డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: సుమారు 45 రోజుల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగి డిసెంబర్ 19వ తేదీతో ఆరు నెలలు కావస్తున్నందున తప్పనిసరిగా ఆ లోపలే సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి 3వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చించి తేదీలను ఖరారు చేయనున్నారు.
కాగా, డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే మంత్రివర్గ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చర్చించడంతో పాటు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులకు మధ్యంతర భృతి అంశంకూడా చర్చకు రానుంది. రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్‌కు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
3న రాష్ట్ర కేబినెట్ భేటీ
Published Sat, Nov 30 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement