Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’ | Womens entry banned in tourist places in Pakistan | Sakshi
Sakshi News home page

Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’

Published Mon, Jul 18 2022 2:10 AM | Last Updated on Mon, Jul 18 2022 2:11 AM

Womens entry banned in tourist places in Pakistan  - Sakshi

ఇస్లామాబాద్‌: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది.

బజౌర్‌ గిరిజన జిల్లా సలార్‌జాయ్‌ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్‌ ఉలేమా–ఇ–ఫజుల్‌(జేయూఐ–ఎఫ్‌) జిల్లా చీఫ్‌ మౌలానా అబ్దుర్‌ రషీద్‌ నేతృత్వం వహించారు. పాక్‌ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్‌ ప్రధాన భాగస్వామి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement