CWC decision
-
విపక్ష నేతగా రాహుల్
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయితే తనకు కాస్త సమయం కావాలని ఈ బాధ్యత స్వీకరించే విషయమై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాహుల్ చెప్పారు. ఖర్గే, రాహుల్‌తో పాటు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. 32 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 26 మంది శాశ్వత ఆహా్వనితులు, 12 మంది ప్రత్యేక ఆహా్వనితులు, 29 మంది పీసీసీ అధ్యక్షులు, 18 మంది సీఎల్పీ నేతలతో పాటు మరో 35 మంది వీరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భేటీ ప్రధానంగా చర్చించింది. ‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాపాడేందుకు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పోరాడింది. సమర్థమైన ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, సామాజిక విజన్‌ను ప్రజల ముందుంచింది. వారు కూడా తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు పట్టం కట్టారు. అందుకు దేశ ప్రజలకు అభినందనలు. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవన పథంలో నిలిపినందుకు కృతజ్ఞతలు’’ అంటూ మరో తీర్మానం ఆమోదించింది. ‘‘పదేళ్ల మోదీ పాలనను ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. తన పేరుతోనే ఓట్లడిగిన మోదీకి ఇది రాజకీయ నష్టం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, నైతికంగా ఓటమి కూడా! ఆయన అవాస్తవ, విద్వేష, విభజన ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టారు’’ అని తీర్మానం పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక పార్టీని అద్భుతంగా ముందుకు నడిపారంటూ అభినందించింది. ‘‘ముఖ్యంగా పార్టీ అద్భుత ప్రదర్శనలో రాహుల్‌ది కీలక పాత్ర. భారత్ జోడో, భారత్ జోడో న్యాయ్ యాత్రలను స్వయంగా రూపొందించి విజయవంతం చేశారు’’ అంటూ ప్రశంసించింది. ఈ ఎన్నికల్లో రాహుల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అభివరి్ణంచారు. విద్వేష రాజకీయాలకు చెంప పెట్టు: ఖర్గే ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా పలు రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల్లో తక్షణ దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని భేటీ నిర్ణయించింది. ప్రారం¿ోపన్యాసం చేసిన ఖర్గే ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్‌కు పునరుజ్జీవంగా, విద్వేష, విభజన రాజకీయాలకు చెంపపెట్టుగా అభివరి్ణంచారు. పార్లమెంటు బయటా లోపలా ఇండియా కూటమి కలసికట్టుగా పని చేయాలని నొక్కి చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రాల్లో ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయామని కర్నాటక, తెలంగాణలను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తేల్చేందుకు అతి త్వరలో రాష్ట్రాలవారీగా ప్రత్యేకంగా మథనం జరుపుతామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రతి చోటా కాంగ్రెస్‌కు సీట్లు, ఓట్ల శాతం పెరిగాయని ఖర్గే అన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా పలు రాష్ట్రాల్లో అద్భుతంగా పని చేశాయంటూ అభినందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రాబల్య స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాం. పట్టణ ప్రాంతాల్లో పట్టును మరింతగా పెంచుకోవాల్సి ఉంది’’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. రాష్ట్రాలవారీ కమిటీలు పరిస్థితులను క్షుణ్నంగా సమీక్షించి అధ్యక్షునికి నివేదిక సమరి్పస్తాయని జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు.పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పారీ్టకి పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా, విపక్ష నేత పదవి దక్కాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10 శాతం వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కాంగ్రెస్‌కు 2014లో 44, 2019లో 52 మాత్రమే రావడం తెలిసిందే. -
నేడు శివసేనతో భేటీ
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్‌వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్నా? ఆదిత్యనా? శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్‌నేతలు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ ఆమోదం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, ఉద్ధవ్ భేటీ ఉండదు సోనియాగాంధీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు. పవార్, ఠాక్రే భేటీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ‘డిప్యూటీ’ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున బాలాసాహెబ్ తోరట్ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి. -
దమ్ముంటే సీడబ్ల్యూసీ నిర్ణయంపై వ్యతిరేక తీర్మానం చేయండి
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘‘పార్టీ అధిష్ఠానం ముందు ఒక తీరుగా, బయటకు వచ్చిన తర్వాత మరోతీరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగాట ఆడుతున్నారు. ఆ పార్టీ మంత్రి వట్టి వసంతకుమార్ శాసన సభలో మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిందని.., దీనిని కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. శాసన సభలో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ.. బయటకు వచ్చి చె ట్ట పట్టాలు వేసుకుంటున్నారని అన్నారు. టీడీపీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇరుపార్టీలు తెలంగాణ విషయంలో నాటకాలు ఆడుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, చర్చలు, ఓటింగ్‌తో కాలయాపన చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగదన్నారు. జనవరి 23 తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని చెప్పారు. ఢిల్లీలో అమ్ఆద్మీ పార్టీ కార్యాలయంపై బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అన్నారు. కాదుపొమ్మన్నా... టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ వెంటే తిరగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు సిద్ది వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు పాల్గొన్నారు. -
సీడబ్ల్యూసీ ‘విభజన’ నిర్ణయం శిరోధార్యం: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానమే తమకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు వినిపిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన బొత్స బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తొలి నుంచి ప్రాంతాల వారీగా ఎవరి వాదన వారు చెబుతున్నారని, ఇప్పటికీ ఎవరూ మాట మార్చలేదన్నారు. అఖిలపక్షంలో కూడా అదే వాదనలను వినిపించామని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ తమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను వినిపిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ప్రాంతాల వారీగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు చెబుతారన్నారు. అసెంబ్లీలో బిల్లుపై మెజార్టీ, మైనార్టీ అనేది ఏమీ ఉండదని, విప్ కూడా ఉండదని చెప్పారు. కేంద్ర మంత్రి షిండేను తాను రహస్యంగా కలవలేదని, అందరి ఎదుట రాష్ట్రానికి రావలసిన తుపాను సహాయక నిధులు విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చానని తెలిపారు. జీవోఎం ముందుకు రావాలని తనను పిలవలేదని, పిలిస్తే వెళ్తానన్నారు. ముఖ్యమంత్రికి జీవోఎం నుంచి పిలుపు వచ్చిన విషయం తనకు తెలియదన్నారు. జీవోఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన నివేదిక గురించి ప్రస్తావించగా అలాంటి నివేదిక పంపినట్లు తనకు తెలియదని చెప్పారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, అది కేంద్రం పరిధిలో విషయమని అన్నారు. -
సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం:సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సమైక్యాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 9 మంది మంత్రులు హాజరయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. తమని రాజీనామాలు చేయమనడం సమైక్యవాదులకు తగదన్నారు. రెండు మూడు రోజులలో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ వెనక్కి తీసుకోదు: భక్త చరణ్ దాస్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విధివిధానాలు కొనసాగుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ సోమవారం వెల్లడించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోదు అని భక్తచరణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విదేశాల నుంచి రాగానే హోంశాఖ తయారు చేసిన కేబినేట్ నోట్ కు రాజకీయ అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటామని ఆదివారం హోంశాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఆందోళనలు సోమవారానికి 41 రోజుకు చేరుకుంది.