
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్‌లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు.
Comments
Please login to add a commentAdd a comment