Circle Inspector Of Police
-
నల్లగొండ టూటౌన్ సీఐ డానియల్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు
-
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
సాయం కోరితే.. సరసాలాడమంటూ సీఐ బలవంతం!
ఖలీల్‌వాడి: సాయం కోసం వచ్చిన యువతితో ఓ సీఐ చనువు పెంచుకుని వాట్సాప్ చాటింగ్ చేయడంతోపాటు అడ్డువచ్చిన యువకుడిపై కేసు నమో దు చేయించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువతి లెక్చరర్‌కు రూ.లక్షన్నర వరకు డబ్బులు ఇచ్చింది. లెక్చరర్ తన డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడి ద్వారా యువతి సీఐని కలిసి తన సమస్యను తెలిపింది. సీఐ సదరు లెక్చరర్‌ను పలుమార్లు పిలిపించి యువతి ముందే బెదిరించడంతోపాటు కొంత డబ్బును తిరిగి ఇప్పించాడు. ఈ క్రమంలో యువతితో చనువు పెంచుకున్న సీఐ ఆమె మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. తాను ఉదయం లేచింది మొదలు ఇంట్లో, కార్యాలయంలో ఏం చేస్తున్నది, డ్యూటీలో ఏం చేస్తున్నది ఇలా అన్ని విషయాలు, ఫొటోలు యువతితో షేర్ చేసుకున్నాడు. కూతురు వయస్సున్న యువతితో సీఐ వాట్సాప్ చాటింగ్ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. డిగ్రీ పూర్తి చేసిన యువతి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, సీఐ దగ్గరుండి ఎంక్వైరీ పూర్తి చేయించినట్లు ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారం తెలిసిన యువకుడు ఎస్బీ కానిస్టేబుల్ సాయంతో అప్పటి సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీఐని అప్పటి సీపీ హెచ్చరించారు. సీపీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన యువకుడి వద్ద నుంచి ఎస్బీ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చాటింగ్, వీడియోలను డిలీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని సూచించాడు. అయితే తనపై సీపీకి ఫిర్యాదు చేసిన యువకుడిపై కక్ష పెంచుకున్న సీఐ ఓ కేసులో అతడిని ఇరికించాడు. ఆ త రువాత బదిలీపై వెళ్లిపోయిన సదరు సీఐ ఇటీ వల తిరిగి జిల్లాకు వచ్చాడు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు సీఐతోపాటు ఎస్సై, ఓ కానిస్టేబుల్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. -
మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా
రామచంద్రపురం: స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ‘‘భవిష్యత్ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. ఆది నుంచీ వివాదాస్పదమే.. సీఐ అశోక్ కుమార్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్ కుమార్ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
బెదిరింపులు.. దౌర్జన్యం.. గుణదల సీఐ ఓవర్‌యాక్షన్
సాక్షి, విజయవాడ: సరిహద్దు తగాదాలో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సరిహద్దు విషయమై కొద్దికాలంగా ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్, కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే, గుణదల సీఐ శ్రీనివాస్ రియల్టర్ల మధ్య వివాదంలో తలదూర్చారు. ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్ యజమానికి కొమ్ముకాసిన సిఐ.. కోర్టులో వివాదం ఉండగానే ఎస్ఎల్వి యజమాని ఫిర్యాదు మేరకు దేవినేని శ్రీహరిపై కేసు నమోదు చేశారు.కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి ఇంటికెళ్లి సీఐ శ్రీనివాస్ దౌర్జన్యం చేశారు. రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపులకు దిగారు. శ్రీహరి భార్య పట్ల కూడా సీఐ అసభ్యకరంగా వ్యవహరించారు. సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీపీకి నివేదిక ఇవ్వనున్నారు. -
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్‌లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
గన్‌తో కాల్చేస్తా.. నా కొడకా!
సాక్షి, టాస్‌్కఫోర్స్: పట్టా భూమి విషయంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన చంద్రగిరి సీఐ జనసేన నేతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా ‘నా కొడకా.. గన్‌తో కాల్చేస్తా..’ అంటూ బూతులు లంకించుకున్నారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని జనసేన నేత పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన పాశం గురుమూర్తి జనసేన నేత. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. కాగా.. గురుమూర్తి తండ్రి గురవయ్యకు అదే మండలం పనపాకంలో సర్వే నంబర్ 395/2డిలో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. తండ్రి చనిపోవడంతో భూమిని తనపేరిట మార్చాలని గురుమూర్తి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చాడు. ఆ భూమిని కాజేసేందుకు టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఆ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత సుబ్రహ్యణ్యంనాయుడు గురుమూర్తిపై చంద్రగిరి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించడంతో పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆత్మహత్యకు ప్రయత్నం గౌరవంగా బతుకుతున్న తనను సీఐ అసభ్యంగా దూషించడమే కాకుండా చంపుతామని బెదిరించడాన్ని గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఇంటికెళ్లిన గురుమూర్తి మనస్తాపంతో అదే రోజు రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. ‘కాల్చి పారేస్తే అడిగే దిక్కుండదు’ పట్టా భూమి వ్యవహారంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన సీఐ సుబ్బరామిరెడ్డి ఆదివారం నాడు గురుమూర్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. ‘నా కొ..ను.. పగలకొట్టి లోపలేయండి. నీయమ్మా లం.. కొడకా. ఏమనుకుంటున్నావురా. దొంగ నా కొ.. బూటు కాలితో తంతా నా కొ.. మళ్లీ మాట్లాడితే గన్‌తో కాల్చిపారేస్తా’ అంటూ సీఐ సుబ్బరామిరెడ్డి తనను దూషించి కొట్టినట్టు బాధితుడు గురుమూర్తి వాపోయాడు. కాల్చేస్తా.. అంటూ టేబుల్‌పై తుపాకీ పెట్టి బెదిరించినట్టు కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా మాట కూడా వినండి సార్. నేనూ చదువుకున్న వాడినే. అలా తిట్టకండి సార్’ అని వేడుకున్నా కనికరించలేదని గురుమూర్తి వాపోయాడు. కాగా.. సీఐ సుబ్బరామిరెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గ్రావెల్, ఇసుక దందాలకు సీఐ వత్తాసు పలుకుతున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతూ అనేక ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్‌ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్‌తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్‌లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్‌కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్‌కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్‌ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్‌పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్‌ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
‘నువ్వు మేయర్ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’
చిత్తూరు అర్బన్: గాంధీ జయంతి రోజే నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్‌కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్ ఆముదపై ట్రాఫిక్ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఏకవచనంతో రెచి్చపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్‌ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచడానికి మేయర్ ఆముద, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓవైపు పార్కింగ్ చేశారు. మేయర్ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్ చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు.. మేయర్ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్ డ్రైవర్ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్ కారును కొద్దిసేపు పీసీఆర్ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.ఇదీ చదవండి: ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్లోపల మేయర్ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్ వాహనం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశి్నంచారు. దీంతో సీఐ మరింతగా రెచి్చపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్‌తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్‌పైకి సీఐ దూసుకెళ్లారు. -
అజ్ఞాతంలో తిరుపతి సీఐ
-
తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్!
తిరుపతి, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంతోనే.. జిల్లాలో ఓ సీఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి రాలేదని వాళ్లు అంటున్నారు. తన భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని మహేశ్వర్‌రెడ్డి భార్య అంటోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తక ముందే.. ఆయన ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
ఇసుక స్టాక్ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం
గుంటూరు టాస్‌్కఫోర్స్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డులో తుళ్లూరు సీఐ ఆగడాలు మితిమీరుతున్నాయని, అకారణంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీరంగం వేస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నోటితో చెప్పలేని రీతిలో బండ బూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. శనివారం సాయంత్రం ఇసుక లోడింగ్ చేసుకుంటుండగా ఆ సీఐ వచ్చి.. రికార్డులు పరిశీలించి లోడింగ్ జరుగుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌ను కిందకు దించి ‘నీకిది మూడో ట్రిప్పు.. నువ్వెందుకు వచ్చావురా? నీ ఊరేది, నీ కులం ఏంటి రా..?’ అని గద్దించారు. డ్రైవర్ ఉద్దండరాయునిపాలెం అని బదులివ్వగానే.. మా.. లం..కో..ల్లారా.. అంటూ అతన్ని బిల్లులు రాసే దగ్గరకి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి వే బిల్లును లాక్కొని ట్రాక్టర్‌ను వే బ్రిడ్జి దగ్గర కాటా పెట్టించి స్టేషన్‌కు తీసుకురావాలని కానిస్టేబుల్‌కు చెప్పారు. నిజానికి.. లోకల్ ట్రాక్టర్ కావడం, ట్రాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతోపాటు స్థానిక గ్రామాల్లోనే ఇసుకను తోలుతుండటంవల్ల సదరు ట్రాక్టర్ ఆ రోజు క్యూలోనే మూడో ట్రిప్పు కింద వచ్చింది. అయితే, అసలు వే బిల్లులు ఇచ్చిన వారిని వదిలిపెట్టి తనను కావాలనే టార్గెట్ చేసి కులం పేరుతో దూషించి కొట్టాడని బాధితుడు ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించి వే బిల్లులు తీసుకుని ఇసుకను తీసుకెళ్తున్న దళితుడినైన తనపై సీఐ దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. స్టాక్ యార్డులో వేబ్రిడ్జి ఉండాల్సి ఉన్నప్పటికీ అవేమీ నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కేవలం జేసీబీ బొచ్చ ప్రామాణికంగా లోడింగ్ జరుగుతుంటే వాహనాలపై అధిక లోడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిపైనా మాటల దాడి.. ఇక ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ అనే మరో ఎస్సీ యువకుడి లారీపై కూడా ఓవర్ లోడింగ్ కేసు నమోదు చేసిన సీఐ అతన్ని కూడా పిలిపించి.. రాయడానికి వీల్లేని భాష మాట్లాడుతూ.. ‘మా.. నా కొ.. నీ మీద తొమ్మిది కేసులున్నాయి.. ఇంకోసారి కనపడితే నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేసి బొక్కలో వేస్తా నువ్వు ఊరు వదిలి పారిపోవాలి’.. అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఇలా ఉద్దండరాయునిపాలెం ఎస్సీ యువకులే టార్గెట్‌గా సీఐ బెదిరింపులు ఎక్కువయ్యాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పడిగాపులు కాసి ఒక్క ఇసుక ట్రాక్టరు తీసుకెళ్లి అన్లోడ్ చేస్తే యజమాని వద్ద నుంచి మాకు వచ్చేది రూ.300–రూ.400లేనని.. పోలీసులు ఇలా తమను టార్గెట్ చేస్తే బతికేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. ఇసుక తరలింపులో టీడీపీ నేతల వాహనాలను వదిలేసి వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలే టార్గెట్‌గా సీఐ వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అదే టీడీపీకి చెందిన వారి వాహనాలు కూడా ఎక్కువ ట్రిప్పులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నా తమనే టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కులం పేరుతో తిట్టి కాళ్లతో తన్నాడు.. బిల్లు రాయించుకుని లోడింగ్ చేసుకునేందుకు వెళ్లిన నన్ను పిలిచి మాదిగ లం..కొ..ల్లారా అంటూ జుట్టు పట్టుకుని (రాయలేని భాషలో తిడుతూ) చెంపల మీద కొట్టి కిందపడేసి బూట్లతో కడుపులో గట్టిగా తన్ని ‘నా కొ.. ఉద్దండరాయునిపాలెం మా.. నా కొ.. ఊళ్లో ఒక్కడినీ ఉండనివ్వను’ అంటూ నానా మాటలన్నాడు. – ప్రసన్నకుమార్, ట్రాక్టర్ డ్రైవర్ రౌడ్‌షీట్ ఓపెన్ చేసి బొక్కలో.. నాపై గతంలో టీడీపీ వాళ్లు పెట్టిన కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించి ఏ కులం అని అడిగి.. ‘మా.. నా కొ.. మీకు ఎక్కడవిరా ఈ లారీలు? నీ మీద 9 కేసులున్నాయి. ఇంకోసారి కనబడితే ‘నా కొ.. నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేస్తానంటూ చెప్పలేని మాటలతో దూషించాడు. – నందిగం మణికంఠ -
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్‌పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్‌నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు
హన్మకొండ: మైనర్‌పై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రవారం అరెస్టయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైంలో బండారి సంపత్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆమెకు అప్పటికే పదేళ్ల వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆ బాలికకు తండ్రిగా వ్యవహరించాలి్సన సీఐ కీచకుడిగా మారాడు. ఇటీవల అత్యాచారానికి యత్నించడంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడికి యత్నించినట్లు నిర్ధారణకు వచ్చి సీఐ సంపత్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్లక్రితం సంపత్‌పై ఫిర్యాదు.. ఎస్సై బండారి సంపత్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లాడని రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్జోషిని కలిసి ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. అçప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్ చేశారు. -
జగిత్యాల సీఐ నటేశ్గౌడ్ సస్పెన్షన్
జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణ సీఐ నటేశ్గౌడ్పై సస్పెన్షన్ వేటు వేస్తూ మల్టీ జోన్ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆయనను బదిలీ చేశారు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ రిలీవ్ కాలేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ టౌన్–1 సీఐగా పని చేస్తున్న సమయంలో పలు భూ తగాదాల్లో తలదూర్చి, భూ ఆక్రమణదారులకు వత్తాసు పలికి, యజమానులపైనే కేసులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జగిత్యాల సీఐగా చేస్తూ బైపాస్ రోడ్‌లోని ఓ భూ సెటిల్మెంట్ విషయమై ఇద్దరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, ఒక వ్యక్తికే వత్తాసు పలికినట్లు చర్చ జరిగింది. మరో వ్యక్తి ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, ఇటీవల బీట్బజార్లోని ఓ ఇంటి విషయంలో కుటుంబసభ్యుల మధ్య జరిగిన గొడవలో ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు సీఐ నమోదు చేశారు. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ జారీ చేసిన కేసులోనూ కొంతమంది పైనే కేసు పెట్టి, మిగతావారిని వదిలిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. బదిలీ నిలిపివేతకు ఒత్తిడి.. సీఐ నటేశ్గౌడ్ను 15 రోజుల క్రితం బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చి, బదిలీ నిలిపివేయించారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకున్నారు. ఇది జిల్లాలోని పోలీస్ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. భూ సెటిల్మెంట్లు, సివిల్ పంచాయితీల్లో తలదూర్చే పోలీసులపై నిఘా పటిష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌తోపాటు ఎస్బీ పోలీసులు కూడా పోలీసు అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, నిర్లక్ష్యం సీఐ నటేశ్గౌడ్పై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు ఆయన పనిచేసిన చోట విధుల్లో నిర్లక్ష్యం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సస్పెండ్ చేశారు. – సన్ ప్రీతిసింగ్, ఎస్పీ, జగిత్యాల -
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్‌పేటలోని క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్‌ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు. -
దుబాయ్ పారిపోయిన సోహిల్..పంజాగుట్ట సీఐ సస్పెండ్
-
ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తులన బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్ మార్చేసిన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు. Panjagutta Inspector B. Durga Rao suspended for negligence in former MLA Shakeel's son Sohail case. #Telangana pic.twitter.com/qvq11aSRNC — Mubashir.Khurram (@infomubashir) December 26, 2023 ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్‌ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటంతో.. సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. ఇక, పరారీలో ఉన్న సొహైల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సీఐ అంజిత్ రావు సస్పెండ్
-
సంతోష్ నగర్ సీఐపై MIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
-
వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి!
సాక్షి, మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ సీఐ నరేందర్
సాక్షి, బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్స్పెక్టర్ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్, నరేందర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది.