No entry
-
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్‌కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్‌లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్‌లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
Novak Djokovic: వ్యాక్సిన్ వేసుకోలేదని..
ఇండియన్‌వెల్స్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఇంకా కరోనా వ్యాక్సిన్ కష్టాలు వీడటం లేదు. అతను వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అతడిని అనుమతించలేదు. దాంతో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌నుంచి అతను తప్పుకున్నాడు. తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జొకోవిచ్ చేసిన దరఖాస్తును అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇండియన్వెల్స్తో పాటు మరో పెద్ద టోర్నీ మయామీ ఓపెన్‌కు కూడా జొకోవిచ్ దూరం కానున్నాడు. ఈ రెండు టోర్నీలు మార్చి 19 – ఏప్రిల్ 2 మధ్య జరుగుతాయి. -
మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?
సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే.. ఇది అన్నమాచార్యులు చెప్పిన మాట. రూపాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే..లింగ, వర్గ, జాతి బేధాలు లేకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే..కానీ అక్కడ మహిళల పట్ల వివక్ష కాదుగానీ..పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం ఆనవాయితీ. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత. చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే ఆలయ పరిసరాల్లో అన్ని పనులు మగవారే చేస్తారు. పూజారి పురుషుడే...నైవేద్యం పెట్టాలన్నా.. పూజ చేయాలన్నా వారే చేయడం విశేషం. ఆడవాళ్లకు ప్రవేశం లేదు. అందులోనూ సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం మగవాళ్లు మడికట్టుకుని వరుసగా పెట్టే పొంగళ్లు, కుండలతో ఊరంతా సందడిగా మారుతుంది. తిప్పాయపల్లెలో కొనసాగుతున్న పురాతన సంప్రదాయంపై ప్రత్యేక కథనం. పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లె గ్రామం. చుట్టూ పూలు, అరటి, మామిడి చెట్లతో, శేషాచలం అడవులతో పల్లె అందంగా కనిపిస్తోంది. గ్రామం లోపల పురాతన కాలం నాటి సంజీవరాయస్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది. నైవేద్యం సిద్ధం చేస్తున్న పురుషులు(ఫైల్) పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజలకష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు. సంక్రాంతికి ముందు కొత్త సందడి తిప్పాయపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు వచ్చి పొంగళ్ల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలోని వీధులన్నీ పేడతో అలికి...ముగ్గులు వేసి వాటిపై పదుల సంఖ్యలో పొంగళ్లు పెట్టి వంట వండుతారు. అగ్గి మంట మొదలుకొని అన్నం అయ్యే వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు మండలంనుంచే కాక చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఆనవాయితీని కొనసాగిస్తున్నాం మా గ్రామంలో పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. సంక్రాంతికి ముందు వచ్చే పొంగళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటాం. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారు. – కేశవరెడ్డి, మాజీ సర్పంచ్, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం ఎంతో సందడిగా ఉంటుంది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం పొంగళ్లు నిర్వహించడం సంతోషదాయకంగా ఉంటుంది. ముందస్తుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లుగా..కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఊరికి రావడంతో ఊరంతా జాతరను తలపించేలా ఉంటుంది. –ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’
ఇస్లామాబాద్: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. బజౌర్ గిరిజన జిల్లా సలార్జాయ్ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్ ఉలేమా–ఇ–ఫజుల్(జేయూఐ–ఎఫ్) జిల్లా చీఫ్ మౌలానా అబ్దుర్ రషీద్ నేతృత్వం వహించారు. పాక్ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్ ప్రధాన భాగస్వామి. -
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం
ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై హెల్మెట్ లేకుండా ప్రవేశం లభించదు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రవేశం లభించదు. కొంతకాలంగా రహ దారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మందికి తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధగా కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ జనజాగృతి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘ఎన్నో జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించడం విషయంలో అనుకున్న ఫలితాలు రావడం లేదనీ, అందుకు ఇకనుంచి కఠినమైన చర్యలు చేపట్టాలనీ నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్ అవినాశ్ డాక్టె తెలిపారు. హెల్మెట్ లేని వారెవ్వరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకూడదనీ, ఉన్నతాధికారులైనా, సామాన్యులైనా అందరికీ ఈ నియమం వర్తిస్తుందన్నారు. చదవండి: (సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..) ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు, జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా హెల్మెట్ ధారణ విషయంలో నిర్లక్ష్యం వహించే ద్విచక్రవాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామనీ అవినాష్ డాక్టె వెల్లడించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని పరిపాలనా శాఖకు చెందిన అన్ని ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో, ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలనే నియమాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి -
3 పాత్రల్లో సల్మాన్ ఖాన్.. 10 మంది హీరోయిన్లు !
10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ గతేడాది డిసెంబర్ 27న పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను చేసే వరుస సినిమాలను ప్రకటించాడు. అందులో 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్‌తోపాటు 'నో ఎంట్రీ' సీక్వెల్ చేయనున్నట్లు తెలిపాడు సల్లూ భాయ్. 2005లో విడుదలైన నో ఎంట్రీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సల్మాన్‌తోపాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'నో ఎంట్రీ 2' సినిమాకు కూడా ఇదే తారాగణంతో అనీస్ బజ్మీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ అయితే ఈ సినిమాలో ఏకంగా 10 మంది హీరోయిన్లు యాక్ట్ చేయనున్నారట. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ ముగ్గురు మూడు పాత్రల్లో నటించనున్నారని సమాచారం. అంటే మొత్తంగా 9 పాత్రల్లో సందడి చేయనున్నారు. అందుకే ఈ 9 పాత్రలకు తగినట్లుగా 9 మంది హీరోయిన్లు అలరించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో 10వ కథానాయికకు కీలక పాత్ర పోషించనుందట. ఆ పాత్రకు పాపులర్ హీరోయిన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో డైసీ షా హీరోయిన్గా చేస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఒకరు చెప్పినట్లు సమాచారం. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు.. 'కబీ ఈద్ కబీ దివాళీ' సినిమా షూటింగ్ తర్వాత 'నో ఎంట్రీ 2' చిత్రీకరణను ప్రారంభించనున్నాడు సల్మాన్. సినిమాలో మూడు పాత్రలు ఉండటంతో సల్మాన్ అధికంగా డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్లూ భాయ్ 'టైగర్ 3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో అతిథిపాత్రలో అలరించనున్నాడు సల్మాన్ ఖాన్. ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్.. -
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యాక్సిన్ వేసుకోకుంటే..
ఆహ్మదాబాద్: ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అయితే తొలి డోస్ కోసం ఎగబడ్డ జనం.. రెండో డోస్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కరోనా తగ్గిపోయిందని భావించి, వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే జ్వరం, నొప్పులు వంటి భయాలతో రెండో డోస్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు, ప్రభుత్వాలు వ్యాక్సిన్‌పై భయాందోళనలు పోయేలా, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. చదవండి: కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని పలు ఉద్యోగ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 12 నుంచి 18 ఏళ్లు నిండి ఉండి వ్యాక్సినేషన్ తీసుకొని వారికి పబ్లిక్ ప్లేస్‌లోకి అనుమతి నిషేధించింది. చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి అహ్మదాబాద్ మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఏఎమ్టీఎస్),అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీర్టీఎస్) బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక టీకా తీసుకొని వారు కంకారియా లేక్ ఫ్రంట్, కంకారియా జూ,యు సబర్మతి రివర్ ఫ్రంట్‌లోకి ప్రవేశం లేదని వెల్లడించింది. లైబ్రరీ, జింఖానా, స్విమ్మింగ్ పూల్, ఎంఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిటీ సివిక్ సెంటర్, కార్పొరేషన్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు తప్పని సరి తనిఖీ చేస్తామని తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు కాగా గత నెలల్లో రోజువారీ కోవిడ్ కోసులు గుజరాత్లో తొలిసారి 40 దాటాయి. అయితే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 36 మంది కోలకున్నారు. గుజరాత్లో ఇప్పటి వరకు 8కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. -
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
Tokyo Olympics: ఏం చూసినా టీవీల్లోనే...
టోక్యో: విశ్వ క్రీడలంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటే మేటి ఒలింపిక్స్ క్రీడలను ఔత్సాహిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడతారు. నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ‘టోక్యో’ ఈవెంట్‌ను మాత్రం కరోనా వైరస్ దెబ్బకొట్టింది. దీంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల ఆరంభ సంబరాలు, పోటీలు, ముగింపు వేడుకలకు చప్పట్లు కొట్టేవారెవరూ ప్రేక్షకుల గ్యాలరీలో ఉండరు. దీంతో హీట్లు, ఫీట్లు, విజయాలు, ఘనతలు, రికార్డులు టోక్యో గడ్డపై ఇలా ఏం జరుగుతున్నా... టీవీల్లోనే చూడాలి. ప్రత్యక్ష ప్రేక్షకులుండరు. అంతా టీవీ ప్రేక్షకులే! ఇప్పటికే విదేశీ ప్రేక్షకులెవరినీ అనుమతించ వద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యంకానీ పరిస్థితి ఉందిపుడు! 68 వేల సీట్ల సామర్థ్యమున్న నేషనల్ స్టేడియంలో ఈనెల 23న ఒలింపిక్స్ ఆరంభోత్సవాలు జరుగుతాయి. దీనికి మాత్రం కేవలం వీఐపీలను అనుమతిస్తారు. వేదికల వద్ద ప్రేక్షకుల సందడే ఉండదని స్థానిక మీ డియా పేర్కొంది. చిన్నా చితక స్టేడియాల్లో జరిగే పోటీలకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని, భక్తులు అనుమతి లేదని దేవాలయ అధికారులు తెలిపారు. నెలవారీ పూజ కార్యక్రమాలు ఆగస్టు 21 సాయంత్రం పూర్తైన తర్వాత ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా సబరిమల మినహా దక్షిణ కేరళలోని సుమారు వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచి ఉంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయింది. శబరిమల ఆలయాన్ని తెరిస్తే పొరుగు రాష్ట్రాల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్టు29 నుంచి సెప్టెంబర్2 వరకు ఓనం పూజల కోసం ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని టీడీబీ తెలిపింది. ఇటీవల సబరిమల వార్షిక పండుగ తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్న విషయం తెలిసిందే. -
శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా జూన్ 14న తెరవనున్న శబరిమల ఆలయాన్ని పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి మూసివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 నుంచి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సైతం వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇటీవల ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధికారులు, ఆలయ పూజారులు, కేరళ ప్రభుత్వం సమావేశం అయి ఆలయం తెరవాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. -
అడవిలోకి రానివ్వడం లేదు
వెదురు కోసం తమను అటవీ అధికారులు అడవిలోకి అనుమతించడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మేదరులు ర్యాలీలు తీశారు. వెదురు పెంపకానికి గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి, సారంగాపూర్: ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మేదరులు బతికి బట్టకడతారని మండల మేదరులు పేర్కొన్నారు. ఈమేరకు తహసీల్దార్ నవీన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సారంగాపూర్‌లో మేదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకంతో తాము ఉపాధి కోల్పోతున్నానమని, తమ వెదురు వస్తువులను కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి అనుమతించడం లేదన్నారు. వెదరు పెంపకాన్ని ప్రొత్సహించేందుకు ప్రతీ మండలంలో ఐదెకరాలు వెదురు పెంపకానికి అటవీశాఖకు సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని కోరారు. మేదరులా ర్యాలీలో వారు ధరించిన వెదురు టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెదరుతో చేసిన టోపీలు నీడతోపాటు చల్లని గాలిని ఇస్తుండడంతో పలువురు కొనేందుకు ఆసక్తి చూపారు. ర్యాలీలో మేదరుల సంఘం మండలాధ్యక్షుడు చంద శ్రీహరి, ఉపాధ్యక్షులు బొమ్మిడి లచ్చన్న, ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి శ్రీనివాస్, కోశాధికారి బొమ్మిడి వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు లస్మయ్య, సలహాదారు చింతల చిన్నగంగరాజం, ప్రచార కార్యదర్శి వేముల లక్ష్మీరాజం, కార్యవర్గ సభ్యులు చంద మల్లేశం, పోతు నర్సయ్య, తుమ్మల రాజేశం, మామిడిపెల్లి రాజేందర్, చింతల దుబ్బరాజం పాల్గొన్నారు. జగిత్యాలటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేదరులు బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శరత్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వెదురుబొం గులు దొరకడం లేదని, వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. మే దరులకు డబుల్బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ రుణా లు ఇప్పించాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. -
‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ 2005లో నటించిన బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నో ఎంట్రీ’. ఈ సినిమా విడుదలై సోమవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్ కపూర్ ఆ చిత్రంలో పాపులర్ సరదా సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సన్నివేశంలో అనిల్, ఫర్దీన్ ఖాన్‌కు పాజిటివ్‌గా ఉండమని సలహా ఇస్తుంటాడు.‘నా రక్తంలో సానుకూలత ప్రవహిస్తోంది, ఎందుకంటే నో ఎంట్రీ సినిమాకు 14 ఏళ్లు’ అనే క్యాప్షన్‌తో అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్ చేశాడు. దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ చిత్రంలో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్లు హీరోలగా నటించగా.. బిపాస బసు, లారా దత్త, ఇషా డియోల్‌లు హీరోయిన్లుగా నటించారు. అదే విధంగా ఈ సినిమా నిర్మాత బోని కపూర్ కూడా ‘2005లో అత్యంత ఘన విజయం సాధించిన ‘నో ఎంట్రీ’కి నేటితో 14 ఏళ్లు! తొందరల్లోనే మనందరం ‘నో ఎంట్రీ2’ తో మళ్లీ కలవబోతున్నందుకు సంతోషం’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నో ఎంట్రీ2’ డైరెక్టర్ అనీస్ బాజ్మీకి, చిత్ర బృందానికి బోనీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నో ఎంట్రీ’ని తెరకెక్కించిన దర్శకుడు అనీస్ బాజ్మీనే దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. B-eing positive runs in my blood 😂 #14YearsOfNoEntry @BazmeeAnees pic.twitter.com/jGSOx9Kl39 — Anil Kapoor (@AnilKapoor) August 27, 2019 -
చలాన్‌తోనే సరిపెడుతున్నారు..
సాక్షి,సిటీబ్యూరో: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారుల పైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగా 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి కారణంగానే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదన్నారు. అనుమతి పొందిన వాటి మినహా నగరంలో భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయినా ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకొచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో–ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళల్లో నగరంలోని ప్రవేశించి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీనిని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయట్లేదు. మరోపక్క ఇలాంటి ‘నో–ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనుక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసు స్టేషన్, లేదా గోషామహల్ స్టేడియానికి తరలించాలి. అనంతరం సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్ళే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ ఆయా వాహనాల డ్రైవర్లకు కలిసి వస్తుండటంతో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇలా నో–ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ... ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్ధాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగరవాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. అలాగే రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటిగా మారింది. వీటి సమస్య తీరాలంటే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చు. -
తలపాగాతో ప్రవేశానికి అమెరికా బార్ నో
న్యూయార్క్: తలపాగా ధరించిన కారణంగా అమెరికాలో ఓ సిక్కు యువకుడిని బార్లోకి అనుమతించలేదు. అర్థరాత్రి దాటిన తన స్నేహితుడి కలుసుకోవడానికి వెళ్లిన ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు మీడియా పేర్కొంది. గురువీందర్ గ్రేవల్ అనే యువకుడు అర్థరాత్రి తర్వాత తలపాగాతో పోర్ట్ జెఫర్‌సన్‌లోని హర్బర్ గ్రిల్ బార్కి వెళ్లాడు. అక్కడి భద్రతా సిబ్బంది తలపాగా ఉన్న కారణంగా అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది తమ సాంప్రదాయం అని మేనేజర్‌కి వివరించినా ప్రవేశానికి అనుమతించలేదని గురువీందర్ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత హర్బర్ గ్రిల్ ఫేస్బుక్లో క్షమాపణలు తెలపడంతో పాటు వివరణ ఇచ్చింది. శుక్రవారం, శనివారాల్లో రాత్రి పది గంటల తర్వాత టోపీలు, హ్యాట్లు ధరించిరావడంపై నిషేధం విధించామని, అంతేకానీ సాంప్రదాయంగా ధరించేవాటిపై ఎలాంటి నిషేధం లేదని చెప్పుకొచ్చింది. -
హత్యాయత్నం కేసులో బయటపడుతున్న కుట్ర
-
సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం?
-
ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీబీఐకి సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు.తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాగా, చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాలకు తావిస్తున్న ప్రభుత్వ నిర్ణయం.. దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని పైకి చెబుతున్నప్పటికీ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ఏ మేరకు న్యాయబద్ధమైనది అనే విషయంపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తన అనుచరులపై దాడి చేస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం? అంతే కాకుండా రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే దర్యాప్తు చేయాలని ఆ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి తమ డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కేంద్ర సంస్థలచే విచారణ జరిపితే చంద్రబాబు లోసుగులు బయటపడతాయనే భయంతో, కేసును పక్కదారి పట్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే చంద్రబాబు సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు సీబీఐని కీర్తించిన చంద్రబాబు.. ఇప్పడు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకోవడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహారించడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని కూడా కేవలం అనుకూల మీడియాకు మాత్రమే తెలుపడాన్ని గమనిస్తే.. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆధార్ లేదని ప్రవేశాలు నిరాకరించొద్దు
న్యూఢిల్లీ: ఆధార్ లేదన్న కారణంతో విద్యార్థులకు పాఠశాలల ప్రవేశాలను నిరాకరించరాదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఆధార్ లేనందుకు కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలేదన్న ఆరోపణలు తన దృష్టికి రావడంతో యూఐడీఏఐ స్పందించింది. విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కులను ఆధార్‌ను కారణంగా చూపుతూ దూరం చేయకూడదని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఇప్పటి వరకూ ఆధార్ పొందని, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోని విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాల ను నిర్వహించే బాధ్యత సంబంధిత పాఠశాలలదే అని స్పష్టం చేసింది. స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా అధికారులు, రాష్ట్ర విద్యా శాఖ సమన్వయంతో పాఠశాలలే అలాంటి విద్యార్థుల కోసం ఆధార్ నమోదు, అప్డేట్ శిబిరాలు నిర్వహించాలని సూచించింది. ఏటా కనీసం రెండు సార్లు అన్ని పాఠశాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.విద్యార్థులు ఆధార్ పొందే వరకు, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునే వరకు ప్రత్యామ్నాయ గుర్తిం పు మార్గాలను అనుమతించాలంది. 5–15 ఏళ్లు నిండిన చిన్నారుల ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరని పేర్కొంది. -
పార్టీలోవారికి ప్రవేశం లేదు
చెన్నై: తమ పార్టీలోకి కుల, మత సంస్థల నేతలకు ప్రవేశం ఉండబోదని తమిళ స్టార్ రజనీకాంత్ నెలకొల్పిన ‘రజనీ మక్కల్ మండ్రం’ స్పష్టం చేసింది. నిబంధనలతో కూడిన 36 పేజీల కరపత్రాన్ని ఆ పార్టీలోని వివిధ విభాగాలకు అందజేసింది. దీని ప్రకారం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, చెడు అలవాట్లకు బానిసలైన వారికి పార్టీలోకి ప్రవేశం ఉండదు. సంస్థాగత నిర్మాణం, ప్రవర్తనావళి, వివిధ విభాగాల్లో చేరికలకు సంబంధించిన అంశాలపైనా ఇందులో వివరణ ఉంది. రజనీకాంత్ ‘రజనీ మక్కల్ మండ్రం’ ఏర్పాటు చేసి, వివిధ స్థాయిల్లో పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించుకుని, సంస్థాగత నిర్మాణ పనుల్లో ఉన్నారు. త్వరలోనే పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. -
గేటు దాటితే ఖబడ్దార్!
పిఠాపురం: అది సెంట్రల్ జైలు కాదు, అలాగని నిషేధిత ప్రాంతం అసలే కాదు. హై సెక్యూరిటీ జోన్ కూడా కాదు. పోనీ కనీసం రోగులకు ఇబ్బంది కలుగుతుందనుకోవడానికి అది ఆసుపత్రి కానే కాదు. కానీ అక్కడెక్కడా లేని నిబంధనలు మాత్రం ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తప్ప ఉదయం ఎవ్వరూ అటువైపు వెళ్లరాదు. ఒకవేళ వెళదామన్నా వెళ్లనివ్వరు. అదేదో శ్రీహరికోటలోని ఉపగ్రహ తయారీ కేంద్రం అనుకుంటే పొరపాటే. అది పిఠాపురంలోని మున్సిపల్ కార్యాలయం. అక్కడకు వెళ్లాలంటే అర్జీదారులతోపాటు పురపాలక సంఘ సభ్యులు సహితం సమయ పాలన పాటించక తప్పదు. ఇందుకోసం ఉదయం నుంచీ మున్సిపల్ కార్యాలయం గేటు మూసివేసి, నిరంతరం సెక్యూరిటీ గార్డులతో కాపలా ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయంలో గేటు దాటి లోపల అడుగు పెట్టాలన్నా కూడా.. గేటు వద్ద ఉన్న సిబ్బందికి ఏ పనిమీద, ఎవరికోసం వచ్చారు? ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారనే వివరాలను కచ్చితంగా ఇచ్చి వెళ్లాలని నిబంధనలు విధించారు. ఇటీవల రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ బిల్లు కలెక్టర్ పట్టుబడిన సంఘటన జరిగిన నాటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకున్న సమయంలోనూ ఇటువంటి నిబంధనలే అమలు చేయగా.. సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో వాటిని సడలించారు. నిత్యం వివిధ పనుల కోసం వచ్చే అనేకమంది ఈ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్ వర్క్ అంటూ మూడు దాటితే సిబ్బందిలో అనేకమంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏ పని చేయించుకోవాలని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇలాంటి నిబంధన పెట్టిన స్థానిక మున్సిపల్ అధికారుల తీరును వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే మున్సిపాలిటీలో.. అందునా సుమారు 70 వేల జనాభా ఉన్న పిఠాపురంలో ప్రజాసేవకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కమిషనర్‌ను కలవడానికి మాత్రమే సమయ పాలన ఏర్పాటు చేయాలి తప్ప, ఇలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేలా నిబంధనలు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శిస్తున్నారు. ప్రజలతో ఎన్నికైన కౌన్సిలర్లకు సహితం ఈ నిబంధన విధించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. సత్వర సేవల కోసమే.. ప్రజలకు సత్వరం సేవలందించడానికే ఈ నిబంధనలు పెట్టాం. కొందరు ఏ పనీ లేకపోయినా కార్యాలయంలో గంటల తరబడి ఉండి అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దళారుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు నిర్ణీత సమయంలో అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తాం. – ఎం.రామ్మోహన్,కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ -
నో ఎంట్రీ..
నిడదవోలు : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీ వామనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆర్అండ్బీ ఏఈ డి.నందకిశోర్ తెలిపారు. భారీ లోడు వాహనాలు వెళ్తే వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల హైదారాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృదం సభ్యులు నివేదికలు అందించారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అంబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పురాతన వంతెనపై 10 టన్నులకు మించి లోడు వాహనాలను పూర్తిగా నిషేధించారు. వంతెనపై గంటకు 15 కిలోమీటర్లకు మించి ఎటువంటి వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. వంతెన ముఖద్వారంలో 10 అడుగుల దూరంలో ఐరన్ గడ్డర్( స్టాపర్)ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ముఖద్వారంలో ఐరన్ స్టాపర్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా... నిడదవోలు మండలం సమిశ్రగూడెం వంతెన వద్ద ఇరుకు, భారీ వాహనాలు నిషేధించడంతో పాటు బరువు 10 టన్నులు, వేగ పరిమితి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమేనని హెచ్చరిక బోర్డులను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొవ్వూరు మండలం పంగిడి, తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు జంక్షన్లో నిడదవోలు వైపుగా భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కొవ్వూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్లే వాహనాలు సమిశ్రగూడెం వంతెన ఎడమ వైపు నుంచి డి,ముప్పవరం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లాల్సిన భారీ వాహనాలు ప్రత్తిపాడు నుంచి తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చును. -
20 ఏళ్లకు పైబడిన వాహనాలకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: 20 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను తప్పనిసరిగా వినియోగం నుంచి తప్పించడానికి ఉద్దేశించిన విధానానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ విధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ తుది దశకు చేరుకుందని రవాణా మంత్రి గడ్కరీ గతంలో చెప్పారు. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంఓలో జరిగిన భేటీలో ఈ విధానానికి సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
సెల్.. నో ఎంట్రీ!
... ఈ మాట వినగానే ఒక్కసారి గుండె ఆగినంత పనైందా? అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినట్లు ‘సెల్ ఫోన్లు బంద్’ అనే ప్రకటన ఏమైనా చేశారా? నోట్లు రద్దయినా తట్టుకున్నాం కానీ... చేతిలో సెల్ (మొబైల్) లేకుంటే ఎలా? బాడీలో ఏదో పార్ట్ తీసేసినట్టే కొందరు ఫీలవుతుంటారు. ఈ సెల్‌కి బంద్.. ప్రజలకు కాదు! ‘సాహో’ యూనిట్‌కి మాత్రమే! మేటర్ ఏంటంటే... ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగులోకి ఇకపై సెల్ ఫోన్స్‌కి ఎంట్రీ లేదట. షూటింగ్ స్పాట్‌కి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురాకూడదని రూల్ పెట్టారట. ఎందుకంటే... భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సిన్మా స్టిల్స్, లొకేషన్లో ఫొటోలు బయటకొస్తే సినిమా రిలీజ్ సమయానికి ఇంట్రెస్ట్ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే... లాకర్ రూమ్‌లో పెడుతున్నారట. గుడికో, బడికో వెళితే లాకర్రూమ్లో పెడతారు కదా, అలాగ! త్వరలో దుబాయ్‌లోని అబుదాబీలో జరగనున్న షెడ్యూల్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
డబుల్ బొనాంజా!
సెలీనా జైట్లీ గుర్తుందా? హిందీలో ‘నో ఎంట్రీ’, ‘గోల్మాల్ రిటర్న్స్’ తదితర చిత్రాల్లో నటించారు. పదమూడేళ్ల క్రితం మంచు విష్ణు సరసన ‘సూర్యం’ చిత్రంలో మెరిశారు. ఆరేళ్ల క్రితం పీటర్ హేగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారామె. పెళ్లయిన ఏడాదికి సెలీనా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఓ స్వీట్ న్యూస్ చెప్పారట. మళ్లీ కవలలు పుట్టబోతున్నారనే ఆ న్యూస్ విని, సెలీనా, పీటర్ సంబరపడిపోతున్నారు. -
గుర్తింపుకార్డులు తప్పనిసరి
-
గుర్తింపుకార్డులు తప్పనిసరి
తమిళసినిమా: సూపర్‌స్టార్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేకుంటే వారు ఎంతటి వీరాభిమానులైనా నోఎంట్రీ. ఏమిటిదంతా అనేగా మీ ఆసక్తి. రజనీకాంత్ రేపటి (సోమవారం)నుంచి ఐదురోజుల పాటు ఆయన అభిమానులను జిల్లాల వారిగా కలవనున్నారు. చాలా కాలం తరువాత ఆయన అభిమానుల కల నెరవేరబోతోంది. అయితే ఈ పరిణామం రాజకీయవర్గాల్లో గట్టి కలవరానికే దారి తీస్తోంది. రజనీకాంత్ రోజుకు మూడు జిల్లాలకు చెందిన అభిమానులు చొప్పున ఈ నెల 19 తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి మంచి విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపం వేదిక కానుంది. అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులను అందించడం జరిగింది. అవి ఉన్న వారికే అనుమతి అని, గుర్తింపు కార్డులు లేని వారు దయచేసి రావద్దని శనివారం రజనీకాంత్ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా రజనీకాంత్‌తో మాట్లాడాలని ప్రయత్నించడం గానీ, రాజకీయ ప్రస్తావన తీసుకురావడం గానీ, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం లాంటివి చేయకూడదని నిబంధనలు విధించడం జరిగిందని సమాచారం. -
అక్కడ పేదోళ్ల కష్టాలు వినే మార్గాలన్నీ క్లోజ్
-
సామాన్యులకు నో ఎంట్రీ
అనంతపురం అర్బన్: స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి వేడుకలు.. ఊళ్లోనే జరుగుతున్నాయి..మళ్లీ జరుగుతాయో లేదో ఒక్కసారైనా ఆ వేడుక ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారందరి ఆశలపై అధికారులు నీళ్లు పోశారు. వేడుకలను తిలకించేందుకు సాధారణ ప్రజలకు రెండు వేల కార్డులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రజల కోసం కేటాయించిన బీ–3 పాసులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెంతకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో నాయకులంతా తమ అనుచరులకు, బంధువులకు పంచి పెట్టారు. దీంతో రాష్ట్రస్థాయి వేడుక కూడా అధికార పార్టీ కార్యక్రమంగా మారిపోయింది. -
ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ
పాలకుర్తి, రేగొండ: ప్రైవేట్ పాఠశాలలపై తిరుగుబాటు మొదలైంది. ఆ స్కూల్‌బస్సులను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం దామరంచపల్లిలో గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మూడున్నరేళ్ల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. పాలకుర్తి మండలం గూడూరు సర్పంచ్ మాచర్ల పుల్లయ్య ప్రైవేటుస్కూళ్లకు నోటీ సులు జారీ చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూ ళ్లకే పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
నో ఎంట్రీ
ఘాట్‌రోడ్డు మూసివేతతో వెలవెలబోయిన ఆలయం ఏడంతస్తులు ఎక్కలేమంటున్న భక్తులు విజయవాడ : అనుకున్నదే అయ్యింది. దుర్గగుడి అధికారులు పంతం నెగ్గించుకున్నారు. టోల్‌గేటుకు తాళాలు వేశారు. ఇక.. భక్తులు కొండపైకి చేరుకోవాలంటే మల్లికార్జున మహామండపంలోని ఏడో అంతస్తులో వందల మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. లిఫ్టు సదుపాయం ఉన్నా.. అందరికీ ఉపయోగపడని పరిస్థితి. రెండు రోజులుగా పాత మెట్లమార్గం మీదుగా భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి ఆ ప్రాంతంలో క్లోక్‌రూమ్, సెల్‌ఫోన్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. వృద్ధులు, చిన్నపిల్లలతో భక్తులు మహామండపం మెట్లు ఎక్కలేక పాత మెట్లమార్గం వద్ద ఉన్న అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని వెనుదిరుగుతున్నారు. ఘాట్‌రోడ్డు వెలవెల నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే ఘాట్‌రోడ్డును మూసివేయడంతో ఆలయ ప్రాంగణం బుధవారం బోసిపోయింది. పొంగలి షెడ్డు, చెప్పుల స్టాండ్ చివరకు షాపింగ్ కాంప్లెక్స్‌లోని పూజా సామగ్రి దుకాణాల వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది. షాపుల్లో సిబ్బంది ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. భవానీ దీక్ష మండపం తొలగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ పరిపాలన విభాగ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ తొలగింపు పనులు రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ భవనాలను తొలగించేందుకు రూ.70 లక్షలతో అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 22 నుంచి నో ఎంట్రీ
మైసూరు : మైసూరు యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహం సందర్భంగా జూన్ 22 నుంచి 28వరకు మైసూరు ప్యాలెస్‌లో సామాన్యులకు ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు ప్యాలెస్ పాలక మండలి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27న రాజస్థాన్‌కు చెందిన త్రిషికా కుమారితో మైసూరు యువరాజుకు వివాహం జరగనుంది. అందులో భాగంగా 22 నుంచే ప్యాలెస్‌లో వేడుకలు మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ప్రవేశం నిషేధించాల్సిందిగా రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ సూచించడంతో పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రేపటి నుంచి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి * 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ * బృందాలతో ప్రత్యేక నిఘా * ఆర్ఐఓ పాత్రుని పాపారావు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో బుధవారం నుంచి 21వ తేదీ వరకూ జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియెట్ విద్యామండలి జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) పాత్రుని పాపారావు తెలిపారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన (ఉదయం 9 గంటల తరువాత) పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఆర్ఐఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డీఈసీ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 (47 ప్రభుత్వ, 49 ప్రైవేటు కళాశాలలు) కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు జనరల్, ఒకేషనల్, ప్రైవేటు, బ్యాక్లాగ్ ఇలా మొత్తం 59,385 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 29,549, ద్వితీయ సంవత్సరం 29,836 మంది ఉన్నారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాల్సిందేనన్నారు. గతంలో 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవారిని కూడా పరీక్షకు అనుమతించేవారని.. ఈ ఏడాది మాత్రం ఇంటర్‌బోర్డు అధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం 96 మంది సీఎస్‌లు, 96 మంది డీవోలు, 49మంది ఏసీఎస్‌లను, 19 మంది కస్టోడియన్లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని 37 పోలీస్స్టేషన్లకు ఇప్పటికే ప్రశ్నపత్రాలను చేరవేశామన్నారు. సెల్ఫ్‌సెంటర్లతోపాటు సమస్యాత్మక కేంద్రాలు, గతంలో కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు తనిఖీ బృందాలను నియమించామన్నారు. డీఈసీ కమిటీ, ఒక హైపవర్ కమిటీతోపాటు 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యత్‌శాఖ, వైద్యఆరోగ్యశాఖ, పోస్టల్‌శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఈసీ సభ్యులు సనపల ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జీ.వి.జగన్నాథరావు, హైపవర్ కమిటీ సభ్యుడు బొడ్డేపల్లి మల్లేశ్వరరావు, జిల్లా బల్క్ ఇన్‌చార్జిపేడాడ రాంబాబు, ఏవో సుధాకర్ పాల్గొన్నారు. సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణా ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 10 రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఎచ్చెర్ల-కింతలి, రణస్థలం-లావేరు, పోలాకి-ప్రియాగ్రాహారం, నౌపడ-పూండీ, భామిని-కొత్తూరు, కోల్లివలస-బూర్జ, పాలకొండ-సీతంపేట, సోంపేట-కంచిలి, పలాస-పెద్దమడి, టెక్కలి-నందిగాం, హరిపురం-మందస రూట్లలో పరీక్ష ప్రారంభానికి గంట ముందు, పరీక్ష పూర్తయిన 15 నిమిషాల తర్వాత బస్సులను నడపనున్నారు. -
అక్బరుద్దీన్‌కు నో ఎంట్రీ
ఏఐఎంఐఎం కీక నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పుణె పోలీసులు షాక్ ఇచ్చారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ) ఉప ఎన్నిక ప్రచారంలో అక్బర్ పాల్గొనేందుకు అనుమతించమని పుణె పోలీస్ కమిషనర్ శనివారం తేల్చిచెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే అక్బర్‌ను పుణెలోకి అనుమతించడంలేదని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం.. స్థానిక సంస్థలపైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎంసీలోని కోడ్వా వార్డులో తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఇక్కడ వచ్చే వారం పోలింగ్ జరగనుంది. ఈ వార్డులో 55 శాతం ఓట్లు ముస్లింలవే కావడం విశేషం. కాగా, అక్బరుద్దీన్ ఆదివారంనాడు కోడ్వాలో ప్రచారం చేయాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన పర్యటన డైలమాలో పడినట్లయింది. బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రధాని మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కేసు నమోదు కావటం తెలిసిందే. -
ఆరు దాటితే.. నో ఎంట్రీ
నంద్యాల: సాయంత్రం ఆరు గంటల తర్వాత నల్లమల అడవిలోకి ప్రవేశాలను నిలిపివేయాలని నంద్యాల అటవీ డీఎఫ్‌వో శివప్రసాద్ అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణలో భాగంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి వేళల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వాహనాలకు ప్రవేశం నిలిపివేస్తున్నామన్నారు. నల్లమలలోని పాములేటయ్య, గరుడాద్రి తదితర క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారు సాయంత్రమే అహోబిలం చేరుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలో సంచరిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు. -
ఎయిర్ పోర్ట్ సందర్శకులకు 'నో ఎంట్రీ'
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చూడాలనుకునేవారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. నేటి నుంచి ఈ నెల 30 వరకు విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చేవారికి అధికారులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల హెచ్చరికల ప్రకారం భద్రతా దృష్ట్యా ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల రక్షణా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరినీ తనిఖీ చేసి ఎయిర్ పోర్టు అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపు ఈ నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఉండనుంది. -
జైళ్లలోకి జర్నలిస్టులకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: జర్నలిస్టులు, ఎన్జీవో కార్యకర్తలు, సినీ, డాక్యుమెంటరీ దర్శకులను ఇక నుంచి జైళ్లలోకి అనుమతించరు. వీరు జైళ్లలోకి వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం, వార్తలు రాయడంపై కేంద్రం నిషేధం విధించింది. బ్రిటిష్ దేశస్థురాలు లెస్లీ ఉడ్విన్ బీబీసీ కోసం తీసిన నిర్భయ డాక్యుమెంటరీపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపారు. ఇలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీల వల్ల సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తే... రాష్ట్రాలు అనుమతి జారీచేయవచ్చు. ఇలాంటి పనులపై జైలులోకి వెళుతున్న వారు రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండీక్యామ్, కెమెరా లేదా రికార్డర్లను మాత్రమే అనుమతిస్తారు. జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే ఖైదీలతో మాట్లాడాల్సి ఉంటుంది. రికార్డరు లేదా వీడియో కెమెరాను 3 రోజులు సూపరింటెండెంట్‌కు అప్పగించాలి. ఆయన ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే ఆ భాగాన్ని తొలగిస్తారు. ఖైదీలతో మాట్లాడి రాసే ఆర్టికల్స్ ప్రచురించే ముందు జైళ్లశాఖ ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి. -
కౌంటింగ్ హాలులోకి మీడియాకు నో ఎంట్రీ..
-
నో ఎంట్రీ @ ఏపీ సెక్రటేరియట్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బుధవారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారం వద్ద రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. కనీసం సచివాలయం ఉద్యోగులను కూడా అనుమతించడంలేదు. ఉద్యోగులు, సందర్శకులు లుంబినీ పార్కువైపు ఉన్న ద్వారం గుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా సెక్రటేరియట్ లో పలువురు మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ( ఆరున్నర గంటపాటు) ఏపీ క్యాబినెట్ సుదీర్ఘంగా సమావేశమైంది. -
31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్
-
31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్
హెదరాబాద్ : చారిత్రక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనుల్లో భాగంగా చేపడుతున్న నాలా మళ్లింపు పనుల కారణంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించారు. లిబర్టీ నుంచి రాణిగంజ్ వరకు వాహనాల రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుద్ధభవన్ నుంచి రాణిగంజ్- కలాసీగూడ నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మళ్లించేందుకు భారీ పైప్‌లైన్ వేయనున్నందున ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతులు తీసుకొని రాకపోకలు నిలిపివేసినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు సాగర్‌లోకి చేరకుండా నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించేందుకు సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నాలా మళ్లింపు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ప్రకాశ్‌నగర్- నెక్లెస్‌రోడ్డు - పి.వి.ఘాట్- జీహెచ్ఎంసీ హెర్బల్ గార్డెన్- మారియట్ హోటల్ మార్గాల్లోనూ నాలా మళ్లింపు పనులను యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు జలమండలి ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి తెలిపారు. -
చెన్నైలో లంక ఆటగాళ్లకు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: ఈసారి కూడా చెన్నైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఈనెల 9న చెన్నైతో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ దూరంకానున్నాడు. వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన మ్యాథ్యూస్ ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడు. లంకలో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా గత రెండేళ్ల నుంచి ఆ దేశ ఆటగాళ్లు చెన్నైలో ఆడేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఈసారి కూడా లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడేందుకు అనుమతి లేదని టీఎన్‌సీఏ సెక్రటరీ జనరల్ కాశీ విశ్వనాథన్ తెలిపారు. -
నిమిషం ఆలస్యమైనా...నో ఎంట్రీ
గుంటూరు ఎడ్యుకేషన్ : ఏప్రిల్ 4న జరగనున్న జేఈఈ (మెయిన్స్) పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు గుంటూరు కేంద్రం కో-ఆర్డినేటర్ నామినేని కోటేశ్వరరావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పరీక్ష రాసేందుకు గుంటూరు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. నగరంతో పాటు సమీప మండలాల్లోని విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన 43 కేంద్రాల్లో పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. 4వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 ఇంజినీరింగ్ పరీక్షకు 29,083 మంది, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 కేంద్రాల్లో జరిగే పేపర్-2 బీఆర్క్, ప్లానింగ్ పరీక్షలకు 7,399 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంజినీరింగ్, బీఆర్క్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని కోటేశ్వరరావు సూచించారు. విద్యార్థులు ఒకరోజు ముందుగానే కేంద్రాలకు వెళ్లి స్వయంగా పరిశీలించాలని చెప్పారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తి లేదని, దీనిపై సీబీఎస్ఈ బోర్టు కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారుల బృందం ఏప్రిల్ 3వ తేదీన గుంటూరు వచ్చి ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులతో సమావేశం కానున్నారని వివరించారు. రవాణా ఏర్పాట్లు గుంటూరు నగరానికి సమీప మండలాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు హోటళ్లలో రూమ్‌లను సాధారణ ధరకే అద్దెకు ఇచ్చే విధంగా ఆయా యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారని వివరించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను జేఈఈ మెయిన్స్.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణలో మనమే టాప్ జేఈఈ నిర్వహణలో గుంటూరు జిల్లా జాతీయస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సొంతం చేసుకుందని కోటేశ్వరరావు చెప్పారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో గతఏడాది ఈ పరీక్ష నిర్వహించిన సీబీఎస్ఈ బోర్డు గుంటూరు మినహా మరే ఇతర నగరంలోనూ పెద్దస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవని గుర్తించిందన్నారు. -
రెండో రోజు కూడా విలేకరులకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: సచివాలయం వద్ద విలేకరులకు రెండోరోజు కూడా చేదు అనుభవమే ఎదురైంది. అర్వింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సచివాలంలోకి రాకుండా వరుసగా రెండోరోజు మంగళవారం కూడా అడ్డుకోవడంపట్ల విలేకరులు అసహనం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మొదటి పనిదినమైన సోమవారం కూడా సచివాలయంలోకి రాకుండా కొంతమంది విలేకరులు, టీవీ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై సచివాలయం భద్రతా విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులను లోపలికి రానివ్వద్దంటూ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందాయన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. రెండు రోజులుగా సచివాలయం వద్ద ఎదురవుతున్న చేదు అనుభవంతో ప్రభుత్వ వైఖరిపై విలేకరులు మండిపడుతున్నారు. ‘సోమవారం సచివాలయంలోనికి రాకుండా అడ్డుకున్నారు. మంగళవారం రోజున లోపలికి అనుమతించవచ్చని ఆశించాం, కానీ ఈ మూర్ఖపు ప్రభుత్వం ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని విలేకరి ఒకరు పేర్కొన్నారు. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సివిల్స్ పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ హాల్‌టికెట్, ఈ-అడ్మిట్ కార్డు తప్పనిసరిగా చూపించాలి సెల్ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురావద్దు విజయవాడ: అఖిల భారత సివిల్ సర్వీసుల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించవద్దని పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఆదివారం నగరంలో జరగనున్న సివిల్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం నలంద కళాశాలలో ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష సమయం దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించవద్దన్నారు. కేంద్రాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లను చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఇ-అడ్మిట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలన్నారు. ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోనులు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ ఆర్.ఆర్.పురి కూడా పాల్గొన్నారు. -
నిమిషం లేటైనా... నో ఎంట్రీ
కన్వీనర్ ఎన్వీ రమణరావు రేపే ఎంసెట్-2014 ప్రవేశపరీక్ష నగరంలో 8 జోన్లు.. 148 పరీక్ష కేంద్రాలు గ్రేటర్ నుంచి 81,445 మంది అభ్యర్థులు మెడిసిన్‌కు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికం సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)-2014 గురువారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం. నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాం’ అని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు పేర్కొన్నారు. నగరంలో ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన విలేకరులకు వివరించారు. మరో 24గంటల్లో ఎంసెట్ పరీక్షకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. కన్వీనర్ ఏం చెప్పారంటే.. నగరంలో మెట్రోపనులు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వారి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెడికల్ పరీక్ష ఉన్న కేంద్రాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించాం. గతంలో మాదిరిగానే ‘నిమిషం లేటు’ నిబంధన ఈసారి కూడా అమల్లో ఉంది. ఒక్క నిమిషం లేటైనా అనుమతించం. అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకుంటే మేలు. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం ఎక్కడుందోనన్న హైరానా తప్పుతుంది. అలాగే ఒక అభ్యర్థి వెంట అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు వీలైనంత వరకు(ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా) రాకుండా ఉంటే మంచిది. అభ్యర్థులు తమ వెంట కేవలం బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు ఫారం, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారైతే కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలు.. వగైరా గ్యాడ్జెట్లు నిషేధం. తెల్లకాగితం తెచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండే హోటళ్లు, దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలపై మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా ఉంటుంది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. 24న ప్రాథమిక కీ ప్రకటిస్తాం. వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని వెలువరిస్తాం. జూన్ 9న ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశాం. దళారులను నమ్మొద్దు. ప్రలోభాలకు గురికావద్దు. మాయమాటలు చెబుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు గానీ, ఎంసెట్ అధికారులకు గానీ తెల్పండి. ఎంసెట్ ప్రక్రియంతా పారదర్శకంగా ఉంటుంది. 81,445మంది అభ్యర్థులు ఎంసెట్-2014కి నగరం నుంచి 81,445మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 58242మంది అభ్యర్థులు ఉండగా, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23203మంది అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 37,644మంది ఉండగా, అమ్మాయిలు 20,598మంది ఉన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌కు మాత్రం అబ్బాయి కంటే అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష 7197మంది అబ్బాయిలు రాస్తుండగా, రెట్టింపు సంఖ్యలో 16006 మంది అమ్మాయిలు రాస్తున్నారు. నగరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 100 కేంద్రాలు, మెడికల్ పరీక్షకు ఏకంగా 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
కిరణ్ ఉన్నారు...ఇటువైపు రాకండి
హైదరాబాద్ : స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాలులో శుభకార్యాలున్నప్పుడే ఆ ప్రాంతం బిజీబిజీగా ఉండేది.... విఐపీలు వచ్చినప్పుడే పోలీసుల హడావుడి కనిపించేది... అయితే రెండు రోజులుగా అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో సామాన్యులు అటువైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించటం లేదు. దీంతో సమీప భవనాల్లో నివాసముండే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మాదాపూర్‌లోని కృతిక లేఅవుట్లోని ఓ భవనంలో కిరణ్ రెండు రోజులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాను ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి ఆ భవనాన్నే కార్యాలయంగా ఉపయోగిస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో పరిసర భవనాల్లోని వారంతా గగ్గోలు పెడుతున్నారు. బారికేడ్లు అమర్చి అటువైపు ఎలాంటి వాహనాలను అనుమతించకపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అక్కడి రెండు భవనాల్లో సాప్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మంచినీరు తీసుకొచ్చే వాహనాలనూ అనుమతించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా వుండగా, కిరణ్ కుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్న భవనంలో పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దీంతో వాహనాలను ఖాళీ స్థాలాలు, రోడ్ల పక్కన, సమీపంలోని ఫంక్షన్ హాల్లో పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.