ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హజరయ్యారు. వట్టి వసంత్ కుమార్, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారధి, ఆనం రాంనారాయణ భేటీలో పాల్గొన్నారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి గైర్హజరు అయ్యారు.