assembly winter sessions
-
శీతాకాల సమరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీకానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల ముందుంచేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది.అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, అప్పటి రుణాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు గత ఏడాది కాలంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరుకానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, ఆరు గ్యారంటీల అమలు, ఫోన్ ట్యాపింగ్, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఇక రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ చార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.. ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది. రెవెన్యూ చట్టం.. మహిళా వర్సిటీ.. శాసనసభ శీతాకాల సమావేశాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్వోఆర్–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది. ‘హైడ్రా’కు చట్టబద్ధత కలి్పంచనుంది. మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, జెన్కో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లపై సమీక్షించిన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ ఔన్నత్యాన్ని కాపాడాలి: స్పీకర్ ప్రసాద్‌కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల హుందాతనం, ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే సభ్యులకు పంపాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు.అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ సమావేశాల కోసం ప్రతి శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, మండలి భేటీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయండి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. మండలి సభ్యుల ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని, ఉల్లంఘనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వ పక్షం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ఏయే రోజుల్లో... ఎన్నిరోజులు సమావేశాలు? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనా... ఎన్నిరోజుల పాటు, ఏయే రోజుల్లో కొనసాగుతాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దానిపై రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మంగళ, బుధవారాలు మినహాయించి గురువారం నుంచి మళ్లీ సమావేశాలు జరుగుతాయని, వారం పాటు కొనసాగుతాయని చర్చ జరుగుతోంది. మరోవైపు సోమవారం తర్వాత ఈ నెల 16వ తేదీకి అసెంబ్లీ వాయిదా పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.గత ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో తొలి సమావేశాలు ప్రారంభమైనందున మళ్లీ డిసెంబర్ 9న సభ ప్రారంభానికి నోటిఫికేషన్ వచ్చిందని... అసెంబ్లీలో పలు కీలక అంశాలకు సంబంధించిన ప్రక్రియ కొంత పూర్తి కావాల్సి ఉండటంతో విరామం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రైతు భరోసా అమలుపై విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ మరో రెండు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, కమిటీ నివేదికకు సమయం అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణనకు సంబంధించిన రిపోర్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఈ రెండు అంశాలపై స్పష్టమైన ప్రకటన చేశాకే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగించాలనేది అధికార పక్షం ఉద్దేశమని.. అందుకే సోమవారం తర్వాత వాయిదా వేసి, డిసెంబర్ 16 నుంచి తిరిగి కొనసాగించవచ్చని సమాచారం. అయితే సోమవారం జరిగే సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. -
ఇద్దరు మంత్రులు సహా 50మందికి కరోనా
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమే కరోనా కేసుల ఉధృతి కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. తాజాగా మహా అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా కోరలు చాచింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా నాగ్‌పూర్‌లో జరగాలి. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ఈసారి ముంబైలో నిర్వహించింది శివసేన సర్కార్. డిసెంబర్ 22న ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఐదు రోజుల సమావేశాల కారణంగా.. మొత్తం 50 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. మంత్రి వర్ష గైక్వాడ్ (ఫైల్ ఫొటో) ప్రశ్నోత్తరాల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యాశాఖ(పాఠశాల) మంత్రి వర్ష గైక్వాడ్(కిందటి ఏడాది కూడా ఆమె వైరస్ బారినపడ్డారు) కరోనా బారినపడ్డారు. మరో మంత్రి కేసీ పాడ్వికి కూడా వైరస్ సోకింది. ఇక శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సంబంధిత వార్త: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. -
AP Assembly: ఉభయసభలు నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉభయసభల సమావేశాలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు శుక్రవారం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు వేర్వేరుగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెల 18న ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మధ్యలో రెండు రోజులు మినహాయించి ఏడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలను చర్చించారు. రెండు సభల్లో ఆన్లైన్ టిక్కెట్ల నిర్వహణ కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లు వంటి మొత్తం 26 బిల్లులను ఆమోదించారు. 34.50 గంటలపాటు శాసనసభ సమావేశాలు శాసనసభ సమావేశాలు ఏడు రోజుల్లో మొత్తం 34.50 గంటలపాటు జరిగినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. చర్చల్లో 96 మంది ప్రసంగించారన్నారు. 41 స్టార్ ప్రశ్నలకు సమాధానం చెప్పారని.. మరో 21 ప్రశ్నలకు సమాధానాలు సభ ముందుంచారని తెలిపారు. ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగిందన్నారు. కాగా, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ– బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లును శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు కాగా, వారం రోజుల్లో మొత్తం 26 గంటలపాటు శాసనమండలి సమావేశాలు జరిగాయి. సభ్యులు స్టార్ ప్రశ్నలు 40, స్టార్ ప్రశ్నలు (ఆన్ టేబుల్) 12, అన్‌స్టార్ ప్రశ్నలు 6 అడిగారు. ఐదు ప్రధాన అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఒక తీర్మానం చేశారు. మండలి సమావేశాల తొలిరోజునే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ వాకౌట్ చేసింది. రెండో రోజు కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బాయ్‌కాట్ చేసింది. అప్పటి నుంచి టీడీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీలో చంద్రబాబు తాను సీఎం అయ్యాకే సభకు వస్తానని ప్రకటించి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని సాకుగా చూపి మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా సమావేశాలను బహిష్కరించారు. దీన్ని పలువురు అధికార పార్టీ సభ్యులు తప్పుబట్టారు. బిల్లులకు ఉభయ సభల ఆమోదం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ తీసుకొచ్చిన బిల్లులు శాసనసభ, శాసన మండలి ఆమోదం పొందాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నుంచి అందిన సమాచారం, చట్టాల రద్దుకు గల కారణాలను, బిల్లుల కాపీలను ఈ అఫిడవిట్‌తో జతచేశామని కోర్టుకు తెలిపింది. వాటిని పరిశీలించి ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతున్న సమయంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు ప్రవేశపెట్టినట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ బిల్లుల కాపీలను, చట్టాల ఉపసంహరణ కారణాలు తదితరాలను మెమో రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి.. ధర్మాసనం ఆదేశించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 29న విచారణ జరపనుంది. -
ఆ స్థానంలో సోదరి జకియా ఖాన్ కూర్చోవడం ఆనందంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్థానంలో తన అక్క జకియా ఖానమ్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ వైస్ చైర్మన్‌గా ఆ స్థానంలో కూర్చోవడం గర్వనీయమన్నారు. చదవండి: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం: సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు.. ‘నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం. ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలన్నది మ ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
AP: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
Time: 05:05 PM ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏడురోజుల పాటు సాగిన సమావేశాలు.. 26 బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ. Time: 04:10 PM రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యారంగంపై సీఎం జగన్ శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని పేర్కొన్నారు. Time: 03:00 PM ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. Time: 01:30 PM ► ఏపీ అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడంపై నిషేధం విధించారు. సభలోకి సభ్యులు సెల్ఫోన్లు తీసుకురావొద్దని స్పీకర్ ప్రకటించారు. Time: 01:20 PM ఇటీవల కురిసిన వర్షాలకు మూడు జిల్లాలో తీవ్ర నష్టం సంభవించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గడిచిన వంద ఏళ్లలో కనీవినీ ఎరుగని వానలు కురిశాయన్నారు. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయన్నారు. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతం గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయన్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు కురిశాయని, 3.2 క్యూసెక్కుల వర్షం చెయ్యేరు నుంచి విరుచుకుపడిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాలను ఎక్కడ దాచడం లేదని స్పష్టం చేశారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. Time: 12:30 PM అధ్యక్షా అని సంబోధించే స్థానంలో అక్కలాంటి వ్యక్తి జకియా ఖాన్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చట్టసభల్లో అడుగు పెట్టడం, అంతేగాక నేడు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు. ఇది మైనార్టీ అక్కాచెల్లెలమ్మలకు శుభ సంకేతామన్నారు సీఎం జగన్. ఆడవాళ్లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని ఆయన స్పష్ట ం చేశారు. Time: 12:20 PM ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్‌కు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా ఖానమ్‌కు మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు. చరిత్రలోనే తొలిసారి మైనార్టీ మహిళకు ఈస్థానానికి ఎంపిక చేయడం సాధారణ విషయం కాదన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కాగా వైఎస్సార్ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. ► రాజ్యాంగ దినోత్సవం రోజున శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్‌కు సభ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, మాధవ్, కత్తి నర్సింహరెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. Time: 10:42 AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 99 శాతం హామీలను అమలు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని.. డ్వాక్రా సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొత్త గ్రూపులకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు. Time: 10:12 AM ►అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన సాగుతోందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు నాశనం చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు. సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు విద్యారంగంపై స్వల్ప కాలిక చర్చ జరపనున్నారు. 2019-20 కాగ్ రిపోర్ట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 వ్యయంపై అదనపు అంచనాలను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఏపీ శాసన మండలిలో నేడు విద్యుత్ సంస్కరణలు, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. నేడు ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. -
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా
Time: 4:40 PM ఆంధ్రప్రదేశ్ శాసన సభ, మండలి సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. Time: 3:30 PM మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య ఆంశంపై ప్రసంగించారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. Time: 12:40 PM ►ఏపీ సినిమా రెగ్యులేషన్ సవరణ బిల్లు సహా ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రజల వినోదానికి ఇబ్బందులు కలగకూడదనే ఈ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో చర్చించామని తెలిపారు. ఆన్లైన్ టిక్కెటింగ్ వల్ల ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరన్నారు. బ్లాక్ బ్లస్టర్.. వందల కోట్లు వసూళ్లు అంటూ చెప్పుకుంటున్నారు. కానీ జీఎస్టీ మాత్రం రావటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా పారదర్శకత కోసమే ఆన్ లైన్ టిక్కెట్ల చట్టం తెస్తున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. Time: 11:18 AM ►వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం మైనార్టీలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభించిందన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. అన్ని వర్గాల కన్నా మైనార్టీలు వెనుకబడి ఉన్నారన్నారు. వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు దగా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ ఆసరాతో లక్షా 68 వేల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కలిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా 2.46 లక్షల మంది మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. వక్ఫ్ ఆస్తులను కంప్యూటరీకరణ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు బకాయిలు చెల్లించడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల్లో 43, 680 మైనార్టీలు ఉన్నారు. ప్రైవేటు కంపెనీ బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం ఆదుకుంది. 20 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి రూ.38 కోట్లు ప్రభుత్వం అందించిందని అంజాద్‌బాషా అన్నారు. Time: 10:31 AM ►పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో 14వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్‌తో ప్రజల దగ్గరకే వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. Time: 9:26 AM ► పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు సేకరించిన భూమి, ఇళ్లులేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాల సంఖ్య చూస్తే ఈ రెండున్నర ఏళ్లలో ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 71 వేల ఎకరాలకుపైగా భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సేకరించిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల వద్ద సేకరించిన భూమికి వెంటనే డబ్బులు అందించామని తెలిపారు. అయినా రాజకీయ ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి సాధ్యమైనంత త్వరలో పేదలకు ఇళ్లపట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని అంబటి ఆకాక్షించారు. Time: 9:23 AM ► ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం అన్నారు. Time: 9:15 AM సాక్షి, అమరావతి: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. నేడు బీసీ జనగణన తీర్మానం మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీ సంక్షేమంపై చర్చ జరపనున్నారు. ఆరోగ్యం, విద్య, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరో మూడు బిల్లులను ప్రభ్వుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. -
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం...
Time: 03:20 PM ► శాసన మండలి, శాసన సభ రేపటికి వాయిదాపడింది. Time: 03:05 PM ► మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఈ సంధిగ్ధతను తొలగించేందుకు మండలిని తిరిగి కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. Time: 03:00 PM ► అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. Time: 02:21 PM ►1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని.. 90 ఏళ్లుగా కులపరమైనా జనాభా లెక్కలు లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప.. కచ్చితమైన లెక్క లేదన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతం ఉందన్నారు. వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదన్నారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. Time: 02:12 PM ►అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. Time: 01:32 PM అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. Time: 12:30 PM ►కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని వేణుగోపాల కృష్ణ అన్నారు. ►ఏపీ శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. గోవింద్‌రెడ్డి, ఇషాక్, విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. Time: 11:17 AM ►ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. Time: 10:39 AM ►అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన అన్నారు. Time: 10:30 AM ►ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. Time: 9:38 AM దేశంలోనే ఆదర్శమైన పథకం ఆరోగ్యశ్రీ అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. Time: 9:30 AM ►ఆరోగ్యశ్రీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2446 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. గతంలో కేవలం 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగేంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 1387 వ్యాధులను అదనంగా చేర్చడం జరిగిందని మంత్రి తెలిపారు. Time: 9:15 AM సాక్షి, అమరావతి: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కులాలవారీగా బీసీ జనగణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. నేడు ఏపీ శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును తీసుకురానున్నారు. -
లోకేష్‌కు నారాయణస్వామి సవాల్..!
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో ది ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్(రెండో సవరణ) బిల్లు 2020 చర్చ సాగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కూడా ప్రతిపక్షం అడ్డుకుంటుందని విమర్శించారు. అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకోవడం దారుణమన్నారు. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేయడానికి బిల్లును ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని గుర్తు చేశారు. చదవండి: వారికి జీతం ఎంత పెంచినా తక్కువే: మంత్రి బుగ్గన ‘మీది చిత్తూరు జిల్లానే మాది చిత్తూరు జిల్లానే. జిల్లాలో మన ఇద్దరం కలిసి ఏ ప్రాంతానికైనా వెళ్దాం. మా ప్రభుత్వం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందని ప్రజలు చెప్తే నా పదవికి నేను రాజీనామా చేస్తాను. మా ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని ప్రజలు చెప్తే లోకేష్ రాజీనామా చేయాలి’. అని నారా లోకేష్‌కు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తమది కాదని, ఎన్టీఆర్ స్థాపించిందని ప్రస్తావించారు. ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే మీరందరూ ఒంటరిగా మిగిలి పోతారని అన్నారు. ఇదిలా ఉండగా శాసనమండలిలో మరొక బిల్లును టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ది ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్ ట్రేడ్స్ కాలింగ్ అండ్ ఎంప్లాయిమెంట్స్ (సవరణ) బిల్లు-20 20 బిల్లుపై టీడీపీ నేతలు డివిజన్ కోరారు. బిల్లుకు 24 మంది టీడీపీ ఎమ్మెల్సీలు వ్యతిరేకించగా అనుకూలంగా తొమ్మిది మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఓటేశారు. తటస్థంగా అయిదుగురు ఎమ్మెల్సీలు ఓటేశారు. చదవండి: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్! -
లోకేష్‌కు ఆ స్క్రిప్ట్‌ను ట్విటర్లో పెట్టడమే తెలుసు
-
లోకేష్‌కు ట్విటర్లో పెట్టడమే తెలుసు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే సాధికారత కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. చంద్రబాబుది 420 విజన్. వైఎస్ జగన్ విజన్.. ఓ విప్లవం. వచ్చే జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు. ప్రతి ఆడ బిడ్డను రక్షించే 'దిశ' చట్టాన్ని తెచ్చారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్ జగన్.. ఓ క్రియేటర్. వైఎస్ జగన్ ఫేక్ సీఎం కాదు.. చంద్రబాబును షేక్ చేసిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నారా లోకేష్‌కు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ట్విటర్లో పెట్టడమే తెలుసు. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్’ అని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీలో ‘చంద్రన్న భజన’.. పడి పడి నవ్విన సీఎం జగన్
-
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మార్షల్స్ ఫిర్యాదు
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యేల దాడిపై స్పీకర్ తమ్మినేని సీతారాంకి మార్షల్స్ ఫిర్యాదు చేశారు. సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా, సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. -
అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
-
మార్షల్స్‌పై టీడీపీ ఎమ్మెల్యేల దాడి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. మార్షల్స్‌ని కొట్టిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టపాటి రవి, సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయులు ఉన్నారు. మరోవైపు సస్సెండ్ అయిన సభ్యులతో కలిసి చంద్రబాబు బయటకు వెళ్లారు. (చదవండి : మీ సంగతి చూస్తా.. స్పీకర్‌కు చంద్రబాబు బెదిరింపు) -
నేలబారు రాజకీయం
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన సోమవారమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర తీశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేతననే ఇంగితం లేకుండా అధికార పక్ష మైనారిటీ ఎమ్మెల్యేపై వేలు చూపుతూ.. అసభ్యంగా దూషిస్తూ బెదిరించారు.. పూనకం వచ్చినట్లుగా ఉద్రేకంతో ఊగిపోయారు.. తమ పార్టీ సభ్యుడు మాట్లాడుతుండగా తానే అడ్డుకుని ఏకంగా పోడియంలోకి దూసుకెళ్లి బైఠాయించారు. ప్రతిపక్ష నేత ఇలా పోడియంలో కూర్చోవడం ఏమాత్రం సమజసం కాదని, సంప్రదాయాలను కాలరాయడం మంచిది కాదని, నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని స్పీకర్, సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేసినా వినకుండా అక్కడే బైఠాయించి నినాదాలు చేయడం ద్వారా సభను అడ్డుకునే కుట్ర పన్నారు. దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులను సోమవారం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో మార్షల్స్ ద్వారా వారిని బయటకు పంపారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సభలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి కన్నబాబు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వం ఆదుకున్న తీరు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పంట నష్టం జరిగిన సీజన్లోనే పెట్టుబడి రాయితీ ఇవ్వటాన్ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ పంటల బీమా పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతినని నిరూపించుకుందని గణాంకాలతో తెలియచేశారు. అనంతరం టీడీపీ సభ్యుడు రామానాయుడు మాట్లాడేందుకు స్పీకరు అవకాశం ఇవ్వగా పయ్యావుల కేశవ్ లేచి నించుని పంటల బీమా ప్రీమియం చెల్లించినట్లు ప్రకటించడం ద్వారా మంత్రి సభను తప్పుదోవ పట్టించారని, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడ్డు తగిలారు. అయితే పయ్యావుల వ్యాఖ్యలను మంత్రి కన్నబాబు ఖండించారు. సీఎం కోసం సభను అరగంట ఆలస్యంగా ప్రారంభించారని, మంత్రి ప్రకటనలో బాధిత రైతులకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని రామానాయుడు విమర్శలు చేయడాన్ని మంత్రి కన్నబాబు ఖండించారు. చరిత్రాత్మక నిర్ణయం: సీఎం జగన్ నివర్ తుపాను వల్ల ఎంత నష్టం జరిగింది? రైతులకు ఎంత ఇస్తారో కూడా చెప్పలేదని రామానాయుడు మరోసారి వ్యాఖ్యలు చేయడంతో సీఎం జగన్ జోక్యం చేసుకుంటూ.. ‘మొన్ననే వర్షం వెలిసింది. ఆరు లక్షల హెక్టార్లలో పంట దెబ్బ తిన్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు మంత్రి ప్రకటించారు. డిసెంబరు 15లోగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి 31వ తేదీకల్లా పెట్టుబడి రాయితీ చెల్లించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం...’ అని వివరించారు. ఇంతలో ప్రతిపక్ష నేత చంద్రబాబు లేచి మాట్లాడబోగా.. రామానాయుడు అడిగిన దానికి ఇప్పటికే వివరణ ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాట్లాడితే రెండు పక్షాల మధ్య వాదనలు, వివరణలతో సమయం సరిపోతుందని, ఇంకా బిల్లులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. దీంతో స్పీకర్ అవకాశం ఇస్తే సీఎం డిక్టేట్ చేసి అవమానపరుస్తున్నారంటూ చంద్రబాబు వేలు తిప్పుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. రామానాయుడిని మాట్లాడాలని స్పీకరు సూచించగా చంద్రబాబు తన స్థానంలో నుంచి ముందుకు వచ్చి ప్రతిపక్ష నేతకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరా? అవమానిస్తారా? అంటూ ఉద్రేకంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులంతా తమ స్థానాల్లోనుంచి లేచి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తమ స్థానాల నుంచి ముందుకు వచ్చిన అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు చేయి ఎత్తి చూపుతూ అసభ్య వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ సభ్యుడైన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసి కూడా తనను మాట్లాడనివ్వకుండా అవమానించారంటూ టీడీపీ సభ్యులతో కలిసి పోడియంలోకి దూసుకెళ్లి నేలపై బైఠాయించారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుతగిలారు. గందరగోళం సృష్టిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వయసుకు తగ్గ మాటలేనా అవి? విపక్ష సభ్యులు సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ.. సభా కార్యక్రమాలకు పదేపదే అవరోధం కల్పించడంపై సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసును, అనుభవాన్ని మర్చిపోయి వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు. సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని హితవు పలికారు. ‘విపక్ష సభ్యుడు ప్రస్తావించిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకసారి స్పష్టత ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సరికాదు. ఆయన (చంద్రబాబు) మైనారిటీ ఎమ్మెల్యేని బెదిరించి మళ్లీ ఏదో తనకు అన్యాయం జరిగినట్లుగా పోడియం ముందు కూర్చున్నారు. ఎమ్మెల్యేలను ఉద్దేశించి తన వయసును కూడా మరిచి బాబు అసభ్యంగా మాట్లాడటం సరికాదు. అసెంబ్లీకి ప్రజాసమస్యలపై చర్చించడానికే వచ్చారా? ఇదేం పద్ధతి? బాబు వయసుకు తగ్గ మాటలా అవి? బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? కనీస ఇంగిత జ్ఞానం ఉందా?’ అని చంద్రబాబు తీరును సీఎం తప్పుబట్టారు. సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశాక చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. బయట వరకూ ప్రదర్శన నిర్వహించారు. తొలిరోజు ఆయన ఎమ్మెల్యేలతో కలిసి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. వరి దుబ్బులు పట్టుకుని రైతులకు అన్యాయం జరుగుతోందని నిరసన తెలిపారు. -
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది. తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. (చదవండి: ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని) ఎకానిమల్ ఫీడ్, ఫిష్ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ వర్సిటి బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్ ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్, మోటార్ వెహికల్ చట్టం, ఆన్లైన్ గేమింగ్ నిషేధితచట్టం, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ ఎఫ్ఆర్బిఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 20 ప్రధాన అంశాలను ప్రభుత్వం చర్చించనుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశాన్ని చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) -
ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పలు ఆరోపణలు చేసి బురద చల్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇటీవల సమావేశమైన టీడీపీ శాసనసభాపక్షం ఇందు కోసం 22 అంశాలను సిద్ధం చేసింది. ఆ పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఈ మేరకు వాటిపై నోట్ రూపొందించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందించింది. ఉల్లి ధరలు బాగా పెరగడంపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపి హడావుడి చేయాలని నిర్ణయించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, తమ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఎక్కువ సేపు చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలను పెంచాలని నిర్ణయించడంతో దానిపై గొడవ చేయాలని నిర్ణయించారు. రాజధాని పర్యటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనలనూ ప్రస్తావించాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో ఒక రకమైన వ్యూహం, శాసన మండలిలో మరో వ్యూహం అమలు చేయాలని నిర్ణయించారు. మండలిలో తమ సభ్యులే మెజారిటీగా ఉండడంతో అక్కడ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, అందుకు సిద్ధమవ్వాలని ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు. చర్చకు తేవాలనుకుంటున్న అంశాలు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు, వలంటీర్ల నియామకాలు, ఉపాధి హామీ పథకం బిల్లుల పెండింగ్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, రాజధాని పనులు నిలిపివేయడం వంటి 22 అంశాలను లేవనెత్తాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
మహిళల భద్రతకు సరికొత్త చట్టం
సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విప్లవాత్మక చట్టాలు గత బడ్జెట్ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ.. మరోమారు ఆ తరహాలో మరికొన్ని చట్టాలను రూపొందించడానికి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ, మండలి సమావేశాల్లో పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. ఈ చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించాక సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సోమవారం మహిళల భద్రతపై చర్చను ఉభయ సభల్లో చేపట్టనున్నారు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత ఆరు నెలల పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించడాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం, ఇచ్చిన మాట కన్నా ముందుగా, మెరుగ్గా వైఎస్సార్ రైతు భరోసా అమలు, నవరత్నాల్లోని ఇతర పథకాలు, కార్యక్రమాల అమలుపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానితో పాటు అజెండా అంశాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ‘అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్–2019’ను తేనుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రజా రవాణా శాఖ (ప్రభుత్వ) ఉద్యోగులు కానున్నారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మందికి ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. చిరు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రత్యేక బోర్డులు - ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉంది. ఇకపై వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా చట్టాలను చేయనున్నారు. - చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చట్టాలు చేయనున్నారు. - పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల అనంతరం విక్రయించడానికి వీలు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. - నూతన బార్ల విధానం, సగానికి పైగా మద్యం షాపుల తగ్గింపు, 40 శాతం మేర బార్ల సంఖ్య తగ్గింపునకు సంబంధిత చట్టాల్లో సవరణలు చేయనున్నారు. - అడ్వకేట్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు - రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు – ప్రభుత్వ చర్యలు - గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు – కొత్తగా శాశ్వత ఉద్యోగాల కల్పన - వ్యవసాయ రంగం – రైతు భరోసా, మద్దతు ధర - మద్య నియంత్రణ విధానం – ప్రభుత్వ చర్యలు - ఆంగ్ల విద్య ఆవశ్యకత – అమ్మ ఒడి, నాడు–నేడు - విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు - అగ్రిగోల్డ్ బాధితులు – ప్రభుత్వ చర్యలు - సంక్షేమ పథకాలు – ప్రభుత్వ చర్యలు - స్పందన కార్యక్రమం – అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన - రాజధాని – గత ప్రభుత్వ చర్యలు – అప్పులు - విద్యుత్ పీపీఏలు – ప్రభుత్వ చర్యలు - పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు – వాటర్ గ్రిడ్స్ – రివర్స్ టెండరింగ్ - విభజన హామీలు - పెట్టుబడులు – భూ కేటాయింపులు - గృహ నిర్మాణం – ఇళ్ల స్థలాల పంపిణీ - శాంతి భద్రతలు – ప్రభుత్వ చర్యలు -
ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాన్ని వ్యూహత్మకంగా ఎదుర్కోవాలని, వాస్తవాల ఆధారంగానే సమాధానం చెప్పేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని నేతలు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలోని వైఎస్సార్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలి ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికీ వాస్తవాలతోనే అధికార పక్షం సమాధానమివ్వాలని, అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. వ్యవసాయం, వాహన మిత్ర, వైఎస్సార్ నవశకం, రాజధాని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% రిజర్వేషన్లు, మద్యం విధానం–ధరలు, స్పందన, ఇసుక సరఫరా, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, నాడు–నేడు, రైతు భరోసా, అవినీతి నిర్మూలన వంటి అంశాలు ఉభయ సభల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏయే అంశాలపై ఎవరు మాట్లాడాలనే దానిపైనా చర్చించారు. వాగ్ధాటి గల ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలించారు. అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 19వ తేదీ వరకూ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి? కార్యకలాపాలు ఏయే అంశాలపై ఉంటాయి? అనేది సమావేశాల ప్రారంభం రోజున జరిగే ఉభయ సభల బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశంలో నిర్ణయిస్తారు. 9న శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల ప్రారంభం రోజునే వైఎస్సార్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిసారి మాదిరిగానే సంప్రదాయికంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. బుధవారం వైఎస్సార్ఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి విప్‌లు సామినేని ఉదయభాను, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎం.జగన్మోహన్రావు, జోగి రమేష్, మల్లాది విష్ణు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. -
డిసెంబర్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సమావేశాలు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల కంప్యూటరీకరణ మూడు దశల వరకు పూర్తయిందని, పూర్తి డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను డిసెంబర్ 17లోపు కేంద్రానికి పంపాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. వచ్చే నెల 15 నుంచి 21 వరకు డెహ్రాడూన్‌లో స్పీకర్ల సదస్సు జరగనుందని, ఇటీవల కంపాలలో జరిగిన పలు దేశాల స్పీకర్ల సమావేశంలో చేసిన తీర్మానాల అమలుపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి అస్సాం అసెంబ్లీ స్పీకర్ చైర్మన్‌గా, తాను సభ్యుడిగా మొత్తం ఏడుగురితో కూడిన సబ్‌కమిటీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారని తెలిపారు. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై మీడియా ప్రశ్నించగా.. ఆ ఎమ్మెల్యేను ఇక ఇండిపెండెంట్‌గా పరిగణించవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. -
'హోదా కోసం ఏ శిక్షకైనా సిద్ధమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏ శిక్షకైనా సిద్ధమే' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పడానికి వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగ్గిరెడ్డి, రాచముల్లు ప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించాలనే సభలో పట్టుబట్టామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడతామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసిందని జగ్గిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలనే సస్పెండ్ చేస్తే ఇతరులు భయపడి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయరని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ సభ సాంప్రదాయలను ఉల్లంఘించలేదన్నారు. స్పీకర్ తమకు తండ్రి లాంటి వారని చెప్పారు. హోదా కోసం మాట్లాడే అవకాశం ఇవ్వాలనే స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. హోదా వల్లనే భవిష్యత్ అని లక్షలాది యువత ప్రశ్నిస్తోందని చెప్పారు. యువత కోసమే ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నామని తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు సమాధానం చెబుతామని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ఎమ్మెల్యేల హక్కులను రక్షించడానికి కానీ, ప్రత్యేక హోదా కోసం నినదించిన మమ్మల్ని శిక్షించాలని కమిటీ చూస్తోందని అని రాచముల్లు ప్రసాదరెడ్డి వాపోయారు. -
ప్రారంభమైన ఏపీ ప్రివిలేజెస్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది. గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 12 మంది తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. అసెంబ్లీ కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఈ నెల 15న వీరికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కమిటీ ముందు ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నానిగుడివాడ), చెవిరెడ్డి భాస్కర రెడ్డి (చంద్రగిరి), దాడిశెట్టి రామలింగే శ్వరరావు (రాజ తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాదరెడ్డి (ప్రొద్దుటూరు) అభిప్రాయాలను కమిటీ తెలుసుకోనుంది. అదేవిధంగా రేపు (బుధవారం) కూడా అదే సమయానికి కమిటీ ముందు మరో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి, బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), ఎం. సునీల్ కుమార్ (పూతలపట్టు), కంబాల జోగులు (రాజాం) అభిప్రాయాలను కమిటీ తెలసుకోనుంది. -
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు వరుసగా రెండుసార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో గందరగోళం నెలకొంది. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షం ఎంతగా పట్టుబట్టినా అధికారపక్షం వినిపించుకోలేదు. ఈ గందరగోళం నడుమే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో అధికార పక్షం నుంచి సభను నియంత్రించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. కానీ విపక్షం తన పట్టు వీడకపోవడంతో.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేశారు. -
అనారోగ్యంతో ఉన్నా అరెస్టు చేస్తారా?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 9 రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అలాంటి మనిషిని అరెస్టు చేస్తారా అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లడారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఇది తప్పు సంప్రదాయమని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే... కరణం బలరాం వ్యవహారానికి, రోజా సస్పెన్షన్‌కు సంబంధం ఏంటి? బలరాం విషయంలో నిబంధనలన్నీ పాటించారు. ఆయన నేరుగా స్పీకర్‌ను దూషించారు పైగా దాన్ని ప్రివిలేజి కమిటీకి రిఫర్ చేశారు, ఆ సందర్భంగా జరిపిన విచారణకు ఆయన హాజరు కాలేదు ఆ తర్వాత మాత్రమే ఆయనను సస్పెండ్ చేశారు ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఒక్కరు వస్తుంటే పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టారు రోజా సస్పెన్షన్‌ను ఉపసంహరించకపోతే మేమంతా సస్పెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం స్పీకర్ సమక్షంలోనే సభలోనే తిట్టినా పట్టించుకోరా ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయకుండా ఎలా సస్పెండ్ చేస్తారు ప్రతి రోజూ సభ జరగకుండా ఉండాలనే యనమల చూస్తున్నారు ఎజెండాలో లేకపోయినా అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు ఇప్పుడు కూడా రోజాను ఏడాది సస్పెండ్ చేసి, ఇక సభను నడవనివ్వకూడదని చేస్తున్నారు మేం ఎటూ నిరసన వ్యక్తం చేస్తామని ఆయనకు తెలుసు సెక్స్ రాకెట్ అంశాన్ని అసలు చర్చించనివ్వకుండా ఈ అంశాన్ని లేవనెత్తారు సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాది మాత్రమే అలాంటిది ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వకుండా, సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇక సభ ఎలా జరుపుతారు? అయితే రోజా సస్పెన్షన్ విషయంలో తమకు మరో ఆలోచన లేదని యనమల స్పష్టం చేశారు. సభను జరగనివ్వబోమని అనడం సరికాదని, తాను బిల్లులు ప్రవేశపెడతానని చెప్పారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అయితే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిరసనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. వాటన్నింటినీ మూజువాణీ ఓటుతో ఆమోదిస్తున్నట్లు సభ ప్రకటించింది. అనంతరం సభను స్పీకర్ కోడెల 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికం అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు. ఇటీవల ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే అంతుతేలుస్తా అని మాట్లాడారు అచ్చెన్నాయుడు, ఉమా, యనమల అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారు బోండా ఉమా అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్నారు బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియనిది కాదు రోజాను సస్పెండ్ చేయాలంటే , ఆ నియమాలు సీఎంకు, మంత్రులకు వర్తించవా మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నులిమేస్తున్నారు ప్రభుత్వం తమ దమననీతిని మానుకోవాలి మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు -
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
-
ప్రతిపక్షాన్ని సింగిల్ షాట్లో తీసేయొచ్చు
-
ప్రతిపక్షాన్ని సింగిల్ షాట్లో తీసేయొచ్చు
ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సభే పూర్తిగా ఏ నిర్ణయం తీసుకున్నా, అదే వర్తిస్తుంది, రూల్స్ తో సంబంధం లేదంటే ఎప్పుడూ అధికార పక్షం మొత్తం ప్రతిపక్షాన్ని సింగిల్ షాట్లో తీసేయొచ్చని ఆయన చెప్పారు. ఎందుకంటే వాళ్లకు మెజారిటీ ఉంటుందన్నారు. రోజా సస్పెన్షన్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం బాధాకరమని, అది కఠిన విషయమని తెలిపారు. దయచేసి ఆ సస్పెన్షన్‌ను ఈ సెషన్ వరకు తగ్గిస్తే బాగుంటుందేమో పరిశీలించాలని స్పీకర్ కోడెలను ఆయన కోరారు. -
రోజాను ఎలా సస్పెండ్ చేస్తారు
-
నిబంధనలు తూచ్.. మా నిర్ణయమే ఫైనల్
అసెంబ్లీ నిబంధనల కంటే సభ పెద్దదని, అసలు నిబంధనలను రూపొందించిదే సభ కాబట్టి.. సభకు సర్వోన్నత అధికారాలు ఉంటాయని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాదిపాటు ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం స్పీకర్‌ది కాదు, సభది ఏ నిబంధననైనా అతిక్రమించేందుకు సభకు అధికారం ఉంది కోర్టులకు కూడా ఇందులో జోక్యం చేసుకునే అధికారం లేదు. అంటే ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు సభకు అపరిమిత అధికారాలున్నాయి గతంలో బలరాంను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు జేఎంఎం కేసులో అనర్హులను చేశారు సభకు అన్ని హక్కులూ ఉన్నాయి. దీనిపై చర్చ అవసరం లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీని కూడా సస్పెండ్ చేశారు. అందువల్ల నిబంధనల కంటే సభ సుప్రీం. ఇక రోజా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసుకు వచ్చే విషయం స్పీకర్ గారు చెప్పాలి అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. ఎమ్మెల్యే రోజా సస్పెండైన తర్వాత అరగంట సమయం ఉన్నా, ఆమె క్షమాపణ చెప్పలేదని ఆయన అన్నారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో నేను ఒకసారి, రెండుసార్లు మనవి చేశాను అసెంబ్లీ గురించి, విశ్వసనీయత గురించి, ప్రాముఖ్యత గురించి గానీ మీరు చెప్పాల్సిన పనిలేదు అలాంటి అసెంబ్లీ నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం, బాధ్యతల ప్రకారం నడవాలి ఒక సభ్యుడు వెల్‌లోకి వస్తే వాయిదా వేయాలి, లేదా సభ్యుడు తిరిగి సీట్లోకి వెళ్లేవరకు సభ నడవకూడదు సంప్రదాయాలు చూస్తే, ఎజెండా పూర్తి చేయాలి. రాజ్యాంగంలో నిబంధనలు చూస్తే, సభకు పూర్తి అధికారాలు ఉంటాయి అసలు సీట్లోంచి నిలబడటమే అభ్యంతరకరం సభా నాయకుడి ముందు నిల్చుంటున్నారు.. ఇదెంతవరకు సమంజసం సభా ఆస్తుల మీదకు వస్తున్నారు.. ఇది సరికాదని చెప్పాను కెమెరా ముందు ప్లకార్డులు పట్టుకుని నిలబడటం సమంజసం కాదు రోజా సభ్యులకు నాయకత్వం వహిస్తూ వచ్చారు ఆమె ఎవరి గురించి మాట్లాడారో అందరూ విన్నారు ఇద్దరు ముగ్గురు సభ్యులు అభ్యంతరం చెప్పిన తర్వాత ఆమె వివరణ ఇచ్చి ఉంటే ఇలాంటి నిర్ణయం ఉండేది కాదు సభ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించకూడదు నిబంధనల ప్రకారం సస్పెండ్ అయితే అసెంబ్లీ క్వార్టర్లలో కూడా ఉండకూడదు ఇక లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారు, కుదరదు -
నిబంధనలు కాలరాసి రోజాను ఎలా సస్పెండ్ చేస్తారు
► అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటి ప్రశ్న ► 340 నిబంధన ప్రకారం సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ పరిమితం కావాలి ► మేం కూడా రేపు అలాగే చేస్తే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు ► సభ నుంచి సస్పెండ్ చేస్తే కనీసం వైఎస్ఆర్సీఎల్పీలోకి కూడా రానివ్వరా హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన సభలో మాట్లాడారు. 340 నిబంధనలో ఏముందో ఆయన చదివి వినిపించారు. ఒక సెషన్ కంటే ఎక్కువ కాలం సస్పెండ్ చేయకూడదని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘించి ఎలా సస్పెండ్ చేశారో అర్థం కాని విషయమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. సభ మొత్తం నిబంధనలకు అనుగుణంగానే నడవాలని, ప్రచురిత పుస్తకంలోనే స్పష్టంగా ఉంది ఈ రోజు మాకు జరగచ్చు, రేపు మీకు జరగొచ్చు మనమే తప్పుడు సంప్రదాయాలు పాటిస్తే.. రేపు మేం కూడా ఇలాగే నిబంధనలు పక్కన పారేస్తే ఇక ఏమీ ఉండదు లేని అధికారాలు ఉపయోగించి ఎలా చేయగలరు ఎవరు మారినా రూల్స్ మాత్రం మారవు సభలో ఉన్న రూల్ పుస్తకంలో రూల్ ఉన్నా, లేని అధికారాన్ని వాడుకుంటూ మహిళా శాసన సభ్యురాలిని ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారు? అన్న మాటల్లో ఎలాంటి దోషం లేకపోయినా ఆమెను సస్పెండ్ చేస్తున్నారు అచ్చెన్నాయుడి లాంటి వ్యక్తులు ఏమన్నారో, ఆ బోండా ఉమా అయితే పాతేస్తామని అన్నా తప్పులేదు సాక్షాత్తు చంద్రబాబు అంతు చూస్తా అని వేలు పైకెత్తి చూపించినా సస్పెండ్ చేయరు అచ్చెన్నాయుడు అన్న మాటలు చెప్పాలంటే బాధాకరంగా ఉంటోంది అన్నేసి మాటలన్నా కూడా ఆయననూ సస్పెండ్ చేయరు రోజా అన్న మాటలు ఏమాత్రం తప్పుకాదు నిరసన చెప్పడమే తప్పన్నట్లు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. లేని అధికారంతో సస్పెండ్ చేయడం సరికాదు, దయ ఉంచి రివోక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా శాసన సభ్యులందరినీ కూడా అలాగే సస్పెండ్ చేసుకోండి కాదంటే మాత్రం మేం నిరసన వ్యక్తం చేస్తాం.. సభను జరగనిచ్చేది లేదు స్పెసిఫిక్ రూల్.. రూల్ పుస్తకంలో లేనప్పుడు మాత్రమే రెసిడ్యువల్ పవర్స్ వాడచ్చు అని రూల్ పుస్తకంలో ఉంది దయ ఉంచి, మేం స్పీకర్‌కు వ్యతిరేకమన్న భావన తీసుకురావద్దు సెక్రటరీ సలహా వల్లో, మరేదైనా కారణంతోనో పొరపాటు జరిగి ఉండొచ్చు రేపు మేం వచ్చిన తర్వాత కూడా ఇదే మాదిరిగా సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం విఫలమయ్యే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాం రోజాను అసెంబ్లీ బయట ఆపారు. సభ నుంచి సస్పెండైతే సీఎల్పీ ఆఫీసులోకి కూడా రాకూడదా? ఆమె శాసనసభ్యురాలు కూడా కాకుండా పోయిందా? సభలోకి రాకూడదంటే సరే.. కానీ మా ఆఫీసులోకి కూడా రానివ్వకపోతే ఎలా అసెంబ్లీ గేటు బయట ఎలా ఆపుతారు.. ఇది కరెక్టు కాదు -
'తన పాపం బయటపడుతుందనే ఇలా.. '
అసెంబ్లీ నుంచి సస్పెండైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ''నిన్నటి బిజినెస్ ఎజెండా చూడండి.. ఈ జాబితాలో అంబేద్కర్ గారి గురించి ఎక్కడా లేదు. ఆ అంశం మీద చర్చ జరుగుతుందని ఎక్కడైనా ఒక్క చోటైనా ఉందా అని అడుగుతున్నా. తొలిసారి వాయిదా పడినప్పుడు అంబేద్కర్ అంశం లేదు. రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన చర్చ జరగకూడదని, జరిగితే తాను చేసిన పాపం బయటపడుతుందని భావించారు. చంద్రబాబుతోను, ఇంటెలిజెన్స్ డీజీతోను నిందితుడు పిచ్చాపాటీ మీటింగ్ పెట్టుకున్నాడు. సీఎం అండదండలు లేకపోతే ఇలా కూర్చోగలడా? ఇక ఓ టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ అనే నిందితునితో విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. తర్వాత ఎమ్మెల్యే తిరిగొస్తాడు గానీ నిందితుడు మాత్రం విదేశాల్లోనే ఆగిపోతాడు. ఆ నిందితుడు ఎక్కడున్నాడని పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించరు, కేసులు పెట్టరు. మరో ఎమ్మెల్సీ చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన సొంత అన్న.. కాల్‌మనీ కేసులో నిందితుడు. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. అయినా ఈ ఎమ్మెల్సీ మీద కేసు పెట్టరు, కస్టడీలోకి తీసుకోరు, ప్రశ్నించరు. ఇవన్నీ చంద్రబాబు దీవనెలతో జరుగుతున్నాయి. ఆయన కొడుకు ఆశీస్సులు కూడా దీనికి ఉన్నాయి. ఈ చర్చను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులందరి మీద దాడులు చేస్తారు. ఇదేదో మామూలు వడ్డీ వ్యాపారమని తేల్చేయడానికి చూస్తారు. కృష్ణాజిల్లాలో అతి హేయంగా ఆడవాళ్ల మానప్రాణాలతో ఆడుకుని, వారిని అశ్లీలంగా వీడియో టేపులు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేశారు. 200 పైచిలుకు వీడియో సీడీలు దొరికాయి. ఆడవాళ్లకు ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి, అవి తీర్చలేదని వాళ్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్లను శాశ్వతంగా వేశ్యవృత్తిలోకి దింపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాకెట్లో చంద్రబాబు నుంచి ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా ఉన్నారు. ఇంత ముఖ్యమైన అంశం మీద అసెంబ్లీలో చర్చ రాకుండా చేసేందుకు అంబేద్కర్ గారిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు గట్టిగా అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకున్నారు. పార్లమెంటులో రెండురోజులు చర్చిస్తే చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నవంబర్ 26న పార్లమెంటు చర్చించిందంటే, అది రాజ్యాంగ రచన పూర్తిచేసిన రోజు. అందుకే అప్పుడు పార్లమెంటులో దాని గురించి రెండు రోజులు చర్చించారు. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. అంబేద్కర్ జయంతి, వర్ధంతి, రాజ్యాంగసభ తొలి సమావేశం, రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించిన రోజు.. ఈ రోజుల్లో ఎప్పుడూ చంద్రబాబుకు ఆయన గురించి చర్చ జరపాలని గుర్తుకు రాలేదు. ఈవాళ మాత్రం.. డిసెంబర్ 17, 18 తేదీల్లో గుర్తుకొస్తున్నారు. సెక్స్ రాకెట్ కేసులో తాను, తన వాళ్లు నిండా మునగడంతో బయట పడేందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఒకసారి చూడండి.. ఆ విగ్రహాలను క్లీన్ చేయించాలన్న ఆలోచన కూడా లేదు. దుమ్ము, ధూళితో ఉన్నాయి. దండ ఎండిపోయింది. లోపల అసెంబ్లీలో మాత్రం అంబేద్కర్‌ను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇంత రాక్షస పాలన ఎక్కడా ఉండదు. సెక్స్ రాకెట్లో ఉన్నవాళ్లు పేదలు కారా, అంబేద్కర్ బిడ్డలు కారా అని అడుగుతున్నా. వాళ్లను కాపాడే కేసును నీరుగార్చడానికి మీరు చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతున్నా'' అన్నారు. రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గమని ఇతర ఎమ్మెల్యేలు అన్నారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని చర్చించాలని అడిగినందుకు తమను మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తరలించారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మందబలంతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ప్రజలంతా చూశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అత్యంత ముఖ్యమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించడానికి అధికారపక్షానికి తీరికలేదా అని ప్రశ్నించారు. -
బలవంతంగా గెంటేసినా గేటుముందు గొంతు విప్పి..
హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అసెంబ్లీ బయటా వెలుపలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ చర్యలు ఏమాత్రం సహించేవి కావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శుక్రవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సెక్స్ రాకెట్ పై వ్యవహారంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని పక్కకు పెడుతూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభను వాయిదా వేసిన స్పీకర్ తిరిగి మరోసారి ప్రారంభించగా వైఎస్ఆర్ సీపీ అదే డిమాండ్ ను పట్టుబట్టింది. దీంతో మొత్తం ప్రతిపక్షాన్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అంబేద్కర్ జన్మదినోత్సవంపై చర్చ పూర్తయ్యే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే, సభలో నుంచి వెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు తిరస్కరించడంతో సభలోకి మార్షల్స్ ను పెట్టించి బయటకు పంపించారు. దీంతో కొందరు గాంధీ విగ్రహం వద్ద నిరసనలు ప్రారంభించగా మరికొందరు అసెంబ్లీ గేటువద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గేటు వద్ద కూర్చుని అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు. -
బలవంతంగా గెంటేసినా గేటుముందు గొంతు విప్పి..
-
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు
-
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు
ప్రతిపక్షం మొత్తాన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి తమ చర్చ తాము జరుపుకోడానికి అధికార పక్షం కుట్ర పన్నింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. కాల్ మనీ అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టడం, అయినా వినిపించుకోకుండా అధికార పక్షం యథా ప్రకారం అంబేద్కర్ అంశంపైనే చర్చను కొనసాగిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దాంతో యనమల మొత్తం ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ స్పీకర్‌ను కోరారు. దాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటిస్తూ, అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు మొత్తం ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు అందరి పేర్లను చదివి ప్రకటించారు. అయినా కొద్దిసేపటి పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలోనే ఉండి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెండైన సభ్యులందరూ వెంటనే సభను వదిలిపెట్టి వెళ్లిపోవాలని స్పీకర్ పదేపదే చెప్పారు. సభలో అనుచిత ప్రవర్తన మానుకోవాలని తెలిపారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్పీకర్ కోడెల తన సీటు నుంచి లేచి వెళ్లిపోగా, ప్యానల్ స్పీకర్ అధ్యక్ష స్థానంలోకి వచ్చారు. ఆయన మార్షల్స్‌ను పిలిచి, విపక్ష సభ్యులను బయటకు పంపాల్సిందిగా సూచించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం వెల్‌లోనే బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. ఆ తర్వాత.. మార్షల్స్ రంగప్రవేశం చేసి, వైఎస్ఆర్ సీపీ సభ్యులను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. -
కాల్‌మనీ.. కాదు అంబేద్కర్
-
కాల్‌మనీ.. కాదు అంబేద్కర్
కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశం మీద చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అసెంబ్లీ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత వైఎస్ఆర్సీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముందు కాల్‌మనీ - సెక్స్ రాకెట్ అంశంపై చర్చ సాగించాలని కోరారు. మిగిలిన అంశాలు ఏవైనా ఆ తర్వాత చర్చించుకోవచ్చని సూచించారు. ఇంతకంటే ప్రధానమైన అంశం ఏమీ లేదని అన్నారు. అయితే, అందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిరాకరించారు. నిన్నటి ఎజెండాలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ అంశం మీద చర్చను ముందుగా చేపట్టాలని, అది పూర్తయిన తర్వాతే మరే అంశాన్నైనా చేపట్టుకోవచ్చని తెలిపారు. దానికి వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయినా అధికారపక్షం మాత్రం తమ పట్టు వీడకుండా ముందుగా అంబేద్కర్ అంశం మీద చర్చను ప్రారంభించింది. -
'సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు డాక్టరేట్ ఇచ్చారేమో'
హైదరాబాద్: అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ది చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నీచమైన రాజకీయాలకోసం మహానుభావుడు అంబేద్కర్ ను వాడుకున్న దౌర్బాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప దేశంలో మరొకరు లేరని అన్నారు. అసలు సెక్స్ రాకెట్ ను ప్రోత్సహించినందుకు చంద్రబాబునాయుడికి చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. 'రుణాలు మాఫీ చేయలేదు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మహిళలు అప్పుల పాలయ్యారు. అందుకే అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఆసరగా తీసుకొని మహిళలను అసభ్యంగా చిత్రీకరించారు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయించే పరిస్ధితి తీసుకొచ్చారు. మహిళలకు ఇలాంటి దుస్తితి కల్పించడానికి ఎలా మనసు వచ్చింది. అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసినవ్వుతున్నారు' అని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా మహిళలకు అండగా ఉందామని, చర్చ జరిపి నేరస్తులను శిక్షిద్దామంటే సీఎం ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అసలు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని అన్నారు. కుటుంబంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందు ఆ విషయం ఇంట్లో వారికి చెప్పి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటిస్తారని ఉదహరించారు. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయొచ్చనుకుంటే కష్టమని గుర్తుచేశారు. -
ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది
-
ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే ఇలా ఉంది
ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎవరైనా, చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఇస్తారు గానీ, ప్రకటన తర్వాత చర్చ అనేది తాను ఎక్కడా వినలేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతోందని చెప్పారు. ''సీఎం ప్రకటన చేసేసిన తర్వాత ఇక చర్చించడానికి ఏముంది? కామన్ సెన్స్ ఉండాలి. చర్చ జరిగిన తర్వాత ప్రకటన ఉండాలి. అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, ఐదురోజులే ఎందుకు పెట్టారు, అది కూడా మధ్యాహ్నం వరకే ఎందుకు? మరో రెండు రోజులు పొడిగించి, ఆ రెండు రోజులు అచ్చంగా అంబేద్కర్ గారి మీదే చర్చిద్దాం. చంద్రబాబు, ఆయన కొడుకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సెక్స్ రాకెట్లో ఉన్నారు. డీజీ ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా నిందితులతో కూర్చుంటున్నారు. ఇంత ముఖ్యమైన టాపిక్ మీద చర్చ జరగకుండా చూసుకోడానికి అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు'' అని ఆయన అన్నారు. ఈ మధ్యలో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఏం అంశంపై అయినా ప్రకటన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పారు. చర్చ పెట్టాలని అడిగే హక్కు ప్రతిపక్షానికి లేదని అన్నారు. కావాలని అసెంబ్లీని స్తంభింపజేయాలని అనుకుంటున్నారన్నారు. చర్చే కావాలంటే ప్రభుత్వం ఆమోదించే సమస్య లేదని, ముందు ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత మాత్రమే చర్చకు అనుమతిస్తామని తెలిపారు. ఇలాగే సభను అడ్డుకుంటే తగిన చర్య తీసుకోవాల్సిందిగా చెబుతానని బెదిరించారు. రాష్ట్రం మొత్తమ్మీద చాలా పరిణామాలు జరిగాయని, ఏయే అంశాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చ ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు
ఆడవారి మానప్రాణాలతో టీడీపీ నేతలు చెలగాటం అడి వీడియోలు తీశారని, ఆ సెక్స్ రాకెట్ ముఠాను చంద్రబాబు కాపాడుతున్నారని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇక ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... సెక్స్ రాకెట్‌కు సంబంధించి స్పష్టంగా ఆధారాలున్నాయి చంద్రబాబు ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోంది ఆ నిందితులు చంద్రబాబుతో, ఇంటెలిజెన్స్ డీజీతో టీడీపీ ఎమ్మెల్యేలతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. నిందితులను విదేశాల్లో వదిలేసి బోడె ప్రసాద్ వచ్చినా ఆయన్ను విచారించలేదు మరో ఎమ్మెల్సీ సొంత తమ్ముడే ఈ కేసులో నిందితుడు ఎమ్మెల్సీతో పాటు ఆయన సోదరుడు ఒకే ఇంట్లో ఉంటారు అయినా ఆ ఎమ్మెల్సీ తనకేమీ తెలియదంటాడు అయినా టీడీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి కేసులుండవు, విచారణ జరగదు అతి దారుణమైన సంఘటనను ప్రశ్నించిన మాపార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు కేసును నీరుగార్చేందుకు వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు సెక్స్ రాకెట్ కేసును దారి మళ్లించేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలు చూస్తుంటే.. ఇంత దారుణమైన సీఎం దేశంలో ఎక్కడా లేరనిపిస్తోంది చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదు మా పార్టీ వైఖరిని బీఏసీలో స్పష్టంగా చెప్పినా అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు కాల్‌బాబు, మనీబాబు, సెక్స్‌రాకెట్ బాబు అని అనచ్చు చంద్రబాబుకు సడన్‌గా అంబేద్కర్ గుర్తుకొచ్చారు అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమే నా జీవితంలో ఇంత దారుణమైన వ్యక్తిని చూడలేదు సభలో ఒకరోజు సస్పెండ్ చేయమని చెబితే, రెండు రోజులు సస్పెండ్ చేశారు ఇలాంటి దుశ్శాసన, దుర్మార్గపు కౌరవ సభ ఇంకోటి ఉండదు తప్పుచేసిన ఎమ్మెల్యేను ప్రశ్నించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు వనజాక్షి, రిషితేశ్వరి కేసులో ఒక్కరిని కూడా నిలదీసిన పాపాన పోలేదు లాండ్, శాండ్, లిక్కర్, సెక్స్ మాఫియాలో చంద్రబాబు భాగం -
రూల్స్ లేవ్..!
భూ సమీకరణపై అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కారు అబద్ధాలు సీఆర్డీఏ బిల్లు సమయంలో.. రూల్స్‌ను తర్వాత ప్రకటిస్తామన్న చంద్రబాబు రైతులు, కౌలు రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, ఇతర చేతివృత్తిదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, పరిహారం ఊసే లేదు రూల్స్ రూపొందించి, వాటిపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదించక ముందే.. విధివిధానాలేవీ లేకుండానే సంక్రాంతి లోగా సమీకరణ పూర్తిచేసే తాపత్రయం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రాజధానికి అవసరమైన భూములను సమీకరించడానికి నియమ నిబంధనలు (రూల్స్) ప్రకటించకుం డానే ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ.. వారికి ఎలాంటి హామీ లేకుండానే సమీకరణకు తెగబడింది. ఇటీవలి కాలం లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజ ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లు కు చట్టబద్ధత కల్పించే క్రమంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. సీఆర్డీఏ చట్టానికి అనుగుణంగా రూల్స్ (నియమాలు) వెల్లడించిన తర్వాత వాటిపై తిరిగి అసెంబ్లీలో చర్చిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఆర్డీఏ బిల్లును పురపాలక శాఖ మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భూములు ఇచ్చే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, ఇతరత్రా ఆ ప్రాంతాల్లో జీవనం సాగి స్తున్న ప్రజలకు ఎలాంటి ప్యాకేజీ, పరిహారం చెల్లిస్తారన్న వివరాలు బిల్లులో లేకుండా ఎలా ఆమోదిస్తారని సూటిగా ప్రశ్నించారు. దానిపై సీఎం చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. ముందు బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత విడిగా రూల్స్ (నియమాలు) ఖరారు చేస్తామని, ఆ రూల్స్ మళ్లీ అసెంబ్లీ ముందు చర్చకు కూడా వస్తాయ ని, వాటిపై అభ్యంతరాలుంటే ఆ సమయంలో తెలియజేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. సీఆర్డీఏ చట్టం-2014 లోని తొలి చాప్టర్లో గల సెక్షన్ 38 లోనూ రూల్స్ విషయంలో ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టానికి అనుగుణంగా మార్గదర్శకాలు తయారు చేసి తిరిగి అసెంబ్లీ ముందుకు వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు మూజువాణి ఓటుతో సీఆర్డీఏకు చట్టబద్ధత కల్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాలను దాటవేసింది. ఉపాధి, పరిహారం ఊసు లేకుండానే... సీఆర్డీఏపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతుల నుంచి భూములు సమీకరించినప్పుడు వారికి నష్టపరిహారాన్ని ఏ విధంగా ఇస్తారు? కౌలు రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఏంటి? వ్యవసాయ కూలీలు, ప్రస్తుతం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఇతర మార్గాల్లో ఉపాధిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్నది అధికారికంగా ప్రకటించకుండా.. తయారు చేసిన రూల్స్‌పై మళ్లీ అసెంబ్లీలో చర్చించి ఆమోదించకుండానే అధికారులు రాజధాని ప్రాంతాల్లో భూ సమీకరణపై హడావుడి చేస్తూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఈ నెల 2న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో సీఆర్డీఏ రూల్స్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరారు చేశాక ఆ మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. అదేమీ లేకుండానే సీఆర్డీఏపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన క్షణం నుంచే భూ సేకరణను ప్రారంభించడం విడ్డూరం. అదీ సంక్రాంతిలోగా భూ అంగీకార పత్రాల సేకరణ కూడా పూర్తి చేయాలని లక్ష్యం గా నిర్దేశించడం విస్మయం గొలుపుతోంది. 27 బృందాలు... 300 మంది సిబ్బంది.. సీఆర్డీఏ చట్టం - 2014పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రభుత్వం రైతుల నుంచి భూములను తీసుకోవడానికి ప్రత్యేకంగా 27 బృందాలను ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది అధికారులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించింది. వీటికి తోడు రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది బృందాలు ప్రవేశించడమే కాకుండా ఆగమేఘాల మీద రైతులను హడావుడి పెట్టారు. ఈ 27 రెవెన్యూ బృం దాలపై పర్యవేక్షణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవా రం జీవో జారీ చేసింది.అలాగే 300 మంది సిబ్బందిని కూడా ఎంపిక చేసింది. భూ సమీకరణకు అధికారం ఎవరిచ్చారు? జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి సీఆర్డీఏ చట్టమైంది కాబట్టి దాని తర్వాత రూల్స్ (నిబంధనలు) రూపొందించాలి. వాటిని అసెంబ్లీకి తీసుకురావాలి. అక్కడ ఆమోదం పొందాక మిగతా కార్యక్రమాలు చేయాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా ఇదే చెప్పారు. అయితే ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ల్యాండ్ పూలింగ్ చేయనున్నామని, తమను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పినట్టు ఆయా గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు. సెక్షన్ 10 (ఎ) ప్రకారం ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి భూములు సర్వే చేసుకోవచ్చు. జనాభా లెక్కలు, భూసమీకరణలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఇలా అన్నిటిపైనా సర్వే చేసుకోవచ్చు గానీ.. భూసేకరణ చేస్తామంటూ ఏ అధికారంతో వెళతారు?దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ విజయవాడలో భూసమీకరణకు కూడా వర్తిస్తుందని కొందరు ప్రభుత్వాధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇది పట్టణీకరణ విషయంలో వర్తించదు. పాత చట్టమే వర్తిస్తుంది. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రాజెక్టుల నిర్మాణంవంటి వాటికే ఆర్డినెన్స్ తప్పా రాజధాని భూ సమీకరణకు ఇది వర్తించదు. వర్తించదు. పథకం ప్రకారమే సర్కారు వ్యాపారం... బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ సీఆర్డీఏ చట్టంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని అసెంబ్లీ సాక్షిగా నేను, మా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దీనికి సీఎం, ఆర్థికమంత్రి బదులిస్తూ ముందు చట్టం వస్తుంది ఆ తర్వాత రూల్స్ తెస్తామన్నారు. ఇప్పుడేమో రూల్స్ తేకుండానే ల్యాండ్ పూలింగ్‌కు వెళుతున్నారు. మీరు తేబోతున్న రూల్సేమిటో ఒక్క రైతుకైనా వివరించారా? రోడ్లకు, బలహీన వర్గాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత స్థలాలు ఇస్తున్నదీ చెప్పిన మీరు, రైతులకు ఎంత ఇస్తున్నది ఎందుకు చెప్పలేకపోయారు? ఎక్కడైనా ఒక చట్టం వచ్చాకే ఎంఓయూ చేసుకుంటారు. కానీ చట్టం ఇంకా అమల్లోకి రాకముందే సింగపూర్ పార్టీతో మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు?. ఒక చిన్న ఉద్యోగానికైనా నిబంధనలు రూపొందించాకే నియామకం చేస్తారు. కానీ 30 వేల ఎకరాల భూములు మీరు లాక్కుంటున్నప్పుడు రైతులకు సమాధానం చెప్పకుండా, ఎలా తీసుకుంటున్నదీ వివరించకుండా చేస్తున్నారంటే మీది వ్యాపారం కాక మరేమనుకోవాలి? రూల్స్ రూపొందించాక,ల్యాండ్ పూలింగ్‌కు వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? దీనివెనుక మతలబు ఉంది కాబట్టే హడావిడిగా అన్నీ చేసేస్తున్నారు. -
కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..!
నాగార్జున విశ్వవిద్యాలయం పేరెత్తగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ ఉలిక్కిపడుతున్నారట! అక్కడ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుపుదామన్న ప్రతిపాదన వచ్చింది. సభాపతి కోడెల శివప్రసాదరావు అక్కడకు వెళ్లి పరిశీలించి కూడా వచ్చారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పలువురు ఆ యూనివర్సిటీకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాతే రాజకీయంగా నష్టపోయారన్నది ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం వాడుకలోకి వచ్చాక స్నాతకోత్సవాలకు కూడా గవర్నర్లు రావడం లేదని ఇక్కడి ఉద్యోగులు సైతం అంటుంటారు. పక్కనే కృష్ణా విశ్వవిద్యాలయానికి హాజరవుతున్న గవర్నర్లు నాగార్జున వర్సిటీకి మాత్రం రావడం లేదు. దీన్ని బాగా నమ్ముతున్న కారణంగానే చంద్రబాబు సైతం ఆ వర్సిటీ పేరెత్తగానే కంగారు పడుతున్నారని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గుంటూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు కోసం అధికారులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతిథి గృహాన్ని తీర్చిదిద్దారు. అయితే జ్యోతిష్యుల సూచనల మేరకు ఆయన ఆ అతిథి గృహంలో అడుగుపెట్టలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రదేశానికి పక్కనే హుటాహుటిన మరో విశ్రాంతి గదిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తర్వాత సెప్టెంబర్ 5న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఈ యూనివర్సిటీలోనే జరపాలని నిర్ణయించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యే తరుణంలో ఆఖరు నిమిషంలో వేదికను గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఇప్పుడు మూడోసారి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను యూనివర్సిటీలోని ఆడిటోరియంలోనే జరపాలని భావించి సభాపతి కోడెల ఉత్సాహం ప్రదర్శిస్తే.. ఆ ప్రతిపాదనను నీరుగార్చుతూ మరోసారి చూద్దామని బాబు చెప్పారట! మతలబేంటబ్బా...! కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారనగానే మిత్రపక్షమైన టీడీపీలో అప్పట్లో పెద్ద కలకలమే రేగింది. మోదీ తన కేబినెట్లో తొలిసారి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పిం చగా.. విస్తరణలో రెండో బెర్త్ ఇస్తున్నట్టు సమాచారం రాగానే పార్టీ ఎంపీల్లో చర్చ మొదలైంది. ఎంపీల్లో సీనియర్లలో బీసీలే ఉన్నందున వారిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును ప్రధానమంత్రికి సూచించారు. మిత్రపక్షమైన టీడీపీకి ఒక బెర్త్ ఖాయం చేసిన మోదీ ముందుగానే ఒక శాఖను ఎంపిక చేసుకున్నారు. అయితే చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును సూచించడంతో ఆ వెంటనే శాఖను కూడా మార్చారట. కొందరు టీడీపీ నేతలే రాత్రికి రాత్రి సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణల చిట్టాను కేంద్రానికి చేరవేశారు. అప్పటికే కేంద్రం వద్ద ఉన్న సమాచారానికి టీడీపీ నాయకులు పంపిన చిట్టా చేరడంతో సుజనాకు ఇవ్వాలనుకున్న శాఖను మార్చి అంతగా ప్రాధాన్యం లేని శాస్త్ర సాంకేతిక శాఖ (సహాయ మంత్రి)ను మోదీ కట్టబెట్టారని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది!! హమ్మయ్య.. బదిలీ అయ్యాడా.. ‘ఆ అధికారి బదిలీ అయ్యాడా.. హమ్మయ్య!’.. ఇదేదో ప్రభుత్వ ఆఫీసులో ఏదో పని కోసం వెళ్లి విసిగి వేసారిన సగటు మనిషి నిట్టూ ర్పుకాదు.. తెలంగాణలో సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి నిస్సహాయత. ఏవో పనుల కోసం తన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యేలకు సాయం చేసేందుకు సదరు మంత్రివర్యులు ఓ డీఎస్పీకి ఫోన్ చేస్తే... అతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినలేదు.. పనికాలేదని తెలిసి మంత్రిగారు చెడా మడా తిట్టినా కదలిక లేదు. ఇక చేసేది లేక తన ఓఎస్డీని పిలిపించుకుని ‘ఆ డీఎస్పీ మాట వినడం లేదు, ఏం చేద్దా’మంటే... ‘ఏం చేయడమెందుకు సార్.. బదిలీ జాబితాలో ఉన్నాడు. వారం రోజులు ఆగితే చాలు’ అని ఓఎస్డీ సలహా ఇచ్చాడు. ఓ వారం అయ్యాక డీఎస్పీ బదిలీ అయ్యాడు. ఈ సంగతి తెలిసిన మంత్రివర్యులు.. ‘హమ్మయ్య.. ఇప్పుడు వచ్చిన అధికారి అయినా మాట వింటాడంటావా?..’ అని నిట్టూర్చారు. రాష్ట్రంలో ఓ శాఖను పర్యవేక్షించే మంత్రి మాటకే అధికారుల వద్ద విలువ లేకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏమిటో.. అంటూ ఓ శాసనసభ్యుడు అసలు విషయం చెప్పాడు. -
అసెంబ్లీలో బిల్లుపై చర్చ 23 రోజులు.. 56 గంటలు
చర్చ జరిగిన సమయమిదే.. 86 మంది సభ్యులకే మాట్లాడే అవకాశం సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ మొత్తం 23 రోజుల పాటు సమావేశమైంది. సగటున రోజుకు రెండున్నర గంటల చొప్పున సుమారు 56 గంటలకు పైగా చర్చించింది. ప్రస్తుతం 280 మంది ఎమ్మెల్యేలున్న సభలో 86 మందికి మాత్రమే విభజన బిల్లుపై అభిప్రాయాలు చెప్పే అవకాశం లభించింది. మిగతావారికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో సుమారు 150 మంది తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేశారు. బిల్లుకు మొత్తం 9,072 సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 12నే ప్రారంభమయ్యాయి. - తొలి రోజు నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపట్ల సంతాప తీర్మానం చేశారు. రెండో రోజు ఏ అంశంపై చర్చించాలనే విషయంలో సభ్యుల మధ్య గొడవ జరగడంతో సభ వాయిదా పడింది. - మరోవైపు రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు డిసెంబర్ 12న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి అందింది. దానిని ఆగమేఘాలపై సీఎం, గవర్నర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సంతకాలు చేయించి 13వ తేదీ మధ్యాహ్నానికి అసెంబ్లీకి పంపారు. అప్పటికే సభ వాయిదా పడటంతో దానిని సభలో ప్రవేశపెట్టలేదు. - అసెంబ్లీ తిరిగి డిసెంబర్ 16న సమావేశంకాగా అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అభ్యంతరాల మధ్య ప్రభుత్వం తరఫున విభజన బిల్లును ప్రవేశపెట్టడం వివాదాస్పదమైంది. ఆ రోజు నుంచి సభ గురువారం నిరవధిక వాయిదా పడేవరకు మొత్తం 23 రోజుల పాటు సమావేశమై 56 గంటలకుపైగా చర్చించింది. - డిసెంబర్ 18న రెండు నిమిషాలపాటే సభ సమావేశమై అతితక్కువ సమయం సభ జరిగిన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధికంగా గత నెల 22న 9 గంటల 4 నిమిషాలు విభజన బిల్లుపై చర్చించినట్లు శాసనసభ సచివాలయ గణాంకాలు చెప్తున్నాయి. - పార్టీల వారీగా చూస్తే మొత్తం 86 మంది సభ్యులు మాట్లాడగా వారిలో 42 మంది కాంగ్రెస్ వారే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున 22 మంది సభ్యులు ప్రసంగించారు. అలాగే 9 మంది టీఆర్ఎస్, ఏడుగురు వైఎస్సార్ కాంగ్రెస్, ఇద్దరు సీపీఐ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా, నామినేటెడ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
అసెంబ్లీ వద్ద నిషేధాజ్ఞలు
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల పునఃప్రారంభం నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అసెంబ్లీ పరిసరాల్లో సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఉండదు. ఎవరైనా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అనురాగ్‌శర్మ హెచ్చరించారు. -
నిరసనల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా
-
సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: సభ్యులు గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు వేరు వేరుగా నినాదాలు చేసి ఆందోళనలు కల్గించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టి ముట్టి ఆందోళనకర పరిస్థితులు సృష్టించారు. తొందర పాటు చర్యలు పాల్పడకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత బుధవారం జరిగిన బీఏసీలో బిల్లుపై వారం రోజులు చర్చించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో తిరిగి అసెంబ్లీ సోమవారం ఆరంభమైంది. గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేయక తప్పలేదు. -
ఈ నెల12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
ఈ నెల12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభకానున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారా?లేదా అనే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రాన్ని అతాలకుతలం చేసిన తుపాన్లతో భారీగా నష్టపోయిన బాధితుల నష్ట పరిహారం అంశాన్ని సి.రామచంద్రయ్య రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువచ్చారు. వివాదస్పద చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగింది. తాగునీటి పథకంపై టెండర్ల ఖరారు అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించారు. తాగునీటి పథకానికి సంబంధించి టెండర్లు ప్రతిపాదనను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 శాతం నుంచి 39 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి రూ.200 మేర పింఛన్ ను అందించేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మావోయిస్టులతోపాటు ఏడు తీవ్రవాద సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు దాడుల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపుకు, జీహెచ్ఎంసీలో మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఒకడుగు ముందుకు,రెండడుగులు వెనక్కు
-
3న రాష్ట్ర కేబినెట్ భేటీ
డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ తేదీలు ఖరారు సాక్షి, హైదరాబాద్: సుమారు 45 రోజుల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగి డిసెంబర్ 19వ తేదీతో ఆరు నెలలు కావస్తున్నందున తప్పనిసరిగా ఆ లోపలే సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి 3వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చించి తేదీలను ఖరారు చేయనున్నారు. కాగా, డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే మంత్రివర్గ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చర్చించడంతో పాటు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులకు మధ్యంతర భృతి అంశంకూడా చర్చకు రానుంది. రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్‌కు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.