spyware
-
ఇండియన్ ఐఫోన్ యూజర్లకు ముప్పు.. యాపిల్ హెచ్చరిక!!
భారత్‌లోని ఐఫోన్ వినియోగదారులను యాపిల్ అప్రమత్తం చేసింది. కొంతమంది వారి ఫోన్లు పెగాసస్ లాంటి "కిరాయి స్పైవేర్ దాడి"కి గురి కావచ్చని హెచ్చరించింది.స్పైవేర్ ఫోన్లపై నియంత్రణను పొందవచ్చని భారత్‌తోపాటు మరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 98 ఇతర దేశాలలోని వినియోగదారులకు పంపిన రెండవ నోటిఫికేషన్లో కంపెనీ తెలిపింది. 2021 నుంచి యాపిల్ ఈ నోటిఫికేషన్లను 150 కంటే ఎక్కువ దేశాల్లోని యూజర్లకు పంపింది.ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు చెందిన పెగాసస్ తరహా మెర్సెనరీ స్పైవేర్ దాడులు అనూహ్యంగా అరుదైనవని, సాధారణ సైబర్‌క్రిమినల్ యాక్టివిటీ లేదా కన్స్యూమర్ మాల్వేర్ కంటే చాలా అధునాతనమైనవని యాపిల్ పేర్కొంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) కూడా ఐఫోన్, ఐపాడ్లకు సంబంధించిన యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక ముప్పులను గుర్తించింది. 17.4.1 iOS వెర్షన్ కంటే ముందు Safari వెబ్ బ్రౌజర్ వెర్షన్లలోని లోపాలు దాడులకు అవకాశం ఇచ్చేలా ఉన్నాయని హెచ్చరించింది. -
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్ ట్యాపింగ్ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్‌లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది. 35 లక్షల మంది డేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానించారు. ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. ఐ ఫోన్‌ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోమ్ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని యాపిల్ కంపెనీ అలెర్ట్ మెస్సేజ్ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్ ఫోన్ ట్యాపింగ్‌పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా? చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. -
భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్ నిఘా!
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షకు పంపించగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తేలింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ స్పైవేర్ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్బారిన పడ్డారని ‘ది వైర్’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్’ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్ ఆనాడు ప్రకటించింది. రాహుల్ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో కాగ్సైట్ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్‌ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్‌కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్‌లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్‌కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్‌ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్‌తో సంబంధం లేకుండానే బ్లాస్ట్‌పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్‌పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్‌లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్‌ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
అది ‘పెగసస్’గా నిర్ధారించలేం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్‌ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ ప్యానెల్ తన నివేదికను ధర్మాసనానికి అందజేసింది. 29 ఫోన్లను పరీక్షించగా, కేవలం 5 ఫోన్లలో ఒకరకం మాల్వేర్ను గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. అయితే, అది నిజంగా ఇజ్రాయెల్ పెగసస్ స్పైవేర్ అవునో కాదో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పేర్కొంది. పెగసస్ అంశంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని ప్యానెల్ తన నివేదికను తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందజేసింది. అందులోని వివరాలను ధర్మాసనం గురువారం బయటపెట్టింది. ‘‘దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని కమిటీ(ప్యానెల్) చెప్పింది. పెగసస్ విషయంలో కోర్టులో విచారణకు మీరు(కేంద్రం) సహకరించలేదు. కమిటీకి సహకరించలేదు’ అని పేర్కొంది. పౌరుల గోప్యత హక్కు రక్షణ, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న చట్టాలను సవరించాలని సూచించిందని వివరించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం పరీక్ష కోసం టెక్నికల్ కమిటీకి 29 ఫోన్లు అందజేయగా, అందులో 5 ఫోన్లలో మాల్వేర్ కనిపించడం కొంత ఆందోళనకరమైన విషయమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 29 ఫోన్లు ఇచ్చిన వారికి ఈ నివేదికను అందజేయలేదని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, చట్టవిరుద్ధమైన నిఘా, పౌరుల గోప్యత విషయంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్యానల్ ప్రతిపాదించిందని చెప్పారు. నివేదికను విడుదల చేయొద్దంటూ ప్యానల్ తమను కోరిందన్నారు. ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలని, నివేదికలో ఏయే భాగాలను బహిర్గతం చేయాలో తాము నిర్ణయిస్తామని, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. ప్యానెల్ నివేదికను కక్షిదారులకు అందజేయాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాకేశ్ త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దర్యాప్తునకు కేంద్రం సహరించలేదని ధర్మాసనం చెప్పగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. ధర్మాసనం తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాహుల్ క్షమాపణ చెబుతారా?: బీజేపీ పెగసస్ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం సాగించాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ ఇకనైనా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, ఓ వర్గం మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ అబద్ధాలు ప్రచారం చేసినట్లు తేటతెల్లమయ్యిందన్నారు. కేంద్రం ఏదో దాస్తోంది: రాహుల్ పెగసస్ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదో దాచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌కు మోదీ ప్రభుత్వం సహకరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ సర్కారు కోరుకుంటోందన్నారు. దర్యాప్తునకు సహకరించలేదంటే ఏదో నిజాన్ని దాస్తున్నట్లు అంగీకరించినట్లేనని చెప్పారు. ఈ మేరకు రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. -
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్!
యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అలెర్ట్. ఐఫోన్లపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన ఐఫోన్ యాప్స్‌ను యాపిల్ బ్లాక్ చేసింది. అంతేకాదు ఐఫోన్లపై దాడులు చేసేందుకు ఎలాంటి మాల్వేర్ను తయారు చేశారు. ఎవరు తయారు చేశారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌కు చెందిన 'థ్రెట్ అనాలిసిస్ గ్రూప్' (టీఏజీ ) హ్యాకింగ్, దాడుల్ని గుర్తిస్తుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం..ఇటాలియన్ సాఫ్ట్ వేర్ సంస్థ ఆర్సీఎస్ తయారు చేసిన 'హెర్మిట్' అనే స్పైవేర్ ఐఫోన్లపై దాడి చేసి..ఆఫోన్ పనితీరు ఆగిపోయేలా చేస్తుంది.ఈ స్పైవేర్ మీ ఫోన్లో ఎంటర్ అయ్యిందంటే చాలు హ్యాక్ చేయడం,ఆడియోను రికార్డ్ చేయడం, అనధికారిక కాల్స్ లిఫ్ట్ చేయడం, ఈమెయిల్‌లు చెక్ చేయడం, మెసేజెస్ చదవడం, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేశారో తెలుసుకోవడం, కెమెరాను హ్యాక్ చేస్తున్నట్లు ట్యాగ్ గ్రూప్ గుర్తించింది. అంతేకాదు విచిత్రంగా ఐఫోన్లలోకి ఎంటర్ అయ్యే ఈ వైరస్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాపిల్ స్టోర్ నుంచి సాధ్యపడదని సదరు రిపోర్ట్‌లో పేర్కొంది. సైడ్ లోడింగ్ ద్వారా ఐఫోన్లలోకి ఎంటర్ అవుతున్నట్లు నివేదిక నిర్ధారించింది. సైడ్‌లోడింగ్ అంటే యూఎస్బీ, బ్లూటూత్, వైఫై లాంటి ఇతర పద్ధతుల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసే సామర్ధ్యం ఉన్న మీడియా ఫైల్స్ ద్వారా ఫోన్లపై అటాక్ చేస్తున్నట్లు తేలింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ ఐఫోన్ వినియోగదారుల్ని హెచ్చరించింది. డేటా షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్ స్పైవేర్ ‘హెర్మిట్’ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్' ఎంటర్ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్ టీంఈ మాలావేర్ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు. హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్ల డైవర్షన్ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్ఎంఎస్ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్లను కూడా ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది. 'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్సీఎస్ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్సీఎస్ ల్యాబ్ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా పెగాసస్ డెవలపర్ ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్ఫిషర్ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్మెనిస్తాన్లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్‌రెడ్డి
-
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
AP: భూమన నేతృత్వంలో పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ (చంద్రబాబు) ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసింది. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతాం. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశం. చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపుతాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేశామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చదవండి: (గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ) -
ఏపీ: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్ కమిటీ
సాక్షి, అమరావతి: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు. కాగా రాష్ట్రంలో పెగసస్ స్పైవేర్ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్ ఉదంతంపై హౌస్ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ హౌస్ కమిటీ వేశారు. చదవండి: మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్ -
నేరమే అధికారమై..!
నేరమే అధికారమై నేరం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే అన్నాడొక మహానుభావుడు. నేరమే అధికారమై నేరం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఒకానొక పాపిష్టి ఘటన ఇంకా మన జ్ఞాపకాల్లో సజీవంగానే నిలిచి ఉన్నది. ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’! అధికార పీఠమెక్కిన నేరస్వరానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఆడియో!! ఆ కంఠస్వరం అక్షరాలా ‘ఆయన’దేనని ఆడియోను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. అంత చక్కని ఇంగ్లీష్ భాషలో ‘ఆయన’ తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ రోజుల్లోనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి నేరం చేస్తూ దొరికిపోయిన జుగుప్సాకర సన్నివేశం అది. పొరుగు రాష్ట్ర శాసనసభ్యుడిని కొనుగోలు చేస్తూ, ఆడియో – వీడియోల సాక్షిగా నోట్ల కట్టల సూట్‌కేసుతో బుక్కయిన ఒక అసభ్య చిత్రమది. కొన్ని కోట్లమంది ‘బ్రీఫ్డ్ మీ’ ఆవాజ్‌ను విని ఉంటారు. ఆ గొంతు ఎవరిదీ అనే అనుమానం ఎవరికీ వచ్చి ఉండే ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినా ఫోరెన్సిక్ నివేదిక దాన్ని పటాపంచలు చేసింది. అయినా ఆ నాయకుడి మీద కేసు పడలేదు. ఆయన ఆదేశాలు పాటించిన వారి మీద మాత్రమే ఇప్పుడు కేసు నడుస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను విజయవంతంగా నడిపించడంలో, ఇతరేతర సంస్థలను, వ్యవస్థలను మెప్పించడంలో గొప్ప దిట్టగా చంద్రబాబుకు పేరున్నది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్నీ, పార్టీనీ కబ్జా చేసిన చంద్రబాబు ఆ తర్వాత బాజప్తా న్యాయస్థానం ద్వారానే సైకిల్ గుర్తునూ, పార్టీ జెండానూ, పార్టీ బ్యాంక్ అక్కౌంట్స్నూ స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా తన చేతుల మీదుగానే పార్టీని నిర్మించారనీ, ప్రభుత్వాన్ని స్థాపించారనీ, పార్టీ పతాకాన్ని డిజైన్ చేశారనీ, సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నారనీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కోట్లాదిమంది కామన్సెన్స్ను ఓడించి, కోర్టులో గెలవగలిగారు. ఆయన వ్యాజ్య నైపుణ్యం అటువంటిది. ఒక నాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని దర్యాప్తు చేయాలని సాక్షాత్తూ హైకోర్టు కోరినప్పుడు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని సీబీఐ తప్పించుకున్న ఘటన ఇంకోటి ఏదైనా ఉన్నదా? చంద్రబాబు విషయంలో మాత్రమే అలా జరిగింది. అందువల్ల ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించిన ‘ఐటి గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ముందుపెట్టి, కోట్లాది మంది ఓటర్ల సమస్త సమాచారాన్ని అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ తస్కరింపజేశారనీ ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న అధారాలు కూడా దొరికాయి. వాటిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతలు, ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ దొంగిలించడం కోసం అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ పలుమార్లు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి, ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. మరో ఇద్దరు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సాఫ్ట్వేర్ సామర్ధ్యాన్ని పరిశీలించి వచ్చారని సమాచారం. ఆ సాఫ్ట్వేర్ మరేదో కాదు పక్కా పెగసస్ అనేదానికి మరో తిరుగులేని రుజువు ఇప్పుడు దొరికింది. గురువారం నాడు బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ సందర్భానుసారం పెగసస్ ప్రస్తావన తెచ్చారు. పెగసస్‌పై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రస్తావన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు ఇజ్రాయెల్ సంస్థ తమ పోలీస్ విభాగాన్ని కూడా సంప్రదించిందనీ, విషయం తన దృష్టికి రావడంతో తాను తిరస్కరించాననీ ఆమె చెప్పారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుతో ఆమెకు విరోధమేమీ లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలో ఆమె ప్రచారం కూడా చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న కీలక నేత కావడం, చంద్రబాబుతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం మూలంగా ఆమె ప్రకటనకు విశ్వసనీయత చేకూరింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ అవసరాల కోసం ఎన్ఎస్ఓ అనే రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. ప్రపంచ దేశాల గూఢచార సంస్థలన్నింటిలోకి సమర్థత ప్రాతిపదికన ‘మొసాద్’ అగ్రస్థానంలో ఉన్నది. ఎంతో విస్తృత ప్రచారమున్న సీఐఏ, కేజీబీ వగైరా సంస్థలన్నీ మొసాద్ ముందు దిగదుడుపే! మొసాద్ చేతికి ఈ సాఫ్ట్వేర్ అందిన తర్వాత ఇరుగు–పొరుగు మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల్లో వందలాదిమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ఎన్జీవోల ప్రతినిధులు హత్యలకు గురికావడం, ప్రమాదాల్లో మరణించడం సంభవించిందని అంచనా. గ్రీకు పురాణాల్లో దివ్య మహిమలు గల రెక్కలగుర్రం పేరు – పెగసస్. అంతటి శక్తిమంతమైనదన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌కు ఆ పేరు పెట్టి ఉంటారు. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు నిజంగానే ఊహాతీతమైన మహిమలున్నాయి. ఎవరి ఫోన్ నంబర్‌ను అయినా సరే, తమ సర్వర్‌లో ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్నో, వాట్సప్ మెసేజ్‌నో, ఒక మెయిల్నో పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్ చేసినా, చేయకపోయినా పెగసస్ అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక ఫోన్‌కాల్‌తో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు, మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే! ఇక అక్కడి నుంచి మీ ప్రతి కదలికా... అవతలి వారికి తెలిసిపోతుంది. తమ ఫోన్ ట్యాప్ అవుతున్నదని అనుమానం వచ్చిన వాళ్లు ఫోన్లో మాట్లాడకుండా వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడాలనుకోవచ్చు. చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఫోన్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ దాని పనిని అది చేస్తుంది. మీ ఎదుటి వ్యక్తి ఫోటోను తీస్తుంది. మీ మాటల్నీ, అతడి మాటల్నీ రికార్డు చేస్తుంది. వాట్సప్ మెసేజ్‌లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, ఫేస్ బుక్ వగైరా అన్నిరకాల సమాచారాన్నీ సంగ్రహిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరున్న సోర్స్ కోడ్‌కు వెళ్తుంది. అక్కడ్నుంచి క్లయింట్‌కు చేరుతుంది. అంటే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన క్లయింట్లు ఈ దేశ ప్రముఖుల రహస్యాలనూ, ప్రజల సమాచారాన్నీ విదేశీ సంస్థ గుప్పెట్లో డబ్బులిచ్చి మరీ పెడుతున్నారన్నమాట! ఈ లెక్కన చంద్రబాబు కూడా ఈ పని చేశారు. ఆయన ఏటా 35 కోట్ల రూపాయల చొప్పున చెల్లించి మూడేళ్లపాటు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలుస్తున్నది. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కుట్రపూరితంగా తెలుసుకోదలిచినా, అతడి కదలికలను కనిపెట్టే ప్రయత్నం చేసినా... భారత రాజ్యాంగం 21 (ఎ) అధికరణం, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)ల ప్రకారం అది పెద్ద నేరం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి టెలిఫోన్‌ను ట్యాప్ చేయాలి అంటే అతడు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడనీ, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగస్థుడనీ స్పష్టమైన సమాచారం ఉండాలి. ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్ర డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాసి, ఫోన్ ట్యాపింగ్ అనుమతిని తీసుకోవాలి. అందుకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి సదరు లేఖ టెలికామ్ నోడల్ ఏజెన్సీకి చేరుతుంది. అప్పుడు అనుమానిత వ్యక్తి డేటాను రికార్డు చేసి రాష్ట్ర పోలీసు శాఖకు పంపిస్తారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మనదేశంలో పాటించే విధానం ఇది. ఇక్కడ కేంద్రంతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సంస్థ ద్వారా పెగసస్ గూఢచర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడిపించినట్టు అర్థమవుతున్నది. ఇది దేశద్రోహం కంటే పెద్ద నేరమవుతుంది. నేరమే అధికారమై, ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఇక్కడ నేరమే అధికారమై, ప్రత్యర్థుల్ని నేరస్థులుగా ముద్రవేసి వేటాడిన దుర్దినాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం దాటి వచ్చింది. అధికారం కోల్పోయినా నేరస్వభావం మారలేదు. ప్రత్యర్థులపై ముద్రలు వేసి గగ్గోలు పుట్టించాలని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ఎకో సిస్టమ్ ఇప్పటికీ సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉన్నది. దాని ఉపాంగమైన మీడియా సింఫనీ నిర్విరామంగా సాగుతూనే ఉన్నది. అధికార పీఠం మీద ఉన్నప్పుడు రచించిన అవినీతి పురాణం డజన్ల కొద్దీ అధ్యాయాలతో ఒక పుస్తకంగానే వెలుగు చూసింది. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్, భూములతో గేమింగ్, రాజధాని నిర్మాణం పేరుతో స్విస్ ఛాలెంజ్ కుంభకోణం, విశాఖపట్నంలో సృష్టించిన భూకంపం, సదావర్తి సత్రం నిలువు దోపిడీ, అస్మదీయులకు కారుచౌకగా భూ నజరానాలు, మద్యం సిండికేట్ల నుంచి పిండుకున్న ముడుపుల గుట్టలు, అగ్రిగోల్డ్ ఆస్తుల నిలువు దోపిడీ – బాధితులకు పంగనామాలు, ఇసుక మాఫియా పిండుకున్న ‘తైలం’, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకోవడం, నీరు – చెట్టు పేరుతో నిత్యశఠగోపం, గ్రానైట్ ఫలహారానికి స్కెచ్‌లు, బరైటీస్ దందాల బిందాస్, విదేశీ బొగ్గును భోంచేయడం... ఇలా ఇదో గాథాసప్తశతి! బృహత్కథా మంజరి!! తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీతోపాటు ఇతర పార్టీల్లోని కొన్ని స్వార్థపూరిత శక్తులు, సొంత ప్రయోజనాల కోసం పనిచేసే మీడియా పెద్దలు, వివిధ సంస్థల్లో, వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉండే తనవారు ఈ సిస్టమ్‌లో భాగం. చంద్రబాబుకు అవసరమైనప్పుడు వీరంతా ఎవరి పాత్రను వారు పోషిస్తారు. చూసేవాళ్లకు అంతా యాదృచ్ఛికమనే భావన కలుగుతుంది. కానీ అంతా ఒక పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారమే నాటక ప్రదర్శన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నేరాలకు, ఘోరాలకు మూల్యం చెల్లించవలసిన సమయమిది. రచ్చబండ వద్ద నిలబెట్టి ప్రశ్నించవలసిన తరుణమిది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రకూటమి ఎజెండాను పక్కదారి పట్టించే పనిలో బిజీగా నిమగ్నమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, విద్య – వైద్యరంగాల్లో మొలకెత్తిన విప్లవం, వ్యవసాయరంగంలో కనిపిస్తున్న సుస్థిరాభివృద్ధి నాగేటి చాళ్లు, పేదవర్గాల ప్రజల్లో పరుచుకుంటున్న కులాతీత సాధికార చైతన్యం... ఇవన్నీ గొప్ప సామాజిక – ఆర్థిక పరిశోధనాంశాలు. దేశవ్యాప్తంగా ఈ మార్పుల మీద చర్చ జరగడం ఒక చారిత్రక అవసరం. కానీ తెలుగుదేశం నడిపించే మీడియాలో ఈ నిశ్శబ్ద విప్లవానికి ఏనాడూ సెంటీమీటర్ చోటు లభించదు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పులుముకున్న అవినీతి అరాచక పాలన బురదను మరిచిపోవడానికి అధికార పార్టీపై బురదను కుమ్మరించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. దాని లక్ష్యం సుస్పష్టం. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓట్లు పడ్డాయి. దాని ఓటింగ్ బలం ఇంకొంత పెరిగిందని ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దాని ఓటింగ్ బలాన్ని ఓ ఐదారు శాతం మేరకు తగ్గించగలగాలి. అందుకోసం దుష్ప్రచారాల దండోరా! లేకపోతే... వైఎస్ వివేకా హత్య ఎప్పుడు జరిగింది? ఆ హత్య జరిగిన తర్వాత రెండున్నర నెలలపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోలీసులే దర్యాప్తు జరిపారు. వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టగలిగే ఏ ఒక్క ఆధారం దొరికినా చంద్రబాబు వదిలేవాడేనా? రెండున్నరేళ్ల తర్వాత ఈ కొత్త పాటేమిటి? కొత్త ప్రచారం ఏమిటి? మొదట్లో తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసిన వివేకా కూతురు హఠాత్తుగా ప్లేటు మార్చడం ఏమిటి? ఆమెకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్టిస్తారన్న ప్రచారం ఎందుకొస్తున్నది? ఇదంతా ఒక స్కీమ్‌లా కనిపించడం లేదా? మిగిలిన దుష్ప్రచారాలన్నీ ఈ తరహావే! ఒక్కో ఆరోపణను సాంగోపాంగంగా తర్కించి పరిశీలిస్తే తేలేది బోగస్ కథనాలే! ఈ ప్రచారాల ద్వారా అధికార పార్టీ ఓట్లను తగ్గించడం వ్యూహంలో ఒక భాగం. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చూడటం రెండో భాగం. వ్యూహంలో రెండో భాగాన్ని మొన్ననే పవన్ కల్యాణ్ నిర్ధారించారు. చంద్రబాబు పవన్ మీద తనకున్న ఒన్ సైడ్ లవ్‌ను ప్రకటించిన మూడు మాసాలకు పవన్ స్పందించారు. ఆ ప్రేమను స్వీకరిస్తూ, ఓట్లు చీలకూడదని సందేశాన్నిచ్చారు. పాలక పార్టీ మీద తొడగొట్టినంత తీవ్రంగా దాడి చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది ఏడు శాతమే. మరి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? ఓట్ల శాతం ప్రకారం పవన్ పార్టీ కూరలో కరివేపాకే కదా! మరి కరివేపాకులే తొడలు కొడితే బాలయ్య బాబులు ఏం చేయాలి? విశాల ప్రజానీకం దైనందిన జీవితాల్లో వస్తున్న మార్పులే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప కరివేపాకులు, కలగూరగంపలు చేయగలిగిందేమీ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పెగసస్ స్పైవేర్‌పై దీదీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: భారత్‌లో గతేడాది ప్రకంపనలు సృష్టించిన ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ ఎన్ఎస్ఓ.. నాలుగేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ పోలీసు డిపార్టుమెంటకు తమ స్పైవేర్లను విక్రయించడానికి వచ్చినట్లు తెలిపారు. పెగసస్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామని ఆ సంస్థ పేర్కొన్నట్లు సీఎం మమతా వెల్లడించారు. అయితే పెగసస్ వంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయడం రాజకీయంగా దోపిడీకి పాల్పడినట్లు అవుతుందని,న్యాయమూర్తులు, కేంద్ర సంస్థల అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఎన్ఎస్ఓ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఫోన్లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రధాని నర్రేందమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పెగసస్ స్పైవేర్ వివాదంపై బెంగాల్ ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలవటం విశేషం. పెగాసస్ స్పైవేర్ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు విక్రయిస్తోందని తెలిపాయి. -
ఇజ్రాయెల్‌లో అనుమతి లేకుండా పెగసస్ వాడకం
జెరూసలేం: తమ దేశ పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడానికి పరిశోధక సిబ్బంది అత్యాధునిక స్పైవేర్‌ను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు ఆధారాలను గుర్తించామని ఇజ్రాయెల్ నేషనల్ పోలీసు ఫోర్స్ మంగళవారం ప్రకటించింది. ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌ను పోలీసులు ఉపయోగించారంటూ ఇజ్రాయెల్ పత్రిక రెండు వారాల క్రితం ప్రకటించింది. దీనిపై దేశమంతా దుమారం రేగుతోంది. నిరసనకారులు, రాజకీయ నాయకులు, నేరగాళ్లపై నిఘా కోసం పోలీసులు ఈ స్పైవేర్‌ను సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకోకుండానే ఉపయోగించారని సదరు పత్రిక వెల్లడించింది. ప్రజల వినతి మేరకు దీనిపై అటార్నీ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. -
సాక్షి కార్టూన్(31-01-2022)
-
దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చేసింది
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మోదీ ప్రభుత్వం దేశద్రోహ నేరానికి పాల్పడిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల మీదే దాడి జరుగుతోందని, చట్టసభల్ని, న్యాయవ్యవస్థని మోసం చేసిందని, ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని మండిపడ్డాయి. దేశాన్ని ఒక ‘బిగ్ బాస్ షో’లా మార్చేసిందని విరుచుకుపడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిన మోసంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు న్యూయార్క్ కథనాన్ని కేంద్రం తిప్పి కొట్టింది. న్యూయార్క్ టైమ్స్‌ని సుపారీ మీడియా అంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ’’మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారి మీడియాగా పేరుపడ్డారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ బృందం ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎవరినీ వదల్లేదు... ‘‘దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయనాయకులు, సాధారణ ప్రజల మీద నిఘా పెట్టడానికే మోదీ ప్రభుత్వం పెగసస్‌ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్ ట్యాపింగ్‌లకు టార్గెట్ అయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు మౌనం అర్ధాంగీకారమే! ‘‘ఆ సైబర్ ఆయుధాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దానిని వాడడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? లక్ష్యాలను ఎలా నిర్ణయించారు? వీటన్నింటికీ మోదీ ప్రభుత్వం అఫడివిట్ రూపంలో సమాధానం ఇవ్వాలి. ఇంత కీలకమైన అంశంలో మౌనంగా ఉంటే నేర కార్యకలాపాలకు పాల్పడ్డామని అంగీకరించినట్టు అవుతుంది’’ – సీతారామ్ ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి రియాలిటీ షో చేసేశారు... ‘‘రక్షణ వ్యవహారాలకు ఈ స్పైవేర్‌ని వినియోగించుకుండా ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై ప్రయోగించడమేంటి? బీజేపీ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. వాళ్లు దేశాన్ని ఒక బిగ్ బాస్ షోలా మార్చేస్తున్నారు’’ – ప్రియాంక చతుర్వేది, ఎంపీ, శివసేన కావాలని కేంద్రం తప్పించుకుంటోంది ‘‘పెగసస్‌పై ఐటీ కమిటీకి ప్రభుత్వం సమాధానమివ్వడం లేదు. ఎప్పుడు ఈ విషయాన్ని చర్చిద్దామన్నా బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే హాజరుకాకపోవడంతో కోరమ్ ఉండటం లేదు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కమిటీకి అవకాశం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారిస్తోంది. నిజంగా పెగసస్‌ను ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి వినియోగిస్తే మన ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడినట్టే’’ – శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్లు, ఐటీపై పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ అది సుపారీ మీడియా ‘మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారీ మీడియాగా పేరుపడ్డారు’’ – కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్ -
మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో సీన్ మారింది
‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్‌వెపన్’’ అనే టైటిల్‌తో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్ గత దశాబ్దాకాలంగా పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది. ఇది పని చేసినట్టు మరేది చేయలేదని వివిధ దేశాల పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు ఆ సంస్థ హామీలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు డిటెక్టివ్ కంపెనీలు కూడా చేయలేని పని ఈ పెగసస్ చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను కూడా కనిపెట్టగలదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి. అంతకు ముందు దశాబ్దాలుగా పాలస్తీనాకు మద్దతుగానే భారత్ వ్యవహరించింది. కానీ మోదీ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగాయి. నెతన్యాహూతో కలిసి మోదీ చెప్పులు లేకుండా మరీ స్థానిక బీచ్‌లో విహరించారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, పెగసస్ స్పైవేర్ అన్నీ కలిసి ఒక ప్యాకేజీలా కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే నెతన్యాహూ ఆకస్మికంగా భారత్‌కు పర్యటించారు. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్ స్టేటస్‌కు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు జరిగిన ఓటింగ్‌లో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతునివ్వడం అదే తొలిసారి. అమెరికాకు చెందిన ఎఫ్బిఐ కూడా పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది. 2011లో ఇజ్రాయెల్ ప్రపంచ మార్కెట్లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి. ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్ (డీకోడ్) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి. జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపైనా మెక్సికో ప్రయోగిస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌర హక్కుల కార్యకర్తలపైనా, సౌదీ అరేబియా మహిళా హక్కుల కార్యకర్తలపైనా నిఘాను ఉంచాయి. ఈ స్పైవేర్ ఇలా దుర్వినియోగమడం వివాదాస్పదం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై గత ఏడాది జులైలో విచారణకు ఒక కమిటీ వేసింది. దీనిపై ఎన్ఎస్ఒ ఆనాటి చీఫ్ షాలెవ్ హులియో ఇజ్రాయెల్ సైబర్ పరిశ్రమపైనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వివాదం నుంచి దూరంగా జరిగింది. స్పైవేర్‌ని రూపొందించిన ఎన్ఎస్ఒ ప్రైవేటు సంస్థ కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకి వర్తించవని తప్పించుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై ఆంక్షలు విధించింది’’ అని న్యూయార్క్ టైమ్స్ ఆ కథనాన్ని ముగించింది. -
పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని నివేదిక పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. చదవండి: నామినేషన్ దాఖలు చేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తాజాగా ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్‌వెపన్ కోసం యుద్ధం’’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎస్ఓ తన సాఫ్ట్‌వేర్‌ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయేల్ పర్యటన వెళ్లగా.. దీని గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని, ఈ డీల్లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారని, జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయేల్‌కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హోదాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసిందని నివేదిక పేర్కొంది. అయితే న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కేంద్రాన్ని పీటీఐ సంప్రదించగా.. తక్షణమే స్పందించడానికి నిరాకరించింది. -
సైబర్ క్రైమ్: ఫోన్లో గూఢచర్యం..
ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త. ఫోన్ సంభాషణతో చౌర్యం ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్స్టాల్ చేసి, రికార్డర్ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్ చేసినట్టుగా గుర్తించారు. దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు. ఇదో మానసిక జాడ్యం కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్ఆర్ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్లు పుట్టుకు వస్తాయి. ఫోన్ సర్వీస్ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. యాంటీ స్పై వేర్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ► మాల్వేర్ లేదా స్పై వేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ► ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుంటుంది. ► పాప్ అప్ యాడ్స్ నిరంతరం వస్తూ ఉంటాయి. ► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది. ► ఇతర పాప్ అప్ యాప్ నోటిఫికేషన్స్ విరివిగా వస్తుంటాయి. ► మాల్వేర్ లేదా స్పై వేర్ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఫోన్‌ని స్కాన్ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మావోయిస్టుల ఫోన్లలో స్పైవేర్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులపై పోలీసులు గూఢచర్య ఆపరేషన్లు చేస్తున్నారని.. ఫోన్లలో స్పైవేర్ చొప్పించి లొకేషన్, ఫొటోలు సేకరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పత్రికలో ఆరోపించింది. ఆ వివరాల ఆధారంగానే భారీగా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. అంతేగాకుండా ఇన్ఫార్మర్లు, కొరియర్లను లోబర్చుకుని.. వారి ద్వారా మావోయిస్టులపై విష ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ప్రతి ఆరు నెలలకోసారి అధికార పత్రికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా తాజా పత్రికలో పలు సంచలన ఆరోపణలు చేసింది. హ్యాకర్లతో స్పైవేర్.. పోలీసులు హ్యాకర్ల సాయంతో తమ ఫోన్లలో రహస్యంగా నిఘా యాప్స్ (స్పైవేర్)ను ఇన్స్టాల్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. లొకేషన్, ఫోటోలు, వీడియోలను సంగ్రహించి.. కూంబింగ్ బృందాలకు పంపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పార్టీ ఇన్ఫార్మర్లు, కొరియర్ల ఫోన్లలోనూ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు తెలిపింది. కొరియర్లను భయపెట్టి.. మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న వారిని పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని.. వారు ప్రాణభయంతో కోవర్టులుగా మారిపోతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కొరియర్లు మావోయిస్టుల కోసం తెచ్చే పళ్లు, డ్రైప్రూట్స్, మందులు, ఇతర ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారని ఆరోపించింది. దీనివల్ల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో వాజేడు– వెంకటాపురం దళంపై ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని, దళంలోని కీలక నేతలు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని వెల్లడించింది. పక్కా ప్రణాళికలతో దాడులు మావోయిస్టులను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి సమాధాన్–2022ను చేపట్టిందని మావోయిస్టు పార్టీ పత్రికలో తెలిపింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో పదిరకాల ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించింది. ఆ వ్యూహాలను మొదట తెలంగాణ నుంచే అమల్లోకి తెచ్చారని. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 4న ములుగులో ఛత్తీస్గడ్, తెలంగాణ డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ డీజీ, ఆ జోన్ ఐజీల, ఇతర కీలక అధికారులు సమావేశమయ్యారని పేర్కొంది. ప్రధానంగా గెరిల్లా బేస్‌గా ఉన్న దండ కారణ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో.. దానికి ఆనుకుని ఉన్న మావోయిస్టు మద్దతు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అందులో భాగంగానే తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామమైన భట్టిగూడెం వద్ద 5వేలమంది కోబ్రా, డీఆర్జీ, గ్రేహౌండ్స్ బలగాలతో దాడికి పాల్పడ్డారని.. కానీ తెలంగాణ కమిటీ తప్పించుకోగలిగిందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ టీమ్‌ను చూసిన మరో గ్రేహౌండ్స్ గ్రూప్.. మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపిందని గుర్తుచేసింది. ఆ ఘటనలో ఓ ఎస్సై మృతిచెందాడని, మరో హెడ్ కానిస్టేబుల్ దాడి భయంతో గుండెపోటుతో చనిపోయాడని పేర్కొంది. మావోయిస్టుల కోసమే ఆ ఓఎస్డీలు! గతంలో మావోయిస్టులపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారులను కీలక విభాగాల్లో ఓఎస్డీలుగా నియమిస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకాలను వేగవంతం చేశారని.. అందులో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తమ పత్రికలో వెల్లడించింది. మావోయిస్టు పార్టీని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతోనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలంటూ పోలీస్ శాఖలో వేలాది మందిని నియమిస్తున్నట్టు ఆరోపించింది. -
గోప్యత హక్కు చాలా ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని చెప్పి కేంద్రం ప్రతిదాన్నీ దాటవేయలేదని స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోపత్య హక్కుకు సంబంధించి ఇటీవలికాలంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరిస్తూ... జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి... న్యాయవ్యవస్థను మౌనప్రేక్షక పాత్రకు పరిమితం చేయలేరని విస్పష్టంగా పేర్కొంది. నిపుణుల కమిటీని వారి సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించి, పరిశీలించి నియమించామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసి పారదర్శక దర్యాప్తు నిమిత్తం కమిటీలో నియమించామని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓసీ)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కమిటీని ఆదేశించింది. ఎనిమిది వారాల అనంతరం ఈ అంశంపై విచారణ చేస్తామని పేర్కొంది. కోర్టు నియమించిన కమిటీకి కావాల్సిన వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. దేశప్రజలపై విదేశీ ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు నిఘా ఉంచడాన్ని గమనించిన ధర్మాసనం ఈ అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది. నిబంధనలకు లోబడే ఉండాలి... దేశంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు జాతీయ భద్రత విషయంలో న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది, అయితే, న్యాయసమీక్షకు వ్యతిరేకంగా దేన్నిపడితే దాన్ని నిషేధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగించే అంశం కాదని తెలిపింది. ఆ ప్రస్తావన వచ్చినపుడల్లా న్యాయవ్యవస్థ జోక్యం అవసరమని అభిప్రాయపడడం లేదని తెలిపింది. జాతీయ భద్రతపై భయాందోళనలు తలెత్తినపుడల్లా కేంద్రానికి తప్పించుకొనే అవశాకం వస్తుందని కాదని, అలాగని తిరస్కరించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్రం తననితాను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సమాచారం బహిర్గతం కావడం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తుందని చెప్పి దీనిపై కోర్టు అన్నివేళలా మౌనంగా వ్యవహరించబోదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజలందరికి గోప్యత హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రజల జీవితాలు మెరుగుకావడానికి సాంకేతిక సాధనమైనప్పటికీ దాని వల్లే గోప్యత ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపింది. ‘గోప్యత అనేది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించింది కాదు. గోప్యత ఉల్లంఘనల నుంచి ప్రతి పౌరుడికి రక్షణ, భద్రత ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛను ఉయోగించుకునేలా చేస్తుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా పరిమితులకు లోబడే ఉంటుందని, అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా ఎంతో అవసరమని, ఈ పరిస్థితుల్లో వ్యక్తుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందని, ఇది జాతీయ భద్రత, ప్రయోజనాల కోసమే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గోప్యత హక్కు ఉల్లంఘన ఆరోపణల విషయంలో సదరు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం సరైనా సాక్ష్యాధారాల ద్వారానే జరగాలని తెలిపింది. ప్రజాస్వామ్య దేశాల్లో విచక్షణారహితంగా వ్యక్తులపై నిఘా, గూఢచర్యం అనుమతించడానికి వీల్లేదని పేర్కొంది. మీడియాపై నిఘా అనేది పబ్లిక్ వాచ్ డాగ్ పాత్రపై దాడి చేసినట్లుగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయడం కచ్చితత్వంతో కూడిన నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రిక సామర్థ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొంది. పెగాసస్‌పై తొలి ఆరోపణల నుంచి కేంద్రం తగిన వైఖరి వెల్లడించలేదని, అయినప్పటికీ రెండేళ్లుగా కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలిపింది. జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయాలని కేంద్రంపై తామెప్పుడు ఒత్తిడి చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ సభ్యులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. జస్టిస్ రవీంద్రన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ)కు 2013 నుంచి 2019 వరకూ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆలోక్ జోషి: 1976 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆలోక్ జోషి ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్ వింగ్ (రా)లో కార్యదర్శిగా, నేషనల్ టెక్నికల్ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ రవీంద్రన్‌కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు నియమించింది. డాక్టర్ సందీప్ ఒబెరాయ్ : ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్ సైబర్ సెక్యూరిటీస్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్ కమిటీ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండరైజేషన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్, జాయింట్ టెక్నికల్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సాంకేతిక కమిటీ సభ్యులు డాక్టర్ నవీన్‌కుమార్ చౌధరి: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన నవీన్ కుమార్ గుజరాత్‌లోని నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్‌గా పనిచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఎనేబులర్‌గా, సైబర్ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ, నెట్వర్క్, వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్‌లో అనుభవంగల వారు. డాక్టర్ పి.ప్రభాహరన్: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రభాహరన్. కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్దాల అనుభవం ఈయన సొంతం. మాల్వేర్ డిటెక్షన్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నిపుణులు. పలు జర్నల్స్‌లో ప్రభాహరన్ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే: బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్‌లో ఇన్స్టిట్యూట్ ఛైర్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈయన పేరు మీద 20 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ «జర్నల్స్‌లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‌సారాభాయ్ అవార్డు (2012), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ ప్రొఫెసర్. పరిశీలించే అంశాలు... భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా?. అలా చేస్తే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏయే చర్యలు తీసుకుంది ?. కేంద్రం పెగాసస్ సహా ఏ తరహావైనా స్పైవేర్లను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా?. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‌ను వినియోగించి ఉంటే ఏ చట్ట ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ప్రోటోకాల్, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్ వినియోగించినట్లైతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాలి. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్‌కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్‌ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్‌తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్‌పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు.