మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ లేపుతోంది. వయసు పెరుగుతున్నా సరే గ్లామర్ మెంటైన్ చేయడంలో వారెవ్వా అనిపిస్తోంది. నటిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తి కావొస్తుంది. అయితేనేం ఇప్పటికీ సినిమాలు-సిరీసులు లాంటవి చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తమన్నా పేరు ఇది కాదని, మార్చుకుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టింది.
తమన్నా అంటే 'కోరిక' అని అర్థమట. 8-9 ఏళ్ల వయసున్నప్పుడే నటి కావాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్సయిందట. అప్పుడు అనుకోవడం ఏమో గానీ టీనేజ్‌లోకి వచ్చేసరికి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 2005లో ఒకేసారి తెలుగు, హిందీ సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళ, కన్నడలోనూ నటించింది. అయితే తమన్నా.. తెలుగులోనే కొన్నేళ్ల పాటు వరస చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
సినిమాల్లో ఎంట్రీ ఇద్దామని తమన్నా అనుకున్నప్పుడు.. ఒకాయన ఈమెని కలిసి పేరులో మార్పు చేసుకోమని చెప్పాడు. ఇంగ్లీష్‌లో అదనంగా a,h జోడీంచమని సలహా ఇచ్చాడు. అలానే నా పేరు Tamannaah అయిందని ఈ బ్యూటీ చెప్పింది. ఈ పేరు మార్పు అనేది తనలో ఓ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని, కెరీర్ పరంగానూ కలిసొచ్చిందని తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇకపోతే తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. గత రెండేళ్ల నుంచి వీళ్లిద్దరూ జంటగా చాలాసార్లు కనిపించారు. పెళ్లి గురించి సరిగా క్లారిటీ ఇవ్వడం లేదు గానీ ఈ ఏడాది తమన్నా-విజయ్ ఒక్కటైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే ఏడ్చేసిన నటి)
Comments
Please login to add a commentAdd a comment