పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్‌ అబ్బాయితో తమన్నా కటిఫ్‌ | Tamannaah Bhatia Break Up With Vijay Varma | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: నెక్స్ట్ పెళ్లి అనుకుంటే విడిపోయి షాకిచ్చారు!

Published Tue, Mar 4 2025 4:52 PM | Last Updated on Tue, Mar 4 2025 5:25 PM

Tamannaah Bhatia Break Up With Vijay Varma

మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)

అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.

ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement