
నిజామాబాద్, సాక్షి: భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ, ఎస్సైలు తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది.
ఎస్సై మహేష్ ,సీఐ నవీన్ లు వేధిస్తున్నారంటూ బాధితులు కొందరు రొడ్డెక్కుతున్నారు. చెంగల్(Chengal)కు చెందిన నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడతను. ఇక..

విరిగిన కాళ్లతో సత్య గంగయ్య అనే వ్యక్తి పీఎస్(Police Station) దగ్గర నిరసనకు దిగాడు. తనను చావు దెబ్బలు కొట్టారని, అందుకు ఎస్సై, సీఐలే కారణమని ఆరోపించాడతను. భీమ్‌గల్(Bheemgal) పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్‌తో పాటు హెచ్‌ఆర్‌సీ కూడా చేరుకుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment