న్యూఢిల్లీ : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. తన మెసేజింగ్ యాప్ లోపలే యూట్యూబ్ వీడియోలను ప్లే చేసుకునేలా ఐఓఎస్ యూజర్లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. గురువారం నుంచి ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇన్నిరోజులు ఎవరైనా మీ స్నేహితులు యూట్యూబ్ లింక్‌ను వాట్సాప్‌కు పంపిస్తే, మెసేజింగ్ యాప్ నుంచి బయటికి వచ్చి ఆ వీడియోను చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌లోనే ఒక విండోలో ఆ యూట్యూబ్ క్లిప్‌ను ప్లే చేసుకోవచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం ఈ కొత్త ఫీచర్ కోసం ఐఓఎస్ యూజర్లు తమ వాట్సాప్ వెర్షన్‌ను 2.18.11కు అప్‌డేట్ చేసుకోవాలని తెలిసింది. ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకున్న అనంతరం బగ్ పరిష్కారాలను, సాధారణ మెరుగుదలను అందిస్తుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది.
వాట్సాప్‌లోనే యూట్యూబ్ వీడియోను చూడటంతో, వెంటనే యూజర్లు ఆ యూఆర్‌ఎల్ లింక్ చాట్‌లో షేరు చేయడం వంటివి తేలికగా చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లు చాట్‌ను మార్చినప్పటికీ, వీడియో ఆగిపోదని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది. అంతకముందు వాట్సాప్ వచ్చిన యూట్యూబ్ వీడియోను యూజర్లు క్లిక్ చేస్తే, అది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న యూట్యూబ్ యాప్‌లో ఓపెన్ అయ్యేది. ఆండ్రాయిడ్, విండోస్ యూజర్లకు కూడా ఈ అప్‌డేట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 1.2 బిలియన్ యూజర్లున్నారు. ఇటీవల తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్ల సంఖ్య పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment