మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట మాత్రం తమ రిలేషన్‌షిప్‌ని బయటపెట్టడం లేదు. అలా అని దూరంగానూ ఉండటం లేదు. కలిసి తిరుగుతున్నారు. లాంగ్‌డ్రైవ్, డిన్నర్ పార్టీలంటూ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహమేనా లేదా ఇంకేమైనా ఉందా అనే అనుమానం అభిమానులకు కలుగుతోంది.
తాజాగా ఈ జంట డిన్నర్ పార్టీకి వెళ్తూ కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ హోటల్‌లో ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. బయటకు వెళ్లేందుకు కారు దగ్గరకు రాగా.. మీడియా కెమెరాలతో రెడీగా ఉంది. అయినా కూడా ఈ జంట గతంలో మాదిరి ముఖం చాటేయలేదు. హాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
(చదవండి: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్.. ‘మంగళవారం’ ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్)
ఈ ఏడాది జరిగిన న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తమన్నా, విజయ్‌ల రిలేషన్‌షిప్ బయటపడింది. ఈ వేడుకల్లో తమన్నా .. విజయ్‌కి లిప్‌లాక్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తమన్నా మాత్రం అదేం లేదని కొట్టిపారేసింది. కానీ వీరిద్దరి వాలకం చూస్తుంటే రేపో మాపే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్‌తో పాటు రజనీకాంత్ జైలర్ చిత్రంలోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment