Seemandhra Ministers
-
కేసీఆర్‌ని విమర్శిస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: ‘‘లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రాజధానికి కట్టుకుంటామంటున్నారు. మీ పిల్లలకు మీరు ఫీజులు కట్టుకోలేరా? దీనిపై మా కేసీఆర్‌ను తిట్టడం ఏమిటి.. ఇది అన్యాయం. దీన్ని మేము సీరియస్‌గా ఖండిస్తున్నాం. మంత్రులారా.. మీ ప్రజల బాగోగులు మీరు చూసుకోండి. మా ప్రజల బాగు మేము చూసుకుంటాం. మీరు మీ చేతగాని తనాన్ని, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం, ఊరుకోం..’’ అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సీమాంధ్ర మంత్రులను హెచ్చరించారు. తెలంగాణ పిల్లలకు అక్కడి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తామని చెపుతుంటే, మీరేందుకు మా పిల్లల ఫీజులు కట్టరని సీమాంధ్ర ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని..దీనికి సమాధానం చెప్పుకోలేకే అక్కడి మంత్రులు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానికత విషయంలో 1956ను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని తమ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, చట్టాలను, రాజ్యాంగాన్ని కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని అక్కడి మంత్రులు విమర్శించడం సరి కాదన్నారు. తెలంగాణ పిల్లలేవరో తేల్చుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని ఉద్ఘాటించారు. కాగా బస్సులపై రాళ్లు వేయడంతోనే ఉస్మానియా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని నాయిని పేర్కొన్నారు. -
'నా ఛాయిస్.... జేడీ, కొండ్రు పనబాక'
హైదరాబాద్: సీఎం సీటును కిరణ్ కుమార్ రెడ్డి ఖాళీ చేయటంతో రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారనే దానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కిరణ్ కొనసాగనని చెప్పటంతో ఆశావాహులు సీఎం సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా మద్దతు ఇస్తానని ఆయన తెలిపారు. అయితే కొత్త ముఖ్యమంత్రిగా తన ఛాయిస్ ఎస్సీ వర్గానికి చెందిన జేడీ శీలం, కొండ్రు మురళి, పనబాక లక్ష్మి అని అన్నారు. ఒకవేళ అధిష్టానం బొత్స సత్యనారాయణను సీఎంను చేసినా మద్దతు తెలుపుతానని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని... తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి గురువారం గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'ధన్యవాదాలు తెలిపేందుకే కలిశాం'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసినట్లు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు మంత్రులు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని వారు గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతు బొత్స నేతృత్వంలో గవర్నర్‌ను కలిశామన్నారు. తాము గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. ధన్యవాదాలు తెలిపేందుకే కలిశామని, ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని ఆనం చెప్పటం విశేషం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు. -
ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం.. అవకాశమివ్వండి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని నలుగురు రాష్ట్ర మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, ఎన్.రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్లు వెళ్లి నరసింహన్‌తో భేటీ అయ్యారు. నరసింహన్‌ను కలిసిన మంత్రులలో వట్టి వంసతకుమార్, దానం నాగేందర్ తదితరులు కూడా ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మంత్రుల మద్దతును సమీకరించే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమ నలుగురిలో ఎవరమైనా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం కల్పించాలని ఆయనకు విజ్క్షప్తి చేశారు. ఇలాంటి కీలక తరుణంలో రాష్ట్రపతి పాలన విధించడం సరికాదని, అందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కోరినట్లు సమాచారం. -
కిరణ్‌పై కొండ్రు తిరుగు బావుటా!
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి కొండ్రు మురళి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నిన్న మొన్నటి వరకూ క్రమశిక్షణ గల కార్యకర్త అంటూ కిరణ్‌ను సమర్థించిన కొండ్రు హఠాత్తుగా స్వరం మార్చి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెడితే ప్రజలే ఛీ కొడతారని అన్నారు. ఇచ్చిన పదవిని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని కొండ్రు మండిపడ్డారు.. అవినీతిపురులకు పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టారని కొండ్రు తెలిపారు. బొత్స నివాసంలో సాయంత్రం జరిగే సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా ఈ రోజు ఉదయం బొత్స సత్యనారాయణతో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, బాలరాజు, కొండ్రు మురళి తదితరులు ఉన్నారు. మరోవైపు మంత్రి మహీధర్ రెడ్డి ....ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిశారు. -
నా హృదయం రక్తమోడుతోంది: ప్రధాని
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల తీరుపై ప్రధాని ఆవేదన న్యూఢిల్లీ: లోక్‌సభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు లోక్‌సభలో గందరగోళం సృష్టించడంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అంత అనుభవమున్న ఎంపీలు.. అందునా సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంటులో యుద్ధవాతావరణం సృష్టించడం చూసి తన గుండె గాయపడిందని, ఇలాంటి దృశ్యాలు లోక్‌సభలో చూడాల్సి రావడం తన దురదృష్టమని అన్నారు. ‘‘సభలో జరుగుతున్నది చూస్తుంటే నా హృదయం రక్తమోడుతోంది’’ అని ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సభ వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవడానికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైల్వే మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేయాల్సి వచ్చింది. ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్.. పలువురు ఎంపీలతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. శాంతంగా ఉండాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ వినలేదంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివికావన్నారు. దురదృష్టకరం: కమల్‌నాథ్ లోక్‌సభలో సీమాంధ్రకు చెందిన మంత్రుల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా తప్పుబట్టారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. సభను అడ్డుకుంటున్నారు.. గందరగోళం సృష్టిస్తున్నారు.. సభా నియమాలను అన్ని విధాలా ఉల్లంఘిస్తున్నారు. భవిష్యత్ లోక్‌సభలకు ఇది అపశకునం’’ అని ఆయన పార్లమెంటు బయట విలేకరులతో వ్యాఖ్యానించారు. సభ ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, సభ్యులందరికీ చెందినదని, దాని మర్యాదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు. అంత తొందరేమొచ్చింది: పల్లంరాజు ప్రధాని వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు విభేదించారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్న తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు బడ్జెట్‌ను అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించారు. ‘‘సభలో ఈ రోజు జరిగిన సంఘటనను ఒక్కదాన్నీ వేరుగా చూస్తూ (ప్రధాని) వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. 15వ లోక్‌సభలో చాలాసార్లు ఇలా సభను స్తంభింపజేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న బిల్లులో చాలా లోపాలున్నాయి. అది ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఆ బిల్లు ఆమోదం పొందితే.. కోస్తాంధ్ర, రాయలసీమ తీవ్రంగా నష్టపోతాయి’’ అని చెప్పారు. -
'సామ, దాన, దండోపాయాలు ఉపయోగించండి'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తుది అంకానికి చేరిన తరుణంలో సీమాంధ్ర మంత్రులకు సమైక్య సెగ తప్పడం లేదు. జీవోఎం నివేదిక అనంతరం టి.బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సీమాంధ్ర వాదులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులే కారణమంటూ నిరనస గళం వినిపిస్తున్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు.. పార్లమెంట్ లో సీమాంధ్ర మంత్రులు టి.బిల్లును అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆ బాధ్యతను సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులే తీసుకుని బిల్లు ఆమోదించబడకుండా చూడాలని అశోక్ బాబు తెలిపారు. కాకుంటే కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చేపడతామన్నారు. పదవులకోసం చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలని విజ్క్షప్తి చేశారు. సామ, దాన, దండోపాయాలు ఉపయోగించి బిల్లును అడ్డుకోవాలన్నారు.కాని పక్షంలో అదే పని చేయడానికి తాము వెనుకాడబోమని అశోక్ బాబు స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో వాటానా..
హైదరాబాద్‌లో వాటా అడగటం సీమాంధ్ర మంత్రుల వితండవాదానికి నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. అయిన తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ లో సీమాంధ్ర మంత్రులకు వాటా ఏలా ఇస్తామని ప్రశ్నించారు. గురువారం న్యూఢిల్లీలో పొన్నాల లక్ష్మయ్య విలేకర్లతో మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు చంద్రబాదు రెండు సార్లు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పడు ప్రజలకు సమాధానం చెప్పుకోవడం కోసం కాలుగాలిన పిల్లిలా అందరి చుట్టూ తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. తమకు చంద్రబాబు లాంటి వాళ్ల సలహా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏలా ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని పొన్నాల తెలిపారు. -
విభజన బిల్లుకు తుది మెరుగులు!
-
విభజన ఆగదని తెలిసీ భేటీలెందుకు?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యేందుకు సీమాంధ్ర మంత్రుల్లో విముఖత వ్యక్తం అవుతోంది. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కిరణ్ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఏ అజెండాతో ఈ సమావేశం పెట్టారో అర్థం కావడంలేదని మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రికి భవిష్యత్తు కార్యాచరణపై ఏమాత్రం స్పష్టత ఉండడం లేదని మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం సొంత అజెండాతో పనిచేస్తే తామేలా సహకరిస్తామని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విభజన ప్రక్రియలో కిరణ్ భాగస్వామి అయిన తర్వాత ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నా ఏం ప్రయోజనం ఉండదని మంత్రులు చెబుతున్నారు. విభజన ఆగదని తెలిసీ ఈ సమావేశం నిర్వహించడంవల్ల ప్రయోజనమేమిటని మంత్రులు పేర్కొంటుండం విశేషం. ఇలాంటి చర్యలతో పార్టీ హైకమాండ్‌ను ధిక్కరిస్తున్నామనే అభిప్రాయం వస్తుందని భావిస్తున్న మంత్రులు సీఎం సమావేశానికి పెద్దసంఖ్యలో డుమ్మా కొడుతున్నారు. కాగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, వట్టి వసంత్ కుమార్, శత్రుచర్ల విజయ రామరాజు, పార్థసారధి, సి.రామచంద్రయ తదితరులు హాజరయ్యారు. మరోవైపు కేంద్రం తెలంగాణ బిల్లుపై కసరత్తును వేగవంతం చేసింది. టి బిల్లును తిరస్కరించాలని రాష్ట్రం తీర్మానించినా పట్టించుకోకుండా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తోంది. ఈ ప్రక్రియపై చర్చించేందుకు ఏర్పాటైన జీవోఎం సోమవారం సాయంత్రం మీడియాతో సమావేశం ఏర్పాటు చేసింది. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చిదంబరం నేతృత్వంలో కమల్‌నాథ్, మనీష్‌తివారీ సహా జీవోఎం సభ్యులంతా హాజరయ్యే ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇలాంటి భేటీలతో జరిగేదేంటీ?మంత్రులు
-
‘తెలంగాణ’ను అడ్డుకునే కుట్ర
మాచారెడ్డి, న్యూస్‌లైన్ : ఒకవైపు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోవైపు సీఎం, స్పీకర్లు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అఖిలపక్ష కమిటీ స భ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనై నా సీమాంధ్ర నేతలు పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. సీ ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైఖరికి నిరసనగా గురువా రం మాచారెడ్డి చౌరస్తాలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాచారెడ్డి చౌరస్తాలో ని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కామారెడ్డి-సిరిసిల్లా రహదారిపై సీఎం, స్పీకర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ కిలోమీటర మేర నిలిచిపోయాయి. ఈసందర్భంగా టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ముస్తాక్‌హుస్సేన్, టీడీపీ అధ్యక్షుడు విష్ణుగోవర్దన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు తో ట బాల్‌రాజ్‌లు మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర సీఎం, స్పీకర్ లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బి డ్డల గోస వినకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ కో సం ఎందరో బిడ్డలు ఆత్మత్యాగం చేసినప్పటికీ సీమాంధ్ర నేతలు స్పందించడం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు బైండ్ల లక్ష్మినారాయణ, అజీజ్, బాల్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, పొన్నాల వెంకట్‌రెడ్డి, భూస సురేష్, భూస శ్రీనివాస్, రమేశ్‌నాయక్, నర్సిం గ్రావు, సత్తయ్య, రమేశ్, హంజీనాయక్, అంబటి నారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం నందిపేట : మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద మండల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సీఎం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాక ముందు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి, వచ్చిన తర్వాత బిల్లును కించపరచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణప్రజలను కించపరచడమేనన్నారు. ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ ప్రజలపై విషం కక్కుతున్నట్లుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను ఊరేగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కె.గంగాధర్, రాం దాసు, ఎస్వి. సతీష్, గంగదాసు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్‌పల్లిలో.. జక్రాన్‌పల్లి : తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపడాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ దీకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించిన తరువాత రాష్ట్రపతికి బిల్లును తిప్పి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ీ కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి అని అన్నారు. బిల్లును తిప్పిపంపి తెలంగాణ ప్రాంత ప్రజలను సీఎం అవమాన పరిచారన్నారు. కేంద్రం వచ్చే పార్లమెంటులో సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. -
'కిరణ్ వ్యవహారశైలి అనుమానాస్పదం'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై సీమాంధ్ర మంత్రులు మండిపడుతున్నారు. పాము చావాలి.. కట్టె విరక్కూడదన్న చందంగా.. విభజన బిల్లు గట్టెక్కాలి.. సమైక్యాంధ్ర కోసం పోరాడినట్టుండాలి.. ఇదీ సీఎం వ్యూహం.. ఇదంతా అంటున్నదని ఎవరో కాదు. సాక్షాత్తూ సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ సభ్యులే. కిరణ్ పనికిమాలిన తాజా ఎత్తులతో సమైక్యాంధ్రకు ఎలాంటి న్యాయం కలగదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వమిచ్చిన తీర్మానంతో.. ప్రభుత్వమే ఇబ్బందుల పాలవుతుందని సీమాంధ్ర మంత్రులు హెచ్చరిస్తున్నారు. రూల్ 77 అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యహరాలకే వర్తిస్తుందని.. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లుకు అసెంబ్లీ నిబంధనలు వర్తించవని.. సీమాంధ్ర మంత్రులు స్పష్టంచేస్తున్నారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు ఈ విషయాలన్నీ తెలుసని, అయితే ఉద్దేశపూర్వకంగా అయోమయాన్ని సృష్టించేందుకే ఈ తీర్మానాన్ని కోరారని.. సీమాంధ్ర మంత్రులు మీడియాతో వాపోతున్నారు. అసలు ఈ విషయంలో సీఎం తమను సంప్రదించలేదని కూడా సీమాంధ్ర మంత్రులు కుండబద్ధలు కొడుతున్నారు. ప్రభుత్వమిచ్చిన తీర్మానం అనుమతి పొందదని విభజన బిల్లుపై ఓటింగ్‌కోసం పట్టుబట్టాలని మొదటినుంచి చెప్పినా స్పందించని సీఎం .. ఇప్పుడు ఉన్నపళంగా ఇలా వ్యవహరించడం సొంత ఇమేజీ కోసమేనని సీమాంధ్ర మంత్రులు అంటున్నారు. అసలు సీఎం వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని సీమాంధ్ర సభ్యులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం పై సీమాంద్ర మంత్రులు ఫైర్
-
'విభజనకు పార్లమెంట్ ఒప్పుకోకపోవచ్చు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేలా అన్ని పార్టీలను సంప్రదిస్తున్నామని మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు తెలిపారు. విభజిస్తే వచ్చే సమస్యలను త్వరలో రాష్ట్రపతికి వివరిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఒప్పుకోకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ చర్చ ద్వారా టి.బిల్లును అడ్డుకోగలమని వారు తెలపారు. టీ.బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉందన్నారు. -
సీఎం కిరణ్ తో సీమాంధ్ర మంత్రుల భేటీ
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు సమావేశమైయ్యారు. ఈ భేటీకి 20 మంది మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ హాజరైయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు సంబంధించి కీలక చర్చ అసెంబ్లీ జరిగే నేపథ్యంలో సీఎం కిరణ్ మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. విభజన బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి హాజరైన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో టీజీ వెంకటేశ్, కొండ్రుమురళి, పితాని సత్యనారాయణ, మహిధర్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్, గాదె వెంకటరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ,తోట నర్సంహ, విప్ రుద్రరాజు పద్మరాజు, శత్రుచర్ల,అహ్మదుల్లా, శ్రీరామచంద్రయ్య, రఘువీరారెడ్డి, గాదె శ్రీనివాసులు, గల్లా అరుణకుమారి, బాలరాజు, గంటా శ్రీనివాస్, ఆనం రాంనారాయణ, ఆనం వివేకానంద రెడ్డి, శ్రీరామచంద్రయ్యలు ఉన్నారు. -
అవును... అమ్ముడుపోయారు
సందర్భం అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసన సభ్యులు తెలుగు జాతి మానమర్యాదల ను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన సీమాంధ్ర ప్రాం త మంత్రులు ఇప్పుడు కొత్తగా అవిశ్వాస డ్రామా ఆడిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా కేంద్ర మంత్రి మండలిలో ఏదో ఒక స్థాయిలో అధికారం అనుభవిస్తున్న ఈ మంత్రుల వల్ల ఆంధ్ర ప్రాంతా నికి ఏమైనా ఒరిగిందా? ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగారా! సోనియా గాంధీ వెంట తిరుగుతూ ఆమె ప్రసంగాలను అనువదించిన వారికి కూడా ఆమె ఎటువంటి వాగ్దానాలు ఎక్కడెక్కడ చేసిందో గుర్తులేదా. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణ నలోకి తీసుకుంటాం’ అన్నదే నాడు సోనియా చెప్పిన మాట. ఆ సమావేశం వెంటనే విజయవాడలో మరో సభ జరిగింది. ఆ సభలో బందరు పోర్టును అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చింది. 2004లో స్పష్టంగా ఇవ్వని తెలం గాణ హామీ కోసం ఆ ప్రాంత నాయకులు అంతగా ఒత్తిడి తెచ్చి సాధించుకుంటే, ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానం సంగతే మిటని విజయవాడ ఎంపీ ఎందుకు అడగడు? ఎన్టీఆర్, ఆయన ఆశయాల గురించి మాట్లాడే పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను తన తండ్రి అంగీ కరించేవాడా! అని ఒక్కసారి ఆయినా ఆలోచించారా? తెలుగు జాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పాటు పడిన తీరు ఏ మాత్రం గుర్తున్నా సీడబ్ల్యూసీ తీర్మానం జరిగిన మరు క్షణమే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చెల్లని రూపాయికే గీతలెక్కువ అన్నాడు ఒక సినీ కవి. అది సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవికి చక్కగా అబ్బుతుంది. చిరంజీవికి మంత్రి పదవి మీదున్న మక్కువ తెలుగు గడ్డమీద లేదని అర్థమవుతున్నది. మంత్రి పదవి రానంతవరకు కావూరి సాంబశివరావు నోటి వెంట వచ్చిన మాటలు, చివరికి తన కులానికి కాంగ్రెస్‌లో అన్యా యం జరుగుతున్న వైనం గురించి బహిరంగంగా కన్నీరు కార్చిన సంఘటనలు ఆయన మానసిక స్థితి మీద అను మానం కలిగించేవిగా ఉన్నాయి. అదే కావూరి కేంద్ర మంత్రి అవగానే ‘అపరిచితుడు’గా మారిపోయాడు. సీమాంధ్ర ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న వా రికి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ముందుగా తెలియ దంటే నమ్మేంత అమాయకులు కారు ఆంధ్రులు. కొత్త రాష్ట్రం ఏర్పడగానే దానికి తొలి ముఖ్యమంత్రిగా నన్ను చేస్తే ఉద్యమాలను సర్దుబాటు చేయగలనని బొత్స సత్తి బాబు చల్లగా చెప్పివచ్చాడు. ఇక వయసు మళ్లిన కావూరికి గవర్నర్ పదవి, ఈ ప్రాంతంలో రెండు ప్రముఖ సామాజిక వర్గాల నేతలుగా చిరంజీవి, పురంధేశ్వరిలకు కేబినెట్ మంత్రి పదవిని మాట్లాడుకున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ నాటికి కొత్త హోదాలలో వీరంతా సీమాంధ్ర వీధుల్లో తిరుగుతుండేవారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆధారం ఏమిటన్న ఒక్క ప్రశ్నను కేంద్ర మంత్రి వెయ్యలేరా? సెంటిమెంట్ ఆధా రంగా రాష్ట్రాలు ఇచ్చిన సందర్భం ఉందా? తెలంగాణ ఉద్యమం అరవయ్యేళ్లదైతే, వందేళ్ల గూర్ఖాల్యాండ్ సంగతే మిటని ఎదురు ప్రశ్న వేయలేరా? అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఎందుకు విభజించాలి? ఒకవేళ విభజించాల్సి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విభజిస్తున్నారని నిల దీయలేరా! తెలుగు జాతిని చీల్చే బాధ్యతను చుట్టూ ఉన్న తమిళ (చిదంబరం, నారాయణస్వామి), కన్నడ (జయ రామ్ రమేష్, మెయిలీ), మలయాళ (ఏకే ఆంటోనీ), మరాఠీ (షిండే)ల చేతిలో పెడితే, ఇదేమిటని ఒక్కసారైనా అడిగారా! హైకమాండ్ నిర్ణయం తీసుకుంది, విభజన ఆపలేం, ఆర్టికల్-3 ప్రకారం ఆ హక్కు పార్లమెంట్‌ది అం టూ ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పన బాక లక్ష్మి, చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్‌లకు తెలుగు వారి ఆక్రందనలు వినబడటం లేదా! తెలంగాణ ప్రాంతంలో 15 సీట్ల కోసం ఒక భాషా జాతిని చీలుస్తున్నా కూడా పార్టీని ప్రశ్నించలేని అశక్తులా? కేంద్రం భారీ ప్యాకేజీ సీమాంధ్రకు ఇచ్చేలా పట్టుపడతాం అని మరో కేంద్ర మం త్రి అంటాడు. నాలుగు నెలలు ఆగితే ఈ ప్రధాని ఉం డడు, కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు. వంద రోజులకు మించి అధికారంలో ఉండని పార్టీ రాబోయే పదేళ్లలో ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఇచ్చి రాజధానిని నిర్మిస్తామని వాగ్దానం చేయడం ఎవరిని మోసగించేందుకు? ఇవి వ్యక్తిగత కక్షతో అంటున్న మాటలు కాదు. తెలుగుజాతికి జరుగుతున్న అవమానం చూసి తట్టుకోలేక వస్తున్న మాటలు. ఇది చాలా సున్నితమైన భాష. ఇంత కన్నా కటువైన పదాలతో తిట్టాలి. కాని తెలుగు జాతిని అవమానించడంలో మీరు దిగజారినంతగా తెలుగు ప్రజలు దిగజారదలుచుకోలేదు. ఇప్పటికైనా మేల్కొనండి. నిద్రా నాటకం నుండి బయటకు రండి. హైకమాండ్‌ని ధిక్కరించండి. తెలుగు జాతి ప్రతిష్ట కోసం తిరగబడితే, మీ చేతికి పార్టీ వేసిన సంకెళ్లు పోతా యే తప్ప మరే నష్టం జరగదు. -
అధిష్టానం మా మొర వినలేదు : కావూరి
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రుల వాయిస్ పూర్తిగా మారిపోయింది. కొంతమంది విభజనకు సిద్ధపడి ప్యాకేజీల విషయం మాట్లాడుతుంటే, మరికొంతమంది విభజనను అడ్డుకోగలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చెన్నైలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తామెంత మొరపెట్టినా అధిష్టానం వినలేదని చెప్పారు. విభజన తప్పదన్న దృఢనిశ్చయంతో అధిష్టానం ఉందన్నారు. కానీ, విభజనను అడ్డుకోగలమనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందన్నారు. విభజన అనివార్యమని తెలియటంతో తాము సీమాంధ్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టామన్నారు. మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో మాట్లాడుతూ విభజన అనివార్యం అన్నారు. సీమాంధ్ర ప్యాకేజి కోసం డిమాండ్ చేస్తామని చెప్పారు. -
అడ్డుకోలేక చేతులెత్తేసిన మంత్రులు
-
కొత్త డ్రామాలకు తెరతీసిన సీమాంద్ర మంత్రులు
-
సీఎం, సీమాంధ్ర మంత్రుల డిమాండ్లు బేఖాతర్
హైదరాబాద్ యూటీ లేదు.. రెవెన్యూలో సీమాంధ్రకు వాటా లేదు టీ బిల్లులోని అంశాలపై రాష్ట్ర అధికారులకు జీవోఎం ప్రజంటేషన్ 5 లేదా ఆరేళ్లు మాత్రమే ‘ఉమ్మడి’ అప్పులు 58% సీమాంధ్రకు, 42% తెలంగాణకు విద్యుత్ 57 శాతం తెలంగాణకు, 43 శాతం సీమాంధ్రకు భద్రాచలం తెలంగాణాకే సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ఘోరంగా వైఫల్యం చెందారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం దేవుడెరుగు కనీసం హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలకు, వారి ఆస్తులకు రాజ్యాంగ రక్షణ కల్పించడంలో కూడా విఫలమయ్యూరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు కేంద్రం సిద్ధం చేసిన ముసాయిదా బిల్లులోని అంశాలను కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం సహా, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేస్తున్న ఏ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు బదులు ఐదు లేదా ఆరు సంవత్సరాలకే పరిమితం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా పరిగణించనున్నారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర ప్రజల రక్షణకు, వారి ఆస్తుల పరిరక్షణకు రాజ్యాంగపరమైన ఎటువంటి భరోసా కల్పించడం లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా జీవోఎం తిరస్కరించింది. కేవలం కేంద్రమంత్రిత్వ శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా సెక్యూరిటీ కౌన్సిల్‌ను మాత్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌన్సిల్లో గవర్నర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుంటారు. హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు ఎటువంటి వాటా ఇవ్వడం లేదు. ఆస్తులు, పలు విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా సీమాంధ్రకు వాటా లేదు. ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ ప్రాంతానికే చెందుతాయని జీవోఎం పేర్కొంది. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. గోదావరి నదీ జలాలపై కేంద్ర అదనపు కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను, కృష్ణా జలాలపై కేంద్ర సంయుక్త కార్యదర్శిని ఆర్బిట్రేటర్‌గాను నియమించనున్నారు. ఎక్కువ విద్యుత్ వినియోగించే తెలంగాణకు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 57 శాతం, తక్కువ విద్యుత్ వినియోగించే సీమాంధ్రకు 43 శాతం విద్యుత్‌ను జీవోఎం కేటాయించింది. జనవరి నెలాఖరులోగా అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేడర్‌ను విభజించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని సూచించింది. అప్పులను జనాభా నిష్పత్తి ఆధారంగా 58 శాతం సీమాంధ్రకు, 42 శాతం తెలంగాణకు కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని భవనాల విలువ ఆధారంగా సీమాంధ్రకు వాటా ఇచ్చే అంశాన్ని కూడా పొందుపరచలేదు. -
విభజన అనివార్యం:సీమాంద్ర కేంద్రమంత్రులు
-
చివరకు సోనియాను కలవమని చెప్పిన జైరామ్ రమేష్
ఢిల్లీ: హైదరాబాద్ విషయమై కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడైన జైరామ్ రమేష్‌ను కలిసిన సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఆయన యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలవమని సలహా ఇచ్చారు. జైరాం రమేష్‌తో సీమాంధ్ర కేంద్రమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కావూరి సాంబిశివరాలు, కోట్ల విజయభాస్కర రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని వారు కోరారు. ఇరుప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని చేసినందున ఒరిగేదేమీలేదని చెప్పారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యుటి) చేయాలని కోరారు. వారు చెప్పిన మాటలు విన్న తరువాత సోనియా గాంధీని కలమని జైరాం రమేష్ వారికి సూచించారు. -
సీమాంధ్ర మంత్రులు సోనియా పెంపుడు కుక్కలు
సాక్షి, చిత్తూరు: అందరికీ ఆమోదయోగ్యంగా సమన్యాయం చేస్తే విభజనకు సహకరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని, మరో ఐదు నెలల్లో రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి మూడు నెలలకోసారి కుప్పం వస్తానని 2012, ఆగస్టులో వాగ్దానం చేసిన చంద్రబాబు.. సుమారు 15 నెలల తర్వాత సోమవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం గం.11.20కు బెంగళూరు నుంచి శాంతిపురం వుండలం సిద్దా వూరు చేరుకున్న బాబు.. శాంతిపురం, రావుకుప్పం వుండలాల్లో పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇరుప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసే రాష్ట్ర విభజనకు సహకరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ సైతం టీడీపీ దారిలోకే వచ్చిందని, సీమాంధ్రకు న్యాయం చేస్తేనే విభజనకు అంగీకరిస్తామని స్పష్టం చేసిందన్నారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చి అని, కాంగ్రెస్ నాయకుల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర మంత్రులు సోనియా పెంపుడు కుక్కలని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనికివూలినవాడు, ఉత్తర కువూరుడు, ఓ దద్దవ్ము కావడంతో జనం బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ ఓ రొచ్చుబండగా వూరిందన్నారు. వురో ఐదు నెలల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో యువతకు వంద ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు వూఫీ చేస్తావుని హామీ ఇచ్చారు. ఒక యూక్టర్ సావూజిక న్యాయుం అని చెప్పి పార్టీ పెట్టి తర్వాత ఏమయ్యాడనేది మీకే తెలుసని బాబు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈనెల 26న కుప్పం వస్తారని, తనలేఖ గురించి మాట్లాడతారని, ఆయన మోసపూరిత వూటలను నవ్మువద్దని చంద్రబాబు ప్రజలను కోరారు. జగన్‌ను చూడటానికి కూడా రావొద్దని జనానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. ఆయనలా అధికార దాహం ఉంటే తాను ఎప్పుడో ప్రధానమంత్రిని అయ్యేవాడినన్నారు. -
'హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందే'
-
హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందే: సీమాంధ్ర మంత్రులు
ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు కుదిరిందని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. హైదరాబాద్, నీళ్లు, ఉద్యోగాలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై తాము జీవోఎంతో చర్చించామని ఆయన చెప్పారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే జరిగిందని, అందువల్ల హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాండిచ్చేరి తరహాలోనే హైదరాబాద్ పాలన ఉండాలన్నారు. సీమాంధ్రలోని ప్రతి విద్యార్థి హైదరాబాద్ కావాలంటున్నాడని చెప్పారు. ఉమ్మడి రాజధాని హెచ్ఎండీఏ పరిధి వరకు ఉండాలని కోరామన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను తెలిపామని, సమస్యలు పరిష్కరించాకే ముందుకెళ్లాలన్నామని అన్నారు. హైదరాబాద్‌లో మరో నగరం అభివృద్ధి చెందేవరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తాము మూడు నెలల నుంచి చెబుతున్నామని, ఇప్పుడు కూడా రాయలసీమ నీటి సమస్యను ప్రస్తావించామని అన్నారు. హైదరాబాద్‌లో 30 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల మాటేమిటని తాము కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో ప్రస్తావించామన్నారు. జీవోఎంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు విలేకరులతో మాట్లాడారు. అయితే.. శీలం మాట్లాడుతుండగానే మరో ముగ్గురు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పళ్లంరాజు కూడా మీడియాతో మాట్లాడలేదు. -
మా దురదృష్టం..మా కేంద్ర మంత్రులే:అశోక్ బాబు
ఢిల్లీ: 'మా దురదృష్టం.. మా కేంద్ర మంత్రులు, మా మంత్రులు చేతకాని వాళ్లు' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంపై మరోమారు మీడియా ముందుకొచ్చిన అశోక్ బాబు సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరిపై మండిపడ్డారు. యూటీ, ప్యాకేజీలంటూ వారు మాట్లాడటం వారి అమాయకత్వమన్నారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కన్వీన్స్ అయ్యారేమో కానీ తాము మాత్రం కాదని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్రమంత్రులు సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేసిన నేపథ్యంలో అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు, యూటీ ప్రాంతాలంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం తగదని సూచించారు. -
సమైక్యవాదం కాదు.. ప్యాకేజీ వాదం
విభజన దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల కొత్త పల్లవి రూ.4 లక్షల కోట్లు కోరిన చంద్రబాబు బాటలో కాంగ్రెస్ మంత్రుల డిమాండ్లు జీవోఎం సభ్యులు మొయిలీ, చిదంబరంలతో కావూరి, శీలం, పురందేశ్వరి, చిరంజీవి భేటీ విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చెప్పాలని విజ్ఞప్తి సీమాంధ్రలో కొత్త రాజధానికి ఎన్ని నిధులిస్తారంటూ ప్రశ్న తగిన పరిష్కరాలు చూపి ప్యాకేజీలిస్తే ప్రజలను ఒప్పించగలమని వెల్లడి దొరకని ప్రధాని అపాయింట్మెంట్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తప్ప మరో ఇతర ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ డాంబికాలు పలుకుతూ వచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా అడుగులు వేస్తున్నారు. తమది సమైక్యవాదం కాదని, సమస్యావాదమని చెబుతూ.. ప్యాకేజీవాదన మొదలుపెట్టారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే రాష్ట్రాన్ని విభజించేసుకోవచ్చన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో కాంగ్రెస్ మంత్రులు డిమాండ్లు మొదలుపెట్టారు. సీమాంధ్రలో కొత్త రాజధానికి ఎన్ని నిధులిస్తారంటూ జీవోఎం సభ్యులను ప్రశ్నించారు. విభజనతో సీమాంధ్రలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని ఎలా పరిష్కరిస్తారో ముందుగా స్పష్టత ఇచ్చాకే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని వారు జీవోఎంకు విజ్ఞప్తి చేశారు. తగిన పరిష్కారం చూపితే, తగిన ప్యాకేజీలు ఇస్తే విభజనకు అంగీకరించేలా ప్రజలను తాము ఒప్పించగలమని వెల్లడించారు. గురువారం జీవోఎం కీలక సమావేశానికి ముందు జీవోఎం సభ్యులు వీరప్ప మొయిలీ, చిదంబరంలతో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జేడీ శీలం విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీ నేతలుగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతామని, అయితే విభజన అనంతరం విద్య, ఉద్యోగ, ఉపాధి, సాగు నీటి రంగాల్లో సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సీమాంధ్రను అన్ని విధాలా ఆదుకునేందుకు ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తారో ముందుగానే వెల్లడించాలని విన్నవించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు తీసుకునే చర్యలేంటి? సీమాంధ్రలో కొత్తగా నిర్మించే రాజధానికి ఏ మాత్రం నిధులు కేటాయిస్తారు? పోలవరంపై తెలంగాణవాదులు లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారాలు ఏంటీ? కొత్తగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు ఎలా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేంద్రంపై ఎంతైనా ఉందన్నారు. ఇక ఇవే అంశాలను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవిద్దామని మంత్రులు భావించినా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. సమస్యల పరిష్కారంవైపే మా ప్రయత్నం: జేడీ శీలం మొయిలీతో భేటీ అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. తమది సమైక్యతావాదం కాదని సమస్యావాదమని జేడీ శీలం స్పష్టం చేశారు. అయితే సమైక్యతా వాదం, సమస్యావాదం వేరుకాదని అన్నారు. విభజన అనంతరం సమస్యల పరిష్కారంవైపుగా తాము ప్రయత్నం చేస్తున్నామని, వాటికి పరిష్కారాలు చూపాలని జీవోఎం సభ్యులను కోరామన్నారు. తగిన పరిష్కారం చూపితే ప్రజలను తాము ఒప్పించగలమన్నారు. ఉద్యోగాలు రావని విద్యార్థులు, నీళ్లు రావని రైతులు, భద్రత ఉండదని హైదరాబాద్‌లోనీ సీమాంధ్రులు భయాందోళనలతో ఉన్నారని, వారి భయాలను తొలగించేలా జీవోఎం చర్యలు చేపట్టాలన్నారు. విభజన జరిగినా తెలుగు ప్రజలు భవిష్యత్తులో వైషమ్యాలు పెంచుకోకుండా సామరస్యపూర్వకంగా ఉండేలా జీవోఎం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా ఇరు ప్రాంతాలు కలిసుండాలని కోరారు. తాము జీవోఎంకు ఎలాంటి నివేదికలు ఇవ్వడం లేదని, ఎలాంటి ప్యాకేజీలూ కోరడం లేదని చెప్పారు. భయాందోళనలు తొలగించాలి: చిరంజీవి విద్యార్థులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు అంతా హైదరాబాద్‌నే నమ్ముకొని ఉన్నారని, ప్రస్తుత విభజన ప్రకటనతో వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, వాటిని ముందుగా నివృత్తి చేయాల్సిన బాధ్యత జీవోఎంపై ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల అనుమానాలను నివృత్తి చేసేలా, సీమాంధ్రుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలనే తాము కోరుతున్నామని, ప్యాకేజీలు కోరడం లేదని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాటి సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. -
సమ్మె కొనసాగిస్తాం: అశోక్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న గట్టి సంకల్పంతో పోరాడుతున్న ప్రజల్లో ఆ ధృడ సంకల్పం సడలకుండా ఉండాలంటే మా పోరాటం కొనసాగాల్సిందే. అందుకే సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాం. గురువారం ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో ఆయన ఇచ్చే హామీ ఆధారంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది’ అని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. బుధవారం 13 సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులంతా సమ్మె కొనసాగించాలని ముక్తకంఠంతో చెప్పడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నీతికి, నిబద్ధతకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి సమయంలో తాము వెనక్కు వెళ్లడం సరికాదని ఎన్జీఓలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే గురువారం సీఎంతో భేటీకంటే ముందుగా జేఏసీ సమావేశం జరగనున్నందున, సమ్మెకు సంబంధించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు తాను తీసుకోబోయే చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చే స్పష్టత ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని అన్నారు. ‘నేను సీఎంగా ఉన్నంతవరకు రాష్ట్ర విభజన జరగదు’లాంటి మాటలు కాకుండా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తోందో, వాటికి సంబంధించి ప్రభుత్వం ఏయే అంశాలను అందజేస్తోందో తెలియజేయాలన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న ఆర్టికల్ 371 డీ కొనసాగింపుపై వస్తున్న సంకేతాలు వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా దాపరికం లేకుండా తమకు వెల్లడించాలన్నారు. ఉద్యోగ సంఘాలను నమ్ముకుని ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సమయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం వారిని అయోమయానికి గురిచేస్తోందని చెప్పారు. ‘విభజన తథ్యమైనందున సీమాంధ్ర హక్కులపై చర్చించటం మంచిది’లాంటి రకరకాల ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ‘చేతనైతే మాకు అండగా నిలవండి.. ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రకటనలు మాత్రం మానుకోండి’ అని అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలు చేయటం, రాష్ట్ర విభజనకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడికే ప్రాధాన్యం విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పష్టమైన వాణిని వినిపిస్తే, దాని ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వీలుంటుందని అశోక్‌బాబు చెప్పారు. అందువల్ల ఇకపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవటానికే తాము ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో వారివారి నియోజకవర్గాల్లో బహిరంగ ప్రకటన చేయాలని ఒత్తిడి తెచ్చామని, దీన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెలుబుచ్చిన ఎమ్మెల్యేలను అభినందిస్తున్నామని అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఢిల్లీలో ఒత్తిడిని పెంచాలని నిర్ణయించామని, ఒక్కో జిల్లా నుంచి వెయ్యిమంది చొప్పున ఢిల్లీకి వెళ్లి వారి నివాసాల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా వారు రాజీ‘డ్రామా’లు మానాలని, అధికారిక విధులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశామని, త్వరలోనే వ్యక్తిగతంగా కూడా కలుస్తామని చెప్పారు. ఈనెల 18న నాగార్జున సాగర్‌లో, 22న కాకినాడలో, 27న గుడివాడలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి మద్దతుపై తర్వాత స్పందిస్తానని అన్నారు. -
కేంద్ర మంత్రి పురందరేశ్వరిపై విద్యార్థుల ఫైర్
-
విభజన మర్ధిని
-
‘అయ్యవార్ల’కు చాలు పప్పుబెల్లాలు!
సమైక్యానికి స్వస్తి.. ప్యాకేజీలపై దృష్టి అధిష్టానం దారిలోకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు నివాసాల్లో రెండు దఫాలుగా మంతనాలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుండడంతో ఇక సమైక్య రాష్ట్ర డిమాండ్‌కు స్వస్తి చెప్పడమే మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదంటున్న అధిష్టానంతో సహకరించి సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరుగకుండానైనా చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం రెండు దఫాలుగా సమావేశమై తెలంగాణేతర ప్రాంతాలతో మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వరాభివృద్ధికి కేంద్రం నుండి రాబట్టుకోవాల్సిన అదనపు నిధులు, సంస్థలు, పథకాల జాబితాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉదయం పల్లంరాజు నివాసంలో, పురందేశ్వరి, కృపారాణి మినహా మిగిలినవారు సాయంత్రం మరోసారి కావూరి నివాసంలో సమావేశమై సీమాంధ్ర అవసరాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఏడుగురు మంత్రుల కమిటీ (జీవోఎం) శుక్రవారం సమావేశం కానున్న నేపథ్యంలో తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుండి తమ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు సాధించడం ద్వారానైనా సమైక్యాంధ్ర కోసం రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజల ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలన్నది వీరి ఉద్దేశంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసే విషయంలో సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడం, తామెంత వత్తిడి తెచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశమే లేదని తేలిపోవడంతో ఒకరి తర్వాత ఒకరుగా అంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనడంతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలు, రక్షణ, వ్యవసాయరంగ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరుతూ కిశోర్‌చంద్రదేవ్ ఆంటోనీ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధ, గురువారాలలో దీనిపై ప్రాథమిక కసరత్తు మాత్రమే జరిగిందని, వచ్చే 15వ తేదీన గురువారం హాజరుకాని చిరంజీవి, కిశోర్‌చంద్ర దేవ్‌లతో పాటు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి మరోసారి చర్చించిన తర్వాత ‘ప్యాకేజీలపై’ తమ ప్రతిపాదనలతో షిండే నేతృత్వంలోని జీవోఎంతో భేటీ కావాలని కేంద్ర మంత్రులు నిర్ణయించుకొన్నారు. సోనియాతో కావూరి, పురందేశ్వరి చర్చలు ఉదయం సమావేశం ముగిసిన తర్వాత కావూరి సాంబశివరావు, పురందేశ్వరి విడివిడిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చర్చల వివరాలను వెల్లడించడానికి వారు నిరాకరించినప్పటికీ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న భయాందోళనలను, సమస్యల తీవ్రతను వివరించి విభజన తర్వాత దేశంలో అతిపేద రాష్ట్రంగా మిగిలిపోకుండా కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
తెలంగాణపై వెనక్కి వెళ్లలేం: మన్మోహన్ సింగ్
సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రధాని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మంచో, చెడో నిర్ణయం చేశాం, ఇప్పుడు దానినుండి వెనక్కు వెళ్లలేం. విభజన ప్రక్రియను నిలిపివేయడం నా చేతుల్లో లేదు. రాజీనామాల కారణంగా విధులకు హాజరుకావడం, కాకపోవడం మీ ఇష్టం..’’ అని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులతో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ సీమాంధ్రకు చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు సోమవారం ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాలు కొనసాగిన భేటీలో కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విభజన నిర్ణయానంతరం ఏర్పాటైన ఆంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించకముందే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలుపడంపై నిరసన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను నిలిపివేసి సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం ద్వారా కోస్తా, రాయలసీమల్లో రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజలను శాంతింపజేయాలని కోరారు. తెలంగాణపై ఇతర అన్ని పార్టీలతో సంప్రదించిన కాంగ్రెస్ అధిష్టానం, ప్రభుత్వం.. సీమాంధ్రలోని సొంత పార్టీ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం తమను బాధిస్తున్నదని తెలిపారు. విభజన నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము మంత్రి పదవుల్లో కొనసాగలేమని, తమ రాజీనామాలను ఆమోదించాలని మంత్రుల్లో నలుగురు ప్రధానిని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ను మాత్రం వదలబోమంటూ హామీ ఇచ్చినట్టు తెలిసింది. తమ రాజీనామాలను సైతం ప్రజలు నమ్మడం లేదని, డ్రామాలుగా భావిస్తున్నారని దీంతో తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని చిరంజీవి, కోట్ల, పురందేశ్వరి ప్రధానితో అన్నారు. ప్రధానికి పల్లంరాజు రాజీనామా లేఖ ఇలావుండగా గతంలోనే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినా సోనియాతో సమావేశానంతరం వెనక్కు తగ్గినట్టు కనిపించిన మంత్రి పల్లంరాజు సోమవారం స్వయంగా ప్రధానికి రాజీనామా లేఖను సమర్పించారు. ముగ్గురు మంత్రుల రాజీనామాలు తనకు అందాయని ప్రధాని ధ్రువీకరించిన తర్వాత పల్లంరాజు రాజీనామా పత్రాన్ని అందజేశారని తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని గట్టిగా కోరినప్పటికీ జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి మాత్రం రాజీనామాలు సమర్పించలేదు, వాటిపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా వారు నోరుమెదపలేదని తెలిసింది. ప్రధానితో సమావేశానంతరం చిరంజీవి నివాసంలో కొద్దిసేపు సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించుకొన్న మంత్రులు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వీరిద్దరూ ముఖం చాటేశారు. వీరితోపాటు ఇప్పటికే రాజీనామా ప్రసక్తే లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఢిల్లీలో లేని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్‌చంద్ర దేవ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలం కూడా రాజీనామాలకు దూరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాను అశక్తుడనన్న ప్రధాని నుంచి తమ రాజీనామాలను ఆమోదించే విషయంలో కూడా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో తాము మంగళవారం నుండి విధులకు హాజరుకాబోమని నలుగురు మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ‘అది మీ ఇష్టం..’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సమైక్యంగా ఉంచాలని కోరాం: పురందేశ్వరి ప్రధానితో భేటీ తర్వాత పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, చిరంజీవిలతో కలిసి పురందేశ్వరి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రధానిని కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలు కనిపించకపోవడంతో మంత్రి పదవులకు తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. రాజీనామాలు చేసినందున ప్రభుత్వ బాధ్యతలను నిర్వర్తించలేమని కూడా చెప్పామని, మంగళవారం నుండి విధులకు హాజరు కారాదని నిర్ణయించుకొన్నామని తెలిపారు. మంగళవారం జరిగే ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి పల్లంరాజు కూడా దూరంగా ఉంటారని చెప్పారు. రాజీనామాల విషయంలో కావూరి సాంబశివరావు వైఖరి ఏమిటన్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆమె నిరాకరించారు. ఆ విషయం ఆయన్నే అడగాలని సూచించారు. -
సోనియా ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా అని వారు ప్రశ్నించారు. రాజీనామా విషయంలో కేంద్రమంత్రులు నాటాకాలు అడుతున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఈ సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. -
సీమాంధ్ర నేతలపై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ర్ట విభజనను అడ్డుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుక్రవారం సమైక్య సెగ తగిలింది. పలు జిల్లాల్లో మంత్రుల ఇళ్లను, పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కర్నూలులో మంత్రి టీజీ వెంకటేష్‌కి చెందిన హోటల్ మౌర్య ఇన్‌పై దాడి చేశారు. కేంద్రమంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి నివాసంపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నివాసం ఎదుట విద్యార్థులు దీక్ష చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో డీసీసీ కార్యాలయంపై విద్యార్థులు రాళ్లతో దాడికి దిగారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విశాఖజిల్లా నర్సీపట్నం,పాడేరులో మంత్రి బాలరాజు ఇంటిని ముట్టడించారు. చోడవరంలో ఎమ్మెల్యే కన్నబాబు కారును అడ్డుకున్నారు. కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. మలికిపురంలోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. రాజమండ్రిలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటిని, రంపచోడవరంలో ఎంపీ రత్నాబాయి, ఎమ్మెల్యే కాశీ విశ్వనాథ్‌ల ఇళ్లను ముట్టడించారు. జేఎన్టీయూకే విద్యార్థులు కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కొత్తపేటలో కాంగ్రెస్ కార్యాలయం గోడలు బద్దలు కొట్టి, లోపలకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. కార్యాలయానికి నిప్పు పెట్టే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కృపారాణి క్యాంప్ కార్యాలయాన్ని, పాతపట్నంలో మంత్రి శత్రుచర్ల క్యాంప్ ఆఫీసును ఉద్యమకారులు ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు రువ్వి ఆద్దాలు ధ్వంసంచేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని, గుంటూరులో మంత్రి కన్నా ఇంటిని, ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎన్జీవోలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. కృషా ్ణజిల్లా విజయవాడలో నగర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. -
రాజీనామాలు చేయొద్దని నిర్ణయించుకున్నాం : మంత్రి గంటా
-
తిరుమలకి తాకిన సమైక్య సెగ
-
మంత్రులు వీళ్ళెక్కడ ?
-
రాజీనామాలపై కేంద్రమంత్రుల డ్రామాలు
-
అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటాం - శైలజానాథ్
-
ముగిసిన సీమాంధ్ర మంత్రుల భేటీ
-
సీఎంకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సీమాంధ్ర మంత్రులు
-
సమైక్యాంద్ర ఉద్యమంపై స్పెషల్ ఎడిషన్
-
అక్టోబర్ ఆరే ఆఖరా?
సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి అక్టోబర్ ఆరే ఆఖరు అన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అక్టోబర్ ఆరు తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోరన్న గుసగుసలు జోరందుకున్నాయి. సీల్డ్ కవర్ సీఎంగా ప్రత్యర్థుల నుంచి నీరాజనాలు అందుకుంటున్న నల్లారివారు ఈ నెల మొదటి వారంలోనే ఇంటికెళ్లడం ఖాయమని అంటున్నారు. గులాబీ నేతలు ఒకడుగు ముందుకేసి అక్టోబర్ 7 తర్వాత కిరణ్ పదవిలో ఉండరని చా(ఘా)టుగా వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్ చివరి సీఎం అని కూడా వారంటున్నారు. తనకున్న సమాచారం ప్రకారం కిరణ్ అక్టోబర్ ఆరు దాటడని సకల జనభేరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌కు ప్లగ్‌ను పీకేస్తుందని జోస్యం చెప్పారు. కిరణం బొగ్గు అయితది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు కొంత మంది సీమాంధ్ర మంత్రులు సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా మంత్రాంగం నడుపుతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. వీరి వెనుక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో పలువురు సీమాంధ్ర మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. సీఎం కిరణ్‌పై ఈ భేటీలో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వ్యక్తిగత లబ్ది కోసమే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని, తమను కలుపుకుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాట మాత్రంగానైనా తమను సంప్రదించకుండా మీడియా సమావేశాలు పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని చాటుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు(ట). విభజనకు ముందే సీఎంను మార్చాలని అధిష్టానికి విన్నవించాలని కూడా నిర్ణయించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. బొత్స సత్తిబాబును హైకమాండ్ వద్దకు దూతగా పంపినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు 2014 వరకు సీఎంగా కిరణ్ కొనసాగుతారని బొత్స నిన్న ప్రకటించారు. అయితే సీమాంధ్ర మంత్రుల భేటీకి చిరంజీవి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు కిరణ్ కూడా సీఎం పదవిపై ఆశలు వదులుకున్నట్టు కనబడుతోంది. తనకు ప్రజలే ముఖ్యమని పదవి ఇటీవల మీడియా సమావేశంలో కిరణ్ కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాలన్నటిని గమనిస్తే కిరణ్ అక్టోబర్ ఆరు దాటేలా కనిపించడంలేదు. -
పార్టీని వీడే మంత్రులెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బాటలోనే నడవాలని రాష్ట్ర పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, అప్పుడు పార్టీలో కొనసాగే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారన్న అంశంపై పీసీసీ నేతలు అంచనా వేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా సీమాంధ్ర మంత్రుల్లో పార్టీని వీడేవారెందరు,ఏం జరిగినా కచ్చితంగా పార్టీలోనే కొనసాగే వారెందరని కూపీ లాగుతున్నారు. ఏ జిల్లాలో ఏ మంత్రి ఎలా ఆలోచిస్తున్నారు, ఆయన వ్యూహమేమిటి అంటూ వారి సన్నిహిత నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిరోజులుగా సీమాంధ్ర మంత్రులను విడివిడిగా పిలిపించుకుని దీనిపై నేరుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. సీఎం, బొత్సతో కలిపి మంత్రివర్గంలో ప్రస్తుతం సీమాంధ్ర నుంచి 19 మంది ఉన్నారు. విభజనపై ముందుకే వెళ్తే వీరిలో కనీసం తొమ్మిది మంది పార్టీని వీడతారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు... కోస్తాంధ్రలో కన్నా ల క్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు), పార్థసారథి (కృష్ణా), తోట నరసింహం (తూర్పుగోదావరి), ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు), ఎం.మహీధర్‌రెడ్డి (ప్రకాశం), ఉత్తరాంధ్రలో పి.బాలరాజు (విశాఖపట్నం), కొండ్రు మురళీమోహన్ (శ్రీకాకుళం), రాయలసీమలో ఎన్.రఘువీరారెడ్డి (అనంతపురం), సి.రామచంద్రయ్య (కడప) కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని హామీ ఇచ్చారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న మంత్రులెవరూ కాంగ్రెస్‌లో కొనసాగుతారన్న నమ్మకం పార్టీ పెద్దలకు లేదంటున్నారు. ముఖ్యంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న మంత్రులంతా పార్టీని వీడనున్న వారేనని పెద్దలు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీతో ఉంటారన్న దానిపై కూడా పీసీసీ అంచనాలు రూపొందిస్తోంది. -
లోక్‌సభ స్పికర్‌ను కలవనున్న సీమాంధ్ర ఎంపీలు
-
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
-
విజయవాడలో 59వ రోజు కొనసాగుతున్న ఉద్యమం
-
అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారి బైకు ర్యాలీ
-
సోనియాను కలిసే యోచనలో సీమాంధ్ర మంత్రులు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సిద్ధమవుతున్నారు. సోనియాను సీమాంధ్ర మంత్రులు మరి కాసేపట్లో కలిసే అవకాశం ఉన్నట్ల్ల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించే సూచనలు లేకపోవటంతో మరోమారు తమ విన్నపాన్నిఅధిష్టాన నాయకురాలికి వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో ముందుకెళ్తున్న సంకేతాలే స్పష్టంగా వెలువడుతుండటంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు డీలా పడ్డారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. -
భిక్షాటన చేసిన ఉద్యోగులు
-
జతకలిసిన రైతు బజారు సిబ్బంది
-
మీరు చేస్తున్నదే ఉద్యమమా?: బొత్స
హైదరాబాద్ : సీమాంధ్ర మంత్రులకు సమైక్య సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీమాంధ్ర మంత్రులను .... ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమించాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తున్నారని.... మంత్రులు కూడా తమతో కలవాలని ఉద్యోగులు కోరగా.... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిగా అసహనం ప్రదర్శించారు. మీరు చేస్తున్నదే ఉద్యమమా అని ప్రశ్నించారు. తాము కూడా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని బొత్స తెలిపారు. -
సమైక్యాంద్ర కోసం వైయస్ఆర్సిపి పాదయాత్ర
-
కేబినెట్ భేటీకి హాజరు కానీ 8మంది మంత్రులు
-
కేబినెట్ భేటీకి హాజరు కానీ 8మంది మంత్రులు
హైదరాబాద్ : ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి హాజరు కాలేదు. మిగతా మంత్రులు సమావేశానికి హాజరు అయ్యారు. -
సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం:సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సమైక్యాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 9 మంది మంత్రులు హాజరయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. తమని రాజీనామాలు చేయమనడం సమైక్యవాదులకు తగదన్నారు. రెండు మూడు రోజులలో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
రాజీనామాల్లేవ్!
* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం * పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు.. * ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి * మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు * సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం * హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది * పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది * హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’ - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’ - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’ - టీటీడీ చైర్మన్ బాపిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు. తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు. పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం... టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు. రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు... హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు. పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు. -
కేసీఆర్ చనిపోతాడనే విభజన ప్రకటన చేశారు: కావూరి
కేసిఆర్ చనిపోతాడన్న భయంతో 2009లో విభజన ప్రకటన చేశారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్ 9 ప్రకటనకు ముందే చెప్పామని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవని, జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో చెప్పామని కావూరి తెలిపారు. 2009లాగే 2013లోనూ కేంద్రం వెనక్కువెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు ఢిల్లీ వెళ్తామని, తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కావూరి చెప్పారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అయితే.. రాజీనామాలపై మాత్రం సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరి ప్రయత్నంగా సోనియాను కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. -
మెట్టు దిగిన కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిన్నటివరకు చెబు తూ వస్తున్న సీమాంధ్ర మంత్రులు ఒక్కో మెట్టు దిగుతున్నారు. విభజనవల్ల తమ ప్రాంతంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తే తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామంటున్నారు. రాష్ర్టం విడిపోతే తలెత్తే ప్రధాన సమస్యలు సాగునీరు, ఉద్యోగ భద్రత, హైదరాబాద్ లాంటి అంశాలను సీమాంధ్ర కు అన్యాయం జరగకుండా పరిష్కరిస్తే విభజనకు తమకేమీ అభ్యంతరం లేదనేదే వీటి సారాంశం. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి దీనిపై చర్చించేందుకు ముందుకు రావాలని తెలంగాణ మంత్రుల్ని కోరుతున్నారు. కాగా తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరించే మంత్రుల్నిగాక తమ ప్రాంత సమస్యలపై సానుకూల ధోరణితో ఉన్న అమాత్యుల్ని చర్చలకు పిలిచేందుకు సీమాంధ్ర మంత్రులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా శ్రీధర్‌బాబు, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి తదితరులతో మంతనాలు జరుపుతున్నారు. సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనపై చర్చిం చేందుకు వారూ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఒకరోజు ముందు వీరంతా సమావేశమై విభజన వల్ల తలెత్తే సమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అధిష్టానం తెగేసి చెబుతోంది. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన గాడితప్పింది. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేకు పడాల్సిన అవసరముంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రతిపాదన తెచ్చాం. విభజనవల్ల తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై ఓ ప్రతిపాదనను రూపొందిస్తున్నాం. మా ప్రతిపాదనలకు పరిష్కార మార్గం చూపితే విభజనకు అంగీకరిస్తాం’’ అని ఏరాసు తెలిపారు. విభజనవల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని పరిష్కరించడం సాధ్యమా? కాదా? అనేది ఇరుప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకుంటే ఓ అంచనాకు రావొచ్చని గంటా చెప్పారు. టీ-మంత్రులు తమకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కార మార్గాలు చూపితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మూడు గంటల దీక్ష
రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అంగీకరించేది లేదంటూ కొద్ది రోజుల కిందట ఢిల్లీలో హడావుడి చేసిన అదే పార్టీ సీమాంధ్ర నేతలు.. తాజాగా శాసనసభ ఆవరణను వేదికగా ‘మూడు గంటల దీక్ష’ చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత మంత్రులు కూడా పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలనూ ఒప్పుకోబోమంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజలు సాగిస్తున్న ఉద్యమానికి, ఏపీఎన్జీఓలు 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. తమ ఉద్యమాన్ని ఇక ఉధృతం చేస్తామని, వినాయకచవితి తరువాత హైదరాబాద్‌లో 48 గంటల నిరశన దీక్ష చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, వైఎస్సార్సీపీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని, యాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ‘‘కొత్త రాజధానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలని బేరం పెట్టిన చంద్రబాబు దానికి కట్టుబడి ఉన్నారా? గెలిపిస్తే ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని, విడిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మీ మాటలు నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులనుకున్నారా? సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్సీపీలు కొంగజపం చేస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు కూడా దొంగనాటకాలే ఆడుతున్నాయి’’ అని విమర్శించారు. ఎన్.టి.రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవమనటం సిగ్గుచేటన్నారు. సీమాంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణలోని 30 శాతం మంది ప్రజలు సమైక్యాన్నే కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర సమైక్యతను కొనసాగించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరటానికే తామీ దీక్ష చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, దుర్మార్గమైన విభజన నిర్ణయం తీసుకుందని సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై ప్రకటన చేస్తూ రాష్ట్రంలోని భాగస్వాములందరినీ సంప్రదించాకనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేశారే తప్ప తెలంగాణ ఇచ్చేయాలనలేదని స్పష్టంచేశారు. ఉదయం పది గంటల నుంచి మూడు గంటల పాటు సాగిన దీక్షలో 18 మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, టి.జి.వెంకటేశ్‌లు హాజరుకాలేదు. పొంగులేటి గులాబీలు: సీమాంధ్ర నేతల దీక్షా స్థలి వద్ద తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాసేపు హడావుడి చేశారు. సీమాంధ్ర నేతలకు గులాబీలు ఇచ్చి విభజనకు సహకరించాలని కోరబోయారు. దీనిపై మంత్రులు, ఇతర నేతలు అభ్యంతరపెట్టారు. కొందరు నేతలు గులాబీ పువ్వులను తిరిగి పొంగులేటిపైకే విసిరేయగా మరి కొందరు చెవిలో పెట్టుకొని నిరసన తెలిపారు. -
మంత్రుల రాజీనామాలు తూచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసమంటూ మంత్రులు చేసిన రాజీనామాలు పెద్ద ప్రహసనంగా మారాయి. ముఖ్యమంత్రికి మంత్రులిచ్చిన రాజీనామాలేవీ ఇప్పటికీ ఆమోదం పొందలేదు. పైగా మంత్రులంతా యథావిధిగా అధికార హోదాను అనుభవిస్తున్నారు. రాజీనామాల ఆమోదమంటూ అడపాదడపా వారు చేస్తున్నది ఉత్తుత్తి హడావుడిగానే మిగిలిపోతోంది. సోమవారం కూడా అదే పునరావృతమైంది. తమ రాజీనామాల ఆమోదం కోసమంటూ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు గవర్నర్ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని గంటా, ఏరాసు సీఎంను కోరారు. మంత్రులుగా కొనసాగుతూ సమైక్యోద్యమంలో భాగస్వాములం కాలేమన్నారు. తమ రాజీనామా లేఖను వెంటనే గవర్నర్‌కు పంపాలన్నారు. అయితే రాజీనామాల విషయంలో అందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని, తొందరపాటు వద్దని సీఎం వారించారు. ‘‘ఒకటి రెండు రోజుల్లో నేను ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పెద్దల స్పందన, పరిణామాలను అనుసరించి అంతా కలసి ఒకే బాటలో వెళ్దాం. రాష్ట్ర సమైక్యత కోసం అధిష్టానంతో నేను ఎప్పటి కప్పుడు చర్చిస్తున్నాను. పార్టీ పెద్దలను అంగీకరింపజేసే ప్రయత్నం చేస్తున్నాను. వారి వైఖరిపై నా పర్యటన తర్వాత స్పష్టత వస్తుంది’’ అన్నారు. రాజీనామాల ఆమోదంపై కిరణ్ సూచనల మేరకు వెళ్లాలన్న అభిప్రాయానికి కాసు, శత్రుచర్ల వచ్చారని సమాచారం. అంతా కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం చెబుతున్నందున ఆయన మాట ప్రకారం ముందుకెళ్తామని శత్రుచర్ల తనను కలసిన మీడియాతో అన్నారు. అంతా ఒకేసారి రాజీనామాలు ఆమెదింపజేసుకునే కన్నా ఒకరి తరవాత ఒకరుగా చేస్తే మేలన్న అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది. గవర్నర్‌ను కలిసింది ఇద్దరు మంత్రులే: రాజీనామాల ఆమోదం కోసం నలుగురు మంత్రులు గవర్నర్‌ను కలవబోతున్నారంటూ ఆదివారం లీకులిచ్చారు. ముగ్గురు మంత్రులు గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా చివరకు గంటా, ఏరాసు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ‘కొత్తగా నాకు రాజీనామా లేఖలిచ్చినా తిరిగి వాటిని సీఎంకే పంపాల్సి ఉంటుంది. దానికి బదులు మీరిప్పటికే సీఎంకు ఇచ్చిన రాజీనామా లేఖలు నాకందేలా చేయండి చాలు. వెంటనే ఆమోదిస్తా’నని గవర్నర్ వారితో వ్యాఖ్యానించారని సమాచారం. దాంతో మంత్రులు ఆయనకు కొత్తగా రాజీనామా లేఖలివ్వకుండానే వెనుదిరిగారు. రాష్ట్ర విభజన జరిగితే మంత్రులుగా కొనసాగలేమని ముందు నుంచి చెబుతున్నామని అనంతరం వారు మీడియాతో అన్నారు. ‘‘33 రోజులయినా మా రాజీనామాలను ఆమోదించలేదు. సీఎంను కలిసి, రాజీనామాలను తొందరగా గవర్నర్‌కు పంపాలని కోరాం. రాజీనామాలై నా, ఇంకేదైనా కొద్దిరోజుల్లోనే అంతా కలిసే నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ స్థాయికైనా వెళ్దామన్నారు’’ అంటూ వివరించారు. రాజీనామాల ఆమోదానికి సీఎంపై ఒత్తిడి చేస్తామన్నారు. నవంబర్ 2న రాజీనామా: విశ్వరూప్: మంత్రి విశ్వరూప్ సోమవారం సాయంత్రం కిరణ్‌తో వేరుగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను కాంగ్రెస్ వెనక్కు తీసుకుంటుందని, రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టం చేస్తుందని తాను నూటికి నూరుపాళ్లు విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం నవంబర్ 1 దాకా ఎదురు చూస్తాన్నారు. అలా చెప్పని పక్షంలో 2న గవర్నర్‌ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకొని ప్రజా ఉద్యమంలో భాగస్వామిని అవుతానన్నారు. -
సంయుక్త ఉద్యమ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ఉంటుందని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ‘‘రాజీనామాలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే పార్టీకి, ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటే సీమాంధ్రుల మనోభావాలను కేంద్రానికి వెల్లడించడం కష్టమవుతుందన్నారు. కాబట్టి మరికొంత సమయం వేచిచూద్దామన్నారు’’ అని వెల్లడించారు. ఉద్యమంలో రాజకీయ నేతలు, ఉద్యమ శక్తులు కలిసి పని చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా అంగీకారం తెలిపామన్నారు. త్వరలోనే ఇరు పక్షాలతో కమిటీ వేసి భావి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. తమ ఉద్యమంలో మంత్రులు కలిసి వస్తామని చెప్పడం శుభపరిణామమని, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంటు హాల్లో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీ ఎన్జీవోలు సమావేశమయ్యారు. పలు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు. ఆ వెంటనే వారంతా మరోమారు ఏపీభవన్లోనూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేవీపీ రామచంద్రరావు పాల్గొన్న ఈ భేటీలోనూ మంత్రులు, ఎంపీల రాజీనామాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని మేమంతా గట్టిగా డిమాండ్ చేశాం. రాజీనామాలు చేయనంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని మంత్రలు, ఎంపీలు అన్నారు. ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పాకులాడబోమని, ఉద్యమాన్ని ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తామంటే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే ఇప్పుడే రాజీనామాలు ఇస్తామన్నారు. కానీ అలా చేస్తే సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితిని, వాస్తవాలను కేంద్రానికి చెప్పే వీలుండదని చెప్పారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించి, విభజన నిర్ణయాన్ని రద్దు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు’’ అని ఆయన వివరించారు. ‘రాజకీయ నాయకులు, ఉద్యమ శక్తులు కలిసి నడుద్దాం. ప్రజాప్రతినిధుల తరఫున ఇద్దరు, ఉద్యోగుల నుంచి కొందరితో కమిటీ వేసుకుని ముందుకెళ్దాం’ అని సూచించారన్నారు. ఆ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఇరుపక్షాల నేతలతో కలిసి కమిటీ వేసి కార్యాచరణపై చర్చించుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలు ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లడంపై చర్చ జరిగిందని, కానీ అందుకు తాము అంగీకరించలేదని అన్నారు. హైదరాబాద్ సభకు మంత్రుల మద్దతు సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మంత్రులు, ఎంపీలు మద్దతిస్తామన్నారని అశోక్‌బాబు తెలిపారు. వీలును బట్టి అందులో పాల్గొనేందుకు కూడా సిద్ధమని వారు చెప్పారని, తమ హాజరుపై రాజకీయ దుమారం రేగుతుందనుకుంటే తమ ప్రతినిధులను పంపుతామన్నారని చెప్పారు. ‘సభ నిర్వహణలో ఏర్పడుతున్న అడ్డం కులను వారి దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తామని వారు చెప్పారు’ అన్నారు. వెనక్కు రాకున్నా ముందుకు పోదు ప్రస్తుత ఢిల్లీ పరిస్థితులు, పార్టీల అభిప్రాయాలను చూస్తుంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను మాత్రం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని స్పష్టమైందని అశోక్‌బాబు అన్నారు. ‘‘విభజనతో సీమాంధ్రలో తలెత్తే పలు అంశాలను కేంద్రం విస్మరించిందని, వాటికి పరిష్కారం చూపకపోవడం సరికాదని బీజేపీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, జేడీ(యూ) అభిప్రాయపడ్డాయి’’ అన్నా రు. విభజన సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తెలంగాణ ప్రక్రియపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. -
విభజన తప్పదన్నారు.. అయినా పోరాడతాం
రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తమతో అన్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన అలా అన్నప్పటికీ.. సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాలు మాత్రం మానేది లేదని, కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభిప్రాయాలను తాము దిగ్విజయ్ సింగ్‌కు వివరించినట్లు తెలిపారు. మంత్రులు రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిసి బుధవారం దిగ్విజయ్ సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసనలు, సచివాలయంలో జరుగుతున్న వివాదాలు, తిరుపతి దిగ్బంధం తదితర అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రులిద్దరూ ఎన్ని చెప్పినా.. దిగ్విజయ్ మాత్రం విభజన విషయంలో సీడబ్ల్యుసీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకుందని, ఆ విషయంలో ఇక వెనక్కి వెళ్లడం గానీ, యూటర్న్ తీసుకోవడం గానీ కుదరని పని అని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అధిష్ఠానానికి విధేయులుగానే ఉంటామని పలువురు నాయకులు చెప్పిన విషయాన్ని కూడా ఆయన మంగళవారం విలేకరుల వద్ద ప్రస్తావించారు. అయితే.. విభజనపై అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు తమ అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఇవ్వాలని, అంతేతప్ప.. ఆ సమయంలో విప్ జారీ చేస్తే మాత్రం ఆ కొద్దిపాటి అవకాశం కూడా తమ చేజారిపోతుందని మరో మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి దిగ్విజయ్ సింగ్‌తో అన్నారు. ఇక మరోవైపు, త్వరలో జరగనున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీ వరెడ్డి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతిని ఆహ్వానించినట్లు మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. బుధవారం వారు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈమేరకు ఆయనకు ఆహ్వానం అందజేశారు. -
సీమాంధ్ర మంత్రులు సోనియా తొత్తులు
సాక్షి, హైదరాబాద్: ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు నడుం బిగించినా అడ్డుకోవటంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, నేతలు దారుణంగా విఫలమయ్యారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం విమర్శించింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత మంత్రులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తొత్తులుగా మారి నోరెత్తటం లేదని ఆరోపించారు. శనివారం ఫోరం ఆధ్వర్యంలో సచివాలయంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ, సాధారణ ప్రజలు పార్లమెంటుకు వెళ్లి అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం లేనందున వారి పక్షాన మాట్లాడాల్సిన సీమాంధ్ర ప్రాంత నేతలు నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు జడిసి వారు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు రాసిన ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు బెలూన్లను గాలిలోకి వదిలారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు మాట్లాడనందున, బెలూన్ల ద్వారా వర్తమానం పంపే ప్రయత్నం చేశామన్నారు. పోలీసులతో వాగ్వాదం సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సచివాలయం ఎన్ బ్లాక్ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించిన ఉద్యోగులు సీఎం కార్యాలయం ఉన్న సీ బ్లాక్ వద్ద బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆ సమయంలో సీఎం కార్యాలయంలోనే ఉండటంతో పోలీసులు వారిని అడ్డగించారు. డి బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్ వద్దకు రాగానే ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు, బెలూన్లను అక్కడే వదిలి పెడితేనే సీఎం కార్యాలయం వైపు ర్యాలీకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ఫోరం ప్రతినిధులు కాసేపు వాగ్వాదానికి దిగారు. మూడు రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగులు సీఎం కార్యాలయం ముందు పావురాలు వదిలితే అడ్డుచెప్పని పోలీసులు తమను అడ్డుకోవటం వివక్షేనంటూ నినాదాలు చేశారు. అయినా పోలీసులు ససేమిరా అనడంతో అక్కడే బెలూన్లను వదిలి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. రాజధానిలో సమైక్య సభ జరిపి తీరుతాం: అశోక్‌బాబు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభ జరిపి తీరుతామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో కార్యాలయంలో శనివారం జరిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉంటే సమైక్య సభకు ఆటంకాలు సృష్టించరని, నిజాయితీ లేకే శాంతి ర్యాలీలు, మిలియన్ మార్చ్‌లు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. తాము సభను గాంధేయ పద్ధతుల్లో శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో సభలు, సమావేశాలు నిర్వహించుకొనే హక్కు తమకుందన్నారు. సభకు అనుమతి లభించకుంటే.. కోర్టుకు వెళ్లి తెచ్చుకుంటామని చెప్పారు. విభజన వల్ల ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నదీ జలాలపై స్పష్టత లేదన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఏం కావాలనే విషయంలో స్పష్టత కొరవడిందన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోలు, ఐటీ ఉద్యోగులతో పాటు ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు?: హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు..? ఏ హోదాలో ఉదారతను ప్రకటిస్తున్నారు.. ఎవరిని అడిగి ప్రతిపాదిస్తున్నారు?’అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకు లు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర అధికారిక కార్యకలాపాలకు మాత్రమే భాగ్యనగరాన్ని రాజధానిగా పరిమితం చేయాలని డిమాం డ్ చేశారు. రాబడి, శాంతిభద్రతలవంటివన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండాల్సిందేనని చెప్పారు. హెచ్ఎండీఏను కేంద్రం పరిధిలోకి తేవడమంటే తెలంగాణలోని సగం జిల్లాలను విడదీసినట్లేనని, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలను వెంటనే మానుకోవాలన్నారు. వారిని సస్పెండ్ చేసే దమ్ముందా?: చంద్రబాబుకు కేటీఆర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: తమది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఎందుకు చేయడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ప్రశ్నించారు. టీడీపీ విధానం తెలంగాణకు అనుకూలమని చెబుతున్న చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అంగీకరించిన చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఏమిటన్నారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని అర్భకుడు సీఎం కిరణ్ అని. ఆయనకు దమ్ముంటే కేసీఆర్ విసిరిన సవాల్‌కు స్పందించాలని కోరారు. తెలంగాణవాదులపై సంస్కారహీనంగా వ్యవహరిస్తున్న వారితో ఎలా కలిసుండాలని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్ష గురించి విలేకరులు ప్రస్తావించగా... వేరే రాష్ర్టంలో జరుగుతున్న దీక్ష గురించి తామెందుకు మాట్లాడాలని చెప్పారు. హరికృష్ణా.. ఎన్టీఆర్ ఇప్పుడే గుర్తుకొచ్చారా?: కడియం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును సీఎం పదవి నుంచి దించేటప్పుడు అందులో భాగస్వామి అయిన హరికృష్ణకు ఇన్నాళ్లకు తండ్రి గుర్తుకొచ్చినట్టున్నారని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడూ చేసేప్పుడు తమతోనే ఉన్న హరికృష్ణ ఆనాడు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, రమణాచారిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బావమరిది ఎన్టీఆర్ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటికీ టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం తమ పార్టీది తెలంగాణ అనుకూల వైఖరి అని చెప్పడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడంపై శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఈ స్థితిలోనే ఒత్తిడి చేయలేని కాంగ్రెస్ నేతలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా గౌరవిస్తారని సందేహం వ్యక్తం చేశారు. ఈనెలాఖరులో కరీంనగర్ నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుందని చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతం అనేది హైదరాబాద్‌కు నప్పదని తెలిపారు. దిగ్విజయ్‌సింగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. -
'డిమాండ్లను అంగీకరించకుంటే రాజీనామాలకు సిద్ధం'
ఢిల్లీ: కేంద్రం ముందు నాలుగు డిమాండ్లను ఉంచుతున్నామని, వాటిని ఆమోదించని పక్షంలో రాజీనామాలకు సిద్ధమని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు. ఆంటోని కమిటీకి వివరించాల్సిన విషయాలపై ముఖ్యంగా చర్చించారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బ తింటుందని ఆంటోనీకి కమిటీకి వివరించేందుకు నేతలు సన్నద్ధమైయ్యారు. భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే..హైదరాబాద్‌ను కేంద్ర పాలితంగా చేయాలని డిమాండ్‌ను కమిటీకి వివరించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 30లోగా సీమాంధ్ర ప్రజల డిమాండ్లపై కేంద్రం ప్రకటన చేయాలన్నారు. .కాగా, ఈ రోజు ఆంటోనీ కమిటీతో జరగాల్సిన సీమాంధ్ర నేతల సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈ మేరకు నాలుగు డిమాండ్లను ఆంటోనీకి కమిటీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. 1.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి 2.విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్రపాలితప్రాంతంగా చేయాలి 3.తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరుగా రాజధానులు ఏర్పాటుచేయాలి 4. తెలంగాణ విషయంలో కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాలి -
ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో, పార్టలో తలెత్తిన విభేదాల పరిష్కారం కోసం కాంగ్రెస్ అధినాయకులు ఏర్పాటుచేసిన ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర నేతలు గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు కూడా సమావేశంలో పాల్గొన్నారు. దీనికి కేంద్ర మంత్రులు చిరంజీవి, ఎం.ఎం. పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, తిరుపతి ఎంపీ చింతా మోహన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి హాజరయ్యారు. అయితే, రేణుకా చౌదరి మాత్రం సమావేశానికి హాజరై కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. 'ఇది మా పార్టీ కార్యాలయం.. ఇష్టం వచ్చినప్పుడు వస్తాం.. వెళ్లిపోతాం. నేను నిన్నటి సమావేశంలో పాల్గొనలేదు.. ఈ సమావేశంలోనూ పాల్గొనలేదు' అని ఆమె సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూంలో మిగిలిన నాయకులతో సమావేశం ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులు కూడా తమ జీతాలు, జీవితాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుండటంతో సీమాంధ్ర ప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువగానే ఉంది. అటు కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎదురు చెప్పలేకపోవడం, మరోవైపు సొంత ప్రాంతాల్లోని ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని కాదనలేకపోవడంతో వీరంతా ఆంటోనీ కమిటీకి ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. -
చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గురువారం సమావేశమైయ్యారు. రాత్రి 8గం.లకు ఆంటోని కమిటీతో సమావేశం ఉన్నందున ముందుగా చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవితో సమావేశమైన మంత్రులు ఆంటోని కమిటీలోవివరించే అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలున్నట్లు తెలుస్తోంది. కొందరు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతుండగా, ఇంకొందరు హైదరాబాద్‌ను శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టుబడుతున్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న సమయంలో సీమాంధ్ర మంత్రులు ఏ అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమైక్యమే శ్వాసగా ఉద్యమిస్తున్న సీమాంధ్రులకు సకల జనుల సమ్మె తోడవడంతో సమైక్యపోరాటం తారస్థాయికి చేరింది. మలిరోజూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. సమ్మెకు తోడుగా అడుగడుగునా సమైక్యవాదులు గురువారం కూడా నిరసనలను హోరెత్తిస్తున్నారు. -
మిన్నంటిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ నిరసనలు
సాక్షి, నెట్వర్క్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లాల్లో కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు గైని గంగారాం, కిషన్ మాట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సత్వరమే ప్రవేశ పెట్టాలని, జాప్యం చేస్తే గతంలో మాదిరిగా మళ్లీ సకల జనుల సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట, కామారెడ్డిలో భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన నందిపేటలో రిలే నిరాహార దీక్షలు 937వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదని ఖమ్మంలో జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు పువ్వులతో వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. గె జిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఖాజామియా ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాచలంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఇల్లెందు, అశ్వారావుపేట, పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, మధిర, కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ సెంటర్లో ఉద్యోగులు ధర్నా, మానవహారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చి సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని, పెద్దపల్లి , సిరిసిల్ల, మల్యాలలో ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. నల్లగొండలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రెండోరోజు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓ విజ్ఞప్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, వారి భద్రతకు ఇక్కడి ఉద్యోగులదే బాధ్యతన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామన్నారు. -
సమ్మెలు వద్దు.. సమస్యలపై చర్చిద్దాం: తెలంగాణ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని తీసుకుందని, దానిపై సీమాంధ్రలో ఉద్యోగులు, నాయకులు సమ్మెలు, ఆందోళనలకు దిగడం సరికాదని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, వెంటనే ఆందోళనలను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యోగులతో పాటు హైదరాబాద్‌లోని ప్రజలందరి భద్రతకూ తాము భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్ వద్ద డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. సీమాంధ్రలో ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, తెలంగాణ అంశంలో ఢిల్లీ పరిణామాలపై వారు చర్చించారు. తెలంగాణ మంత్రులుగా భరోసా ఇచ్చి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని, పలు ఇతర అంశాలపైనా ఆ ప్రాంత నేతలతో సానుకూల వాతావరణంలో చర్చించాలని అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఆంటోనీ కమిటీకి తెలంగాణకు సంబంధించిన అంశాలను వివరించాలని నిర్ణయించారు. ఈ మేరకు 18వ తేదీన తెలంగాణ ప్రాంత నేతలు సమావేశమై నివేదికను రూపొందించనున్నారు. అదే సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. భేటీ అనంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగ భద్రత, పెన్షన్లు, ఇతర అంశాలపై ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విధివిధానాలు పూర్తయ్యేవరకు సీమాంధ్ర ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో భాగమేనని జానారెడ్డి స్పష్టం చేశారు. ఆందోళనలు చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎన్జీవోలు కూడా సీమాంధ్ర ఉద్యోగుల్ని రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని కోరారు. వారితో సయోధ్యతో వ్యవహరించి సమ్మె విరమించేలా చేయాలన్నారు. హైదరాబాద్‌పై ఆందోళన అనవసరమని, అది అంత ర్జాతీయ కేంద్రంగా మారిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమయాభావం వల్ల వారిని ఆహ్వానించలేకపోయామని, ఇకపై వారు ప్రతి సమావేశానికి వచ్చేలా చూస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
ముక్కలు చేయడం అనైతికం: సీమాంధ్ర మహిళలు
విభజన వద్దంటూ గవర్నర్‌కు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణుల వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అప్రజాస్వామికం, అన్యాయం, అనైతికం అని రాష్ట్ర సీమాంధ్ర మంత్రుల భార్యలు మండిపడ్డారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ సతీమణి మోక్షప్రసన్న, మంత్రి పార్థసారథి సతీమణి కమలల నాయకత్వంలో పలువురు మంత్రుల భార్యలు, బంధువులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఒడిశా తదితర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌కు నీటి వివాదాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య కూడా నీటి తగాదాలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌ను అందరం కలిసి అభివ ృద్ధి చేసుకున్నామని, అలాంటిది ఇప్పుడు తమను వెళ్లిపోమంటే ఎక్కడకు వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు విభజన వల్ల పూర్తిగా దెబ్బతింటాయన్నారు. విడిపోతే అందరం నష్టపోతామని, కలిసుంటే అందరం అబివృద్ధి సాధిస్తామని చెప్పారు. వారితో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సోనియా గాంధీకి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా ప్రతి తుపాకి గుండు ఒక మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుందని, రాష్ట్ర విభజన తమ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తోందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హోదాలో గవర్నర్‌ను కలిశామని, ఇందులో తమ భర్తలకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. ఇదే అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుసుకుని, ఆయనకు కూడా వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శత్రుచర్ల సతీమణిశశికళ, టీజీ వెంకటేష్ సతీమణి మంజరి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరి సుచరిత, విప్ రుద్రరాజు పద్మరాజు సతీమణి ఇందిర, వారి బంధువులు సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. వీరంతా రాజ్‌భవన్‌కు మంత్రులు అధికారికంగా వినియోగించే బుగ్గ కార్లలో రావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల మేరకు బుగ్గకార్లలో కేవలం మంత్రులు మాత్రమే పయనించాలి. -
సీమాంధ్ర మంత్రులు రాజీనామా సరికాదు: కేఎల్ఆర్
సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయడం సరికాదని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) మంగళవారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. మంత్రుల రాజీనామాలతో రాష్ట్రంలో పాలన స్తంభిస్తుందన్నారు. సీఎం కిరణ్ తక్షణమే మంత్రివర్గాన్ని సమావేశపరిచి, తాజా పరిస్థితిపై సమీక్షించాలని సూచించారు. రాజీనామాలు చేసిన మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాలనను మెరుగుపరిచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హితవు పలికారు. -
సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎందుకు సైలెంటయ్యారు?
-
ముఖ్యమంత్రిని కలిసిన సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని గురువారం పలువురు సీమాంధ్ర మంత్రులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన వీరు సీఎంతో భేటీ అయ్యారు. కిరణ్‌ను కలిసినవారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, వట్టి వసంత్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, తోట నర్సింహం, పితాని సత్యానారాయణ, డొక్క మాణిక్య వరప్రసాద్, ఆనం రాంనారాయణ, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర విభజన, ఆంటోనీ హైలెవల్ కమిటీ, సీమాంధ్ర ఉద్యమంతో పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసులపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
పదవుల కోసం పాకులాట ఎందుకు: వీరశివారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విభజన జరుగుతుందని తెలిసినా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మిన్నకుండిపోయారని ఆయన బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలు నేతలకు పట్టవా అని ప్రశ్నించిన ఆయన రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడేవారిని ప్రజలు క్షమించరని వీరశివారెడ్డి అన్నారు. నాలుగు నెలల మంత్రి పదవుల కోసం పాకులాట ఎందుకని ఆయన మండిపడ్డడారు. పనిలో పనిగా వీరశివారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై శివాలెత్తారు. కేసీఆర్‌పై భౌతిక దాడి చేయాల్సిన పని రాష్ట్రంలో ఎవరికి లేదన్నారు. రాజకీయ వారసత్వం, ఆస్తుల కోసమో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, లేక పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేకేలకే ఈ ఆలోచన ఉండొచ్చని ఆరోపించారు. విజయశాంతి ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారని, మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌లో చేరుతారనే ఆందోళనలతోనే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని వీరశివరెడ్డి ఎద్దేవా చేశారు. -
కొత్త పల్లవి అందుకున్న మంత్రి టీజీ వెంకటేశ్
-
నేడు సీఎం క్యాంప్ ఆఫీసులో తెలంగాణ, సీమాంధ్ర సిఎల్పి భేటీ
-
కాంగ్రెస్ నిర్ణయంపై నిరసనలు తీవ్రతరం
-
11గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భేటీ