State Cabinet meeting
-
అయోధ్యలో ‘ఆదిత్య’ మంత్రివర్గ సమావేశం
అయోధ్య: రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. అయోధ్యలో కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా రాష్ట్ర రాజధానికి బదులు వేరే చోట కేబినెట్ సమావేశమవుతుంది. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి అంగరంగ వైభవంగా సంసిద్ధమవుతున్న వేళ అదే పట్టణంలో సీఎం మంత్రివర్గాన్ని సమావేశపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
సమీపిస్తున్న ఎన్నికలు... కొత్త సచివాలయంలో 18న తొలి కేబినెట్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం (ఈ నెల 18న) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సచివాలయంలో ఇదే తొలి కేబినెట్ భేటీ కానుండటం గమనార్హం. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ భేటీలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాల అమలుతీరును లోతుగా సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. నాలుగు నెలలే గడువు ఉండటంతో.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఆ వెంటనే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. అంటే స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా.. ఈ నాలుగు నెలల్లో అనుసరించిన వ్యూహాలు, పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో.. తెలంగాణలో దాని ప్రభావంపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అమలు చేయాల్సిన కొత్త పథకాలు, జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పెండింగ్ హామీల అమలుపై నిర్ణయాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సాయం వంటి పథకాల విషయంలో కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దళితబంధులో అవినీతి, పోడుభూములకు పట్టాల పంపిణీ, ఉద్యోగ నియామకా ల్లో జాప్యం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం, ధరణి సమస్యలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్రావుల పదవీకాలం ఈ నెల 27న ముగియనుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదం కోసం శాసనసభ సమావేశాలు గవర్నర్ తమిళిసై తిరస్కరించిన, తిప్పి పంపించిన బిల్లులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి శాసనసభ సమావేశాలు నిర్వహించాల.ని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గవ ర్నర్ తిరస్కరించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) చట్ట సవరణ బిల్లును మళ్లీ శాసనసభలో ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా రెండోసారి ఆమోదించి పంపితే.. గవర్నర్ తప్పనిసరిగా పాస్ చేయాల న్న నిబంధన ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కోవిడ్–19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. విజయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు వైద్యానికి సంబంధించి అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
నేడు ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లు లపై ఇందులో చర్చించనున్నారు. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్లో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ► 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్ చేయూత పథకం నేడు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ► చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చే విషయమై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ► జీఎస్టీ ఎగవేతను నివారించడం, మరింత సమర్ధంగా జీఎస్టీ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ► అక్రమ మద్యం, ఇసుక రవాణా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ► పోలీసు శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయనున్నారు. ► కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ ముసాయిదా బిల్లును కేబినెట్లో ఆమోదించనున్నారు. ► జీఎస్టీ చట్టంలో సవరణలు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ► గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ► రాష్ట్రంలో తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ► ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ► విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో మూడు కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. -
పవర్ఫుల్ సర్పంచ్
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ దిశగా సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను వారికే అప్పగించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సర్పంచులు తీసుకున్న నిర్ణయాలను తదుపరి పంచాయతీ సమావేశాల్లో ఆమోదం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని తీర్మానించారన్నారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. అవినీతికి పాల్పడితే వేటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటే అధిక ధన వ్యయం, మద్య ప్రవాహానికి ఆస్కారం ఉంటుందని.. కాలపరిమితిని 13 రోజులకు కుదించాలని నిర్ణయించిందన్నారు. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను పూర్తిగా ఆ వర్గాల వారికే కేటాయిస్తారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకరించిందన్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారన్నారు. మండలి నిర్ణయాలను మంత్రి ఇంకా ఇలా వివరించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు. వ్యవసాయ, ఉద్యానవన విద్యా సంస్థలను పర్యవేక్షించడంతోపాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. నియమ నిబంధనలు పాటించే కళాశాలలకు ఈ సంస్థ గుర్తింపు ఇస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులకు మరింత తోడ్పాటు అందిస్తుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి విధానాలకు ఈ కౌన్సిల్ ఒక రెగ్యులేటర్‌గా పని చేయనుంది. వ్యవసాయ, ఉద్యానవన విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ, ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలకు పబ్లిక్, ప్రవేట్ విభాగాల్లో పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది. పండ్లు, పూల తోటలకు ఇచ్చే పరిహారం పెంపు రాష్ట్రంలో భూ సేకరణతోపాటు, నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దానివల్ల మామిడి, కొబ్బరి, నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో రూ.2,600 మాత్రమే ఉన్న మామిడి పరిహారం రూ.7,283కు పెంపు. కొబ్బరి చెట్టుకు రూ.6,090కి పరిహారం పెంపు. గతంలో ఈ మొత్తం కేవలం రూ.2149గా ఉండేది. నిమ్మ పంటకు పరిహారం రూ.1,444 నుంచి రూ.3,210కి పెంపు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ జెన్కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. దీనికితోడు ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందుకోసం ఏటా 45 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వా రైతులకు సబ్సిడీపై నిరంతరం విద్యుత్‌ను అందించించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా దాని ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మెగావాట్‌కు రూ.20 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఆ వెసులుబాటును వినియోగించుకోనుంది. ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు సీఎండీ సహా మరో 18 పోస్టులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిడెట్ ఏర్పాటు రాష్ట్రంలో వివిధ శాఖల వద్ద ఉన్న మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్లో 1992లో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అది మంచి ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
‘ఆర్టీసీ’పై కీలక కేబినెట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అమలు చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం కానుంది. సమ్మె 27 రోజులకు చేరడంతో ప్రజలకు అసౌకర్యం, ఆర్టీ సీకి నష్టాలు పెరిగిపోయాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆర్టీసీ యూని యన్లు తరచూ సమ్మెకు వెళ్తున్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో తీర్చగలిగినవి ఎన్ని? తీర్చలేనివి ఎన్ని? సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఆర్టీసీ భవితవ్యంపై తీవ్ర కసరత్తు చేస్తున్న సీఎం, నిపుణులతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్రం అమలుచేస్తున్న రవాణా చట్టంపైనా సీఎం సమగ్ర అధ్యయనం చేసినట్లు ఆయన సన్ని హిత వర్గాలు తెలిపాయి. దీనిని క్రోడికరించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. విలీనంపై ఏం చేద్దాం? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మిక నేతలు పట్టుబట్టుతున్నారు. విలీనం అసాధ్యమని, దేశంలో ఇంతవరకు ఎక్కడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని ప్రభు త్వం వాదిస్తోంది. విలీనం చేయాలన్నదే తమ డిమాండ్ కాదని యూనియన్లు కోర్టుకు తెలిపాయని, కానీ సరూర్‌నగర్ సభలో మళ్లీ విలీనం డిమాండ్ చేశాయని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఏమి చేయాలనే విషయంలో సీఎం సమాలోచనలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది? ఇతర రాష్ట్రాలు ఆర్టీసీ విషయంలో అనుసరించిన విధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆర్టీసీని మూసేశారని, ఆ రాష్ట్రాలతోపాటు జార్ఖండ్‌లోనూ ప్రభుత్వరంగ రవాణా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 12 వేల బస్సులే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వద్ద ఉన్నాయి. బిహార్‌లో 600 ఆర్టీసీ బస్సులుండగా పశ్చిమ బెంగాల్లో 10 వేల రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు బస్సులను నడిపిస్తున్నారని అధికారులు సీఎంకు నివేదించారు. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మోటారు వాహన సవరణ చట్టంలో రవాణా రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొల్పేందుకు ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. దీని ఆధారంగానే రాష్ట్రంలో దాదాపు 4 వేల రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు పర్మిట్లు జారీ చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలో విపక్షాలు అనుసరిస్తున్న వైఖరిపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టీసీ నష్టాల్లోనూ 31 శాతం వాటాను భరించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని పూర్తిగా మూసేసి ఇక్కడ మాత్రం విలీనం డిమాండ్ చేస్తున్నారని సీఎం మండిపడినట్లు పేర్కొంటున్నాయి. -
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
-
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, అమరావతి: మరిన్ని ఎన్నికల హామీలను అమల్లోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా 66 వేల మంది గర్భవతులు, బాలింతలకు, 3.18 లక్షల మంది పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందిస్తారు. అలాగే హజ్ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలలోపు వార్షికాదాయమున్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, మూడు లక్షలపైన వార్షికాదాయమున్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న క్రషర్స్‌కు పావలా వడ్డీకే రుణాలను ఏపీఎస్ఎఫ్సీ ద్వారా అందించేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అడ్వొకేట్స్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలు, అలాగే దేవదాయ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశముంది. -
పెరిగిన అంచనాలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న సీతారామ ఎత్తిపోతల, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ)ల అంచనా వ్యయాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రీ డిజైనింగ్ జరిగిన నేపథ్యంలో మార్పులు జరగడంతో సీతారామ అంచనా వ్యయం రూ.7,926.14 కోట్ల నుంచి రూ.13,057 కోట్లకు పెరగ్గా, ఎఫ్ఎఫ్సీ అంచనా వ్యయం రూ.4,729.26 కోట్ల నుంచి రూ.9,886.27 కోట్లకు పెరిగింది. ఈ పెరిగిన అంచనా వ్యయాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్పులకు తగ్గట్టే పెరిగిన వ్యయాలు శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సీతారామ, ఎఫ్ఎఫ్సీ పరిధిలో జరిగిన మార్పులు, పెరిగిన వ్యయాలపై చర్చించింది. సీతారామ ఎత్తిపోతలతో మొదట 50 టీఎంసీల గోదావరి నీటితో 5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. దీనికోసం రూ.7,926.41 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. అనంతరం సీతారామ ద్వారా 9.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తొలి దశలో 70 టీఎంసీల నీటిని తీసుకుని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. దీంతో మార్పులు అనివార్యమయ్యాయి. ప్రధాన కాల్వ ద్వారా తొలుత 4,545 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని భావించగా, దాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో భూసేకరణ అవసరం 5,800 హెక్టార్ల నుంచి 7,402 హెక్టార్లకు పెరిగింది. భూసేకరణకు రూ.1,342 కోట్లు లెక్కించగా, అది ప్రస్తుతం రూ.2,011 కోట్లకు పెరిగింది. కాల్వ వ్యవస్థలో మార్పులకు అదనంగా మరో రూ.1,615 కోట్ల వ్యయం పెరుగుతోంది. నీటిసామర్థ్యం పెంచడంతో గతంలో 380 మెగావాట్ల విద్యుత్ అవసరాలను లెక్కించగా ప్రస్తుతం 715 మెగావాట్లుగా లెక్కించారు. దీంతో ఈ విద్యుత్ సరఫరా అవసరాల వ్యయం రూ.1,298 కోట్ల నుంచి రూ.3,264 కోట్ల మేర పెరుగుతోంది. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.13,057 కోట్లకు చేరగా దీన్ని శుక్రవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. 51 ప్యాకేజీలకు గడువు పొడిగింపు ఇక ఎఫ్ఎఫ్సీ వరద కాల్వను రూ.4,729.26 కోట్లతో చేపట్టగా, రీ ఇంజనీరింగ్‌లో దీని పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 నుంచి 1 టీఎంసీ సామర్థ్యానికి పెంచారు. ఆయకట్టు సైతం 2.20 లక్షల ఎకరాలు ఉండగా మరో 32 వేల ఎకరాలకు పెంచారు. దీంతో వ్యయం రూ.9,886.27 కోట్లకు పెరగ్గా, దీనికి కేబినెట్ ఓకే చేసింది. దీంతో పాటే మిడ్‌మానేరు పరిధిలోని మన్వాడ గ్రామాన్ని పునరావాస గ్రామంగా గుర్తించేందుకు అనుమతించింది. ఇక వీటితో పాటే జీవో 146 కింద ఎస్కలేషన్ ఇచ్చిన 51 ప్యాకేజీల పనులు భూసేకరణతో పూర్తి కాకపోవడంతో వాటి గడువును మరింత కాలం పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. -
పక్కా లోకల్ !
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేయనున్న 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్రానికి పంపించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండింటిని ఆమోదించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఏర్పడుతాయి. ఒకటో మల్టీ జోన్లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు, రెండో మల్టీ జోన్లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా ఉంటాయి. ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. స్టేట్ కేడర్ పోస్టులను కచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస గౌడ్, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిలను ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానిని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పంద్రాగస్టు నుంచి బీమా పత్రాలు రాష్ట్రంలోని 18–60 ఏళ్ల వయసున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా వర్తించనుంది. ఎల్ఐసీ ద్వారా ఈ బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును బడ్జెట్లోనే కేటాయించనుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతోపాటు ఇతర సిబ్బందిని నియమిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతారు. పదోన్నతులతోనే సూపర్ వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ఐసీడీఎస్‌లో సూపర్ వైజర్–గ్రేడ్ 2 పోస్టులను వందకు వందశాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హతలు కలిగిన వారినే సూపర్ వైజర్లుగా నియమించాలని చెప్పారు. సూపర్ వైజర్ల నియామకానికి సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులతో సీఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అంగన్వాడీ టీచర్లకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. -
ప్రజారోగ్యానికి ప్రపంచబ్యాంకు రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లతో కలసి సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. - రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరమని, వాటిలో ప్రపంచబ్యాంకు నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగాను, మిగిలిన 30 శాతం (రూ.1,442కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. - టాటా ట్రస్ట్‌కు బాలామృతం కార్యక్రమంలో పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత అప్పగింత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్టు ద్వారా మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది. - రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రూ. 38,265 కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం. ఈ హౌజింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు సమకూర్చుకుంటాడు. -
మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు
-
మరో మూడు ఉడాలు
అనంతపురం, కర్నూలు, కాకినాడ కేంద్రంగా ఏర్పాటు ⇒ చంద్రన్న బీమా కింద అదనంగా రూ.30 వేలు ⇒ అర్బన్ ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం ⇒ మద్యం షాపుల లైసెన్సు ఫీజుల తగ్గింపు ⇒ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఉడా)ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే ‘చంద్రన్న బీమా’ కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► మాతృమూర్తిపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. ► అనంతపురం కేంద్రంగా 3,098.46 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనంతపు రం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 177 గ్రామాలు. ► తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా 2,215.50 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు. ► కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు. వీటి ఏర్పాటు నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం. ► ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద అర్బన్ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. ► అగ్రిగోల్డ్‌కు కీసరలో ఉన్న 350 ఎకరాలు, విజయవాడలోని 8 వాణిజ్య ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కోర్టు ను అభ్యర్థించాలని నిర్ణయం. కోర్టుల్లో లేని అక్షయ గోల్డ్, బొమ్మరిల్లు, కేశవరెడ్డి సంస్థల వివాదాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు ఆదేశం. ► ఏపీ సైబర్ సెక్యూరిటీ విధానం–2017కు ఆమోదం. ► ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ తదితర కోర్సులను ప్రవేశపెడుతూ పాఠ్యాంశాల్లో మార్పు చేయా లని నిర్ణయం. 2017–18ను ఇ–ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం. ► ఎస్టీ విద్యార్థుల కోసం విజయవాడలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి. ► అమిటీ, విట్, సెంచూరియన్, ఎస్ఆర్ఎం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా అంగీకార లేఖలకు సంబంధించిన సవరణలకు ఆమోదం. ► విభజన చట్టం తర్వాత రాష్ట్రం బయట తలెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన మంత్రుల బృందానికి బదులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన జీవోకు ఆమోదం. ► మద్యం షాపుల లైసెన్సు ఫీజును వందలో 25 శాతానికి తగ్గించాలని నిర్ణయం. కేంద్రానికి చెల్లించే సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు ఈ విధానానికి ఆమోదం. తగ్గించిన ఫీజును అదనపు ఛార్జీల పేరుతో మళ్లీ లైసెన్సుదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం. ‘పతంజలి’ ఆయుర్వేద సంస్థకు 172 ఎకరాలు ► విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలోని 172.84 ఎకరాలను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కేటాయిం చేందుకు గానూ ఏపీఐఐసీకి అనుమతి. ఆహార, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకరం రూ.3 లక్షల చొప్పున కేటాయించేలా నిర్ణయం ► చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులోని 100 ఎకరాల భూమిని వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరం రూ.1.50 లక్షల చొప్పున కేటాయించేలా ఏపీఐఐసీకి అనుమతి. -
నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
-
నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
జిల్లాల పునర్విభజన.. ఉద్యోగులకు 3.144 శాతం డీఏ.. * సుధీర్, చెల్లప్ప కమిషన్ల నివేదికలకు ఆమోదం * జీఎస్టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) 3.144 శాతం పెంపు, ముస్లింలు, గిరిజనులకు చెరో 12 శాతం రిజర్వేషన్లు, వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎజెండాలోని 30 అంశాలపై చర్చించి ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటును ఎజెండాలో ముఖ్య అంశంగా పెట్టారు. వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)ను ఆమోదించేందుకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాల తేదీలను సైతం ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. అదే విధంగా గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు ముస్లింలు, గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ సమర్పించిన నివేదికలను కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. నీటిపారుదల శాఖలో 150 ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన డ్రైవింగ్ లెసైన్స్‌ను రద్దు చేసేందుకు 12 పాయింట్ల ప్రతిపాదనలను ఆమోదించనుంది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన అంచనాలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అదే విధంగా దేవాలయాల ట్రస్ట్‌లలో సభ్యుల సంఖ్యను 9 నుంచి 15కు పెంచేందుకు వీలుగా దేవాదాయ చట్టానికి ప్రతిపాదించిన సవరణలతో పాటు రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు సంబధించిన ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. -
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతల అప్పగింత అంశం తో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించేందుకు మంత్రివర్గం ఆదివారం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ ఎజెండా ప్రకారం బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చ జరగనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శాఖల వారీగా బడ్జెట్ పద్దులతో పాటు త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు, గవర్నర్ ప్రసంగించే తేదీని నిర్ణయించనుంది. 1993కు ముందు నుంచి ప్రభుత్వంలో పనిచేస్తున్న 5 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనుంది. -
2017 జూన్ 2లోపు ఏపీకి వచ్చిన వారికే...స్థానిక హోదా
- రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్థానికత నిబంధన సడలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీకి వచ్చిన వారికే స్థానికత వర్తిస్తుందని ప్రకటించింది. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా ఈలోపు ఇక్కడకు వచ్చి నివాస ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఇక్కడి స్థానికత వర్తించదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత స్థానికత నిబంధనల ప్రకారం నాలుగేళ్లపాటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే స్థానికులు అవుతారు. రాష్ట్ర విభజన జరిగిన ప్రత్యేక నేపథ్యంలో ఉద్యోగులు స్థానికత విషయంలో అసంతృప్తితో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ నిబంధనకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2017 జూన్ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి వెంటనే స్థానికత వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత నిబంధనను మార్చాలంటే ఏపీ స్టేట్ రీ-ఆర్గనైజేషన్ ప్రకారం.. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అనుమతితోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు మీడియాకు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఈనెల 22న శంకుస్థాపన చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. → ఈ నెల 22న మధ్యాహ్నం 12.35-12.45 మధ్య ఉద్దంరాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం మధ్య సీడ్ రాజధాని నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కృష్ణా నది నుంచి కరకట్టవైపు 50 ఎకరాలను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. → 3వేల ఎకరాల్లో తొలి దశ రాజధాని నిర్మాణం ఉంటుంది. భూమిని సీఆర్డీఏ పేరిట ఉంచి సింగపూర్ సంస్థల భాగస్వామ్యంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో నిర్మిస్తారు. సచిత్తూరు జిల్లా కుప్పంలో 3కేఆర్ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13,035మంది రైతులకు చెందిన రూ.13.24 కోట్ల రుణాల మాఫీ. → కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చిన 1,398 ఎకరాల లీజును 30 ఏళ్లకుపొడిగింపు. సవిశాఖపట్నం జిల్లా రాయవరం, రాంబిల్లి మండల్లాలో 1,965.57 ఎకరాలను నేవల్ ఆల్టర్నేట్ బేస్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ ఎస్టేట్‌కు ఎకరం రూ.5 లక్షల చొప్పున అప్పగింత. → లక్ష మంది పిల్లలకు భోజనం సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 2 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని ఎకరా రూ.54 వేల చొప్పున 30 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్డీఓకు 2,721 ఎకరాల కేటాయింపు. → పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెరగడంపై చర్చ. ఈ నెల 22 నుంచి ఎర్త్‌వర్క్ పనుల్ని ప్రారంభించాలి. ఈ పనులు ప్రారంభించడానికి వీలుగా రెండు గ్రామాలను ఖాళీ చేయించాలి. ఐటీ కంపెనీలకు భారీ రాయితీలు... → ఐటీ టెక్నాలజీ పార్కులో కార్యాలయం ఏర్పాటు చేసుకునే సంస్థలకు లీజు అద్దెలో 50 శాతం రీయింబర్స్మెంట్ (ఏడాదికి రూ.10 లక్షలకు లోబడి) సదుపాయం కల్పించడం. → ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కంపెనీలు చెల్లించే బ్యాండ్ విడ్త్ చార్జీల్లో 25 శాతం(రూ.15 లక్షల పరిమితికి లోబడి) రీయింబర్స్మెంట్. కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ అవకాశం. → కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు నిర్ణీత కరెంటు చార్జీలు యూనిట్ ఒక్కింటికి రూ.10 చొప్పున రీయింబర్స్మెంట్. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు విద్యుత్ సుంకాల్లో నూరు శాతం మినహాయించి పరిశ్రమలకు వర్తింపచేసే టారీఫ్. → రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలో సబ్ రిజిస్ట్రార్‌కు చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై నూరుశాతం రీయింబర్స్మెంట్. → ఐటీ కార్యాలయాలకు స్థానిక మున్సిపాల్టీలకు చెల్లించే ఆస్తి పన్నులో 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ కంపెనీల కోసం నిర్మించే భవనాలకు 50 శాతం బీమా. నిర్వహణ చార్జీల్లో 50.4 శాతం రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం. ఆడియో, వీడియో సిస్టమ్స్, ప్రొజెక్షన్, సర్వర్ రూమ్, కెఫెటేరియాలతో ఉన్న కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటుకు వన్ టైమ్ విలువతో రూ.10 లక్షలకు మించకుండా 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ భవనాలు నిర్మించే మౌలిక వసతుల ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు, లీజుదారులకు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో పది శాతం రీయింబర్స్మెంట్. → కొత్తగా ఏర్పాటు చేసే ఐటీ కంపెనీల్లో రెండేళ్లపాటు ఉద్యోగికి రూ.2 వేల చొప్పున పీఎఫ్ రీయింబర్స్మెంట్ (రెండేళ్లు ఉద్యోగంలో కొనసాగి ఉంటే) -
సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం సచివాలయంలో జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలను మరో ఐదు రోజులు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, వివిధ శాఖలకు కేటాయించిన పద్దులు, బిల్లులు, డిమాండ్లు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును కూడా ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వాటర్‌గ్రిడ్, ఇసుక విధానం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపెట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించడంపై మంత్రివర్గం తీర్మానించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత కేబినెట్ సమావేశాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లుగా మంత్రులకు సమాచారం అందింది. కానీ, అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుండడంతో ఆ లోపు భేటీ సాధ్యంకాదని అభిప్రాయం వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. -
గరంగరంగా కేబినెట్ భేటీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎఫ్ కూటమి దారుణ పరాభవం అనంతరం జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశం గరంగరంగా సాగింది. ఈ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనుల గురించి గళమెత్తారు. ఈ సమావేశానికి ఛగన్ భుజ్‌బల్, సురేశ్ దాస్, సునీల్ తట్కరే, శివాజీరావ్ మోఘే కూడా హాజరయ్యారు. రాయ్‌గఢ్ స్థానం నుంచి శివసేన ఎంపీ అనంత్ గీతే చేతిలో ఓడిన తట్కరే మాట్లాడుతూ దిగ్గి పోర్టు అభివృద్ధిలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులు చేపట్టిన డెవలపర్‌కు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీడ్‌లో బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేతిలో ఓడిన దాస్ మాట్లాడుతూ మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత సమస్యను లేవనెత్తారు. దీనిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మంత్రులు వివాదాస్పద టోల్ వసూలు గురించి ఘాటుగా మాట్లాడారు. నాగపూర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ నేత గడ్కారీ 12 వేల ఓట్ల ఆధిక్యత రావడంతో పదవికి రాజీనామా చేసిన ఉపాధి హామీ పథక మంత్రి నితిన్ రౌత్ గరంగరంగానే మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ న్యాయ పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని లేవనెత్తారు. అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించేందుకు కేబినెట్లో ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబై, నాగపూర్, ఔరంగాబాద్‌లో ఈ న్యాయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్దానా, నాగపూర్, వార్ధా జిల్లా సహకార బ్యాంక్‌ల ఆర్థిక ఇబ్బందులపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. రూ.260 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. చేపల్లో వ్యాధులు త్వరితగతిన గుర్తించేందుకు పాల్ఘర్లో ల్యాబోరేటరీ ఏర్పాటుకోసం పది ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి పోస్టింగ్‌లను ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించేందుకోసం నాగపూర్ రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ పదోన్నతులను రాష్ట్ర డీజీపీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఈ పదోన్నతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అధిష్టానం తీరే కొంపముంచింది: చవాన్ సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవికి రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంలోని నేతల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీంతో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో ఏమో అనుకున్నాడో గానీ ఈ ఓటమికి కారణం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డ్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి అధిష్టానమే కారణమని చవాన్ చేతులెత్తేశారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన అవినీతి, వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ఓటమికి కారణాలయ్యాయని వివరణ ఇచ్చారు. అందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత చవాన్ రాజీనామా చేయాలని అయన వ్యతిరేకులతోపాటు అనుకూలురు కూడా పట్టుబట్టారు. శాసనసభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. చవాన్ రాజీనామా చేస్తే కనీసం ఈ ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అనేకమంది ప్రముఖులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా చవాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నాయకత్వం మారే అవకాశాలు లేకపోవడంతో సీఎం కూడా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఓటమిని కాంగ్రెస్ అధిష్టానంపై నెట్టేసి చేతులెత్తేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక చాలెంజ్‌గా పరిణమించనుంది. ఇప్పటినుంచే సాధ్యమైనన్ని ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 240 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు వెనకబడడం చింతించాల్సిన విషయమ’ని చవాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలా...? లేక మరొకరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే తన రాజకీయ భవిష్యత్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన వెల్లడించారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు
* సలహాల కోసం త్వరలో అఖిలపక్షం... రాష్ట్ర కేబినెట్ నిర్ణయం * బీసీ క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితి రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు * మావోయిస్టుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం పెంపు * జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాల నివారణకు ట్రిబ్యునల్ * జంటనగరాలకు గోదావరి జలాల తరలింపునకు హడ్కో నుంచి రూ. 1,000 కోట్ల రుణం * చిత్తూరు మంచినీటి పథకానికి అమోదం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అలాగే బీసీల్లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల రూ.6 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. సుమారు 75 రోజుల అనంతరం జరిగిన ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇటీవలి తీర్పుపై చర్చించారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ విలేకరులకు వెల్లడించారు. ‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఈ విషయమై త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలు తీసుకోవాలి..’ అని కేబినెట్ నిర్ణరుుంచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల నిరోధానికి బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. పట్టణాలు, నగరాల్లో వ్యాపార ప్రకటనల నియంత్రణకు పురపాలక వ్యాపార ప్రకటనల విధానం తీసుకువచ్చేందుకు చట్టంలో సవరణలు చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో రూ.4,300 కోట్ల వ్యయంతో చేపడుతున్న మంచినీటి పథకానికి గతంలో జారీచేసిన పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవికలురైతే ఇచ్చే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్ర గాయాలకు గురైతే పరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచారు. మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వతంగా అంగవికలురైతే రూ.10 లక్షల పరిహారం ఇస్తారు. తీవ్రంగా గాయపడితే ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచారు. పౌరులు మరణిస్తే ఇస్తున్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందితే ప్రస్తుతం కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2.40 లక్షల నుంచి రూ.3 లక్షలకు పరిహారం పెంచారు. ఇన్స్పెక్టర్, ఆ పైస్థాయి అధికారులు మరణిస్తే పరిహారాన్ని రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే రూ.3.60 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్రంగా గాయపడితే 2.40 లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు పరిహారాన్ని పెంచారు. 13 ప్రభుత్వ శాఖల్లో 14,115 పోస్టుల భర్తీ 13 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 14,115 పోస్టులను భర్తీ చేయూలని మంత్రివర్గం నిర్ణరుుంచింది. జంటనగరాలకు గోదావరి జలాలు తరలింపు పథకానికి హడ్కో నుంచి రూ.1000 కోట్ల రుణం తీసుకోనుంది. ఆర్టీసీ రూ.320 కోట్ల రుణం తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. కాపులను బీసీల్లో చేర్చడానికి సర్వే నిమిత్తం రూ.65 లక్షలు విడుదల చేయాలని నిర్ణరుుంచింది. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులను ఇతరులకు బదలాయించేందుకు ఆ కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు, రుణాల రీ షెడ్యూల్‌కు త్వరలో బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణరుుంచింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటునకు ఏపీఐఐసీకి 1473 ఎకరాలను మార్కెట్ ధరపై పది శాతం అదనంగా లీజుకు కేటాయించనున్నారు. గేమింగ్ పాలసీకి ఆమోదముద్ర ఆంధ్రప్రదేశ్ గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పాలసీ 2014-19కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా తొలుత రాజధానిలో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ఏపీఐఐసీ స్థలం సమకూరుస్తుంది. ఈ సిటీలో కంపెనీలు పూర్తిగా కార్యకలాపాలు నిర్వహించేలా మౌలిక వసతులు సమకూరుస్తారు. కంపెనీలకు స్థలాలు, కార్యాలయ భవనాలను కొన్ని పరిమితులకు లోబడి రాయితీపై కేటాయిస్తారు. తరువాత టైర్-2 నగరాలైన విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్ నగరాల్లోనూ ఇదే తరహాలో గే మింగ్ సిటీని అభివృద్ధి పరుస్తారు. -
ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. -
ఒకడుగు ముందుకు,రెండడుగులు వెనక్కు
-
3న రాష్ట్ర కేబినెట్ భేటీ
డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ తేదీలు ఖరారు సాక్షి, హైదరాబాద్: సుమారు 45 రోజుల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగి డిసెంబర్ 19వ తేదీతో ఆరు నెలలు కావస్తున్నందున తప్పనిసరిగా ఆ లోపలే సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి 3వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చించి తేదీలను ఖరారు చేయనున్నారు. కాగా, డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే మంత్రివర్గ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చర్చించడంతో పాటు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులకు మధ్యంతర భృతి అంశంకూడా చర్చకు రానుంది. రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్‌కు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. -
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు
హైదరాబాద్:గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు కేటాయించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అమలవుతున్న పథకాలపై కూడా కేబినెట్ పెద్దలు చర్చించారు. అమ్మహస్తం పథకం రాష్ట్రంలో ఏవిధంగా అమలవుతుందనే అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. గిరిజన సంక్షేమశాఖలో 143 ట్రైబల్‌వెల్పేర్ ఆఫీసర్లు, 388 వార్డెన్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఏడు కొత్త పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్ల రుణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్‌అండ్‌బీకు 468 కోట్లు, పంచాయతీరాజ్‌కు 532 కోట్లు కేటాయించారు. ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి హాజరు కాలేదు. -
కేబినెట్ భేటీకి హాజరు కానీ 8మంది మంత్రులు
-
కేబినెట్ భేటీకి హాజరు కానీ 8మంది మంత్రులు
హైదరాబాద్ : ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి హాజరు కాలేదు. మిగతా మంత్రులు సమావేశానికి హాజరు అయ్యారు.