dgp office
-
‘ఈ పోలీసుల టార్చర్‌కి చావాలనిపిస్తోంది’
నిజామాబాద్, సాక్షి: భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ, ఎస్సైలు తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. ఎస్సై మహేష్ ,సీఐ నవీన్ లు వేధిస్తున్నారంటూ బాధితులు కొందరు రొడ్డెక్కుతున్నారు. చెంగల్(Chengal)కు చెందిన నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడతను. ఇక.. విరిగిన కాళ్లతో సత్య గంగయ్య అనే వ్యక్తి పీఎస్(Police Station) దగ్గర నిరసనకు దిగాడు. తనను చావు దెబ్బలు కొట్టారని, అందుకు ఎస్సై, సీఐలే కారణమని ఆరోపించాడతను. భీమ్‌గల్(Bheemgal) పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్‌తో పాటు హెచ్ఆర్సీ కూడా చేరుకుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
డీజీపీ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు (ఫోటోలు )
-
ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
గుంటూరు, సాక్షి: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని.. ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి.. ఈ ఏడాది నమోదైన నేర గణాంకాల్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయి. అలాగే దొంగతనాలు తగ్గాయి. టూ వీలర్ దొంగతనాలు తగ్గాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నాం. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోమ్ గార్డుల వరకూ తమ కర్తవ్యాన్ని సమర్థవతంగా నిర్వర్తించారు అని కిందిస్థాయి ఉద్యోగుల్ని అభినందించారాయన. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాం. బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశాం. 7.83 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి అని అన్నారాయన. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించాం. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవిత ఖైదు శిక్షలు పడ్డ కేసులు 57.. 20ఏళ్లు శిక్ష పడిన కేసులు 49.. పదేళ్లు శిక్ష పడిన కేసులు 41.. ఏడేళ్లు శిక్ష పడినవి 15 కేసులు ఉన్నాయి. అలాగే.. వరకట్నం, పొక్సో కేసులు భారీగా తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతం తగ్గాయి లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి సైబర్ నేరాలు గణనీయంగా 25శాతం తగ్గాయి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చింది ఎక్కువ సైబర్ నేరాలకు పాల్పడిన వారు రాజీకి వచ్చి క్షమాపణలు చెప్తున్నారు బ్యాంకుల సమన్వయంతో సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నాం యంగ్ ఆఫీసర్లకు సైబర్ నేరాల అరికట్టేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం మొత్తం 4 వేలమందిలో 1000 మంది జైల్లో ఉన్నారు ఈ ఏడాదిలోనే 900 మంది రౌడీషీటర్లు కన్విక్ట్ అయ్యారు 200 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశాం 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల ఎకరాలను ట్రైబల్స్ కు అందించింది గంజాయి పెడలర్స్, స్మగ్లర్, కన్జ్యుమర్స్ ఎవరినీ వదిలి పెట్టట్లేదు ఈ మూడేళ్లలో 5లక్షల కేజీల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేశాం ఏపీలో మావోయిస్టుల కదలికలు కూడా తగ్గాయి క్రైమ్ గణాంకాలతో పాటు పోలీసుశాఖలో తీసుకున్న సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అంశాలపైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. -
తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్‌రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు. 400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్‌లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు. -
Bathukamma Celebrations: డీజీపీ కార్యాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. -
లంచం ఇవ్వలేను... కనికరించండి!
దుగ్గొండి/ఖైరతాబాద్: తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాల ని కోరుతూ ఓ రైతు వినూత్నంగా నిరసన బాటపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కి చెందిన గట్ల సురేందర్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయి. ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే పెద్ద మనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ బయలుదేరాడు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ వచ్చానని సురేందర్ అన్నారు. -
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్
-
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): దిశ యాప్ ఒక మహిళ ప్రాణాలు కాపాడింది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చివరిక్షణంలో దిశకు సమాచారం అందించటంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సంరక్షించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన జ్ఞానప్రసన్న (31) కృష్ణలంకలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల కిందట భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా జీవిస్తోంది. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన షేక్ అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అఖిల్‌కు అతడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసిన ప్రసన్న లూనాసెంటర్‌లోని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అఖిల్, అతడి కుటుంబసభ్యులు ఆమెను తిట్టి, కొట్టి అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చివరి క్షణంలో దిశ యాప్‌కు సందేశం పంపింది. చికిత్స పొందుతున్న జ్ఞాన ప్రసన్న క్షణాల్లో స్పందించిన పోలీసులు ప్రసన్న ఫోన్ నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలో దిశ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా న్యూరాజరాజేశ్వరీపేటలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ హేమచంద్, కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డ్ చంద్రశేఖర్ 10 నిమిషాల్లోనే ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. చదవండి: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసన్న ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. ఆమె కుమార్తెను వైద్యసిబ్బంది సంరక్షిస్తున్నారు. ప్రసన్న ఇంకా మాట్లాడే స్థితికి రాకపోవడంతో పోలీసులకు పూర్తి వివరాలు తెలియలేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రసన్న తల్లిదండ్రులకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ అధికారులు, పోలీసులకు ప్రశంసలు కేవలం ఓ సందేశం ద్వారా నిమిషాల వ్యవధిలో మహిళ ఇంటికి చేరుకుని మృత్యువాత పడకుండా ఆమెను కాపాడిన దిశ కార్యాలయం అధికారులు, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
4 జిల్లాలకు పోలీసు బాస్‌లు లేరు..
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాలకు, కమిషనరేట్లకు పూర్తిస్థాయి పోలీసు బాస్‌లు లేరు. కొందరికి పదోన్నతులు లభించినా పాతస్థానాల్లో కొనసాగుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగపోవడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఒకేసారి ఏర్పడిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లలో ఖమ్మం, సిద్ధిపేటలకు కమిషనర్లు మారినా రామగుండం సీపీ సత్యనారాయణ, నిజామాబాద్‌లో కార్తికేయ కమిషనర్లుగా అక్కడే ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లా లకు పూర్తిస్థాయి ఎస్పీలను నియ మించలేదు. నల్ల గొండ ఎస్పీగా ఉంటూ డీఐజీగా ప్రమోషన్ పొం దిన రంగనాథ్ కూడా 2018 నుంచి అక్కడే ఎస్పీగా కొనసాగుతున్నారు. 2019 ఏప్రిల్‌లో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదో న్నతులు ఇచ్చినా పాత స్థానాల్లోనే 90 శాతం మంది కొనసాగుతున్నారు. వీరికి అదనపు బాధ్యతలు.. ఏడీజీ వీవీ శ్రీనివాసరావు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పదవితోపాటు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంజయ్‌జైన్– ఏడీజీ (పీ అండ్ ఎల్), పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలు చూస్తున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు విజిలెన్స్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎస్పీ రమణకుమార్ బదిలీతో ఏసీబీలో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. త్వరలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు రిటైర్ కానున్నారు. దీంతో ఏసీబీలో కీలకమైన రెండు పోస్టులు ఖాళీ అవనున్నాయి. ఎస్పీలుగా పదోన్నతులుగా లభించినా... మార్చి ఆఖరివారంలో ప్రభుత్వం 32 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో మెజారిటీ అధికారులకు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పదవీవిరమణ వయసును 58 నుంచి 61కి పెంచడంతో వీరికి పోస్టింగులు ఇవ్వడం సవాలుగా మారిందని సమాచారం. ఇన్‌చార్జీలతోనే... కీలకమైన నాలుగు జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేరు. నిర్మల్ జిల్లాకు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పీ రాజేశ్ చంద్ర ఇన్చార్జి ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు కూడా పోలీసుబాసులు లేరు. ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు రామగుండం సీపీకి, ములుగు జిల్లా బాధ్యతలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌కి అప్పగించారు. ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఖమ్మం సీపీగా విష్ణువారియర్‌ను నియమించగా, ఖమ్మం సీపీగా ఉన్న ఇక్బాల్ బదిలీ మీద ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా, తన స్థాయి కంటే తక్కువ పోస్టులో విధులు నిర్వహించడం ఇష్టంలేక మిన్నకుండిపోయారని సమాచారం. -
నిబంధనలు అనుసరించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద అవస్థలు పడుతున్న దృష్ట్యా డీజీపీ కార్యాలయం సోమవారం సూచనలు జారీ చేసింది. ఏపీకి రావాలంటే.. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాష్ట్రానికి రావాలనుకొనే వారు ఉదయం 6 నుంచి 12 గంటల మధ్యనే ప్రయాణించేలా.. ఆ లోపే గమ్యానికి చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అటువంటి వారికి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయంలో ప్రయాణిస్తే ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు, సంబంధిత సిబ్బందికి ఈ–పాస్ అవసరం లేదు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్‌లో ప్రయాణించే పేషెంట్లతో ఉండే సహాయకులకు అనుక్షణం సహాయ, సహకారాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్బుక్) ద్వారా నిరంతరం అందుబాటులో ఉంటుంది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఇంటిపట్టున ఉంటూ స్వీయ రక్షణ పొందాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఏపీలో ప్రయాణించాలంటే.. ఏపీ పరిధిలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యే ప్రయాణించేలా.. ఆలోపే గమ్యాన్ని చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే ఎలాంటి పాస్‌లు అవసరం లేదు. మిగతా సమయాల్లో ప్రయాణిస్తే మాత్రం ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. అటువంటి వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి పొందాలి. ఏపీలో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి సిటిజన్ సర్వీస్ పోర్టల్ (http://appolice. gov.in), ట్విట్టర్ (@ APPOLICE100), ఫేస్ బుక్ (@ ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే.. ► తెలంగాణ వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి. అక్కడ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే.. కర్ఫ్యూ ఉన్నా లేకపోయినా ఈ పాస్ తప్పనిసరి. https://policeportal. tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ–పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది. ► తమిళనాడులో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. తమిళనాడు భూ భాగంలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. https:// eregister.tnega.org/ ద్వారా తమిళనాడు ఈ–పాస్ పొందవచ్చు. ► ఒడిశాలో పూర్థిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ఈ–పాస్ తప్పనిసరి. https://covid19regd. odisha.gov.in/ లింక్ ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ► కర్ణాటకలోనూ పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఈ పాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్ణాటకలోకి వెళ్లేవారు ఈ–పాస్ పొందవచ్చు. కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూ భాగంలోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. -
పోలీసులను టార్గెట్ చేయొద్దు: డీఐజీ
సాక్షి, మంగళగిరి: ఆలయాల్లో దాడులంటూ సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారాలపై నిజాలు తెలియజేశామని డీఐజీ పాల్రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులకు నిబద్ధత ఉండదని.. సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారంపై విచారణ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘2020- 2021లో జరిగిన ఆలయాలపై దాడుల వివరాలు డీజీపీ ఇచ్చారు. 44 కేసుల్లో జరిగిన దాడుల్లో అసలేం జరిగిందో కూడా చెప్పాం. అబద్ధపు ప్రచారాలు కూడా ఎలా జరిగాయో తెలిపాం. కొన్ని కేసులలో ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కూడా వెల్లడించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాసిన వార్తకు ఒక నిబద్ధత ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్తలకు నిబద్ధత ఉండదు. (చదవండి: స్థానిక ఎన్నికలు: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్) 2014లో ఏలూరులో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, శిక్ష వేశారు. అదే ఘటనను మరల జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమిళనాడు, కర్నాటకలో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ప్రచారం పట్ల విచారణ చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో స్పెషన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాం. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని’’ డీఐజీ పాల్రాజు హెచ్చరించారు.(చదవండి: సీఎం జగన్‌ను కలిసిన బీవోబీ ఈడీ) -
‘గ్యాంగ్‌వార్’ వీడియోలు ఇప్పటివి కావు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో గ్యాంగ్‌వార్ పేరిట పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గత ఏడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగినవిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కథనాలపై స్పందించిన డీజీపీ గౌతమ్‌సవాంగ్ తక్షణ విచారణ జరపాలని గుంటూరు రేంజ్ డీఐజీ, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చారని పేర్కొంది. ఆ ఘటనలు కేవలం మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలని, అయినప్పటికీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారని వివరించింది. నిందితులపై రౌడీషీట్ కూడా తెరవనున్నట్టు తెలిపింది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ పేర్కొంది. -
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!) అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది. -
శిక్షణ తేదీని ప్రకటించకుంటే చనిపోతాం!
సాక్షి, హైదరాబాద్: తమకు వెంటనే శిక్షణ తేదీని ప్రకటించాలంటూ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘శిక్షణ తేదీని వెంటనే ప్రకటిం చండి. లేదా కారుణ్య మరణాలకు అనుమతించండి’ అంటూ బుధవారం చలో డీజీపీ కార్యాలయం పేరిట ముట్టడికి పిలుపునిచ్చా రు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 2వేల మంది కేడెట్లు లక్డీకాపూల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు వారిని వ్యాన్లలోకి ఎక్కించారు. దీంతో తోపులాట, వాగ్వాదం చెలరేగింది. అరెస్టు చేసిన కేడెట్లందరినీ ముషీరాబాద్, గోషామహల్ తదితర ఠాణాలకు తరలించి, సాయంత్రం వదిలిపెట్టారు. కారుణ్యమరణానికి హెచ్చార్సీకి వినతి! తమ శిక్షణ తేదీని ఇంకా ప్రకటించకపోవడం తో ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బం దులు పడుతున్నామని, వేతనం, సర్వీసు కోల్పోతున్నామని పలువురు అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తాము గతేడాది సెప్టెంబర్‌లోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమతోపాటు సెలక్టయిన సివిల్, ఏఆర్‌లకు శిక్షణ కూడా పూర్తికావొచ్చిందని వాపోయా రు. శిక్షణ తేదీల కోసం ఎదురుచూసి విసిగిపోయామని, ఇక తమకు కారుణ్య మరణాని కి అనుమతివ్వాలని విన్నవించారు. ఈలోగా డీజీపీ కార్యాలయం నుంచి అభ్యర్థులకు పిలుపు వచ్చింది. నలుగురు ప్రతినిధుల బృందంతో లా అండ్ ఆర్డర్ ఏడీజీ జితేందర్ మాట్లాడారు. ప్రస్తుతమున్న బ్యాచ్‌ల శిక్షణ పూర్తికాగానే అక్టోబర్ చివరి లేదా నవంబర్ మొదటివారంలో శిక్షణ ప్రారంభిస్తామని చెప్పడంతో కేడెట్లు శాంతించారు. -
‘చలో డీజీపీ ఆఫీస్’కు టీఎస్ఎస్పీ అభ్యర్థుల పిలుపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బుధవారం ‘చలో డీజీపీ ఆఫీస్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయానికి వచ్చిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)కు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితాలు విడుదలయ్యి దాదాపు 9 నెలల అవుతున్న ఇప్పటి వరకు ట్రైనింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు తెలిపారు. తమతో పాటు సెలెక్ట్ అయిన సివిల్, ఏఆర్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి వేతనాలు ఇస్తున్నారన్నారు. కానీ టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని వారు వాపోయారు. శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది సెలక్ట్ అయిన అభ్యర్థులు చనిపోయారని తెలపారు. డీజీపీ తక్షణమే స్పందించి ట్రైనింగ్ తేదీని ప్రకటించి అభ్యర్థులకు పూర్తి వేతనాలు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. -
కరోనా వారియర్ సాంగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్ వీడియో సాంగ్‌ను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు పోలీసు శాఖ చేస్తున్న నిరంతర కృషికి స్పూర్తినిస్తూ.. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ‘కరోనా వారియర్’ వీడియోను సాంగ్‌ను రూపొందించారు. (దశల వారిగా షూటింగ్స్‌ను అనుమతి: కేసీఆర్) నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ పాట విడుదల చేసిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖలు చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా మహిత్ నారాయణ్ వీడియో సాంగ్‌ను రూపొందించడం పట్ల డీజీపీ అభినందించారు. బాలాజీ రచించిన ఈ పాటను గాయకులు మనో, గీతా మాధురిలతో పాటు తమిళ గాయకుడు టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్, నిహాత్, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణ, బేబీలు పాడారు. (సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి) -
అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం
సాక్షి, విజయవాడ: కరోనా లాక్‌డౌన్‌ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: గుంజీలు తీయించి, పూలదండలు వేశారు..) ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. (చదవండి: లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్) అప్లయ్ చేయడం ఇలా.. కోవిడ్-19 ఎమర్జెన్సీ వెహికల్ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు కింద ఇవ్వడం జరిగింది. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. (చదవండి: కష్టంలో ఆదుకుంటున్న కామన్‌మ్యాన్) -
ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్ టన్నెల్‌ను డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ పరికరాన్ని ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. -
కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు
సాక్షి, హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపరేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ( ‘కరోనా’ వెబ్సైట్లు ఓపెన్ చేయొద్దండి ) ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 59కి చేరింది. గడిచిన వారం రోజుల్లోనే 40 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. (కరోనా నియంత్రణ ఏర్పాట్లలో ముందున్నాం ) -
‘కన్నా.. వాస్తవాలు తెలుసుకోండి’
సాక్షి, అమరావతి: జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్‌లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్లో ఉన్నారని పేర్కొంది. వెయిటింగ్లో ఉన్న పోలీసు అధికారులకు పోస్టింగులివ్వండి: కన్నా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వక వెయిటింగ్లో కొనసాగుతున్న పోలీసు అధికారులకు వెంటనే పోస్టులను కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు వెయిటింగ్లో ఉంచిన పోలీసులందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు. -
‘షేర్’కింగ్‌లూ.. జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, వదంతులు నమ్మవద్దని డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. చర్యలేంటి? - సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే.. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(ఏ) ప్రకారం పోలీసులు అరెస్టు చేసే వీలుంది. - వ్యక్తుల పరువుకు భంగం వాటిల్లే పోస్టులు పెడితే.. ఐపీసీ 499 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. - ఒక వ్యక్తిని లేదా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే.. పరువు నష్టం దావా వేసే వీలుంది. - అసభ్యకర పోస్టులు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఐపీసీ సెక్షన్లు 292, 292 (ఏ), 293, 294 ప్రకారం అరెస్టు అవుతారు. -
‘ఈచ్ వన్–టీచ్ వన్’లో పోలీసు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్–టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈచ్ వన్–టీచ్ వన్ కార్యక్రమంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో పాల్గొంటుందని చెప్పారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ రక్షణ కోసం పోలీసు శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరులలో కల్పించాలని చెప్పారు. పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతని స్తోందని తెలిపారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ–రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీజీపీలు, ఐజీలు, సీనియర్ పోలీసు అధికారు లు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్‌ను అభినందించిన డీజీపీ.. పోలీసు ఉద్యోగం అంటే సామాజిక సేవ అని నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంను డీజీపీ అభినందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా ఏ–పాజిటివ్ రక్తం అవసరమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం.. తన రక్తాన్ని దానం చేయడంతో ఆ మహిళకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డీజీపీ.. శ్రీశైలంను అభినందించారు.