‘‘నా పదిహేనేళ్ల వయసులోనే నటిగా నా కెరీర్ మొదలైంది. ప్రేక్షకులకు వీలైనంత చేరువ కావాలని కథల ఎంపికలో ఎప్పటికప్పుడు నేను జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ఇప్పటివరకు ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను. కానీ ఇప్పటివరకూ దొంగ పాత్రలో మాత్రం నటించలేదు. ఈ పాత్ర చేయాలనే నా ఆకాంక్ష ‘సికందర్ కా ముఖద్దర్’ చిత్రంతో నెరవేరినందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఈ పాత్ర నాకెంతో స్పెషల్’’ అని తమన్నా అన్నారు.
జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సికందర్ కా ముఖద్దర్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చేసే పాత్ర చిన్నదా? పెద్దదా అనేది నాకు ముఖ్యం కాదు. ఆ కథను ఎంత ప్రభావితం చేస్తుందన్నది ముఖ్యం.
పెద్దా చిన్నా తేడాల్లేకుండా వచ్చిన అవకాశాలతో ప్రేక్షకులను మెప్పించడమే నా లక్ష్యం. అలాగే ఒకే రకంగా ఉండే స్ట్రాంగ్ ఉమన్ రోల్స్ కాకుండా... కొత్త తరహా ఉమన్ రోల్స్ చేయా లని ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment