iPhone users
-
ఇండియన్ ఐఫోన్ యూజర్లకు ముప్పు.. యాపిల్ హెచ్చరిక!!
భారత్‌లోని ఐఫోన్ వినియోగదారులను యాపిల్ అప్రమత్తం చేసింది. కొంతమంది వారి ఫోన్లు పెగాసస్ లాంటి "కిరాయి స్పైవేర్ దాడి"కి గురి కావచ్చని హెచ్చరించింది.స్పైవేర్ ఫోన్లపై నియంత్రణను పొందవచ్చని భారత్‌తోపాటు మరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 98 ఇతర దేశాలలోని వినియోగదారులకు పంపిన రెండవ నోటిఫికేషన్లో కంపెనీ తెలిపింది. 2021 నుంచి యాపిల్ ఈ నోటిఫికేషన్లను 150 కంటే ఎక్కువ దేశాల్లోని యూజర్లకు పంపింది.ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు చెందిన పెగాసస్ తరహా మెర్సెనరీ స్పైవేర్ దాడులు అనూహ్యంగా అరుదైనవని, సాధారణ సైబర్‌క్రిమినల్ యాక్టివిటీ లేదా కన్స్యూమర్ మాల్వేర్ కంటే చాలా అధునాతనమైనవని యాపిల్ పేర్కొంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) కూడా ఐఫోన్, ఐపాడ్లకు సంబంధించిన యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక ముప్పులను గుర్తించింది. 17.4.1 iOS వెర్షన్ కంటే ముందు Safari వెబ్ బ్రౌజర్ వెర్షన్లలోని లోపాలు దాడులకు అవకాశం ఇచ్చేలా ఉన్నాయని హెచ్చరించింది. -
ఐఫోన్ యూజర్లకు ఎలాన్ మస్క్ భారీ షాక్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఐఫోన్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చారు. డిసెంబర్ 12 నుంచి ‘ట్విటర్ బ్లూ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను ఐఫోన్ యూజర్ల కు అందించేందుకు వారి వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేయనుట్లు తెలిపారు. సోమవారం నుంచి ట్విటర్ సంస్థ బ్లూ సబ్ స్క్రిప్షన్ సర్వీసుల్ని పునప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలు వినియోగించుకునే యూజర్లు బ్లూటిక్‌తో పాటు, 1080 పిక్సెల్ వీడియోలు పోస్ట్ చేయడంతో పాటు, ట్విట్లను ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొంది. తద్వారా ట్విటర్ 2021లో తొలిసారి ప్రారంభించిన సబ్స్క్రిప్షన్ సేవలు కంటే ఇప్పుడు తామిచ్చే సర్వీసులు అందుకు భిన్నంగా ఉంటాయని ట్విటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ రెండోసారి సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లో కొన్ని మార్పులు చేసి రెండోసారి యూజర్లకు పరిచయం చేశారు. కానీ మస్క్ ఊహకు అందని విధంగా ఫేక్ అకౌంట్లు భారీ ఎత్తున వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేశారు. సేవల్లో మార్పులు చేసి..పున ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఆ 3వ సారి ఆ సేవలు వినియోగంలోకి రానుండగా..సవరించిన సబ్‌స్క్రిప్షన్‌కు ఎంత చెల్లించాలనేది ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఐఫోన్ యూజర్లకు అదనం ఏదైనా సంస్థలు, లేదంటే వ్యక్తులు వాళ్లు తయారు చేసిన యాప్స్‌ను..యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్‌లో ఉంచాలంటే ఆ సంస్థకు 30శాతం సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ సంస్థ సైతం నిర్వహాణ పేరుతో అన్నీ యాప్స్ నుంచి ఒకే తరహాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తుంది. కానీ ట్విటర్ ఆశ్చర్యంగా యూజర్ల నుంచి డైరెక్ట్‌గా యూజర్ల నుంచి 3 డాలర్లు అదనంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు, ఐఫోన్ యూజర్లకు 11 డాలర్లు చెల్లించి ట్విటర్ అందించే సబ్స్క్రిప్షన్ సేవల్ని పొందాల్సి ఉంటుంది. we’re relaunching @TwitterBlue on Monday – subscribe on web for $8/month or on iOS for $11/month to get access to subscriber-only features, including the blue checkmark 🧵 pic.twitter.com/DvvsLoSO50 — Twitter (@Twitter) December 10, 2022 ట్విటర్ బ్లూ ప్రత్యేకతలు ట్విటర్ బ్లూ యూజర్లు వారి అకౌంట్లు పేర్లు, ప్రొఫైల్ పిక్చర్లు, ఫోటోలు మార్చుకోవచ్చు. కానీ బ్లూ కలర్ బ్యాడ్జ్ మాత్రం ట్విటర్ సంస్థ రీ వెరిఫికేషన్ చేసే వరకు పొందలేదు. అయితే ఈ రీ వెరిఫై చేసి బ్యాడ్జ్‌ను ఎప్పుడు అందిస్తుందనే అంశంపై ట్విటర్ స్పష్టత ఇవ్వేలేదు. ఇక పునరుద్ధరించిన ఖాతాలో అదనంగా కొన్ని ఫీచర్లను వినియోగించుకోవచ్చని ట్విటర్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ట్విటర్ బ్లూ ఉన్న బిజినెస్ అకౌంట్‌కు అఫీషియల్ గోల్డెన్ కలర్ చెక్ మార్క్, ప్రభుత్వం, ప్రభుత్వానికి చెందినే ఒకే విభాగంలో ఒకటి అంతకు మించి అకౌంట్లు ఉంటే వాటికి గ్రే చెక్ మార్క్ వస్తుంది. ఇది సాధారణ వినియోగదారుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అతి త్వరలో, ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లు తక్కువ యాడ్స్ ఫీచర్లు పొందవచ్చు. అదే వెరిఫై చేయని యూజర్ల అకౌంట్ల మీద వీడియోలు, పెద్దమొత్తంలో యాడ్స్ ప్రసారం కానున్నాయి. దీంతో యూజర్లు ట్విట్ బ్లూను వినియోగించేందుకు మొగ్గుచూపుతారని మస్క్ భావిస్తున్నారు. చదవండి👉‘ఏ పూట ఉద్యోగం ఊడుతుందో’, మరోసారి గూగుల్,అమెజాన్ షాకింగ్ నిర్ణయం? చదవండి👉‘ఇక నిద్ర పోండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం! -
ఐఫోన్ యూజర్లకు యూఐడీఏఐ మెసేజ్
న్యూఢిల్లీ : దేశంలో డిజిటైజేషన్ పెంచడానికి ఆధార్ ఏజెన్సీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరు నెలల క్రితం 'ఎంఆధార్' యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో లాంచ్ చేసిన ఈ యాప్‌ను ఆధార్ ఏజెన్సీ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌ను త్వరలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతుంది. ఎంఆధార్ యాప్ ఐఓఎస్ వెర్షన్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే తెలిపారు. త్వరలోనే ఈ యాప్‌ను ఐఓఎస్ యూజర్లకు లాంచ్ చేయబోతున్నట్టు పాండే ఓ షార్ట్ వీడియోలో పేర్కొన్నారు. అయితే లాంచింగ్ తేదీని మాత్రం పాండే తెలుపలేదు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పాండే ఈ వీడియోను విడుదల చేశారు. ఆధార్ డేటా దొంగతనంపై ఇటీవల వస్తున్న రిపోర్టు, ఆధార్ యాప్ భద్రతపై కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చారు. ఆండ్రాయిడ్ వెర్షన్‌కు అందించే ఫీచర్లనే ఐఓఎస్ వెర్షన్‌కు అందించనున్నారు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు ఆధార్‌తో మొబైల్ నెంబర్‌ను రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది. ఎంఆధార్‌ను అపరిచితులు ఓపెన్ చేయకుండా బయోమెట్రిక్ అథంటికేషన్‌ను ఏర్పాటుచేశారు. బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవడానికి యూజర్లకు ఎంఆధార్ యాప్ సహకరించనుంది. -
ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ : వాట్సాప్‌లోనే...
న్యూఢిల్లీ : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. తన మెసేజింగ్ యాప్ లోపలే యూట్యూబ్ వీడియోలను ప్లే చేసుకునేలా ఐఓఎస్ యూజర్లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. గురువారం నుంచి ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇన్నిరోజులు ఎవరైనా మీ స్నేహితులు యూట్యూబ్ లింక్‌ను వాట్సాప్‌కు పంపిస్తే, మెసేజింగ్ యాప్ నుంచి బయటికి వచ్చి ఆ వీడియోను చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌లోనే ఒక విండోలో ఆ యూట్యూబ్ క్లిప్‌ను ప్లే చేసుకోవచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం ఈ కొత్త ఫీచర్ కోసం ఐఓఎస్ యూజర్లు తమ వాట్సాప్ వెర్షన్‌ను 2.18.11కు అప్డేట్ చేసుకోవాలని తెలిసింది. ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకున్న అనంతరం బగ్ పరిష్కారాలను, సాధారణ మెరుగుదలను అందిస్తుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది. వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోను చూడటంతో, వెంటనే యూజర్లు ఆ యూఆర్ఎల్ లింక్ చాట్‌లో షేరు చేయడం వంటివి తేలికగా చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లు చాట్‌ను మార్చినప్పటికీ, వీడియో ఆగిపోదని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది. అంతకముందు వాట్సాప్ వచ్చిన యూట్యూబ్ వీడియోను యూజర్లు క్లిక్ చేస్తే, అది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకున్న యూట్యూబ్ యాప్‌లో ఓపెన్ అయ్యేది. ఆండ్రాయిడ్, విండోస్ యూజర్లకు కూడా ఈ అప్డేట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 1.2 బిలియన్ యూజర్లున్నారు. ఇటీవల తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్య పెరుగుతోంది. -
నరేంద్ర మోదీ మొబైల్ యాప్
న్యూఢిల్లీ: భారత రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను వాడుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీదే అగ్రస్థానం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మోదీ.. ఐఫోన్ యూజర్ల కోసం ఓ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఐఫోన్ యూజర్లు ఇక నుంచి మోదీతో ఇంటరాక్ట్ కావచ్చు. ఇందుకోసం 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'ను రూపొందించారు. ఈ యాప్‌ను http://nm4.in/nmiosapp లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. 'ప్రధాని నరేంద్ర మోదీ అధికార యాప్ ఇది. దీని ద్వారా తాజా సమాచారం, అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అంతేగాక మోదీ నుంచి నేరుగా ఈమెయిల్స్, మెసేజ్‌లు పొందవచ్చు' అని యాప్ స్టేటస్‌లో తెలిపారు.