తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు.
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సమైక్యాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 9 మంది మంత్రులు హాజరయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. తమని రాజీనామాలు చేయమనడం సమైక్యవాదులకు తగదన్నారు.
రెండు మూడు రోజులలో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.