
2018–19 మధ్య భారత్‌లో వందమంది ప్రముఖులపై నిఘా
అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం.. స్పై వేర్‌తో ట్యాపింగ్
వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడి
2018–19లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై టీడీపీ ప్రభుత్వం నిఘా
అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
తాజాగా నిర్ధారించిన మెటా
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ చెప్పిందే నిజమైంది. 2018–19లో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. భారత్‌లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ బాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది.
స్పైవేర్ నిఘాలో రెండో స్థానంలో భారత్
నిఘా సాఫ్ట్‌వేర్ స్పైవేర్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో, పెగాసస్‌ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.
–2018–19లో భారత్‌లో వందమంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్‌ఎస్‌వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూ.58 కోట్లు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌నకు చెల్లించాయి.
–ఎన్‌ఎస్‌వో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1,223 మందిపై నిఘా పెట్టింది. వారిలో వందమంది భారత్‌కు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచింది.
పెగాసస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్య
భారత్: 100, బ్రిటన్: 82, మొరాకో: 69, పాకిస్థాన్: 58, ఇండోనేసియా: 54,
ఇజ్రాయెల్: 51, స్పెయిన్: 12, నెదర్లాండ్స్: 11, హంగేరీ: 8, ఫ్రాన్స్: 7,
యూకే: 2.
అప్పట్లోనే వెల్లడించిన వైఎస్సార్‌సీపీ
2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, నాడు వైఎస్సార్‌సీపీ చెప్పింది నిజమేనని.. మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.
అసెంబ్లీలోనే బయటపెట్టిన మమత
2018–19లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్‌ను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు కూడా మమతా తెలిపారు. బెంగాల్‌లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్‌ఎస్‌వో గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలతో.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ ను ఉపయోగించినట్లు స్పష్టమైంది.