Did Vijay Varma Go On A Lunch Date With Rumoured GF Tamannaah Bhatia, Deets Inside - Sakshi
Sakshi News home page

Tamannaah -Vijay: ఇదే నిజం.. తమన్నాతో డేటింగ్ వార్తలపై విజయ్ వర్మ

Published Wed, Jan 18 2023 4:53 PM | Last Updated on Wed, Jan 18 2023 5:37 PM

Vijay Varma  lunch date with rumoured Tamannaah Bhatia - Sakshi

విజయ్ వర్మ, తమన్నా భాటియా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఏ ఈవెంట్‌లో చూసినా వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో తమన్నా ముద్దు పెడుతున్న వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనూ దర్శనమిచ్చింది. ఇటీవల ఓ ‍అవార్డ్ ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసి సందడి చేయడంతో మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. 

అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. తన రాబోయే ప్రాజెక్ట్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' డైరెక్టర్ సుజోయ్ ఘోష్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే నా అసలు లంచ్ డేట్ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్, తమన్నా డేటింగ్‌ వార్తలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement