సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం.. సమయం కావాలన్న అగ్ర నేత
ఫలితాలు మోదీకి నైతిక ఓటమి
మరో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం
కాంగ్రెస్ ప్రదర్శన బాగుందంటూ కితాబు
రాణించని రాష్ట్రాల్లో దిద్దుబాటుకు కమిటీలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయితే తనకు కాస్త సమయం కావాలని ఈ బాధ్యత స్వీకరించే విషయమై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాహుల్ చెప్పారు.
ఖర్గే, రాహుల్‌తో పాటు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. 32 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 26 మంది శాశ్వత ఆహా్వనితులు, 12 మంది ప్రత్యేక ఆహా్వనితులు, 29 మంది పీసీసీ అధ్యక్షులు, 18 మంది సీఎల్పీ నేతలతో పాటు మరో 35 మంది వీరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భేటీ ప్రధానంగా చర్చించింది.
‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాపాడేందుకు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పోరాడింది. సమర్థమైన ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, సామాజిక విజన్‌ను ప్రజల ముందుంచింది. వారు కూడా తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు పట్టం కట్టారు. అందుకు దేశ ప్రజలకు అభినందనలు.
కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవన పథంలో నిలిపినందుకు కృతజ్ఞతలు’’ అంటూ మరో తీర్మానం ఆమోదించింది. ‘‘పదేళ్ల మోదీ పాలనను ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. తన పేరుతోనే ఓట్లడిగిన మోదీకి ఇది రాజకీయ నష్టం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, నైతికంగా ఓటమి కూడా! ఆయన అవాస్తవ, విద్వేష, విభజన ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టారు’’ అని తీర్మానం పేర్కొంది.
ఈ ఎన్నికల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక పార్టీని అద్భుతంగా ముందుకు నడిపారంటూ అభినందించింది. ‘‘ముఖ్యంగా పార్టీ అద్భుత ప్రదర్శనలో రాహుల్‌ది కీలక పాత్ర. భారత్ జోడో, భారత్ జోడో న్యాయ్ యాత్రలను స్వయంగా రూపొందించి విజయవంతం చేశారు’’ అంటూ ప్రశంసించింది. ఈ ఎన్నికల్లో రాహుల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అభివరి్ణంచారు.
విద్వేష రాజకీయాలకు చెంప పెట్టు: ఖర్గే
ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా పలు రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల్లో తక్షణ దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని భేటీ నిర్ణయించింది. ప్రారం¿ోపన్యాసం చేసిన ఖర్గే ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్‌కు పునరుజ్జీవంగా, విద్వేష, విభజన రాజకీయాలకు చెంపపెట్టుగా అభివరి్ణంచారు.
పార్లమెంటు బయటా లోపలా ఇండియా కూటమి కలసికట్టుగా పని చేయాలని నొక్కి చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రాల్లో ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయామని కర్నాటక, తెలంగాణలను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తేల్చేందుకు అతి త్వరలో రాష్ట్రాలవారీగా ప్రత్యేకంగా మథనం జరుపుతామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రతి చోటా కాంగ్రెస్‌కు సీట్లు, ఓట్ల శాతం పెరిగాయని ఖర్గే అన్నారు.
ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా పలు రాష్ట్రాల్లో అద్భుతంగా పని చేశాయంటూ అభినందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రాబల్య స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాం. పట్టణ ప్రాంతాల్లో పట్టును మరింతగా పెంచుకోవాల్సి ఉంది’’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. రాష్ట్రాలవారీ కమిటీలు పరిస్థితులను క్షుణ్నంగా సమీక్షించి అధ్యక్షునికి నివేదిక సమరి్పస్తాయని జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు.
పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా
కాంగ్రెస్ పారీ్టకి పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా, విపక్ష నేత పదవి దక్కాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10 శాతం వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కాంగ్రెస్‌కు 2014లో 44, 2019లో 52 మాత్రమే రావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment