
బాలీవుడ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌లో తమన్నా (Tamannaah Bhatia)కు ఎంట్రీ లభించిందని సమాచారం. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రధారులుగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ బడ్డీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘నో ఎంట్రీ’. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ సినిమా తీస్తున్నారు అనీస్ బాజ్మీ, బోనీ కపూర్.
నలుగురికి పైగా హీరోయిన్లు..
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు పైగా నటిస్తారని టాక్. వీరిలో ఇప్పటికి తమన్నా, అదితీ రావ్ హైదరీలను సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ కథానాయికలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వీలైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ టాక్. ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
చదవండి: నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు