. ఈ విషయంపై అపర్ణను సంప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్ మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. -
అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?
సాక్షి, మెదక్: కలిసి జీవించాలని భావించిన వారికి సామాజిక వర్గాలు, వయసులో ఉన్న వ్యత్యాసం అడ్డుపడ్డాయి. దీంతో కలిసి జీవించలేని జీవితంపై విరక్తి పుట్టి బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 5వ తేదీన కనిపించకుండా పోయిన ప్రేమజంట మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రలో మునిగిపోయాయి. పోలీసుల కథనం మేరకు.. నాగిలిగిద్ద మండలం మాయినెళ్లి గ్రామానికి చెందిన అనిల్ (25)సంగారెడ్డిలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన కష్ణవేణి (28)లు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామని ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. అయితే వీరి సామాజిక వర్గాలు, వయసులో వ్యత్యాసం ఉండడంతో ఇరు కటుంబాల పెద్దలు వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో జనవరి 5న కష్ణవేణి, అనిల్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తల్లికి వీడియో కాల్ చేసి..) ఈ నేపథ్యంలో రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై వంతెన వద్ద ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిచి ఉండటాన్ని పలువురు గుర్తించి రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించారు. బైక్ నెంబర్ ఆధారంగా సంగారెడ్డిలో తప్పిపోయిన వారు వినియోగించిన బైక్‌గా గుర్తించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ మృతదేహాన్ని కుటుంబీకుల సాయంతో కృష్ణవేణిదిగా గుర్తించారు. శనివారం ఉదయం మరో మృతదేహం కొట్టుకురాగా అనిల్‌గా గుర్తించారు. మృతదేహాలను సంగారెడ్డి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. -
ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి.. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని..
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమజంట మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వివరాలు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్టకు చెందిన కిరణ్(23), రూరల్ మండలం అంకిశెట్టిపల్లె కుసుమ(22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి వివాహానికి అంగీకరించలేదు. దీంతో సోమవారం ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు. స్పందించిన ఎస్పీ కార్యాలయం సిబ్బంది మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. -
పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..
సాక్షి, రాయగడ: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సొండి వీధిలో మంగళవారం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అనంత నారాయణ మహంతి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. అనంతరం యువతీ, యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సొండి వీధికి చెందిన స్వాతి పాత్రో(15), అదే వీధికి చెందిన రాహుల్ కౌసల్య(26) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్‌కు ఇదివరకే పెళ్లయి, ఓ కొడుకు ఉండగా, 5 నెలల క్రితం నుంచి అతడి భార్య, కొడుకు గుణుపూర్‌లోని తన అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రాహుల్ స్వాతితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఒకరిపై మరొకరు మరింత ఇష్టం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయినా పెళ్లయిన వ్యక్తికి మళ్లీ అమ్మాయిని ఎలా ఇచ్చి, పెళ్లి చేస్తారని అనుకున్న వారు చనిపోయేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. ఎప్పటిలాగే ఉదయం ట్యూషన్‌కి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు ట్యూషన్ మాస్టారు ఇంటికి వెళ్లి, తమ కూతురు ఆచూకీ కోసం అడిగారు. ఈరోజు తను ట్యూషన్‌కు రాలేదని మాస్టారు చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సమాచారం మేరకు అదే వీధిలోని రాహుల్ ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న స్వాతి, రాహుల్ కనిపించారు. అప్పటికే చనిపోయిన స్వాతిని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొనఊపిరితో ఉన్న రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యపై దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) -
భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..
సాక్షి, ఏలూరు టౌన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో ఓ యువతి మరణించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడు ఆ తరువాత తాముంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు బీడీ కాలనీలో శనివారం వేకువ జామున ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీడీ కాలనీ గట్టు ప్రాంతంలో నివాసముంటున్న లక్కపాము సుధారాణి(22), తాడి డింపుల్‌కుమార్ (23) ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సుధారాణి భర్త సాయిప్రభు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సాయిప్రభు రెండేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకోవటంతో సుధారాణి అతడిని విడిచిపెట్టి అదే ప్రాంతంలో ఉంటున్న డింపుల్‌కుమార్‌కు దగ్గరైంది. వీరికి కూడా ఓ పాప పుట్టింది. చదవండి: (రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి) సుధారాణి మొదటి భర్త సంతానాన్ని ఆమె తల్లి వద్ద ఉంచి పెంచుతోంది. వీరిద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన ఇద్దరూ రాత్రి వేళ మద్యం తాగి తిరుగుతుంటారు. శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వీరిద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటి సమీపంలో మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో పడిపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. సుధారాణి తలకు తీవ్రగాయాలు కావటంతో ఘటనా స్థలంలోనే మరణించింది. ఆమె మృతితో భ యపడిన డింపుల్‌కుమార్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి సమీపంలోని తమ ఇంటికి వెళ్లి వెనుకవైపు నుంచి లోపలకు ప్రవేశించి ఫ్యా నుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) శనివారం వేకువ జామున సుధారాణిని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఆమె ఆధార్ కార్డ్ తీసుకుని ఇచ్చేందుకు సుధారాణి ఇంటికెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో తాళం పగులగొట్టి వెళ్లగా డింపుల్ ఉరేసుకుని ఉండటాన్ని గమనించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రూరల్ ఎస్సై లక్ష్మణబాబు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వాదన మరోలా ఉంది. వీరిద్దరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, సుధారాణిని డింపుల్‌కుమార్ హత్యచేసి తరువాత భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. -
ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..'
సాక్షి, జయపురం (ఒడిశా): పరస్పరం ప్రేమించుకొని, పెద్దల కాదనడంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంటను ఒక్కటి చేశారు.. జయపురం మహిళా పోలీసులు. పెళ్లి పెద్దలుగా ఇరువురి కుటుంబాలను ఒప్పించి, స్థానిక బస్టాండ్ సమీపంలోని మందిరంలో బుధవారం వారి వివాహం జరిపించారు. జయపురం మహిళా పోలీసు స్టేషన్ అధికారి మమతా పాణిగ్రహి తెలిపిన వివరాల ప్రకారం... కందులగుడ గ్రామానికి చెందిన కృష్ణమాలి కుమార్తె గాయిత్రీ, కుంద్రా సమితి పుప్పుగాం పంచాయతీ జబాపాత్రోపుట్ గ్రామానికి చెందిన లోక్‌నాథ్ కందిలియా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ఎవరికీ చెప్పకుండా ఇరువురూ పరారయ్యారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) తన కుమార్తెను లోక్‌నాథ్ ఎత్తుకు పోయాడని యువతి తండ్రి జయపురం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు జరిపి, జబాపాత్రోపుట్‌లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని వారు తెలుపగా.. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులే పెళ్లి పెద్దలుగా మారారు. ఇరువైపులా కుటుంబాలను పిలిచి, పరిస్థితి వివరించడంతో వారంతా సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఉభయలకు మందిరంలో వివాహం జరిపించారు. వివాహం సమయంలో గాయత్రీ తండ్రి కృష్ణమాలి, తల్లి తులామాలి, లోక్‌నాథ్ తండ్రి వంశీధర కందలియా, తల్లి రాధామణి, బంధువులు, గ్రామపెద్దలు పాల్గున్నారు. వివాహం జరిపించిన పోలీసు అధికారులను ప్రశంసించారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) -
ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..
-
ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..
సాక్షి, ఒంగోలు/చందానగర్: కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించరని మనస్తాపం చెందిన ప్రేమజంట హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి మృతిచెందగా, గాయాలైన యువకుడు భయపడి ఒంగోలు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. యువకుడు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాలకు చెందిన గాదె కోటిరెడ్డి ఒంగోలులోని జిమ్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒంగోలు మండలం కరవది ప్రాంతానికి చెందిన జి.నాగచైతన్యతో (జిమ్స్‌లోనే నర్సు) పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం కావడంతో కోటిరెడ్డి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య హైదరాబాద్ చేరుకుని అక్కడ సిటిజన్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 22న కోటిరెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు. బాచుపల్లిలో తన సోదరి ఇంట్లో ఉండి 23వ తేదీ నాగచైతన్యను కలిశాడు. డ్యూటీ అనంతరం ఆమెతో కలిసి షాపింగ్‌కు వెళ్లి కత్తిని కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి నల్లగండ్లలోని ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించరని స్పష్టతకు వచ్చి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నాగచైతన్య కత్తితో గొంతుపై, కడుపులో పొడుచుకుని పడిపోయింది. దీంతో కోటిరెడ్డి కూడా కత్తితో గొంతుమీద పొట్టలో పొడుచుకుని పడిపోయాడు. చదవండి: (టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం) ఉదయం 10.30 గంటల సమయంలో కోటిరెడ్డికి మెలకువ వచ్చి చూడగా నాగచైతన్య స్పృహలో లేదు. ఫ్యానుకు ఉరేసుకునేందుకు విఫలయత్నం చేశాడు. భయంతో రెంట్యాలలోని ఇంటికి చేరుకుని బంధువులకు విషయం చెప్పాడు. అంతా కలిసి రెంట్యాల పోలీసుల వద్దకు వెళ్లగా వారు చందానగర్ ఎస్సైతో మాట్లాడారు. మరోవైపు సాయంత్రం వరకు హోటల్ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో నిర్వాహకులు గది తెరచి చూడగా అందులో నాగచైతన్య రక్తపు మడుగలో చనిపోయి ఉంది. దీంతో వారు చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నాగచైతన్య చనిపోయిందని స్పష్టం కావడం, కోటిరెడ్డి గాయాలతో ఉండటంతో తొలుత చికిత్స చేయించాలని చందానగర్ఎస్సై సూచించారు. దీంతో బంధువులు అతనిని సోమవారం ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. అయితే 24వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో కత్తితో శరీరంపై రెండు చోట్ల గాయాలు చేసుకున్న వ్యక్తి 25వ తేదీ ఉదయం 4గంటలకు జీజీహెచ్‌లో చేరేంత వరకు ఏంజరిగిందనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం కోటిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: (అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య) -
ప్రేమజంటను మూడు రాష్ట్రాలను తిప్పి.. ముప్పుతిప్పలు పెట్టి..
భోపాల్: ఇద్దరు ప్రేమికులు తమ వివాహానికి కుటుంబసభ్యులను ఒప్పించలేకపోయారు. దీంతో పారిపోయి ఒకచోట ఉండగా గమనించిన కుటుంబసభ్యులు వారిని కిడ్నాప్‌నకు పాల్పడి మూడు రాష్ట్రాలు తిప్పుతూ అతి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మృతదేహాలతో క్రూరంగా ప్రవర్తించారు. ఇంతకీ వారిని హత్య చేసింది అమ్మాయి కుటుంబసభ్యులే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా జహంగీర్‌పూర్‌కు చెందిన యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు చెప్పి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారికి చెప్పడంలో విఫలమయ్యారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించి ఇంట్లో నుంచి జూలై 31వ తేదీన పారిపోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వారిపై ఆగ్రహంగా ఉన్నారు. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గాలిస్తున్న క్రమంలో వారు ఢిల్లీలో ఉంటున్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడి ఆ కొత్త జంటను జీపులో కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని బింధ్ ప్రాంతానికి తీసుకొచ్చి యువకుడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహంపై కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన అత్రీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చదవండి: రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు అమ్మాయిను హతమార్చి మృతదేహాన్ని రాజస్థాన్‌లోని ధోల్పూర్లో పడేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 5వ తేదీన గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అమ్మాయి, అబ్బాయి మృతిపై ఏదో సంబంధం ఉందని పోలీసులు భావించారు. విచారణ చేపట్టగా పై విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ సిగ్నల్ ఆధారంగా అమ్మాయి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు గుర్తించారు. కుటుంబసభ్యులను విచారించగా నేరం అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం: కలిసి ఉండలేమన్న బాధతో..
వెనిగండ్ల(పెదకాకాని)/గుంటూరు జిల్లా: వివాహేతర సంబంధం పెట్టుకున్న వారిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు మరణించగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి వద్దనున్న పాకలపాడుకు చెందిన సంగీపు గోపి(30) 9ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మీతిరుపతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప. ఈ కుటుంబం పెదకాకాని మండలం వెనిగండ్లకు వలస వచ్చింది. గోపి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. (చదవండి: కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్‌లు) వెనిగండ్లకు చెందిన జూటూరి శ్యామల తన భర్త తెనాలి తాలూకా కోపల్లెకు చెందిన గోపి పదినెలల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీపు గోపి, శ్యామల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అంతలో ఏమైందో ఏమో శనివారం రాత్రి పెదకాకాని శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం గోపి మరణించాడు. శ్యామల పరి స్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, కలిసి ఉండటం సాధ్యం కాదని ఆత్మహత్యకు ఒడిగట్టారని మృతుని తండ్రి వెంకటేశ్వర్లు చెప్పారు. చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే
ఇల్లెందు: క్షణికావేశంలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరిలో భర్త పరిస్థితి విషమంగా ఉంది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని నిజాంపేట పంచాయతీ రేపల్లెవాడకు చెందిన భూక్యా వేణు మూడు నెలల కిందట సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలకే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పురుగులమందు తాగేలా చేసింది. వేణు కలుపు నివారణకు కొట్టే మందు తాగగా సంధ్య విత్తనశుద్ధి చేసే మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మానికి తరలించారు. వేణు పరిస్థితి విషయంగా ఉంది. వేణుకు తల్లి చీన్యా, సోదరుడు వీరన్న ఉండగా సంధ్యకు మాత్రం తల్లిదండ్రులు లేరు. రేపల్లెవాడలో తన పిన్ని ఇంటి వద్ద ఉండి బీఫార్మసీ వరకు చదువుకుంది. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు ప్రియురాలిగా వేషం వేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడియం ఎంబొప్ (22), గంగ్యూ డియోమ్ (19) ప్రేమికులు. తన ప్రియురాలు గంగ్యూ వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే ప్రతిసారి ఆమెకు ఇంగ్లీశ్ అంతగా రాదు. ఆ పరీక్షలో వరుసగా తప్పుతోంది. దీంతో రంగంలోకి తన ప్రియుడు కడియాన్ని దింపింది. తన మాదిరి వేషధారణ వేసుకుని వెళ్లమని చెప్పడంతో మనోడు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రేయసి మాదిరి మేకప్ వేసుకున్నాడు. డ్రెస్, స్కాఫ్, తలపై మరో స్కాఫ్ చుట్టేసుకున్నాడు. విగ్ పెట్టుకుని హొయలు ఒలుకుతూ సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలోని గ్యాస్టన్ బర్గర్ విశ్వవిద్యాలయంలో పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇలా మూడు పరీక్షలు రాశాడు. ఇక నాలుగో రోజు ఇతగాడి ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగింది. దీంతో లేపి పరిశీలించి వివరాలు అడగ్గా ఈ నాటకం బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు పట్టించారు. ప్రేమ కోసం వెళ్లి కటకటాలపాలైన ఆ యువకుడిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి.. -
అత్తింటికి వెళ్లాల్సిన నవవధువు ప్రియుడితో కలిసి..
బాపట్ల (గుంటూరు): ప్రేమించుకున్నారు... కలిసి జీవించాలి అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా యువతికి తల్లిదండ్రులు మరొక వివాహం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్ఐ వెంకటప్రసాద్ వివరాల ప్రకారం.. కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు నెల రోజుల కిందట ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో ఆమె తల్లిదండ్రుల నివాసంలో ఉంటోంది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో అత్తింటికి వెళ్లాల్సి ఉండగా సోమవారం సూర్యలంక గ్రామంలో మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, యువకుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పొన్నూరు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
తొమ్మిదేళ్లుగా వారిద్దరూ డేటింగ్.. చివరకు శ్మశానంలో
నిడదవోలు: తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్న వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనువు చాలించాలని నిర్ణయించుకుని వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న గూటం దుర్గ అనే యువతితో రాజానగరం సమీపంలోని కలవచర్ల గ్రామానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ దాసోహం రాము సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే రాముకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గ సొంతూరు ఉండ్రాజవరం మండలం వడ్డూరు కాగా తొమ్మిదేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమంలో చేరింది. ఆ సమయంలో రాముతో పరిచయమై వివాహేతర సంబంధం బలపడింది. ఈ క్రమంలో వీరికి ఓ పాప పుట్టగా పంగిడిలో ఉంటున్న బంధువులకు ఇచ్చేశారు. అనంతరం దుర్గ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లింది. అక్కడ కొంతకాలం పనిచేసి నిడదవోలు వచ్చి కూరగాయల మార్కెట్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె దుబాయి నుంచి వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. దుర్గ సంపాదించిన సొమ్ముతో రాము అంబులెన్స్ కూడా కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పెరగడంతో సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని రాము ఆమెను బెదిరించాడు. పట్టణంలోని శ్మశానవాటికలో మద్యంలో పురుగు మందు కలిపి తాగాడు. అక్కడి నుంచి బైక్‌పై వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద దుర్గకు విషయం చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన దుర్గ అతడి బైక్‌లో ఉన్న పురుగు మందు సీసా తీసి తానూ తాగింది. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించి వారిద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వీరిద్దరినీ ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై పి.నాగరాజు వారి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
17- 19 ఏళ్ల వయసు ప్రేమ.. హైటెక్ మోసంతో లక్షల దోపిడీ
భోపాల్: తన కన్నా తక్కువ వయసున్న యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. వారి మధ్య వయసు తేడా ఉన్నా ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు. కలిసిమెలసి తిరుగుతూ ఊహలోకంలో తిరుగుతున్నారు. అయితే తమ జల్సాల కోసం వారు వక్రమార్గం పట్టారు. అమాయికులే లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే రూ.లక్షల్లో దోచేసుకుంటున్నారు. ఆ విధంగా ఏకంగా రూ.11.50 లక్షల్లో టోకరా కొట్టి దర్జాగా తిరుగుతున్నారు. వారి ఆటను పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు వారిద్దరూ జైలు పాలయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఎలా మోసం చేశారో తెలుసుకోండి. జబాల్‌పూర్ జిల్లాకు చెందిన 19 సంజనా గుప్తా 17 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. మైనర్ కావడంతో పేరు వెల్లడించలేదు. వీరిద్దరూ కలిసి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా మోసాలు చేశారు. అదుపులోకి తీసుకున్నప్పుడు వారు ఎలా నేరాలు చేసేవారో పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పారు. సీనియర్ పోలీస్ అధికారి సిద్ధార్థ్ బహుగుణ ఆ వివరాలు వెల్లడించారు. హైటెక్ మోసం ‘ఎస్బీఐ బ్రాంచ్‌లను సందర్శించి క్రెడిట్ కార్డుదారుల వివరాలు సేకరించారు. వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అన్నీ తీసుకుంటారు. వారిలో ఖాతాదారుల సంతకాలు (సిగ్నేచర్) ఎవరివి సులువుగా ఉంటే వారి తీసుకున్నారు. ఆ సంతకాలను వారు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లి తమ సంతకాలు మరిచిపోయామని, ఫోన్ నంబర్లు మార్చాలని ఖాతాదారుల పేరుపై వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విధంగా చేసి మొబైల్ ఫోన్లో ఆ ఖాతాదారుల అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. అలా జూన్ 30వ తేదీ నుంచి జూలై 16 మధ్య చాలా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేశారు.’ ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరూ జల్సాలు చేశారు. అయితే తమ ఖాతా నుంచి ఎవరో డబ్బు డ్రా చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బరేలా, పనాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిల్లో ఇద్దరు, సిహోరా స్టేషన్ ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మోసం వెలుగులోకి వచ్చింది. వీరిని ఆచూకీ కనుక్కుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.పది వేల నగదు, రూ.లక్షన్నర విలువైన ఆభరణాలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి సిద్ధార్థ్ బహుగుణ వెల్లడించారు. వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమె ప్రియుడు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. వీరి బారిన ఇంకేవరైనా పడి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ పాస్వర్డ్లు మారుస్తూ ఉండాలని సూచించారు. -
18 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల యువతి ప్రేమ: చివరకు నల్లమలలో
లింగాల (అచ్చంపేట): ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వయసు మధ్య అంతరం ఉండడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి కుటుంబసభ్యులు వేరొకరితో నిశ్చితార్థం జరిపించి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్ (18) ఇంటర్ చదివాడు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ (22) పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో రాధకు కుటుంబసభ్యులు కొన్ని రోజుల కిందట మరో వ్యక్తితో రాధకు నిశ్చితార్థం జరిపించారు. పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సలేశ్వరంగౌడ్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి రాధను తీసుకుని వెళ్లిపోయాడు. వారిద్దరూ అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల వారు గాలిస్తున్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా అక్కడికి వెళ్లి వారిని గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రెండేళ్లుగా....
సాక్షి, కామేపల్లి(ఖమ్మం): ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పింజరమడుగు గ్రామానికి చెందిన కర్రి దేవా, తాళ్లగూడెంకు చెందిన బండారి కావ్యలు డిగ్రీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కావ్యకు తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా గత తొమ్మిది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని..గురువారం కామేపల్లి ఠాణాకు వచ్చారు. ఎస్సై జి.స్రవంతి ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మేజర్లు కావడం, విడిపోడానికి ఇష్టపడకపోవడంతో కావ్యను అబ్బాయి దేవా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామపెద్దలు వీరిద్దరికీ తాళ్లగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేశారు. -
నల్లమలలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నల్లమల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పదర ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లికి చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతుల కుమార్తె శమంత (27), అదే గ్రామానికి చెందిన అయ్యన్న, లింగమ్మ దంపతుల కుమారుడు సురేశ్(28) ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం శమంతకు సికింద్రాబాద్‌కు చెందిన సతీష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన శమంత జూన్ 24న నాలుగేళ్ల చిన్న కుమారుడిని తీసుకుని సురేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదైన నేపథ్యంలో శనివారం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సురేశ్, శమంత తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులు సహాయంతో సిగ్నల్స్ ఆధారంగా మద్దిమడుగు అటవీ ప్రాంతంలో వెతికారు. ఆ సమయంలో అక్కడ బాలుడి ఏడుపు శబ్ధం విని.. ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పురుగుల మందు తాగి, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు, వివరాలు సేకరించారు. -
సీతానగరం ఘటనలో మృగాళ్ల గుర్తింపు
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కీలక ఆధారాల సేకరణ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు. కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్ విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా... అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. -
తమ్ముడి వరసయ్యే వాడితో ప్రేమ.. ఓ టీవీ షోలో..
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ అన్న ఓ సినీ రచయిత రాతలకు ఇంగ్లాండ్‌కు చెందిన మ్యాడీ నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. తమ్ముడి వరసయ్యే(?) వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె.. ఓ టీవీ షోలో తన మనసు విప్పింది. ఏళ్ల దూరాన్ని దగ్గర చేసింది. మనసుపడ్డ వాడిని చేరుకుంది. వివరాలు.. ఇంగ్లాండ్‌కు చెందిన మ్యాడీ తల్లికి, కాలమ్ తండ్రికి తొమ్మిదేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు మ్యాడీ, కాలమ్‌లు చిన్నపిల్లలు. అయితే, కొన్ని అనివార్యకారణాల వల్ల వారిద్దరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. పెద్దలు విడిపోయినప్పటికి మ్యాడీ, కాలమ్‌లు సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారు. ఈ నేపథ్యంలో మ్యాడీ కాలమ్‌ను ఇష్టపడటం మొదలుపెట్టింది. తాజాగా, ఐటీవీ సీక్రెట్ క్రష్ అనే డేటింగ్ షోలో కాలమ్పై ఉన్న ప్రేమను బహిర్గతం చేసింది. సాధారణంగా ఎవరైనా తమకిష్టమైన వాళ్లతో డేటింగ్ చేయాలనుకుంటే ఈ షో ద్వారా వాళ్లకు తమ ప్రేమను తెలియజేస్తారు. ఎదుటి వ్యక్తికి వీరి ప్రేమ ఇష్టమైతే డేటింగ్‌కు వెళతారు. లేదంటే, వారినుంచి ఎలాంటి స్పందన రాదు. ఆ షోలో మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘ నేను కాలమ్‌ను ఇష్టపడుతున్నానని చెప్పటానికి ఈ షోకు వచ్చాను. మా అమ్మ, వాళ్ల నాన్న తొమ్మిదేళ్ల క్రితం కలిసి ఉండేవారు. రెస్టారెంట్లో కాలమ్‌తో మ్యాడీ అయితే, ఇప్పుడు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మా పెద్దలు విడిపోయిన తర్వాత కూడా మేము సోషల్ మీడియాలో టచ్‌లో ఉండేవాళ్లం. అతడు చాలా మంచివాడు, అందగాడు’’ అని చెప్పుకొచ్చింది. వారి తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మ్యాడీ,కాలమ్‌లు ముఖాముఖీగా కలవలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే టచ్‌లో ఉండేవారు. అక్కడే కాలమ్పై మ్యాడీకి ప్రేమ పుట్టింది. మ్యాడీ తనను ప్రేమిస్తోందని తెలుసుకున్న కాలమ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘‘నేను నమ్మలేకపోతున్నాను. మన పెద్దలు విడిపోయిన తర్వాత నేను నీతో మాత్రమే టచ్‌లో ఉన్నాను. ఇన్నేళ్లలో నిన్ను నేను చూడను కూడా చూడలేదు. మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా. నువ్వు నీ ప్రేమను రహస్యంగా ఉంచావు. నిజంగా నమ్మలేకుండా ఉన్నా’’ అని అన్నాడు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘మేము చట్టవ్యతిరేకమైన పని చేయటం లేదు. ఎందుకంటే మేము మా బంధాన్ని రహస్యంగా ఉంచటం లేదు’’ అని అంది. కాలమ్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి మేము సవతి సోదరీ, సోదరులం కూడా కాదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఈ విషయం తెలిస్తే నాన్న నాపై మాటలు పేలుతారు. ఇంకెలా స్పందిస్తారో నాకు తెలియదు. కానీ, నేను దాన్ని లెక్క చేయను. ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు. నీకు,నాకు సంబంధించినది’’ అని అన్నాడు. -
మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి
కేసముద్రం: వేదమంత్రాల నడుమ జరగాల్సిన పెళ్లికి సమయానికి అర్చకుడు హాజరుకాలేకపోయాడు. అయినా వివాహం మాత్రం ఆగలేదు. స్మార్ట్‌ఫోన్‌లో మరో అర్చకుడు మంత్రాలు చదువుతుండగా గుడిలో పెళ్లి కానిచ్చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఈ వివాహం జరిగింది. ఒడిశాకు చెందిన కబీర్దాసు, కవిత కూలీ పనులు చేస్తుంటారు. నిరుపేదలైన ఈ ప్రేమజంటకి మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు. తాళ్లపూసపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయానికి అర్చకుడు మరో చోట కార్యం ఉండటంతో రాలేకపోయాడు. దీంతో కౌన్సిలర్ రవినాయక్‌తో పాటు స్థానికులు మరో అర్చకుడికి ఫోన్ చేశారు. ఆయన లైవ్‌లో మంత్రాలు చదువుతుండగా ప్రేమజంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చదవండి: వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. -
వెరైటీ లవ్ ప్రపోజల్ : వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలో తమ ప్రేమ చాలా ప్రత్యేకం అని ప్రతీ ప్రేమికుడు భావిస్తాడు. అంతేకాదు తమ ప్రేమను ప్రకటించేందుకు నానా తంటాలు పడతారు. లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా వెరైటీగా ఉండేలా లవర్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారు. రకరకాల ఫీట్లతో విభిన్నంగా ప్రయత్నిస్తారు . తాజాగా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనే మాటలను అక్షరాలా ఆచరించి చూపించాడో లవర్. ఏకంగా స్కైడైవింగ్ సమయంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వింగ్ మ్యాన్స్కైడైవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. "స్కైడైవ్ వివాహ ప్రతిపాదన" అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ వీడియో నెటిజనులను, ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రే అనే ప్రేమికుడు, తన గర్ల్‌ఫ్రెండ్ కేటీతో కలిసి స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు "ఐ లవ్ యూ" అంటూ తన ప్రేమను ప్రకటించాడు. ఈ హఠాత్పరిణామానికి కేటీ సర్ప్రైజ్ అవుతూ థ్యాంక్స్ చెప్పింది. ఇంతలో తన నోటిలో దాచుకున్న ఉంగరాన్ని తీసి మరీ తన ప్రేమను వ్యక్తంచేశాడు. ‘రోజు రోజుకు నీ ప్రేమలో మరింత మునిగిపోతున్నాను. నన్నుపెళ్లి చేసుకుంటావా’ అంటూ మెరిసిపోతున్న మబ్బుల నడుమ రే ముద్దుగా అడిగాడు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన ఆమె కూడా ఓకే చెప్పేసింది. ఇక ఏ ప్రేమికుడు ఎగిరి గంతేయకుండా ఉంటాడు. రే ఆల్రడీ గాల్లోనే ఉన్నాడుగా..అందుకే మరింత ఉత్సాహంగా కేకలు వేశాడు. దీనిపై సోషల్ మీడియా యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లవ్ బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదకర ఫీట్‌పై కొంతమంది నెటిజన్లు కోపాన్ని ప్రదర్శించడం విశేషం. View this post on Instagram A post shared by Wingman (@wingmanskydive) -
ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో..
భువనేశ్వర్ : నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి కుటిరచొపర్ గ్రామ పంచాయతీ కిలిగౌడసాహి గ్రామంలో విషం తాగి ఓ ప్రేమ జంట సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజులుగా దంపతుల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రేమజంట అకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఖామ్‌సింగ్ గౌడ చిన్న కుమారుడు ఇంద్ర గౌడ, అదే గ్రామానికి చెందిన జయసింగ్ గౌడ చిన్న కుమార్తె దుతిక గౌడ ప్రేమించుకున్నారు. 15 రోజుల కిందట ప్రేమికురాలు దుతిక గౌడను ఇంద్రగౌడ తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ రోజునుంచి దంపతుల్లా ఇద్దరూ నూతన జీవనం ప్రారంభించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా.. ఆనందంగా ఉంటున్నారని అందరూ భావించారు. అయితే వారిద్దరూ విషం తాగి గిలగిలా కొట్టుకుంటుండడం చూసిన బంధువులు ఇద్దరినీ వెంటనే ఝోరిగాం కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి చేర్చగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై ఇరువురి కుటుంబసభ్యులు ఝోరిగాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించారు. ఝోరిగాం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లవ్ ప్రపోజ్.. ప్రేమ జంటకు చేదు అనుభవం
కాన్బెర్రా: సాధారణం ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను తెలుపడానికి ప్రేమికులంతా భిన్నంగా ఆలోచిస్తూ సాహసాలు చేస్తుంటారు. ఎందుకంటే తన ప్రేమ ప్రపోజల్ ఎదుటి వ్యక్తికి సర్ప్రైజింగ్తో పాటు, ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం ఉంచాలనుకుంటారు. అలా భిన్నంగా ప్రయత్నించిన ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 650 ఎత్తైన కొండపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పిన అనంతరం కొద్ది క్షణాలకు ఆ మహిళ కొండపై నుంచి జారి కింద పడింది. అంత ఎత్తైన కొండపై నుంచి పడినప్పటికి ఆమె ప్రాణాలతో బయటపడిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తను ప్రేమిస్తున్న 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్ చేయడానికి కారింథియా కొండపైకి ట్రెక్కింగ్‌కు తీసుకేళ్లాడు. వారు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కిన అనంతరం అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను అంగీకరించిన ఆ మహిళ ఆకస్మాత్తుగా కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయింది. కాగా అక్కడ అంతా మంచు ఉండటంతో సదరు మహిళ ఈ ఘోర ప్రమాదం నుంచి బతికి బట్టకట్టింది. అయితే ఆమె పడిపోతున్న సమయంలో ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని పైగి లాగే ప్రయత్నం చేస్తూ అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతుడు ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని కింద పడిపోకుండా గాల్లో వ్రేలాడాడు. ప్రమాదంలో ఉన్న ఈ జంటను గమనించిన బాటసారులు వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని రక్షించింది. అయితే ఆ వ్యక్తిని మాత్రం హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. సదరు పోలీసుల అధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మంచు లేకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిచించాం. ఈ ప్రమాదంలో అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అతడి కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో వైద్యులు చికిత్స చేసి కట్టుకట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. -
భర్తతో తెగదెంపులు: మరో వ్యక్తితో ప్రేమ
సాక్షి, విశాఖపట్నం : నగరంలోని సుందరయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ కొత్త జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణికి ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో వివాహమైంది. ఏడాది క్రితం భర్తతో విడిపోయి వేరుగా ఉంటోందామె. ఈ నేపథ్యంలో అభిలాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. నాగిణి ప్రేమ వ్యవహారం అండమాన్‌లో ఉన్న భర్త పాపారావుకు తెలిసింది. ( డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్..) తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులక్రితం నాగిణి, అభిలాష్‌లు వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి బ్రతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ( కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా.. ) -
ప్రేమ జంట ఆత్మహత్య
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖంపూర్ గ్రామానికి సోయం సీతాబాయి(20) ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పెందూ గణేశ్(22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నట్లు తెలిపారు. పెందూర్ గణేశ్ సీతాబాయి స్వగ్రామమైన ఖంపూర్‌లోనే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లి లాక్డౌన్ ముగుస్తుందో.. లేదో.. పెళ్లి జరగదేమోనని మనస్థాపానికి గురైన వారు అమ్మాయి సోదరుడికి ఫోన్ ద్వారా తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నటు తెలిపారు. ఆమె సోదరుడు అక్కడకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్సై పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఉట్నూర్ తరలించి అమ్మాయి తండ్రి సోయం గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.(లాక్డౌన్: ట్రక్కులో దొరికిన ప్రేమికులు) -
లాక్డౌన్: ట్రక్కులో దొరికిన ప్రేమికులు
సిమ్లా: ఎంత కష్టం.. ఎంత కష్టం.. ప్రేమించుకున్నవారికి ఇన్ని రోజుల ఎడబాటు ఎంతో కష్టం. అందుకే ఇప్పుడప్పుడే కరోనా పోయేలా లేదని ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకునేందుకు రహస్యంగా జిల్లాలోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్లు జిల్లాలోని నిర్మాండ్ ప్రాంతానికి చెందిన ఇరవైయేళ్ల యువకుడు, ముప్పై యేళ్ల రష్యన్ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. (చావులో ఒక్కటయ్యారు..) లాక్డౌన్ వల్ల నోయిడాలోనే ఇరుక్కుపోయిన వీరు స్వస్థలానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం అక్కడి నుంచి వస్తున్న ట్రక్కులో దాక్కున్నారు. అయితే అక్కడికి సిమ్లా మీదుగా వెళ్లాల్సి ఉండగా ఆ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంది. అనుమానం వచ్చిన పోలీసులు షోగి ప్రాంతం వద్ద ట్రక్కును అడ్డుకుని కర్ఫ్యూ పాస్ చూపించమని అడగడంతో వారు బిక్కమొహం వేశారు. దీంతో జిల్లాలో చొరబడేందుకు ప్రయత్నించిన ప్రేమికులను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌ను కూడా పట్టుకున్నారు. వీళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రేమా.. ఇది నీకు న్యాయమా?) -
ప్రేమా.. ఇది నీకు న్యాయమా?
చెన్నై, వేలూరు: ఆంబూరు సమీపంలో రైలు పట్టాలపై పడుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆలంగాయం సమీపంలోని పూంగాపుదూరు గ్రామానికి చెందిన ఉమాపతి కుమార్తె నందిని (22). గుడియాత్తం సామర్షికుప్పం గ్రామానికి చెందిన కోదండన్ కుమారుడు రామదాస్(29). ఇతను హోసూరులోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించనట్టు తెలుస్తోంది. ప్రేమ జంట గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆంబూరు సమీపంలోని పచ్చకుప్పంలో రైల్యే పట్టాల వద్దకు చేరుకుంది. రైలు పట్టాల పక్కన కూర్చొని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. చెన్నై–బెంగళూరు వెళ్లే రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రేమ జంట అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ప్రేమ జంట రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి జోలార్‌పేట రైల్యే పోలీసులకు సమాచారం అందజేశారు. జోలార్‌పేట రైల్యే పోలీసులు, ఆంబూరు డీఎస్పీ సదానందం ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. ఆ సమయంలో మృతదేహాల సమీపంలో సెల్‌ఫోన్ ఉండడంతో వాటిని పరిశీలించారు. ప్రేమ జంట రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకున్న చిత్రాలు కనిపించాయి. వెంటనే బంధువులకు సమాచారం అందజేసి మృత దేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. -
అర్ధరాత్రి ప్రేమ జంట కిడ్నాప్‌యత్నం
సాక్షి, మచిలీపట్నం: ఆదివారం రాత్రి 11 గంటలు దాటింది.. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్.. ఓ యువజంట బస్టాండ్ టేబుల్‌పై కూర్చుంది. నలుగురు వ్యక్తులు మెరుపు వేగంతో వచ్చి ఆ జంటను చుట్టుముట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బలవంతంగా ఈడ్చు కుంటూ విజయవాడ బస్సు ఎక్కించారు. మాట్లాడకుండా వారి నోరు నొక్కేశారు. ఇంతలో తన స్నేహితుడిని బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌కు వచ్చిన మచిలీపట్నం పీఆర్వో జాకబ్ ఆ జంటకు ఏ ఆపద వచ్చిందోనని బస్సును ఆపే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో ‘సాక్షి’రిపోర్టర్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత ఫోన్లో పోలీసులకు చెప్పడంతో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పామర్రు పోలీసులు సినీ ఫక్కీలో బస్సును వెంబడించారు. ఆ జంటతో పాటు వార్ని బలవంతంగా తీసుకెళ్తున్న ఆ నలుగురు వ్యక్తులను బస్సు నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా, వారు తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. నాలుగు రోజుల క్రితం పారిపోయి బందరు ప్రాంతానికి వచ్చారు. ఎక్కడా ఆశ్రమం దొరక్కపోవడంతో రాత్రి పూట బస్టాండ్‌లో తలదాచుకునే వారని పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రేమికులను తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని మందలించారు. కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆ రాష్ట్రానికి ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
అనుమానం.. కౌగిలించుకుని చున్నీతో..
భువనేశ్వర్ : తమ ప్రేమను సమాజం అంగీకరిస్తుందా లేదా అన్న అనుమానంతో ఓ ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితి చొడియపార గ్రామంలో మంగళవారం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాంబాయి గోండ్, అమల సింగ్‌లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండడంతో ఒకరింటికి మరొకరు వస్తూ పోతూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ గాఢమైంది. సోమవారం రాత్రి అమల సింగ్, రాంబాయి ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి తన ఇంటికి వెళ్లాడు. రాత్రి రాంబాయి ఇంటిలో నిద్రపోవడం కుటుంబ సభ్యులు చూసి నిదురించిందని భావించారు. అయితే మంగళవారం ఉదయం నుంచి రాంబాయి ఇంటిలో కనిపించలేదు. ఎటువెళ్లిందా అని కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా కనిపించక పోవడంతో అమల సింగ్ ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ కూడా రాంబాయి గానీ అమల సింగ్ కానీ లేక పోడంటంతో రెండు కుటుంబాల వారు వారిద్దరి కోసం గాలించగా గ్రామ సమీప అడవిలో ఇద్దరూ ఒక చెట్టుకు వేలాడుతూ శవాలై కనిపించారు. వారిద్దరూ అతి దగ్గరగా ఒకరినొకరు కౌగిలించుకుని చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ తమ ప్రేమను సమాజం అంగీకరిస్తుందా లేదా అన్న అనుమానంతో భయాందోళన చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు గోండ్ భాషలో ఒక సూసైడ్ లేఖ రాసి పెట్టారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా ప్రేమను మా కుటుంబాలు ఆమోదిస్తాయో లేదా అన్న భయాందోళనతో తాము ఒకటిగా ఆత్మహత్య చేసుకున్నామని లేఖలో రాసి ఉంది. అయితే ఆలేఖ వారు రాసిందా? లేదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలతో గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ఈ కేసును రాయిఘర్ సబ్ఇన్స్పెక్టర్ రామ చంద్ర అగస్థి, గొగోశ్వర మఝిలు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం!
ప్రేమకు రెండు మనసులు కలిస్తే సరిపోతుంది! అదే పెళ్లి విషయానికి వచ్చేసరికి రెండు కుటుంబాలు కలవాల్సి ఉంటుంది. అందుకే చాలా ప్రేమ కథలు పెద్దల అంగీకారం దగ్గరే చతికిలబడి పోతున్నాయి. ఒక వేళ పెద్దలు పెళ్లికి ఒప్పుకుంటే మటుకు.. మంచి పంతులుగారిని వెతుక్కోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేని ఓ పెళ్లి రోజును ఫిక్స్ చేయాలి, పెళ్లి చేయటానికి మంచి కళ్యాణ మండపం.. ఒకటేంటి ఎన్నో పనులు.. పెళ్లంటే మాటలు కాదుగా మరి. ప్రేమించుకోవటం మాత్రమే జంట ఇష్టం. ఆ తర్వాత పెత్తనమంతా పెద్ద వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక జంట అభిప్రాయాలకు విలువుండదనే చెప్పొచ్చు. ఒక వేళ ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఓ మంచి రోజును మీరే ఎంచుకోండి’ అని జంటను అడిగితే. ఎక్కువ శాతం జంటలు చెప్పేపేరు.. వాలెంటైన్స్ డే.. అవును! ఇదిప్పుడు ప్రేమికుల రోజు మాత్రమే.. పెళ్లిళ్లు చేసుకోవటానికి జంటలు ఎంచుకునే రోజు కూడా! అందుకే 55శాతం మంది యువత వాలెంటైన్స్ డేన పెళ్లి చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తోంది. ఓ ప్రముఖ మాట్రిమొనియల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం దాదాపు 1000మందిపై సైట్ సర్వే నిర్వహించింది. వీరిలో 55 శాతంమంది 26-33 సంవత్సరాల వయసు కల్గిన వారే. ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఏ రోజును ఎంచుకుంటారు’ అని అడిగినపుడు. వీరంతా వాలెంటైన్స్ డేకే ఓటేశారు. రొమాంటిక్ డేనే తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది మహిళలు వాలెంటైన్స్ రోజున ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 25 శాతం మంది వాలెంటైన్స్ డేను తమ ప్రియమైన వారితో గడపటానికి ఇష్టపడ్డారు. 4 శాతం మంది బీజీ లైఫ్‌కు దూరంగా పేరెంట్స్‌తో వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడ్డారు. చదవండి : ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి