భారత్‌లోని ఐఫోన్ వినియోగదారులను యాపిల్ అప్రమత్తం చేసింది. కొంతమంది వారి ఫోన్లు పెగాసస్ లాంటి "కిరాయి స్పైవేర్ దాడి"కి గురి కావచ్చని హెచ్చరించింది.
స్పైవేర్ ఫోన్లపై నియంత్రణను పొందవచ్చని భారత్‌తోపాటు మరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 98 ఇతర దేశాలలోని వినియోగదారులకు పంపిన రెండవ నోటిఫికేషన్‌లో కంపెనీ తెలిపింది. 2021 నుంచి యాపిల్ ఈ నోటిఫికేషన్‌లను 150 కంటే ఎక్కువ దేశాల్లోని యూజర్లకు పంపింది.
ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు చెందిన పెగాసస్ తరహా మెర్సెనరీ స్పైవేర్ దాడులు అనూహ్యంగా అరుదైనవని, సాధారణ సైబర్‌క్రిమినల్ యాక్టివిటీ లేదా కన్స్యూమర్ మాల్‌వేర్ కంటే చాలా అధునాతనమైనవని యాపిల్ పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) కూడా ఐఫోన్, ఐపాడ్‌లకు సంబంధించిన యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక ముప్పులను గుర్తించింది. 17.4.1 iOS వెర్షన్ కంటే ముందు Safari వెబ్ బ్రౌజర్ వెర్షన్‌లలోని లోపాలు దాడులకు అవకాశం ఇచ్చేలా ఉన్నాయని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment