యువతితో ఓ సీఐ వాట్సాప్ మెసేజ్‌లు
ఏడాదిన్నరగా కొనసాగుతున్న వ్యవహారం
యువకుడిపై అక్రమ కేసు
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు
ఖలీల్‌వాడి: సాయం కోసం వచ్చిన యువతితో ఓ సీఐ చనువు పెంచుకుని వాట్సాప్ చాటింగ్ చేయడంతోపాటు అడ్డువచ్చిన యువకుడిపై కేసు నమో దు చేయించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువతి లెక్చరర్‌కు రూ.లక్షన్నర వరకు డబ్బులు ఇచ్చింది. లెక్చరర్ తన డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడి ద్వారా యువతి సీఐని కలిసి తన సమస్యను తెలిపింది. సీఐ సదరు లెక్చరర్‌ను పలుమార్లు పిలిపించి యువతి ముందే బెదిరించడంతోపాటు కొంత డబ్బును తిరిగి ఇప్పించాడు.
ఈ క్రమంలో యువతితో చనువు పెంచుకున్న సీఐ ఆమె మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. తాను ఉదయం లేచింది మొదలు ఇంట్లో, కార్యాలయంలో ఏం చేస్తున్నది, డ్యూటీలో ఏం చేస్తున్నది ఇలా అన్ని విషయాలు, ఫొటోలు యువతితో షేర్ చేసుకున్నాడు. కూతురు వయస్సున్న యువతితో సీఐ వాట్సాప్ చాటింగ్ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. డిగ్రీ పూర్తి చేసిన యువతి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, సీఐ దగ్గరుండి ఎంక్వైరీ పూర్తి చేయించినట్లు ప్రచారంలో ఉంది.
ఈ వ్యవహారం తెలిసిన యువకుడు ఎస్బీ కానిస్టేబుల్ సాయంతో అప్పటి సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీఐని అప్పటి సీపీ హెచ్చరించారు. సీపీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన యువకుడి వద్ద నుంచి ఎస్బీ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చాటింగ్, వీడియోలను డిలీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని సూచించాడు. అయితే తనపై సీపీకి ఫిర్యాదు చేసిన యువకుడిపై కక్ష పెంచుకున్న సీఐ ఓ కేసులో అతడిని ఇరికించాడు. ఆ త రువాత బదిలీపై వెళ్లిపోయిన సదరు సీఐ ఇటీ వల తిరిగి జిల్లాకు వచ్చాడు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు సీఐతోపాటు ఎస్సై, ఓ కానిస్టేబుల్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment