unanimous resolution
-
Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి
చెన్నై: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2021 నుంచి వాయిదాపడుతున్న జన గణనను వెంటనే చేపట్టాలని, ఇందులో భాగంగా కుల గణన కూడా చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో కోరారు. ‘భారత్‌లోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా సమాన అవకాశాలు అందాలంటే కుల గణన తప్పనిసరి అని శాసనసభ భావిస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నారు. -
విపక్ష నేతగా రాహుల్
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయితే తనకు కాస్త సమయం కావాలని ఈ బాధ్యత స్వీకరించే విషయమై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాహుల్ చెప్పారు. ఖర్గే, రాహుల్‌తో పాటు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. 32 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 26 మంది శాశ్వత ఆహా్వనితులు, 12 మంది ప్రత్యేక ఆహా్వనితులు, 29 మంది పీసీసీ అధ్యక్షులు, 18 మంది సీఎల్పీ నేతలతో పాటు మరో 35 మంది వీరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భేటీ ప్రధానంగా చర్చించింది. ‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాపాడేందుకు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పోరాడింది. సమర్థమైన ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, సామాజిక విజన్‌ను ప్రజల ముందుంచింది. వారు కూడా తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు పట్టం కట్టారు. అందుకు దేశ ప్రజలకు అభినందనలు. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవన పథంలో నిలిపినందుకు కృతజ్ఞతలు’’ అంటూ మరో తీర్మానం ఆమోదించింది. ‘‘పదేళ్ల మోదీ పాలనను ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. తన పేరుతోనే ఓట్లడిగిన మోదీకి ఇది రాజకీయ నష్టం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, నైతికంగా ఓటమి కూడా! ఆయన అవాస్తవ, విద్వేష, విభజన ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టారు’’ అని తీర్మానం పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక పార్టీని అద్భుతంగా ముందుకు నడిపారంటూ అభినందించింది. ‘‘ముఖ్యంగా పార్టీ అద్భుత ప్రదర్శనలో రాహుల్‌ది కీలక పాత్ర. భారత్ జోడో, భారత్ జోడో న్యాయ్ యాత్రలను స్వయంగా రూపొందించి విజయవంతం చేశారు’’ అంటూ ప్రశంసించింది. ఈ ఎన్నికల్లో రాహుల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అభివరి్ణంచారు. విద్వేష రాజకీయాలకు చెంప పెట్టు: ఖర్గే ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా పలు రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల్లో తక్షణ దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని భేటీ నిర్ణయించింది. ప్రారం¿ోపన్యాసం చేసిన ఖర్గే ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్‌కు పునరుజ్జీవంగా, విద్వేష, విభజన రాజకీయాలకు చెంపపెట్టుగా అభివరి్ణంచారు. పార్లమెంటు బయటా లోపలా ఇండియా కూటమి కలసికట్టుగా పని చేయాలని నొక్కి చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రాల్లో ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయామని కర్నాటక, తెలంగాణలను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తేల్చేందుకు అతి త్వరలో రాష్ట్రాలవారీగా ప్రత్యేకంగా మథనం జరుపుతామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రతి చోటా కాంగ్రెస్‌కు సీట్లు, ఓట్ల శాతం పెరిగాయని ఖర్గే అన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా పలు రాష్ట్రాల్లో అద్భుతంగా పని చేశాయంటూ అభినందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రాబల్య స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాం. పట్టణ ప్రాంతాల్లో పట్టును మరింతగా పెంచుకోవాల్సి ఉంది’’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. రాష్ట్రాలవారీ కమిటీలు పరిస్థితులను క్షుణ్నంగా సమీక్షించి అధ్యక్షునికి నివేదిక సమరి్పస్తాయని జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు.పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పారీ్టకి పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా, విపక్ష నేత పదవి దక్కాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10 శాతం వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కాంగ్రెస్‌కు 2014లో 44, 2019లో 52 మాత్రమే రావడం తెలిసిందే. -
Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’
ఇస్లామాబాద్: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. బజౌర్ గిరిజన జిల్లా సలార్జాయ్ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్ ఉలేమా–ఇ–ఫజుల్(జేయూఐ–ఎఫ్) జిల్లా చీఫ్ మౌలానా అబ్దుర్ రషీద్ నేతృత్వం వహించారు. పాక్ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్ ప్రధాన భాగస్వామి. -
అత్యుత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు..
సాక్షి, విజయవాడ: కేవలం 18 నెలల కాలంలోనే సీఎం జగన్మోహన్రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా గుర్తింపు తెచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంశల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా సీఎం జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు.. ఆయన ఇమేజ్ను దెబ్బ తీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని, అధికారులను బెదిరించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఏమాత్రం సబబు కాదని మంత్రి బొత్స మండిపడ్డారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలన్నవి తాము వచ్చాక మొదలు పెట్టినవి కావని, 2001 లోనే ఏకగ్రీవాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించుకున్నారన్న ఎస్ఈసీ భాష ఏమాత్రం బాగోలేదని ఆయన విమర్శించారు. గ్రామాల ప్రగతికి ఏకగ్రీవాలు తోడ్పడతాయి.. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల విషయంలో అతని ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండి పడ్డారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న అధికారలపై కక్షపూరితంగా వ్యవహరించడం అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులకు తగదని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఏ అధికారికి అన్యాయం జరగదని ఆయన భరోసాను ఇచ్చారు. ఏకగ్రీవాల విషయంలో.. గతంలో ప్రోత్సాహకాలు బాగున్నాయని వ్యాఖ్యానించిన నిమ్మగడ్డ, ఇప్పుడు వేరే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్ది వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు జరిగితే గ్రామాల్లో ఎలాంటి గొడవలు ఉండవని, అందుకే మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో మంచి పాలనా వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలకు సంబందించి గతేడాది మార్చిలోనే అదేశాలిచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఏకగ్రీవాలు ఎంతో తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని మంత్రి స్పష్టం చేశారు. -
మీ అయ్య జాగీరా?
సాక్షి నెట్వర్క్: ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఇక్కడ ముస్లింలు, గిరిజనుల జనాభా పెరిగింది. వారి జనాభా ఆధారంగా విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు పెరగాల్సిన అవసరం ఉంది. వారి రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా.. ప్రధాని మోదీ ఇవ్వనంటున్నారు. భారతదేశం మీ అయ్య జాగీరా.. మేం ఇవ్వం అని అంత అహంకారంగా ఎలా మాట్లాడతారు’అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు 50శాతానికి మించ కూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రజల మనోభావాల మేర నిర్ణయాలు తీసుకోని పక్షంలో దేశంలో ఆందోళనలు చెలరేగుతాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్, మెదక్ జిల్లా నర్సాపూర్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్గల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘ప్రధాని మోదీ నిజామాబాద్‌లో మాట్లాడినవి ఝూటా మాటలు. దేశ ప్రధాని హోదాలో అలా మాట్లాడాల్సింది కాదు. ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. తెలంగాణలో ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. ప్రజల దగ్గర మోదీ అయినా కేసీఆర్ అయినా ఒక్కటే. అబద్దాలు మాట్లాడితే చెల్లదు. మేం గొర్రెలం అనుకున్నావా? అడ్డం పొడవు మాట్లాడుతున్నవ్.. తెలంగాణలో కరెంటు బాగాలేదని, మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. నిజామాబాద్‌ల అయినా, బాన్సువాడలో అయినా కరెంటు పోతుందా? ఇంత మంచి కరెంటు ఇస్తుంటే ప్రధాని అబద్ధాలు చెప్పారు. ఒకవేళ కాంగ్రె సోళ్లు అధికారంలోకి వస్తే కరెంటు పోతుంది తప్ప టీఆర్ఎస్ పాలనలో కరెంటు పోయే ముచ్చట లేదు’అని కేసీఆర్ స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్.. పెద్ద బోగస్.. మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం పెద్ద బోగస్ అని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 20 శాతం మందికి కూడా ఈ పథకం వర్తించదని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు వివరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మోదీ ఏజెంటు, బీజేపీ రాష్ట్ర «అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చిత్తశుద్ధి ఉంటే మీ ఆయుష్మాన్ స్కీం బాగుందో..? మా స్కీమ్‌లు బాగున్నాయో? సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ‘బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రూ.వెయ్యి పింఛన్ ఇస్తున్నారా? కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారా? రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారా? మీరు మాట్లాడింది వింటానికి మేం పిచ్చోళ్లమా? తెలంగాణ అగ్గువ దొరికిందా? మోదీ, అమిత్‌షా, సోనియా, రాహుల్ గాంధీ, సీపీఐ, సీపీఎం.. వీళ్లకు చివరకు చంద్రబాబు నాయుడు తోడయిండు’అని కేసీఆర్ దుయ్యబట్టారు. నాలుగు పార్టీలు కాదు.. నలభై పార్టీలు ఏకమైనా తమను ఏమీ చేయలేరని ఉద్ఘాటించారు. దేశం మీద బీజేపీ, కాంగ్రెస్ పెత్తనం ఎక్కువైందని, అధికారం గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిలో 2 పార్టీలు దుర్మార్గ పాలన చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీతో సంబంధం లేని ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాల హక్కుల నెరవేరుతాయని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పథకాలు రద్దే: హరీశ్ కాంగ్రెస్ గెలిస్తే పథకాలన్నీ రద్దవుతాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. తండాలు, పల్లెల్లో భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంటు లేకుంటే వార్తగా మారిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ శనిని తెచ్చుకుంది... ‘తెలంగాణను అడ్డుకుని, రాష్ట్ర ప్రాజెక్టుల మీద కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబును కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుని తెస్తోంది. మన ఇజ్జత్ కా సవాల్.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద చంద్రబాబు పెత్తనం అవసరమా? చంద్రబాబును నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ శనిని తెచ్చుకుని నష్టపోయింది’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్‌ను తానే కట్టిన అంటడని, చార్మినార్‌ను గూడ కట్టిండేమోనని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో పాలన సాఫీగా సాగుతోంది. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడడమే బంగారు తెలంగాణ లక్ష్యం’అని స్పష్టంచేశారు. ఎన్నికలు అంటే కుల, మత గజ్జితోపాటు డబ్బు, మద్యం సరఫరా జరుగుతుందని, అలాంటి పిచ్చి వేషాలు పోవాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి అయోమయం లేదని.. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు ఉంటే మరోవైపు టీఆర్ఎస్ ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల క్షేమం కోరే టీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. కేసీఆర్ గజ్వేల్ ప్రచారం వాయిదా సాక్షి, హైదరాబాద్: సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం వాయిదా పడింది. బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రచారం చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో దీన్ని వాయిదా వేశారు. సీఎం వచ్చే వారం అక్కడ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్‌లోనూ భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పరేడ్‌గ్రౌండ్స్‌లో డిసెంబర్ 3న ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు సైతం మొదలుపెట్టింది. అయితే రక్షణ శాఖ కార్యక్రమాలు, ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన అదేరోజు ఉండటంతో టీఆర్ఎస్ సభ నిర్వహణకు అనుమతులు రాలేదు. దీంతో మరోరోజు ఈ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా గజ్వేల్‌లోనే ఈ సభ నిర్వహించే అంశాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 2 లేదా 4న ఈ సభ జరగనున్నట్లు సమాచారం. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు బాన్సువాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి -
ఇదొక ఏకగ్రీవ తీర్మానం!
అక్షర తూణీరం అలా మొదలైంది.. కొందరు దిష్టి దెబ్బ తగిలిం దన్నారు. మరి కొందరు ప్రభు త్వ వైఫల్యం అన్నారు. ఇంకొం దరు అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించారు. నెపం ఏదైతేనే మిగాని దీని విలువ ముప్ఫై నిండు ప్రాణాలు, కొన్ని అంగ వైకల్యాలు. ‘‘నీవే కారణమింతకు...’’ అంటూ ప్రతి పక్షులు ముఖ్యమంత్రిని ఎత్తిపొడిచారు. పనిలో పనిగా, ఆనవాయితీగా, రాజీనామా చెయ్యాల్సిందేనని డిమాం డ్ చేశారు. చెయ్యక్కర్లేదని వీరికీ వారికీ కూడా తెలుసు. చెయ్యరని ప్రజలకు తెలుసు. ఇటీవలి కాలంలో మనది ప్రజారాజ్యమనే భావన కలగడం లేదు. రాజ్యాలు, రాజులు, రాజ్యాధికారాలు, యివే తలపిస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు, ఐపీలు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కడైనా కావచ్చుగాని కొన్ని చోట్ల అధికుల మనరాదు. తిరుపతి లాంటి దైవ క్షేత్రంలో ‘‘వీవీఐపీ’’ బోర్డులు కనిపించినపుడు కొంచెం నవ్వు వస్తుంది. దైవ సన్నిధిలో ఎవరహో యీ వీవీఐపీ అనిపిస్తుంది. ప్రత్యేక ద్వారాల్లోంచి వందిమాగధులతో సహా క్షణంలో వెళ్లి, గంటసేపు సేవించి, చాలా పుణ్యం మూటకట్టానని మురిసిపోయే వివిఐపిలను చూస్తే జాలేస్తుంది. ఆ ఆర్భాటంలో దేవుడి ముందు నిలబడేది ఆయన గారి అహంకారమే గాని ఆయన కాదు. ఎవరెవరో, ఎవరేమిటో మూలవిరాట్ గుర్తించలేదా? గుర్తించలేకపోతే దేవుడే కాదు. కొండ మీద గుడి కడుతున్నారు. ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, రకరకాల చెక్కడాలతో అదొక మహానిర్మాణం. ఆ రోజుల్లో ఆధునిక సదుపాయాలు లేవు. బండరాళ్లని మనుష్యులు, కంచర గాడిదలు, ఏనుగులు కొండమీదికి చేరవేస్తున్నాయి. ఆలయ నిర్మాణం మహా యజ్ఞంగా సాగి పూర్తయింది. రేపటి రోజు ఆలయ మహా కుంభాభిషేకం. సిద్ధాంతులు, స్వాములు, ఆగమ పండితులు ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిలాఫలకంపై ‘‘ ఫలానా రాజు నిర్మించిన ’’ అంటూ బిరుదు నామాలతో సహా చెక్కి అక్షరాలకు బంగరుపూత పెట్టారు. తీరా ముహూర్తం వేళకి ఆ శిలాఫలకంలో వేరే పేరు కనిపించింది. అంతా కలకలం చెలరేగింది. పని చేస్తున్న రోజుల్లో అక్కడ శ్రమించిన గాడిదలకు పచ్చిక మేత అందించి, నీళ్లు తాగించిన ఒక వృద్ధుని పేరు ఆ ఫలకం మీద వెలిసింది! అందుకని నిజానిజాలు దేవుడికి తెలుస్తాయి. పుష్కరాల్లో, విఐపి ఘాట్లను రూపొందించారు. అయితే, ఫలానా ఘట్టంలోనే పుణ్యం పురుషార్థమని సీఎం గారి వ్యక్తిగత సిద్ధాంతులు ధ్రువీకరించారు. ఇక రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పుష్కర జలాల్లో నేత యోగా నుంచి సినిమా సీన్స్ దాకా చేశారు. సామాన్య ప్రజ ఏమైపోయినా అధికార యంత్రాంగానికి పట్టదు. వాళ్లందరికీ పెద్ద సార్ ఒక్కరే పడతారు. ఇక తర్వాత జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసి విలపించాం. పుష్కర స్పెషల్ ఆఫర్‌గా ఎక్స్‌గ్రేషియా ప్రాణానికి పది లక్షల చొప్పున ప్రకటించి ముఖ్యమంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. ఇలాంట ప్పుడు అపోజిషన్ వారు ఇరవై, పాతికా అంటూ పై పాట పాడతారు. ఇదంతా మామూలే. జరిగిన వైఫల్యాన్ని, విషాదాన్ని మరిపించాలని అటునుంచి కృషి జరుగుతోంది. ఈ మహా విషాదానికి చిహ్నంగా, ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతి స్తూపాన్ని గోదావరి పుష్కర ఘాట్‌లో నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాను. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)