ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం | State Cabinet Meeting begins, likely to GOM report,rayala telangana issues | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం

Published Tue, Dec 3 2013 4:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

State Cabinet Meeting begins, likely to GOM report,rayala telangana issues

హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేయనుండటం, కేంద్ర కేబినెట్ దానికి ఆమోదముద్ర వేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం  ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక, రాయల తెలంగాణ, అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి ప్రధాన చర్చ సాగవచ్చని తెలుస్తోంది.

కేబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉండడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా కొందరు రాష్ట్ర మంత్రులు సోమవారం నాటి తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో ఏం జరగబోతుందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement