ఆ స్థానంలో సోదరి జకియా ఖాన్‌ కూర్చోవడం ఆనందంగా ఉంది: సీఎం జగన్‌ | CM YS Jagan Congratulates Zakia Khanam | Sakshi
Sakshi News home page

ఆ స్థానంలో సోదరి జకియా ఖాన్‌ కూర్చోవడం ఆనందంగా ఉంది: సీఎం జగన్‌

Published Fri, Nov 26 2021 2:23 PM | Last Updated on Fri, Nov 26 2021 2:30 PM

CM YS Jagan Congratulates Zakia Khanam - Sakshi

సాక్షి, అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్థానంలో తన అక్క జకియా ఖానమ్‌ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ వైస్‌ చైర్మన్‌గా ఆ స్థానంలో కూర్చోవడం గర్వనీయమన్నారు.
చదవండి: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం: సీఎం జగన్‌ వ్యంగ్యాస్త్రాలు..

‘నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం. ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి.  ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలన్నది మ ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement